భారత్‌కు గుడ్ న్యూస్‌.. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్‌ | Tilak Varma Fully Fit Ahead Of T20 World Cup 2026, Set To Join Team India In Mumbai, Read Story Inside | Sakshi
Sakshi News home page

భారత్‌కు గుడ్ న్యూస్‌.. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్‌

Feb 1 2026 11:23 AM | Updated on Feb 1 2026 11:43 AM

Tilak Varma cleared to play T20 World Cup 2026 warm-ups

టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు భారత జట్టుకు శుభవార్త. హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మ పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరమైన తిలక్‌... బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించాడు. సీఓఈలో నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలలో అతడు ఉత్తీర్ణీత సాధించాడు.

దీంతో తిలక్‌కు బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్ వైద్య బృందం క్లియరెన్స్ ఇచ్చింది. అతడు మంగళవారం(ఫిబ్రవరి3) ముంబైలో టీమిండియాతో కలవనున్నాడు. భారత్ ఆడబోయే రెండు వార్మప్ మ్యాచ్‌లలో తిలక్ భాగం కానున్నాడు. ఇక కివీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన సంజు శాంసన్‌ స్థానంలో టీ20 ప్రపంచకప్‌లో ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయం కాగా... తిలక్‌ వర్మ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. 

ఈ పొట్టి ప్రపంచకప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 7న నవీ ముంబై వేదికగా యూఎస్‌ఎతో తలపడనుంది. అంతకుముందు ఫిబ్రవరి 2న అమెరికా, ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో మెన్ ఇన్ బ్లూ వార్మప్ మ్యాచ్‌లలో ఆడనుంది.

టీ20 ప్రపంచకప్ 2026కు భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్‌, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement