ఓ పెంపుడు కుక్క కథ.. | Sky Dog Australia Prayanam, Couple Spends ₹16 Lakh Meant For Home To Take Pet Dog To Australia, Story Went Viral | Sakshi
Sakshi News home page

Sky Dog Story: ఓ పెంపుడు కుక్క కథ..

Mar 4 2026 11:15 AM | Updated on Mar 4 2026 12:46 PM

sky dog australia prayanam viral story

 నెట్టింట వైరల్‌గా పెట్‌ లవ్‌ ఎపిసోడ్‌  

ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నగరవాసులు దివ్య, జాన్‌ రాజేష్‌ సొంతింటి కల నెరవేర్చుకునేందుకు రూ.16లక్షలు కూడబెట్టారు. ఈలోపు వీరికి ఆ్రస్టేలియాలో స్థిరపడే అవకాశం వచి్చంది. దీంతో పెంపుడు శునకం ‘స్కై’ని తమ వెంట తీసుకెళ్లాలని సంకల్పించి.. ఇంటికోసం దాచుకున్న మొత్తాన్ని దాని కోసం వెచి్చంచారు. ఈ జంతు ప్రేమికుల కథ ప్రస్తుతం ఇన్‌స్టాలో డాక్యుమెంటరీగా వైరల్‌ అయ్యింది. ‘స్కై ది మేజికల్‌ డాగ్‌’ పేరుతో ఏకంగా ఓ పేజీ ఏర్పడింది. దీనిపై అనూహ్యంగా స్పందిస్తున్న నెటిజనులు తమ పెట్స్‌తో ఉన్న అనుబంధాన్ని, అనుభవాలను పంచుకుంటున్నారు. 

నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేసిన టెక్కీలు దివ్య, జాన్‌లకు గతేడాది ఉద్యోగరీత్యా ఆ్రస్టేలియాలోని మెల్‌బోర్న్‌ వెళ్లి స్థిరపడే అవకాశం వచి్చంది. ఏళ్లుగా తాము పెంచుకుంటున్న జాగిలం స్కై దగ్గరకు వచ్చేసరికి వారికి ఇబ్బంది అనిపించింది. తమ కుటుంబ సభ్యుడిగా భావించి ప్రేమగా పెంచుకుంటున్న దానిని ఇక్కడ వదిలి వెళ్లడానికి మనసొప్పలేదు. దాన్నీ తమతోపాటు ఆ్రస్టేలియా తీసుకెళ్లాలని భావించారు. అందుకు అవసరమైన ఫార్మాలిటీస్‌ పూర్తి చేసేందుకు ఆ దేశ యంత్రాంగాన్ని సంప్రదించారు. ఒక్క రేబిస్‌ కేసు కూడా నమోదుకాని కంట్రీగా ఉన్న తమ దేశానికి పెట్స్‌ను నేరుగా తీసుకురావడం సాధ్యం కాదని వాళ్లు స్పష్టం చేశారు.

సన్నిహితులు వద్దన్నా.. 
తాహతకు మించిన ఖర్చే అయినా.. స్కై మీద ప్రేమ ఇంటి కోసం దాచుకున్న మొత్తాన్ని వెచి్చంచేలా చేసింది. విషయం తెలిసిన బంధువులు, స్నేహితులు, సన్నిహితులు వీరి నిర్ణయాన్ని వారించారు. అవసరమైతే మరో మేలి జాతి జాగిలాన్ని ఖరీదు చేసుకోవాలని సూచించారు. స్కై మీద ప్రేమతో అంత పెద్ద మొత్తాన్ని ఖర్చుచేయవద్దని వారించారు. 

ఏమాత్రం వెనుకాడక.. 
ఎలాగైనా స్కైని తెసుకెళ్లాలని భావించి అనేక మార్గాలను అన్వేషించారు. మరో రేబిస్‌ ఫ్రీ దేశంలో ఆరు నెలలు పెట్‌ను ఉంచినట్లు, వైద్య పరీక్షలతో ధ్రువీకరణ పొందితే ఆ్రస్టేలియాలో అడుగుపెట్టొచ్చని తెలిసింది. అంతే క్షణం ఆలోచించకుండా ఆ పనులకు శ్రీకారం చుట్టారు. స్కైని తొలుత దుబాయ్‌ తీసుకెళ్లి ఆరు మాసాలు ఉంచాలని నిర్ణయించుకున్నారు. రవాణా, పెట్‌ కేర్, షెల్డర్‌ హోమ్, ఇతర వైద్య పరీక్షలకు ఏజెన్సీలకు సంప్రదించారు. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ మీదుగా ఆస్ట్రేలియాకు చేరేందుకు రూ.15 లక్షలు అవుతుందని లెక్కతేలింది.

కథ సుఖాంతం.. 
తొలుత స్కైని హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ తీసుకెళ్లారు. తక్కువ ఖర్చుతో ఆరు నెలలు ఉంచే రేబిస్‌ ఫ్రీ దేశాలు మరికొన్ని ఉన్నా.. స్కైకితో హిందీలో సంప్రదింపులు జరపాల్సి ఉండటంతో దుబాయ్‌నే ఎంచుకున్నారు. అక్కడి పెట్‌ కేర్‌ సెంటర్‌లో ఆరు మాసాలు ఉంచి తాము ఆ్రస్టేలియా వెళ్లిపోవాలని భావించారు. కొత్త ప్రాంతం, వాతావరణం కావడంతో నెల రోజులు దాంతో పాటే దుబాయ్‌లో ఉన్నారు. ఆపై మెల్‌బోర్న్‌ వెళ్లిపోయారు.. ఐదు నెలల రోజూ ఉదయం, సాయంత్రం వీడియో కాల్స్‌ ద్వారా స్కైని పలుకరించారు. చివరికి 180 రోజుల అనంతరం స్కై మెల్‌బోర్న్‌ చేరింది. అక్కడి క్వారంటైన్‌ సెంటర్‌లో మరో పది రోజులు ఉంచిన తర్వాత వారి ఇంటికి తీసుకువెళ్లారు. దీని ఆధారంగా ‘కహానీ ఆఫ్‌ టేల్స్‌’ అనే హ్యాండిల్‌ డాక్యుమెంటరీ చేయడంతో వైరల్‌ అయ్యింది.  

Advertisement
 
Advertisement
Advertisement