హోబర్ట్: ఆ్రస్టేలియా పర్యటనలో టి20 సిరీస్ నెగ్గిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పుడు క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకునేందుకు, గెలుపు తృప్తితో ముగించేందుకు ఆఖరి వన్డే బరిలోకి దిగుతోంది. ఒత్తిడిలో ఉన్న హర్మన్‌ప్రీత్ సేన జోరు మీదున్న ఆసీస్‌ను సొంతగడ్డపై ఎలా నిలువరిస్తుందో చూడాలి. వన్డే సిరీస్‌కు వచ్చేసరికి భారత బ్యాటింగ్ తడబడుతోంది.
టాపార్డర్‌లో స్మృతి మంధాన, మిడిలార్డర్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మెరుగ్గా ఆడుతున్నప్పటికీ సహచరులంతా ఆసీస్ బౌలింగ్‌కు దాసోహం కావడం జట్టుకు ప్రతికూలంగా పరిణమిస్తోంది. బ్యాటింగ్‌లో షఫాలీ, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మలు రాణించాలి. అలాగే బౌలింగ్ విభాగం కూడా మెరుగవ్వాలి. రేణుక, క్రాంతి, కాశ్వీ గౌతమ్‌లు ఆరంభంలో వికెట్లు తీయగలిగితే పటిష్టమైన ఆ్రస్టేలియాపై వన్డే సిరీస్‌ను సంతృప్తికరంగా ముగిస్తుంది. లేదంటే వైట్‌వాష్ ఖాయమవుతుంది.
గత రెండు మ్యాచ్‌ల్లోనూ కంగారూ జట్టు అద్భుతంగా ఆడింది. బౌలింగ్‌తో కట్టడి చేసి... బ్యాటింగ్‌లో అదరగొట్టింది. ఇప్పుడు ఇదే జోరుతో ‘హ్యాట్రిక్’ విజయంపై కన్నేసింది. ఇదే జరిగితే ఓవరాల్ చాంపియన్‌షిప్ (టి20, వన్డే, ఏకైక టెస్టు సిరీస్)లోనూ ఆ్రస్టేలియా పైచేయి సాధిస్తుంది. ఒకే ఒక టెస్టును డ్రా చేసుకున్నా... ఆసీసే ఓవరాల్ చాంప్‌గా నిలుస్తుంది. ఉ. గం. 9:20 నుంచి ‘స్టార్‌స్పోర్ట్స్’లో ప్రసారం


