రంజీ ట్రోఫీ విజేతగా జమ్మూ కాశ్మీర్‌.. భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన సీఎం | J and K lift Ranji Trophy, CM Omar Abdullah announces massive cash reward for team | Sakshi
Sakshi News home page

రంజీ ట్రోఫీ విజేతగా జమ్మూ కాశ్మీర్‌.. భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన సీఎం

Feb 28 2026 7:52 PM | Updated on Feb 28 2026 9:20 PM

J and K lift Ranji Trophy, CM Omar Abdullah announces massive cash reward for team

భారత దేశవాళీ క్రికెట్‌లో స‌రికొత్త చ‌రిత్ర  ఆవిష్కృతమైంది. జ‌మ్మూ కాశ్మీర్‌ 67 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెరిదించుతూ మొట్ట‌మొద‌టి రంజీ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్‌ను జ‌మ్మూ కాశ్మీర్ కైవ‌సం చేసుకుంది.

ఫైన‌ల్లో క‌ర్ణాటక‌పై జ‌మ్మూ విజ‌యం సాధించింది. మ్యాచ్ డ్రా ముగిసిన‌ప్ప‌టికి తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యప‌రంగా జే అండ్ కేను విజేత‌గా నిర్ణ‌యించారు. ఈ విజ‌యంతో జ‌మ్మూ కాశ్మీర్ అంతటా సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. ఈ నేప‌థ్యంలో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ.2 కోట్ల నగదు బహుమతి ప్రకటించారు. 

అంతేకాకుండా, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆట‌గాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఆయ‌న‌ హామీ ఇచ్చారు. ఒమర్ అబ్దుల్లా చివ‌రి రోజు ఆట చూసేందుకు స్టేడియం వ‌చ్చి త‌మ జ‌ట్టును  ఉత్స‌హ‌ప‌రిచారు. ఈ క్ర‌మంలో విజ‌యం సాధించిన అనంత‌రం త‌మ ఆట‌గాళ్ల‌ను అబ్దుల్లా అభినందించారు.

ఈ ఏడాది సీజ‌న్‌లో జ‌మ్మూ కాశ్మీర్ ప్లేయ‌ర్లు దుమ్ములేపారు. ఆకిబ్ నబీ,అబ్దుల్ సమద్, పరాస్ డోగ్రా, సునీల్ కుమార్ అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న‌లు క‌న‌బ‌రిచారు. ఆకిబ్ నబీ 60 వికెట్ల‌తో ఈ సీజ‌న్ లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు. ఫైన‌ల్లో కూడా 5 వికెట్లతో స‌త్తాచాటాడు. అదేవిధంగా ఐపీఎల్ స్టార్ సమద్ ఈ సీజన్లో 10 మ్యాచ్‌ల్లో 748 పరుగులు చేశాడు. కెప్టెన్ పరాస్ డోగ్రా 637 ప‌రుగుల‌తో జ‌ట్టును ముందుండి న‌డిపించాడు.

Advertisement
 
Advertisement
Advertisement