పాక్ ఓపెన‌ర్ల విధ్వంసం.. శ్రీలంక ముందు భారీ టార్గెట్‌ | Pakistan end with 212, need to restrict Lanka under 147 | Sakshi
Sakshi News home page

T20 WC 2026: పాక్ ఓపెన‌ర్ల విధ్వంసం.. శ్రీలంక ముందు భారీ టార్గెట్‌

Feb 28 2026 9:12 PM | Updated on Feb 28 2026 9:14 PM

Pakistan end with 212, need to restrict Lanka under 147

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో పల్లెకలే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓపెన‌ర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 212 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

ఓపెన‌ర్లు సాహిబ్జాదా ఫర్హాన్, ఫ‌ఖార్ జ‌మాన్ ఘ‌న‌మైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్ద‌రూ తొలి వికెట్‌కు 176 ప‌రుగుల రికార్డు భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఫర్హాన్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. కేవ‌లం 60 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 100 ప‌రుగులు చేశాడు.

ఫర్హాన్‌కు ఈ టోర్నీలో ఇది రెండో సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా జ‌మాన్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 84 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఓ ద‌శ‌లో పాక్ 250 ప‌రుగుల మార్క్ సునాయ‌సంగా దాటేలా క‌న్పించింది.

అయితే ఆఖ‌రిలో వికెట్లు కోల్పోవ‌డంతో పాక్ 250 ప్ల‌స్ ప‌రుగులు సాధించ‌లేక‌పోయింది. శ్రీలంక బౌల‌ర్ల‌లో దిల్షాన్ మ‌ధుశంక మూడు, ష‌న‌క రెండు, చ‌మీరా త‌లా వికెట్ సాధించారు. పాకిస్తాన్ సెమీస్‌కు అర్హ‌త సాధించాలంటే శ్రీలంక‌ను 147 ప‌రుగుల లోపు క‌ట్ట‌డి చేయాలి.
 

Advertisement
 
Advertisement
Advertisement