breaking news
Sahibzada Farhan
-
పవర్ ప్లేలో వాళ్లు అద్భుతం.. మేమింకా స్థాయికి తగ్గట్లు ఆడలేదు: పాక్ కెప్టెన్
టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరోసారి పరాభవమే ఎదురైంది. ఆసియా కప్-2025 టోర్నీమెంట్లో లీగ్ దశలో భారత్ చేతిలో పరాజయం పాలైన పాక్.. తాజాగా సూపర్-4 దశలోనూ అదే ఫలితాన్ని చవిచూసింది. అయితే, గత మ్యాచ్ కంటే ఈసారి కాస్త మెరుగైన ప్రదర్శన చేయగలిగింది.ఈ నేపథ్యంలో టీమిండియా చేతిలో ఓటమిపై పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) స్పందించాడు. తాము ఇంతవరకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని.. అయితే, మెరుగ్గా ఆడామని పేర్కొన్నాడు. పవర్ ప్లేలో టీమిండియా మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకుందని .. తాము ఇంకో 10- 15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని వ్యాఖ్యానించాడు.171 పరుగులుదుబాయ్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58) రాణించగా.. ఫఖర్ జమాన్ (9 బంతుల్లో 15) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. హ్యాట్రిక్ డకౌట్ల ‘స్టార్’ సయీబ్ ఆయుబ్ (17 బంతుల్లో 21) ఈసారి ఫర్వాలేదనిపించగా.. హుసేన్ తలట్ (10), మొహమ్మద్ నవాజ్ (21) తేలిపోయారు.అభి- గిల్ రఫ్పాడించారుకెప్టెన్ సల్మాన్ ఆఘా 17, ఫాహిమ్ ఆష్రఫ్ 20 బంతులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి పాక్ 171 పరుగులు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74), శుబ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47) ఆకాశమే హద్దుగా చెలరేగారు.పవర్ ప్లేలో విజృంభణతో తొలి వికెట్‌కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అభి (Abhishek Sharma)- గిల్ (Shubman Gill) మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేశారు. తిలక్ వర్మ (19 బంతుల్లో 30 నాటౌట్) కూడా వేగంగా ఆడగా.. 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా పని పూర్తి చేసింది.మా స్థాయికి తగ్గట్లుగా ఆడనేలేదుఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. ‘‘ఇంత వరకు మేము మా స్థాయికి తగ్గట్లుగా ఆడనేలేదు. అయితే, మెరుగ్గా ఆడామని చెప్పగలను. కానీ పవర్ ప్లేలోనే వారు మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు. ఇంకో 10- 15 పరుగులు చేసి.. 180 వరకు స్కోరు బోర్డు మీద పెట్టి ఉంటే బాగుండేది.పవర్ ప్లేలో వాళ్లు అద్భుతంఏదేమైనా పవర్ ప్లేలో వాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అదే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మా జట్టులోనూ ఫఖర్, ఫర్హాన్ బాగా బ్యాటింగ్ చేశారు. హ్యారీ కూడా మెరుగ్గా ఆడాడు. తదుపరి శ్రీలంకతో మ్యాచ్‌లో సత్తా చాటుతాం’’ అని పేర్కొన్నాడు.కాగా గతంలో సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లలో సల్మాన్ బృందం మూడు మ్యాచ్‌లలోనూ 200కు పైగా స్కోరు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విలేకరులు సల్మాన్ ఆఘా దగ్గర తాజాగా ప్రస్తావించారు.ఇందుకు బదులిస్తూ.. ‘‘అక్కడికి .. ఇక్కడికి పరిస్థితులు వేరు. మాకు మంచి పిచ్ దొరికితే కచ్చితంగా 200కు పైగా స్కోరు చేస్తాము. కానీ ఈ పిచ్‌లు మాకు అంతగా సహకరించడం లేదు’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్యStarting your Monday with the Blue Storm that lit up Dubai last night 🌪️ 💙 Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/DNKy14ylYn— Sony Sports Network (@SonySportsNetwk) September 22, 2025 -
ఛీ.. మీ బుద్ధిమారదా?.. బరితెగించిన పాక్ ఆటగాళ్లు!
టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు బరితెగించారు. ఓ బ్యాటర్ ఏకే-47 మాదిరి బ్యాట్‌తో సంబరాలు చేసుకుంటే.. ఇంకో ఆటగాడు ఇంకాస్త దిగజారి వ్యవహరించాడు. ప్రేక్షకులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. దీంతో భారత నెటిజన్లు పాక్ ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఛీ.. మీ బుద్ధి మారదా?‘‘ఛీ.. మీ బుద్ధి మారదా? ఇంతకంటే ఇంకెంతకు దిగజారుతారు?’’ అంటూ చివాట్లు పెడుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఆసియా కప్-2025 టోర్నీ సూపర్-4లో భాగంగా భారత్- పాకిస్తాన్ (IND vs PAK) ఆదివారం తలపడ్డాయి.దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసి.. పాక్‌ను 171 పరుగులకు కట్టడిచేసింది. ఆపై 18.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇదిలా ఉంటే.. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.ఏకే-47 గన్ ఎక్కుపెట్టినట్లుగాఫర్హాన్ నలభై ఐదు బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 58 పరుగులు సాధించాడు. అయితే, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగానే ఏకే-47 గన్ ఎక్కుపెట్టినట్లుగా అభినయిస్తూ బ్యాట్‌ను చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు.విరాట్ కోహ్లి నామస్మరణయువ ఆటగాడు ఫర్హాన్ సంగతి ఇలా ఉంటే.. సీనియర్ ప్లేయర్ హ్యారిస్ రవూఫ్ మరో అడుగు ముందుకు వేశాడు. బౌండరీ రోప్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భారత దిగ్గజం విరాట్ కోహ్లి నామస్మరణ చేస్తూ ప్రేక్షకులు టీమిండియాను ఉత్సాహపరిచారు. దీంతో టీ20 ప్రపంచకప్-2022లో కోహ్లి తన బౌలింగ్‌లో రెండు వరుస సిక్స్‌లు బాది.. మ్యాచ్‌ను లాగేసుకున్న విషయం అతడికి గుర్తుకు వచ్చినట్లు ఉంది.ఇదొక దిగజారుడు చర్యఅయితే, ఇందుకు తాజా మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో సమాధానం ఇవ్వాల్సింది పోయి.. రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్.. భారత్‌కు చెందిన ఆరు ఫైటర్ జైట్లను కూల్చామని ప్రగల్బాలు పలికిన విషయం తెలిసిందే. మరోసారి ఈ విషయాన్ని గుర్తుచేస్తూ.. హ్యారిస్ రవూఫ్ సైగలు చేశాడు.అంతకు ముందు ప్రాక్టీస్ సమయంలో ఫుట్‌బాల్ ఆడుతూ.. 6-0sతో లీడ్‌లో ఉన్నామంటూ భారత జర్నలిస్టుల ముందు పాక్ ఆటగాళ్లు అతి చేశారు. ఈ నేపథ్యంలో ఇదొక దిగజారుడు చర్య అంటూ క్రికెట్ ప్రేమికులు పాక్ ఆటగాళ్ల తీరును విమర్శిస్తున్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత ఆటగాళ్లు నిరాకరిస్తున్న విషయం తెలిసిందే.ఆసియా కప్ -2025 సూపర్ 4: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్👉పాకిస్తాన్ స్కోరు: 171/5 (20)👉టీమిండియా స్కోరు: 174/4 (18.5)👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్య Haris Rauf never disappoints, specially with 6-0. pic.twitter.com/vsfKKt1SPZ— Ihtisham Ul Haq (@iihtishamm) September 21, 2025సెకండ్ వికెట్ పడగొట్టిన Shivam Dube 💥 చూడండి #INDvPAK లైవ్Sony Sports Network TV Channels & Sony LIV లో#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/EZGkRemo4D— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025