శ్రీలంక‌తో చావో రేవో.. జ‌ట్టులో మూడు మార్పులు చేసిన పాక్‌ | T20 WC 2026 SL Vs PAK, Srilanka Opt To Bowl, Pakistan Make Three Changes And Need 65 Run Victory To Enter Semis | Sakshi
Sakshi News home page

PAK vs SL: శ్రీలంక‌తో చావో రేవో.. జ‌ట్టులో మూడు మార్పులు చేసిన పాక్‌

Feb 28 2026 6:48 PM | Updated on Feb 28 2026 9:21 PM

T20 WC 2026: Srilanka opt to bowl, Pakistan make three changes

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్-2026 సూప‌ర్‌-8 లో భాగంగా కొలంబో వేదిక‌గా శ్రీలంక‌, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక‌ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక ఇప్ప‌టికే సెమీస్ రేసు నుంచి నిష్క్ర‌మించ‌గా.. పాక్‌కు మాత్రం ఈ మ్యాచ్ చాలా కీల‌కం.

పాక్ తొలుత బ్యాటింగ్ చేయ‌నున్నందున 65 ప‌రుగుల తేడాతో శ్రీలంక‌ను ఓడించాలి. అప్పుడే న్యూజిలాండ్‌ను వెన‌క్కినెట్టి పాక్ సెమీస్‌కు అర్హ‌త సాధిస్తోంది. ఈ కీల‌క మ్యాచ్‌లో పాకిస్తాన్ మూడు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. ఖవాజా నఫే, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్ తుది జ‌ట్టులోకి వ‌చ్చారు.

తుది జ‌ట్లు
పాకిస్తాన్ : సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), ఖవాజా నఫే, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీప‌ర్‌), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్

శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార(వికెట్ కీప‌ర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్), జనిత్ లియానాగే, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక

Advertisement
 
Advertisement
Advertisement