పురుష సామర్థ్యమున్న స్త్రీలకు చెక్‌! | AFI to introduce SRY Gene Test in national level competitions, Know Why | Sakshi
Sakshi News home page

పురుష సామర్థ్యమున్న స్త్రీలకు చెక్‌!

Feb 28 2026 2:00 PM | Updated on Feb 28 2026 3:44 PM

AFI to introduce SRY Gene Test in national level competitions, Know Why

జన్యు పరీక్షతోనే మహిళల ఈవెంట్‌లో పోటీ
 

న్యూఢిల్లీ: పురుష సామర్థ్యమున్న స్త్రీలు మహిళల విభాగంలో పోటీపడకుండా ఎస్‌ఆర్‌వై జన్యు పరీక్షతో అడ్డుకట్ట వేయాలని భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) నిర్ణయించింది. ఇందులో జీవసంబంధమైన లింగనిర్ధారణలో అమ్మాయి అని తేలితేనే పోటీకి అనుమతిస్తారు. ఇందులో పురుషులకు వుండే వై క్రొమోజోముల ప్రభావం ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళల విభాగంలో అనుమతించరు.

ఇటీవల ఏఎఫ్‌ఐ ఎగ్జిక్యూటీవ్‌ కౌన్సిల్‌ (EC) సమావేశంలో ఎస్‌ఆర్‌వై జన్యు పరీక్ష తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జాతీయ స్థాయిలో జరిగే అన్ని పోటీల్లో ఈ పరీక్ష చేయాలని ఏఎఫ్‌ఐ నిర్ణయించింది. ముందుగా ఈ జూలై 24 నుంచి 28 వరకు జరిగే జాతీయ ఇంటర్‌–స్టేట్‌ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో ఎస్‌ఆర్‌వై జన్యుపరీక్షను అమలు చేయనున్నట్లు ఏఎఫ్‌ఐ తెలిపింది.  

ఎందుకీ పరీక్ష... ఏమిటీ ‘ఎస్‌ఆర్‌వై’ ?
జన్మతః అమ్మాయిగా పుట్టినప్పటికీ చాలా అరుదుగా కొందరు స్త్రీలలో పురుష సామర్థ్యం అసహజంగా ఉంటుంది. హార్మోన్ల అసమతౌల్యం కారణంగా ఇలా జరుగుతుంది. దీనివల్ల సదరు స్త్రీ సాటి స్త్రీలకంటే పురుషుడి సామర్థ్యం కలిగి ఉంటుంది. 

దీంతో పోటీల్లో పైచేయి సాధిస్తుంది. ఎస్‌ఆర్‌వై అంటే పురుషుల్లో ఉండే వై క్రొమోజోముల్ని బట్టి నిర్ధారించే లింగ పరీక్ష (SRY gene test). ఈ టెస్టు మహిళలకు చేస్తే జన్మతః కాకుండా జీవసంబంధమైన లింగ నిర్ధారణ బయటపడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement