భార‌త్‌పై సెంచ‌రీల మోత‌.. మిచెల్‌కు ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు | Daryl Mitchell beats Suryakumar Yadav to be named ICC Player of the Month after thrashing India | Sakshi
Sakshi News home page

భార‌త్‌పై సెంచ‌రీల మోత‌.. మిచెల్‌కు ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

Feb 28 2026 4:28 PM | Updated on Feb 28 2026 4:32 PM

Daryl Mitchell beats Suryakumar Yadav to be named ICC Player of the Month after thrashing India

న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ డారిల్ మిచెల్‌కు ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ల‌భించింది. జ‌న‌వ‌రి 2026 నెలకు గాను 'ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా మిచెల్ ఎంపికయ్యాడు. గ‌త నెలలో భార‌త్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో మిచెల్ దుమ్ములేపాడు.

కివీస్ జట్టు 2-1తో సిరీస్ గెలవడంలో డారిల్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ మూడు వ‌న్డేల‌ సిరీస్‌లో అత‌డు ఏకంగా 352 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు సెంచ‌రీలు ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఫ‌లితంగానే అత‌డికి ఈ ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ద‌క్కింది. 

భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇంగ్లండ్ వెటరన్ జో రూట్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి ఈ అవార్డును మిచెల్ సొంతం చేసుకున్నాడు. ఇక బంగ్లాదేశ్‌కు చెందిన శోభన మోస్తరీ మ‌హిళ‌ల విభాగంలో ఈ అవార్డును ద‌క్కించుకుంది. టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో శోభన అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026కు బంగ్లా క్వాలిఫై కావ‌డంలో ఆమెది కీల‌క పాత్ర‌.

Advertisement
 
Advertisement
Advertisement