టీ20 ప్రపంచకప్-2026లో పాకిస్తాన్ యువ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా పల్లెకలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఫర్హాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.
కేవలం 60 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఫర్హాన్ 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. ఈ అద్బుత ఇన్నింగ్స్‌తో పర్హాన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
ఫర్హాన్ సాధించిన రికార్డులు ఇవే
👉టీ20 వరల్డ్‌కప్ ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫర్హాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2014 టీ20 ప్రపంచకప్‌లో విరాట్ 319 పరుగులు చేశాడు. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌లో ఫర్హాన్ 383 పరుగులు చేశాడు. దీంతో కోహ్లి ఆల్‌టైమ్ రికార్డును ఫర్హాన్ బ్రేక్ చేశాడు.
👉టీ20 వరల్డ్‌కప్ ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా షిమ్రాన్ హెట్‌మైర్(17)ను ఫర్హాన్(18) అధిగమించాడు.
👉టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో రెండు సెంచరీలు బాదిన మొట్టమొదటి బ్యాటర్‌గా సాహిబ్జాదా ఫర్హాన్ నిలిచాడు. ఇంతకుముందు ఏ ఆటగాడు కూడా ఒకే టోర్నీలో రెండు శతకాలు బాదలేదు.
👉అదేవిధంగా టీ20 ప్రపంచకప్‌లో ఓవరాల్‌గా రెండు సెంచరీలు చేసిన ప్లేయర్‌గా క్రిస్ గేల్ రికార్డును ఫర్హాన్ సమం చేశాడు.


