breaking news
Omar Abdullah
-
ఎవరీ పాయల్ నాథ్..? హాట్‌టాపిక్‌గా విడాకుల కేసు..
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు శుక్రవారం సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేయడంతో, ఏళ్ల తరబడి సాగిన న్యాయ పోరాటానికి తెరపడింది. దాంతో ఆయన భార్య పాయల్ నాథ్ పేరు వార్తల్లో మరోసారి నిలిచింది. ఆమె ప్రజా జీవితానికి దూరంగా ఉంటూ పారిశ్రామికవేత్తగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నప్పటికీ..రాజకీయ కుటుంబ నేపథ్యం రీత్యా ఆమె మీడియా దృష్టిని ఆకర్షించింది. భర్త ఒమర్ అబ్దుల్లా రాజకీయ ప్రయాణానికి అత్యంత భిన్నమైన మార్గం ఆమెది. ఇంతకీ ఎందుకు ఈ దంపతుల విడాకులు కేసు చర్చనీయాంశమైందంటే...కారణం ఇదే..పాయల్, ఒమర్ అబ్దుల్లాల వివాహం 1994లోనే జరిగినా 2007లో తమిద్దరి మధ్య వైవాహిక సంబంధాలు లేవని ఒమర్ అబ్దుల్లా కోర్టుకు గతంలోనే వెల్లడించారు. 2009 నుంచి భార్యభర్తలు ఇద్దరూ విడిగా జీవిస్తున్నారు. ఒంటరిని చేయడం, క్రూరత్వాన్ని ప్రదర్శించడం వంటి అంశాల ఆధారంగా పాయల్ నుంచి విడాకులు ఇప్పించాలని ఒమర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.అయితే 2016లో ఫ్యామిలీకోర్టు దీన్ని తిరస్కరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఒమర్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. 2023లో ఢిల్లీ హైకోర్టు కూడా ఫ్యామిలీకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ పాయల్‌కు నెలకు రూ.1.5 లక్షలు, సంతానం చదువుల కోసం ఒకొక్కరికి నెలకు రూ.60 వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఒమర్ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. పాయల్ తన స్పందనను తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జూలై 22న ఒమర్ ఆర్టికల్ 142 కింద వివాహాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టును అర్థించారు. తాము పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని, పెండింగ్‌లో ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించుకున్నామని ధర్మాసనానికి తెలియజేసిన తర్వాత, వారి వివాహాన్ని రద్దు చేయడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. ఆ విధంగా ధర్మాసనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి కోర్టు విడాకులు మంజూరు చేయడంతో, ఏళ్ల తరబడి సాగిన విడాకులు కేసుకి పులిస్టాప్ పడింది.ఎవరీ పాయల్‌నాథ్..?పాయల్ నాథ్ జూన్ 6, 1973న ఢిల్లీలో సిక్కు కుటుంబంలో జన్మించారు. ఆమె మూలాలు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న లాహోర్‌కు చెందినవి. ఆమె దివంగత మేజర్ జనరల్ రామ్ నాథ్ కుమార్తె. సైనిక కుటుంబంలో పెరగడం వల్ల, ఆమె తన బాల్యంలో ఎక్కువ భాగం వివిధ కంటోన్మెంట్లలో గడిపారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీషులో ఆనర్స్ డిగ్రీని అభ్యసించడానికి ముందు, ఒక ఆర్మీ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు.వారిద్దరు ఎలా కలుసుకున్నారంటే..ఒమర్ అబ్దుల్లా రాజకీయాల్లోకి ప్రవేశించడానికి చాలా కాలం ముందు, ఆయన, పాయల్ నాథ్ ఇద్దరూ ఆతిథ్య రంగంలో పనిచేశారు. న్యూఢిల్లీలోని 'ది ఒబెరాయ్'లో పనిచేస్తున్నప్పుడు వారిద్దరూ కలుసుకున్నారు. ఒమర్ అబ్దుల్లా ఆ విలాసవంతమైన హోటల్ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుండగా, పాయల్ నాథ్ కూడా అదే సంస్థలో భాగంగా ఉన్నారు. వారి వృత్తిపరమైన పరిచయం క్రమంగా వ్యక్తిగత సంబంధంగా మారింది. అలా ఈ జంట సెప్టెంబర్ 1, 1994న వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు జహీర్, జమీర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దాదాపు 17 సంవత్సరాల వివాహ బంధం తర్వాత, ఆ దంపతులు సెప్టెంబర్ 2011లో విడిపోయారు. విడిపోయిన తర్వాత, పాయల్ రాజకీయ జీవితానికి, ప్రజా దృష్టికి దూరంగా ఉంటూ, వారి పిల్లలతో కలిసి న్యూఢిల్లీలో నివసిస్తూన్నారు.ఆమె నడిపే వ్యాపారాలు ఇవే..పాయల్ నాథ్ రాజకీయ జీవితానికి దూరంగా వ్యవస్థాపకతను ఎంచుకున్నారు. ఆమె 'జైరు నేచురల్లే' అనే మినరల్ వాటర్ కంపెనీకి యజమాని. దీని తయారీ కేంద్రం కులుకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో, కులు-మనాలి హైవేపై ఉంది. ఈ వ్యాపారంతో పాటు, ఆమె ఢిల్లీ కేంద్రంగా ఒక ట్రావెల్ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఆమె వ్యాపార ఆసక్తులు ఎక్కువగా ఆతిథ్యం, పర్యాటక రంగాలతో ముడిపడి ఉన్నాయి. ఈ రంగాలతో ఆమెకు తన కెరీర్ ప్రారంభ సంవత్సరాల నుంచే పరిచయం ఉంది. ఆమె వ్యవస్థాపక ప్రయాణం తన మాజీ భర్త రాజకీయ గుర్తింపుతో సంబంధం లేకుండా స్వతంత్రంగా నిర్మించుకున్నారు. ఆమె బహిరంగంగా కనిపించడం అరుదు, అలాగే మీడియాకు దూరంగా ఉంటూ తన వృత్తిపరమైన ఐడెంటిటీతో సాగిపోవడమే ఆమెను ప్రత్యేకంగా నిలిపింది.(చదవండి: ఐదు పదుల వయసులోనూ యంగ్‌గా నటి శోభనా..! ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..) -
జమ్మూ కశ్మీర్ సీఎం వివాహం రద్దు!
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వివాహాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం అధికారికంగా రద్దు చేసింది. ఒమర్‌తోపాటు భార్య పాయల్ల వాదనలు విన్న తరువాత సుప్రీంకోర్టు తుది తీర్పునిస్తూ ‘‘ఇరువురు స్వేచ్ఛను ఎంచుకున్నారు’’ అని వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తమ వివాహాన్ని రద్దు చేయాలని, ఈ మేరకు ఇద్దరూ ఒక అంగీకరానికి వచ్చామని ఒమర్ తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ చేసిన వాదనలను జస్టిస్ పి.ఎస్.నరసింహన్, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన బెంచ్ సుప్రీంకోర్టు అంగీకరించింది.‘‘ఆర్టికల్ 142 కింద దరఖాస్తు ఎప్పుడు నమోదైంది’’అన్న బెంచ్ ప్రశ్నకు కపిల్ సిబల్ ‘‘జూలై 22న’’అని సమాధానమిచ్చారు. పాయల్‌తో తన వివాహం 1994లోనే జరిగినా 2007లో తమిద్దరి మధ్య వైవాహిక సంబంధాలు లేవని ఒమర్ అబ్దుల్లా కోర్టుకు గతంలోనే వెల్లడించారు. 2009 నుంచి భార్యభర్తలు ఇద్దరూ విడిగా జీవిస్తున్నారు. ఒంటరిని చేయడం, క్రూరత్వాన్ని ప్రదర్శించడం వంటి అంశాల ఆధారంగా పాయల్ నుంచి విడాకులు ఇప్పించాలని ఒమర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే 2016లో ఫ్యామిలీకోర్టు దీన్ని తిరస్కరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఒమర్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. 2023లో ఢిల్లీ హైకోర్టు కూడా ఫ్యామిలీకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ పాయల్‌కు నెలకు రూ.1.5 లక్షలు, సంతానం చదువుల కోసం ఒకొక్కరికి నెలకు రూ.60 వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఒమర్ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. పాయల్ తన స్పందనను తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జూలై 22న ఒమర్ ఆర్టికల్ 142 కింద వివాహాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టును అర్థించారు. -
ఢిల్లీలో కశ్మీర్ సీఎం నిరసన
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు తక్షణమే రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అధికార నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, సీఎం ఒమర్ అబ్దుల్లా, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు సోమవారం ఢిల్లీలో నిరసన చేపట్టారు. రాష్ట్రహోదా పునరుద్ధరణకు ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజే వారు ఈ నిరసన చేపట్టినప్పటికీ కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళన కారణంగా మరుగునపడి పోయింది. జమ్మూ నుంచి సీఎం ఒమర్ సోమవారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నప్పటికీ జంతర్‌మంతర్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు కారణంగా నిరసన వేదిక వద్దకు చేరుకోలేకపోయారు. సాయంత్రం కాన్స్టిట్యూషన్ క్లబ్లో తలపెట్టిన రాష్ట్ర హోదాపై సదస్సును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, ‘రిస్టోర్ స్టేహుడ్’అని ఉన్న జాకెట్‌తో అశోకా రోడ్లో పేమెంట్‌పై బైటాయించిన సీఎం ఒమర్ అబ్దుల్లాకు సీజేపీ నిరసనకారులు కొందరు జతకలిశారు. అక్కడ గుంపు పెద్దదవడంతో పోలీసులు టియర్ గ్యాస్‌తో వారందరినీ చెదరగొట్టారు. -
ఢిల్లీలో కాకుండా వైట్‌హౌస్ బయట నిరసన తెలపాలా?
జమ్మూ: జమ్మూకశ్మీర్‌కు సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర హోదా కల్పించాలని ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర హోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల 20 నుంచి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఆదివారం జమ్మూలో జరిగిన ఓ నిరసన ర్యాలీలో ఒమర్ అబ్దుల్లా ప్రసంగించారు. ‘‘నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనపై బీజేపీ నేతలు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఢిల్లీలో ఇలాంటి నిరసనల వల్ల రాష్ట్ర హోదా లభించదని అంటున్నారు. మరి ఢిల్లీలో కాకపోతే ఇంకెక్కడ నిరసన చేపట్టాలి?’’ అని ఒమర్ ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్‌లో, అసెంబ్లీలో నిరసనల ద్వారా రాష్ట్ర హోదా కోసం తాము చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ దెబ్బతీసిందని ఆరోపించారు. ఇప్పుడు దేశ రాజధానిలో నిరసన విషయంలోనూ అదే కుట్ర చేస్తోందని నిప్పులు చెరిగారు. రాష్ట్ర హోదాను సాధించేందుకు అమెరికాకు వెళ్లి వైట్‌హౌస్ బయట నిరసన తెలపాలా? అని ప్రశ్నించారు. సొంత దేశంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాత్రమే తాము కోరుతున్నామని చెప్పారు. -
మువ్వన్నెల రిబ్బన్ కత్తిరిస్తారా ఎవరైనా: ఒమర్
శ్రీనగర్: రాష్ట్ర వేసవికాల రాజధాని శ్రీనగర్‌లో బుధవారం ఒక ఎగ్జిబిషన్‌ను ప్రారంభించేందుకు వచ్చిన జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అక్కడి ముఖద్వారానికి అడ్డంగా పెట్టిన ప్రారంభోత్సవ రిబ్బన్‌ను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఇదేం రిబ్బన్? త్రివర్ణ పతాక రంగుల్లో ఎవరైనా రిబ్బన్‌ను సిద్ధంచేస్తారా? నేను అస్సలు దీనిని కత్తిరించబోను. వెంటనే దీనిని జాగ్రత్తగా పక్కకు తీసేయండి. పడేయకుండా మడతపెట్టి జాగ్రత్తపరచండి’’అని అధికారులకు సూచించారు. అసలు ఈ ఐడియా ఎవరిది? అని ఆరాతీశారు. దీంతో కంగుతిన్న అక్కడి ఎగ్జిబిషన్ నిర్వహకులు మాకు తెలియదు, మాకు తెలియదు అంటూ నీళ్లు నమిలారు. ఘటన జరిగినప్పుడు సీఎంతోపాటు డెప్యూటీ సీఎం సురీందర్ చౌదరి, సలహాదారు నసీర్ ఆలం తదితరులు ఉన్నారు. శ్రీనగర్‌లోని కశ్మీర్ హాత్ ప్రాంతంలోని ‘నో యువర్ ఆర్టిసాన్’ఎగ్జిబిషన్ ఈ ఘటనకు వేదికైంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ముఖ్యమంత్రి దేశభక్తి, సమయస్ఫూర్తిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘‘జాతీయజెండాకు నిజమైన గౌరవం ఇవ్వడమంటే ఇదే. చవకబారు టీవీ చర్చలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సీఎం సమయస్ఫూర్తితో వ్యవహరించారు. మన మాటలకంటే చేతలే శక్తివంతంగా ప్రజల్లోకి వెళ్తాయి’’అని నేషనల్ కాన్ఫెరెన్స్ పార్టీ నేత గగన్ భగత్ అన్నారు. -
రంజీ ట్రోఫీ విజేతగా జమ్మూ కాశ్మీర్.. భారీ నజరానా ప్రకటించిన సీఎం
భారత దేశవాళీ క్రికెట్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. జమ్మూ కాశ్మీర్ 67 ఏళ్ల నిరీక్షణకు తెరిదించుతూ మొట్టమొదటి రంజీ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్‌ను జమ్మూ కాశ్మీర్ కైవసం చేసుకుంది.ఫైనల్లో కర్ణాటకపై జమ్మూ విజయం సాధించింది. మ్యాచ్ డ్రా ముగిసినప్పటికి తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యపరంగా జే అండ్ కేను విజేతగా నిర్ణయించారు. ఈ విజయంతో జమ్మూ కాశ్మీర్ అంతటా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ.2 కోట్ల నగదు బహుమతి ప్రకటించారు. అంతేకాకుండా, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒమర్ అబ్దుల్లా చివరి రోజు ఆట చూసేందుకు స్టేడియం వచ్చి తమ జట్టును ఉత్సహపరిచారు. ఈ క్రమంలో విజయం సాధించిన అనంతరం తమ ఆటగాళ్లను అబ్దుల్లా అభినందించారు.ఈ ఏడాది సీజన్లో జమ్మూ కాశ్మీర్ ప్లేయర్లు దుమ్ములేపారు. ఆకిబ్ నబీ,అబ్దుల్ సమద్, పరాస్ డోగ్రా, సునీల్ కుమార్ అసాధరణ ప్రదర్శనలు కనబరిచారు. ఆకిబ్ నబీ 60 వికెట్లతో ఈ సీజన్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఫైనల్లో కూడా 5 వికెట్లతో సత్తాచాటాడు. అదేవిధంగా ఐపీఎల్ స్టార్ సమద్ ఈ సీజన్లో 10 మ్యాచ్‌ల్లో 748 పరుగులు చేశాడు. కెప్టెన్ పరాస్ డోగ్రా 637 పరుగులతో జట్టును ముందుండి నడిపించాడు. -
ఆసియాలోనే పొడవైన స్కై డ్రాగ్ లిఫ్ట్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పర్యా టక ప్రాంతం గుల్మార్గ్లో ఆసియాలోనే అత్యంత పొడవైన స్కై డ్రాగ్ లిఫ్ట్ ఏర్పాటైంది. దీనిని శనివారం సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రారంభించారు. స్కైయింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరున్న గుల్మార్గ్లో దీనివల్ల స్కైయింగ్ మౌలికవసతులు మరింతగా మెరుగయ్యాయని సీఎం చెప్పారు. అంతర్జాతీయ వింటర్ స్పోర్ట్స్ మ్యాప్‌లో గుల్మార్గ్ కూడా చేరినట్లయిందని చెప్పారు. బారాముల్లా జిల్లా కొంగ్డొరి వద్ద రూ.3.65 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ స్కై డ్రాగ్ లిఫ్టు పొడవు 726 మీటర్లు. పైన వేలాడుతున్న కదిలే బార్‌ను పట్టుకుని బోర్డుపై నిలబడిన వ్యక్తిని ఇది ఎత్తయిన ప్రదేశంపైకి లాక్కెళుతుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఒమర్ అబ్దుల్లా గుల్మార్గ్లోని అఫ్ఫర్వాత్లో ఏర్పాటైన ప్రపంచంలోనే ఎత్తయిన రివాల్వింగ్ మల్టీపర్సస్ హాల్‌ను కూడా ప్రారంభించారు. గుల్మార్గ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో రూ.17 కోట్లతో నెలకొల్పిన పలు పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించారు. అదేవిధంగా, వింటర్ ట్రెయినింగ్ వసతులను మెరుగుపరిచే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ స్కైయింగ్ ట్రెయినింగ్ అడ్వంచర్ టూరిజమ్ సెంటర్‌ను, ఇంటిగ్రేటెడ్ స్కై ట్రెయినింగ్ కోర్సులను కూడా ఆయన ప్రారంభించారు. జమ్మూకశ్మీర్ పర్యాటక రంగంలో గుల్మార్గ్కు ప్రముఖ స్థానం ఉందని సీఎం ఒమర్ చెప్పారు. పూర్తిస్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అ త్యాధునిక, అత్యంత నాణ్యమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం పెట్టుబడుల అవసరముందని తెలిపారు. దీనివల్ల ఏడాదంతా పర్యాటక రంగ అవకాశాలుండటంతోపాటు స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. -
పైసలేవి మేడం?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విచిత్రమైన సన్నివేశం ఎదురైంది. శనివారం జరిగిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ ఇందుకు వేదికైంది. అందులో నిర్మల మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ‘కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాక అక్కడ ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కానీ జమ్మూ కశ్మీర్‌కు అతి కీలకమైన పర్యాటకం ’బయటి’ పరిస్థితుల వల్ల పూర్తిగా పడకేసింది‘ అని అన్నారు. తర్వాత అదే సదస్సులో ఒమర్ మాట్లాడుతూ, అసలు జమ్మూ కశ్మీర్లో డబ్బులు ఎక్కడున్నాయి మేడమ్ అంటూ నిర్మలను ప్రశ్నించారు. కశ్మీరం ఇప్పుడు మీ కాసులకు చెప్పలేనంతగా కటకటలాడుతోందని ఆవేదన వెలిబుచ్చారు. తమ ప్రాంత ప్రయోజన కోసం కేంద్రంతో సఖ్యంగా ఉంటే తప్పేమిటని విపక్షాలను, తన విమర్శకులను ప్రశ్నించారు. అందుకోసం పాలక బీజేపీతో జట్టు కట్టాల్సి అవసరం ఏమీ లేదని స్పష్టం చేశారు. -
కశ్మీరీలందరినీ అనుమానిస్తున్నారు: ఒమర్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్‌కు చెందిన కొంతమంది వ్యక్తులు చేసిన పనికి ప్రాంతం మెుత్తాన్ని నిందిస్తున్నారని అక్కడి సీఎం ఒమర్ అబ్దుల్లా అసహానం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జమ్మూకశ్మీర్ ప్రజలు ఎక్కడా ఉండే విధంగా లేదని ఎక్కడికెళ్లినా వారిని అనుమానంగా చూస్తున్నారని అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.ఢిల్లీ ఎర్రకోట కారుబాంబు దాడిలో జమ్మూకశ్మీర్ ప్రాంతానికి చెందిన వ్యక్తులను ప్రధాన నిందితులుగా ఎన్ఐఏ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు." ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటనకు కొంతమంది బాధ్యులు. కాని పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రాంతంలోని వ్యక్తులంతా కారణం అన్నట్లున్నాయి. జమ్మూకశ్మీర్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఢిల్లీలో తిరగడం నేరం అన్నట్లు చూస్తున్నారు. నేను ఆ ప్రాంతంలో తిరిగినా ఎవరూ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనేలా పరిస్థితులు కన్పిస్తున్నాయి" అని ఆయన అన్నారు.2019లో జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు అంతా ఆగిపోతుందని కేంద్రం చెప్పింది కానీ ఏమీ ఆగలేదు. ఒకవేళ ఢిల్లీలో బాంబుబ్లాస్ట్ జరిగి ఉండక పోతే తమ దగ్గర జరిగేదని జమ్మూ ఎంతో హింసను చూసిందని బాంబుల దాడులతో జమ్మూ ప్రజలు మరణించడం ఇంకా ఆగలేదని ఒమర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులెవరూ పిల్లలను తమ ప్రాంతం వదిలి బయిటకు పంపించేలా లేరని ఒమర్ తెలిపారు.కాగా ఎర్రకోట బాంబుదాడి ఘటనపై ఆయన తండ్రి ఫరుూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. డాక్టర్లు ఈ మార్గం ఎందుకు ఎన్నుకున్నారు. దానికి కారణం ఏమిటి? దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన అన్నారు. -
జమ్మూ కశ్మీర్ ముస్లింలంతా ఉగ్రవాదులు కాదు: ఒమర్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్‌లో ఉన్న ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదని అక్కడి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఏ మతం ప్రజలను చంపమని హింసను ప్రోత్సహించమని చెప్పదని కశ్మీర్ యువతకు ఉగ్రవాదులతో సంబంధాలు లేవన్నారు. ఢిల్లీ ఎర్రకోట బాంబుదాడి కేసులో కొంతమంది కశ్మీర్ డాక్టర్లను అరెస్టు చేసిన నేపథ్యంలో అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు."ఒక విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కశ్మీర్ ప్రజలందరూ టెర్రరిస్టులు కాదు. వారితో సంబంధాలు లేవు. కానీ కొంతమంది మాత్రం ప్రతిసారి ఇక్కడి ప్రశాంతతను దెబ్బతీయాలని, సోదరభావాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కశ్మీర్ యువత ఎవరికివారు ప్రత్యేక మైన భావజాలం కలిగి ఉంటారు. అందరూ ఒకే రకమైన భావజాలం అందరూ టెర్రరిస్టులే అనుకుంటే అది సరైన పద్దతికాదు" అని ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు దాడి కేసులో ప్రధాన నిందితులైన డా.ఒమర్ మహమ్మద్, డా.ముజామిల్ లు పుల్వామాకు చెందిన వారు కాగా డా. ఆదిల్ అనంత్ నాగ్ ప్రాంతానికి చెందిన వారు. వీరిపై ఎన్ఐఏ జరిపిన దర్యాప్తులో వీరికి ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ తో సంబంధాలున్నట్లు తేలింది.ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల కేసులో సంబంధమున్న వారిని కఠినంగా శిక్షించాలని అదే సందర్భంలో అమాయికులైన వారిని అరెస్టు చేయడం సరికాదని అబ్దుల్లా తెలిపారు. ఎర్రకోట బాంబు పేలుళ్లకు సంబంధించిన భద్రతా వైఫల్యం అంశపైనా ఒమర్ అబ్దుల్లా కేంద్రాన్ని ప్రశ్నించారు. -
క్లీన్ స్వీప్ మిస్.. బీజేపీకి ‘క్రాస్ ఓటింగ్’ విక్టరీ!
కేంద్ర పాలిత జమ్ము కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి(Jammu Rajya Sabha Results). అధికార నేషనల్ కాన్ఫరెన్స్ క్లీన్ స్వీప్ మిస్ అయ్యింది. నాలుగు స్థానాల్లో మూడింటిని కైవసం చేసుకుంది. మిగిలిన ఒక్క స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోగా.. క్రాస్ ఓటింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరిగిన తొలి రాజ్యసభ ఎన్నికలు ఇవే. జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో శుక్రవారం(అక్టోబర్ 24వ తేదీన) ఓటింగ్ జరిగింది. 88 మంది ఎమ్మెల్యేలకు గానూ.. 86 మంది నేరుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జైల్లో ఉన్న ఆప్ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. కాంగ్రెస్, పీడీపీ, సీపీఐ(ఎం), ఏఐపీ, ఇతర స్వతంత్ర ఎమ్మెల్యేలు నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు.ఎన్సీ తరఫున చౌదరి మహ్మద్ రంజాన్, సజ్జాద్ కిచ్లూ, జీఎస్ ఒబెరాయ్, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ సత్ పాల్ శర్మ(Sat Paul Sharma) విజేతలుగా నిలిచారని అసెంబ్లీ సెక్రటరీ ఎంకే పండిత తెలిపారు. भाजपा जम्मू कश्मीर अध्यक्ष श्री @iamsatsharmaca ने आज विधानसभा सचिवालय, श्रीनगर में राज्यसभा सांसद के रूप में विजय का प्रमाण पत्र चुनाव अधिकारी से प्राप्त किया। pic.twitter.com/pZul3mcCjF— BJP Jammu & Kashmir (@BJP4JnK) October 24, 2025నాలుగో సీటు కోసం నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఇమ్రాన్ నబీ, సత్ శర్మ పోటీ పడ్డారు. అయితే 32 ఓట్లతో శర్మ విజయం సాధించినట్లు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. జమ్ము అసెంబ్లీలో బీజేపీకి కేవలం 28 సీట్లు మాత్రమే ఉండగా.. 4 అదనపు ఓట్లు వచ్చాయి. అయితే బీజేపీ ఊహించినట్లుగానే.. స్వతంత్రులు వాళ్ల వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, సీఎం ఒమర్ అబ్దుల్లా ఆ నాలుగు ఓట్లు ఎక్కడివి? అంటూ ఓ ట్వీట్ చేశారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ(Cross Voting For BJP) ఆ నలుగురు ఎవరు అనేది తేలాల్సి ఉంది. ఇక..All of @JKNC_ votes remained intact across the four elections, as witnessed by our election agent who saw each polling slip. There was no cross voting from any of our MLAs so the questions arise - where did the 4 extra votes of the BJP come from? Who were the MLAs who…— Omar Abdullah (@OmarAbdullah) October 24, 2025డోడా నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేశారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (PSA) కింద సెప్టెంబర్ 8, 2025న అరెస్ట్ అయ్యారాయన. ఆయన ప్రస్తుతం కథువా జిల్లా జైలులో నిర్బంధంలో ఉన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ రాష్ట్రం కాస్త కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. ఛండీగఢ్, లక్షద్వీప్ లాంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు అసెంబ్లీ ఉండదు. కాబట్టి వాటికి రాజ్యసభ స్థానాలు ఉండవు. అయితే.. 2020లో జమ్ము కశ్మీర్ రీజనల్ అసెంబ్లీ తిరిగి ఏర్పడింది. అందువల్ల ఇతర రాష్ట్రాల మాదిరిగానే రాజ్యసభ ఎన్నికలు మళ్లీ అసెంబ్లీలోనే జరిగాయి. అంతా ఊహించినట్లుగానే అధికార పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. -
‘బీజేపీతో దోస్తీ కన్నా.. సీఎం పదవి వదిలేయడం నయం’
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో దోస్తి కట్టడం కంటే.. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవటమే తనకు ఇష్టమని స్పష్టంచేశారు. తన ప్రభుత్వంలోకి బీజేపీని భాగస్వామిగా చేర్చుకుంటే.. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ ఆ పని చేయటం తనకు ఇష్టం లేదని ఒమర్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు.అనంత్‌నాగ్ జిల్లాలోని అచబల్లో మంగళవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘మీరు (ప్రజలను ఉద్దేశించి) సిద్ధమైతే చెప్పండి.. ఈ వ్యాపారం (బీజేపీతో పొత్తు) చేయటం నాకు ఇష్టంలేదు. బీజేపీని ప్రభుత్వంలోకి తీసుకోవటం అవసరమని మీరు అనుకుంటే ముందు నా రాజీనామాను ఆమోదించండి. మరో ఎమ్మెల్యే సీఎం అయ్యి ప్రభుత్వాన్ని నడిపిస్తారు. బీజేపీతో పొత్తుకు నేను మాత్రం సిద్ధంగా లేను. మన ప్రభుత్వంలోకి బీజేపీని తీసుకొంటే మనకు ఒక బహుమతి లభించవచ్చు. వాళ్లు (కేంద్రం) మనకు త్వరలోనే రాష్ట్ర హోదా ప్రకటించవచ్చు’ అని పేర్కొన్నారు.ప్రభుత్వంలో కశ్మీర్‌కు మాత్రమే ప్రాతినిధ్యం ఉందన్న వాదనను ఒమర్ అబ్దుల్లా తిరస్కరించారు. ‘ప్రభుత్వంలో పిర్‌పంజాల్‌కు ప్రాతినిధ్యం ఉంది. దిగువ జమ్ము ప్రాంతానికి కూడా ప్రాతినిధ్యం ఉంది. జమ్మూ నుంచి ఉపముఖ్యమంత్రి ఉన్నారు’ అని తెలిపారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను శాంతియుత, ప్రజాస్వామ్యయుత పోరాటాలతోనే సాధించుకుంటామని స్పష్టంచేశారు. -
'ఐ లవ్ మహ్మద్'పై అభ్యంతరం ఎందుకు?
ఐ లవ్ మహ్మద్ వివాదంపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ప్రజలు తాము ఆరాధించే దైవం పట్ల ప్రేమను వ్యక్తపరచడం తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఐ లవ్ మహ్మద్ అనే మూడు సాధారణ పదాలను చట్టవిరుద్ధమని ఎలా అంటారని నిలదీశారు. ఐ లవ్ మహ్మద్ బ్యానర్ ప్రదర్శించిన వారిపై కేసులు పెట్టడాన్ని ఖండించారు. మతిస్థిమితం తప్పినవారే ఇలాంటికేసులు పెడతారని ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంలో వెంటనే కోర్టులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు.కాన్పూర్‌లో మొదలైన వివాదంఐ లవ్ మహ్మద్ వివాదం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మొదలై దేశమంతా పాకింది. ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ సందర్భంగా సెప్టెంబర్ 4న కాన్పూర్‌లోని రావత్‌పూర్‌లో జరిగిన ఊరేగింపులో ‘ఐ లవ్ మహ్మద్’ (I Love Muhammad) అనే బ్యానర్‌ను ముస్లింలు ప్రదర్శించారు. దీనిపై స్థానిక హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. మతపరమైన వేడుకల్లో కొత్త ట్రెండ్‌తో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారని ఆరోపించాయి. దీంతో పోలీసులు సెప్టెంబర్ 9న 24 మంది ముస్లింలపై కేసులు నమోదు చేశారు.కాన్పూర్ పోలీసుల చర్యకు నిరసనగా ఉన్నావ్, మహరాజ్ గంజ్, కౌశాంబి, లక్నో నగరాల్లో ముస్లింలు ర్యాలీలు చేపట్టారు. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, తెలంగాణలోనూ నిరసనలు తెలిపారు. ‘ఐ లవ్ మహ్మద్’ అనడం నేరం కాదని ఎఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టడంతో ఈ వివాదం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్ అయింది. తాజాగా ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) స్పందించారు.ఎలా చట్టవిరుద్ధం?"ఈ వాక్యంపై ఎవరికైనా అభ్యంతరం ఎందుకు ఉండాలి? ఈ మూడు పదాలతో ఎవరికి సమస్య ఉంటుంది? ఈ మూడు పదాలు రాయడం వల్ల అరెస్టు ఎలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఈ మూడు పదాలపై కేసు పెట్టారంటే వాళ్లు మానసిన అనారోగ్యంతో ఉన్నారని అర్థం. ఈ వివాదాన్నికోర్టులు త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ ముహమ్మద్ అని రాయడం ఎలా చట్టవిరుద్ధం?" అని సీఎం ఒమర్ అబ్దుల్లా విలేకరులతో అన్నారు.చదవండి: 'ఐ లవ్ మహ్మద్' ఎందుకు వివాదంగా మారింది?ఇది ఒక మతానికి సంబంధించింది మాత్రమే కాదని మిగతా మతాల వారు కూడా తమ ఇష్ట దైవాలు, గురువులపై ప్రేమను ఏదోక రూపంలో వ్యక్తపరుస్తూనే ఉంటారని చెప్పారు. ''సిక్కులు, హిందువులు సహా అన్ని మతాల వారు తమ దైవాలపై ప్రేమను వ్యక్తం చేయడం లేదా? జమ్మూకశ్మీర్ (Jammu Kashmir) వెలుపల ఎక్కడికైనా వెళ్లండి. దేవుడు ఫొటోలు లేని వాహనాలు మీకు కనిపించవు. అది చట్టవిరుద్ధం కాకపోతే, ఇది ఎలా అవుతుంది?" అని ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. -
మీకో, మీ మంత్రికో, మీ ఎమ్మెల్యేకో జరిగితే ఇలాగే చేస్తారా?
జమ్ము కశ్మీర్ కిష్తవాడ్ జిల్లా చోసితీ గ్రామంలో ఫ్లాష్‌ఫ్లడ్ సహాయక చర్యలు మూడో రోజుకి చేరాయి. ఇప్పటిదాకా 60 మంది మరణించగా.. గల్లంతైన 80 మంది కోసం(ఆ సంఖ్యే ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది) గాలింపు కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు. అదే సమయంలో స్థానికుల ఆగ్రహమూ తారాస్థాయికి చేరింది. అందుకు అక్కడి ప్రజాప్రతినిధులు తీరే కారణంగా తెలుస్తోంది.గురువారం మధ్యాహ్నాం క్లౌడ్‌బరస్ట్ కారణంగా మెరుపు వరదలు చోసితీని ముంచెత్తాయి. బురద నుంచి శకలాలను తొలగిస్తున్న కొద్దీ.. మృతదేహాలు బయటపడుతూ వస్తున్నాయి. దీంతో గల్లంతైన వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. జమ్ము కశ్మీర్ ఒమర్ అబ్దుల్లా శనివారం ఆ ప్రాంతంలో పర్యటించగా.. స్థానికుడి నుంచి ఆయనకు నిలదీత ఎదురైంది.‘‘పోలీసులు, సైన్యం మా వాళ్ల జాడ కోసం అహర్నిశలు ఇక్కడ కష్టపడుతున్నారు. మేమూ మాకు చేతనైన ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడ 20 జేసీబీలు ఉన్నాయి.కానీ, ఇందులో రెండే పని చేస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు పదే పదే ఇక్కడికి వస్తున్నారు. ఫొటోలకు ఫోజులిస్తున్నారు. దీంతో సహాయక చర్యలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గత మూడురోజుల్లో ఇక్కడ రెండే రెండు పెద్ద బండరాళ్లను తొలగించారంటే పరిస్థతి అర్థం చేసుకోండి. మాకు కుటుంబాలు లేవా?. కనీసం మా వాళ్ల శవాలనైనా మాకు అప్పగించండి’’ అని ఎన్డీటీవీతో బాధితుడొకరు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సరిగ్గా అదే సమయంలో సీఎం ఒమర్ అబ్దుల్లా అటుగా వచ్చారు. ఏం జరిగిందో చెప్పమంటూ ఆ వ్యక్తిని ఆరా తీశారు.జరిగిందంతా చెప్పి.. కనీసం తమవాళ్ల మృతదేహాలనైనా అప్పగించాలని కోరాడా వ్యక్తి. జరుగుతోంది అదేనని.. ఘటన జరిగిన నాటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆ వ్యక్తికి సీఎం బదులిచ్చారు. ఈ క్రమంలో.. అతను మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ‘‘సర్.. నేను చెప్పేది ఓసారి వినండి. నా కుటుంబం నుంచి 13 మంది జాడ లేకుండా పోయారు(తమ పిల్లల ఆచూకీ లేదంటూ పలువురు ఆ సమయంలో గట్టిగా రోదించారు). ఎమ్మెల్యేలు, మంత్రులు పది పదిసార్లు ఇక్కడికి వస్తున్నారు. జేసీబీలను ఆపేయించి ఫొటోలు దిగుతున్నారు. మేం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నాం’’ అని వివరించాడు. విషాదంతో చాలా కుటుంబాలు బాధపడుతున్నాయని, అది తాను అర్థం చేసుకోగలనని సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దీంతో ఆ యువకుడు.. మీకో, మీ ఎమ్మెల్యేకో, మీ మంత్రికో జరిగితే ఇలాగే చేస్తారా?.. త్వరగతిన చర్యలు తీసుకుంటారు కదా అని నిలదీశాడా వ్యక్తి. దీంతో అధికారులను పిలిపించిన సీఎం ఫరూక్ అబ్దుల్లా.. సహాయక చర్యలు త్వరగతిన జరిగేలా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు. -
కబరస్తాన్ గేటు దూకి.. అమరులకు నివాళులర్పించి..!
శ్రీనగర్: శ్రీనగర్‌లోని నక్ష్ బంద్ సాహిబ్ కబరస్తాన్ వద్ద సోమవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1931 జూలై 13న డోగ్రా ఆర్మీ జరిపిన కాల్పుల్లో చనిపోయిన 22 మంది సమాధులు ఇందులోనే ఉన్నాయి. ముఖ్యనేతలెవరూ ఇక్కడికి నివాళులరి్పంచడానికి రాకూడదని యంత్రాంగం సీఎం ఒమర్ సహా పలువురు నేతలను ఆదివారం గృహ నిర్బంధంలో ఉంచింది. అయితే, సోమవారం సీఎం ఒమర్ సహా పలువురు నేతలు అక్కడికి చేరుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఆటోలో, విద్యామంత్రి సకినా ఇట్టూ స్కూటీపై వచ్చారు. కబరస్తాన్‌కు దారి తీసే రెండు వైపులా దారుల్నీ అధికారులు మూసివేశారు. ఖన్‌య్రాŠ ప్రాంతానికి చేరుకున్న సీఎం ఒమర్ తన వాహనం దిగి అరకిలో మీటర్ దూరంలో ఉన్న కబరస్తాన్‌కు కాలినడకన చేరుకున్నారు. కబరస్తాన్‌కు తాళంవేసి ఉంచడంతో ఇనుప గేటు పైకెక్కి లోపలికి చేరుకున్నారు. కొందరు నేతలు కూడా ఆయన్ను అనుసరించారు. కొద్దిసేపటికి అధికారులు గేట్లు తెరిచారు. దీంతో, ఫరూక్ అబ్దుల్లా తదితరులు కూడా వచ్చి అమరుల కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ లెఫ్టినెంట్ మనోజ్ సిన్హా చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివారం గృహ నిర్బంధంలో ఉంచిన అధికారులు సోమవారం తనను ఎందుకు ఆపారంటూ మండిపడ్డారు. వాళ్లు మమ్మల్ని బానిసలని అనుకుంటున్నారు. కానీ, మేం ప్రజలు మాత్రమే సేవకులం. యూనిఫాంలో ఉన్న పోలీసులు చట్టం మర్చిపోతున్నారు. పరుగెత్తుతున్న మమ్మల్ని వెంటాడారు. మా చేతిలోని జెండాను చింపేయాలని చూశారు’అని ఆరోపించారు. -
యుద్ధానికి ఆయన వైఫల్యమే కారణం: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్
న్యూఢిల్లీ: పెహల్గాంలో ఉగ్రదాడి, ఆపై చోటు చేసుకున్న పరిస్థితులకు తాను కారణం కాదని, అది జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వైఫల్యమేనని ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు పెహల్గామ్ ఉగ్రదాడికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కారణమన్నారు.కాగా, జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం ఉదయం గోడ దూకి మహారాజా హరిసింగ్‌కు చెందిన డోగ్రా బలగాలు కాల్చిచంపిన వీరుల స్మారకంగా ఉన్న శ్మశానం గోడ దూకి లోపలికి వెళ్లి అక్కడ అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించారు,. డోగ్రా బలగాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 1931, జూలై 13వ తేదీన పలువురు అమరులయ్యారు. ఈ క్రమంలోనే వారికి కశ్మీర్‌లోని శ్మశాన వాటికలో స్మారక చిహ్నాలు ఏర్పాటు చేశారు. దీన్ని ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. ఆదివారం(జూలై 13) సీఎం అబ్దుల్లాను ఇంటి నుంచి కదలకుండా ఒక బంకర్ ఏర్పాటు చేశారు. అయితే అది సోమవారం తీసేశారు. నేడు(జూలై 14) ఒమర్ అబ్దుల్లా ఒంటరిగా కారులో వెళ్లి ఆ అమరులకు నివాళులు అర్పించే యత్నం చేశారు. అక్కడ అబ్దుల్లాను పోలీసులు అడ్డుకునే యత్నం చేయడంతో గోడ దూకి వెళ్లి నివాళులర్పించి వచ్చారు. దీనిపై అబ్దుల్లా మాట్లాడుతూ.. రాష్ట్రంలో లెఫ్టినెంట్ గవర్నర్ పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు. కేంద్ర నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పినట్లే ఇక్కడ నడుస్తోందన్నారు. అనాలోచిత నిర్ణయాలతో ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్లో పెహల్గాం ఉగ్రదాదాడికి, తర్వాత ఆపరేషన్ సింధూర్ వరకూ భారత్ వెళ్లడానికి ఎల్జీ మనోజ్ సిన్హా వైఫల్యమే కారణమన్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ట్రంప్-మునీర్ భేటీపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
శ్రీనగర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- పాక్ సైన్యాధ్యక్షుడు అసిఫ్ మునీర్‌ల లంచ్ భేటీపై దుమారం చెలరేగుతోంది. ఈ అంశంపై తాజాగా జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా తన ప్రయోజనాలను పొందేవరకు మాత్రమే ఇతర దేశాలతో స్నేహం చేస్తుందని, వాషింగ్టన్ తనను తాను కాపాడుకునేందుకు ఏదైనా చేస్తుందని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌కు వైట్ హౌస్‌లో ఆతిథ్యం ఇవ్వడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు.‘అమెరికా అధ్యక్షుడు తన ఇష్టాలకు అనుగుణంగా నడుచుకుంటారు. ఎవరిని విందుకు ఆహ్వానించాలో, ఎవరిని ఆహ్వానించకూడదో మనం ఆయనకు చెప్పగలమా? అమెరికా అధ్యక్షుడు మనకు ప్రత్యేకమైన స్నేహితుడు అని మనం భావిస్తుంటాం. ఆయన మన స్నేహాన్ని గౌరవిస్తారా లేదా అనేది వేరే విషయం. అమెరికా తన స్వప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుంది. అవసరం లేనప్పుడు మరే ఇతర దేశాన్ని పట్టించుకోదు’ అని శ్రీనగర్ రైల్వే స్టేషన్లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విలేకరులతో అన్నారు. ఆయన తన తండ్రి ఫరూక్ అబ్దుల్లాతో కలిసి వందే భారత్ రైలులో జమ్మూకు వెళ్లారు. ఈ రైలు సేవలను ఆయన కొనియాడారు.ఇది కూడా చదవండి: International Yoga Day: యోగాభ్యాసంపై కింగ్ చార్లెస్ ఏమన్నారంటే.. -
ఇంజనీరింగ్ అద్భుతం.. అత్యంత ఎత్తైన రైల్వే చినాబ్ బ్రిడ్జి (ఫొటోలు)
-
ఒమర్ అబ్దుల్లా (జమ్మూకశ్మీర్ సీఎం) రాయని డైరీ
జ్ఞాపకాల స్తూపాలను నిర్మించుకోగలం. పోగొట్టుకున్న నమ్మకాల సౌధాలను పునర్ని ర్మించుకోగలమా?! కశ్మీర్ ఖాళీ అయిపోయింది! కశ్మీర్ గుండె వట్టి గ్రీష్మాన్ని ఊపిరి తీసి వదులుతోంది. ఒక్క వాన చుక్క... ధైర్యం చేసి జారి పడే ఒక్క వాన చుక్క కోసం... మోరెత్తి లోయలోకి చూస్తోంది. లోయే కశ్మీర్ ఆకాశం. టూరిస్టులే వాన జల్లులు, మురిసి కురిసిపోయే కరి మబ్బులు.కశ్మీర్ నన్ను అడుగుతోంది, ‘‘ఏమయ్యా ఒమర్ అబ్దుల్లా... ఈ దాల్ సరస్సుని, మొఘల్ సొగసుని, గుల్మార్గ్ పూతల్ని, సలీం అలీ పార్క్ పిట్టల్ని, శంకరాచార్యుల వారిని, వైష్ణోదేవిని ఎవరికి సాక్షాత్కరింప చేసుకోమంటావ్?!కొండా కోనలున్నా చూసే కన్నే లేకుంటే ఏం చేసుకోను ఈ వరాలన్నీ?!’’ అని అడుగుతోంది.కశ్మీర్ కంట్లో వాన చుక్క! ఇప్పుడంతా ప్రశాంతంగా ఉందని చెప్పటానికి పెహల్గాంలో నేను సైకిల్ మీద తిరుగుతున్నప్పుడు ఓ గడప దగ్గర కశ్మీర్ నన్ను ఆపింది. ‘‘నీ కోసమే చూస్తున్నా ఒమర్!’’ అంది. ‘‘చెప్పండి అమ్మీజాన్...’’ అన్నాను, సైకిల్ దిగి స్టాండ్ వేసి అమ్మీ పాదాలకు నమస్కరిస్తూ. ‘‘నీకు తెలుసు కదా ఒమర్! తెర్లుతున్న తేయాకు నీటిలో యాలకులు, దాల్చిన చెక్క దంచి వేసి, కుంకుమ పువ్వుతో ‘కావా’ టీని నేను ఎంత చక్కగా కాస్తానో! నాక్కాస్త నమ్మకం ఇవ్వు ఒమర్. నా ఇంటికి మళ్లీ అతిథులు వస్తారని, నా చేతి టీని ప్రియంగా సేవిస్తారని...’’ అంటోంది అమ్మీజాన్.‘‘అందుకోసమే పెహల్గాం వచ్చాను అమ్మీజాన్. మంత్రులందర్నీ రప్పించి ఇక్కడే మీటింగ్ కూడా పెడుతున్నాను...’’ అన్నాను.‘‘మీటింగ్ పెడితే మంత్రులు వస్తారు కానీ, నా ఇంటికి అతిథులు వస్తారంటావా ఒమర్?! అంది అమ్మీజాన్ నిస్పృహగా. ‘‘వస్తారు, నన్ను నమ్మండి...’’ అని చెప్పాను. పెహల్గాంలో కేబినెట్ మీటింగ్‌కి వెళుతున్నప్పుడు కూడా బయట కొందరు నా దగ్గరకు పరుగున వచ్చి, ‘‘ఒమర్జీ! మాక్కాస్త నమ్మకం ఇవ్వగలరా..?’’ అని అడిగారు... నా చేతిని స్పృశించే ప్రయత్నం చేస్తూ! మనిషి స్పర్శకు మనిషెంతగా అలమటించి ఉన్నాడు!!వారి చేతిని మృదువుగా అందుకున్నాను. ‘‘ఒమర్జీ! మేము కశ్మీర్‌కు వచ్చిన టూరిస్టులం. ధైర్యం చేసి వచ్చేశాం. ధైర్యం మేము చేస్తాం. నమ్మకం మీరు ఇవ్వండి చాలు. ఇస్తారా ప్లీజ్...’’ అన్నారు. అతిథులు వస్తారని కశ్మీర్‌కు, కశ్మీర్ ఎదురు చూస్తోందని అతిథులకు నమ్మకం ఇవ్వాలి. ఒకవైపు నమ్మకమే సరిపోదు. ‘‘కశ్మీర్ మీ అతిథి గృహం. మీ అతిథి గృహానికి నేను కాపలాదారుడిని...’’ అని వారితో చెప్పాను. రెండో రోజు గుల్మార్గ్లో నాకు మరికొందరు ఎదురుపడ్డారు. అయితే వాళ్లు, ‘‘మాక్కాస్త నమ్మకం ఇవ్వండి’’ అని అడగటానికి వచ్చినవాళ్లు కాదు. ‘‘మీ మీద నమ్మకం లేదు’’ అని చెప్పటానికి వచ్చినవాళ్లు! ‘‘కశ్మీర్‌ను బహిష్కరించండి’’ అని నినాదాలు చేస్తున్నారు. వాళ్లంతా యువకులు. ఉడుకు రక్తాన్ని పిడికిలి పట్టి ఉన్న వారు. ‘‘ఉగ్రవాదులు కూడా ఇదే కోరుకుంటు న్నారు మిత్రులారా..! ‘కశ్మీర్‌ను బహిష్కరించండి’ అన్నదే వారి పిలుపు కూడా. వాళ్లు దేశానికి శత్రువులు. మీరు, వాళ్లూ ఒకటి కాదనే అనుకుంటున్నాను...’’ అన్నాను. వాళ్లేమీ మాట్లాడలేదు. నన్ను దాటుకుని ముందుకు వెళ్లిపోయారు. వాళ్ల నినాదం వాళ్లను అనుసరిస్తూ వెళ్లిపోయింది. ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా పెహల్గామ్లో ఒక స్మారక స్తూపం నిర్మించా లని కేబినెట్ మీటింగ్‌లో అనుకున్నాం. మరి కోల్పోయిన నమ్మకానికి తిరిగి ఎలా ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవటం?ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ నా లోపల అంటున్నారు.. ‘‘హృదయం నిస్సహాయంగా ఏం లేదు. ప్రస్తుతానికి ఓడిపోయిందంతే! దుఃఖపు సాయంత్రం సుదీర్ఘంగా ఉంది. కావచ్చు కానీ, ఇది ఒక సాయంత్రం మాత్రమే’’! -
‘వహ్ సీఎం సాబ్’.. పహల్గాంలో కేబినెట్ భేటీ
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అరుదైన పని చేశారు. ఉగ్రవాదంతో దెబ్బ తిన్న పహల్గాం పట్టణ పర్యాటకాన్ని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో.. ఏకంగా పహల్గాంలోనే మంగళవారం ప్రత్యేక కేబినెట్ భేటీ (Pahalgam Cabinet Meeting) నిర్వహించి దేశానికి బలమైన సందేశం పంపించారు.అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం పట్టణంలోని బైసరన్ లోయ(Baisaran Valley)లో ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నా సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు చెలరేగిపోయారు. ఈ ఘటనలో 26 మంది టూరిస్టులు దుర్మరణం పాలయ్యారు. అయితే.. ఈ దాడి ప్రభావం జమ్ము కశ్మీర్ పర్యాటకంపై తీవ్రంగా పడింది. ఘటన జరిగిన సాయంత్రం నుంచే పర్యాటకులు తిరుగు ముఖం పట్టడం ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఆ సమయంలో సీఎం ఒమర్ అబ్దుల్లా(CM Omar Abdullah) సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పర్యాటకుల భద్రతకు అక్కడి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. తాకిడి మాత్రం పెద్దగా ఉండడం లేదు. దీంతో పర్యాటకాన్నే నమ్ముకున్న వేల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.ఈ నేపథ్యంలో.. పర్యాటకులను ఆహ్వానిస్తూ ఇవాళ ఆయన పహల్గాంలోనే కేబినెట్ భేటీ నిర్వహించారు. ‘‘ఉగ్రదాడి తర్వాత పహల్గాం ప్రజలు ధైర్యంగా ఉన్నారు. వాళ్లను అభినందించడానికే ఈ సమావేశం. ప్రభుత్వంలో ఉన్నామని ఏదో మొక్కుబడిగా ఇక్కడికి మేం రాలేదు. ఉగ్రవాదుల పిరికి పంద చర్యలకు.. కశ్మీర్ పర్యాటకం, అభివృద్ధి రెండూ ఆగిపోవని చెప్పడానికే వచ్చాం’’ అని అన్నారాయన. అంతకు ముందు.. పహల్గాంలోని టూరిస్టు ప్రాంతాల్లో ఆయన తిరిగారు. ఆ ఫొటోలు వైరల్‌కాగా.. వహ్ సీఎం సాబ్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.ఇదీ చదవండి: సారీ మేడమ్.. ఏదో ఏమోషన్లో అనేశా! -
యుద్దానికి బ్రేక్!.. స్పందించిన జమ్మూ కాశ్మీర్ సీఎం
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. అమాయక ప్రజల ప్రాణాలు పోకుండా ఉండటానికి ఇది ముందుగానే వచ్చి ఉంటే బాగుండేదని విచారం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే పాక్ కాల్పుల వల్ల చనిపోయిన కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు.గత నాలుగు రోజుల్లో పూంచ్, రాజౌరి, జమ్మూ, బారాముల్లా సెక్టార్లలో 19 మంది గ్రామస్తులు మరణించారు. బుధవారం పూంచ్‌లో 12 మంది పౌరులు మరణించగా.. శుక్రవారం ఉరి, పూంచ్‌లో మరో ఇద్దరు మరణించారు. శనివారం ఉదయం పాకిస్తాన్ కాల్పుల్లో ఒక సీనియర్ ప్రభుత్వ అధికారితో సహా మరో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.ఘర్షణ సమయంలో జరిగిన అగ్నిప్రమాదాల వల్ల జరిగిన విస్తృతమైన నష్టాన్ని ఎత్తిచూపుతూ, నష్ట అంచనాలను ఖరారు చేయవలసిన ఆవశ్యకతను అబ్దుల్లా నొక్కి చెప్పారు. ప్రభావిత కుటుంబాలకు సహాయం అందించడం ప్రారంభించడానికి వీలుగా వెంటనే తుది సర్వేలు నిర్వహించి నివేదికలు పంపాలని డీసీలకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా మా విమానాశ్రయం చాలా రోజులుగా మూసివేయడం జరిగింది. కాల్పుల విరమణ తర్వాత అది తిరిగి ప్రారంభమవుతుందని మేము ఆశిస్తున్నామని ఆయన అన్నారు.#WATCH | On the India- Pakistan ceasefire agreement, Jammu and Kashmir CM Omar Abdullah says, "I welcome the ceasefire. If it had happened 2-3 days ago, the lives we lost would not have been lost. Pakistan's DGMO called our DGMO and the ceasefire was implemented. It is the… pic.twitter.com/uXxlTfnRzJ— ANI (@ANI) May 10, 2025కాల్పుల విరమణభారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విమరణ అమలులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ DGMO.. భారత్ DGMOకు ఫోన్ చేసి కాల్పులు విమరణ చేయాలని కోరినట్లు మిస్రీ పేర్కొన్నారు. పాకిస్తాన్ అభ్యర్థనతో.. భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పారు. కాగా ఎల్లుండి (సోమవారం, మే 12) మధ్యాహ్నం 12 గంటలకు ఇరుదేశాల మిలటరీ జనరల్స్ మధ్య చర్చలు జరుగుతాయని ప్రకటించారు. -
పాకిస్తాన్ దాడులు: మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా
భారత్ - పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో.. జమ్మూకాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాక్ జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించారు. మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి 'ఒమర్ అబ్దుల్లా' ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.గత నాలుగు రోజుల్లో పూంచ్, రాజౌరి, జమ్మూ, బారాముల్లా సెక్టార్లలో 19 మంది గ్రామస్తులు మరణించారు. బుధవారం పూంచ్‌లో 12 మంది పౌరులు మరణించగా.. శుక్రవారం ఉరి, పూంచ్‌లో మరో ఇద్దరు మరణించారు. శనివారం ఉదయం పాకిస్తాన్ కాల్పుల్లో ఒక సీనియర్ ప్రభుత్వ అధికారితో సహా మరో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.ఇటీవల పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నాకు చాలా బాధ కలిగించింది. మా ప్రభుత్వం మా ప్రజల కష్టాలను తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ముఖ్యమంత్రి కార్యాలయం షేర్ చేసిన పోస్ట్‌లో.. ప్రియమైన వ్యక్తిని ఎప్పటికీ భర్తీ చేయలేము. కానీ ఈ వారి కుటుంబాలకు మద్దతుగా, మా సంఘీభావానికి చిహ్నంగా, మరణించిన వారందరి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు పేర్కొంది. -
పాక్ దాడుల్లో సీనియర్ అధికారి మృతి.. సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన
శ్రీనగర్: భారత్,పాకిస్థాన్ మధ్య తీవ్రమైన దాడులు కొనసాగుతున్నాయి. పాక్ దాడులను భారత్ తిప్పికొడుతోంది. మరోవైపు.. దాయాదా పాకిస్తాన్.. భారత్ సరిహద్దుల్లో పౌరులు, ఆలయాలే టార్గెట్‌గా దాడులకు తెగబడింది. తాజాగా పాక్ జరిపిన కాల్పుల్లో జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్‌కుమార్ థప్పా ప్రాణాలు కోల్పోయారు.వివరాల ప్రకారం.. సరిహద్దుల్లో కాల్పులే కాకుండా డ్రోన్లతో దాడులు చేస్తోంది పాకిస్తాన్. ఈ దాడుల్లో శనివారం ఉదయం జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్‌కుమార్ థప్పా ప్రాణాలు కోల్పోయారు. రాజౌరీ పట్టణంలో ఉంటున్న ఆయన ఇంటిపై పాక్ ఫిరంగులు పడటంతో ఆయన మృతి చెందారు. రాజ్‌కుమార్ జిల్లా డెవలప్మెంట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.Deeply saddened to hear about the tragic loss of Dr. Raj Kumar Thapa, KAS who was posted as ADDC Rajouri in the Pakistani terror attack. Our heartfelt condolences go out to the bereaved family, friends, and loved ones of the victim.Om Shanti! pic.twitter.com/mmZoS1rJWY— IAS Fraternity 🇮🇳 (@IASfraternity) May 10, 2025ఈ ఘటనపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. రాజ్‌కుమార్ మృతిపై సీఎం ఒమర్ ట్విట్టర్ వేదికగా..‘రాజౌరీని లక్ష్యంగా చేసుకున్న పాక్ జరిపిన దాడుల్లో రాజ్‌కుమార్ మృతి చెందారు. నిబద్ధత కలిగిన ఓ ఆఫీసర్‌ను మనం కోల్పోయాం. ఒక్కరోజు ముందే నేను అధ్యక్షత వహించిన ఆన్లైన్ సమావేశంలో రాజ్‌కుమార్ పాల్గొన్నారు. ఇంతలోనే రాజౌరీలోని ఆయన ఇంటిపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటనపై స్పందించేందుకు మాటలు రావడం లేదు. ఇది మాకెంతో నష్టం’ అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. శుక్రవారం రాత్రి నుంచే సరిహద్దు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల పాకిస్తాన్ దాడులు చేసింది. దీంతో, విద్యుత్తు సరఫరా నిలిపివేసి ‘బ్లాకౌట్’ పాటించారు. శ్రీనగర్, పఠాన్ కోట్ ప్రాంతాల్లో ఉదయం కూడా పేలుళ్ల శబ్దాలు వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. డ్రోన్లతో పాక్ చేసిన దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. విద్యుత్ సరఫరాను నిలిపేశారు. -
ఉద్రిక్తతల వల్ల పాకిస్తాన్‌కే నష్టం
జమ్మూ: సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు కొనసాగడం పాకిస్తాన్నే దెబ్బతీస్తుందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఉద్రిక్తతలు తగ్గించడంపై దృష్టి పెట్టాలని పాక్‌కు సూచించారు. లేదంటే వారికి ఎక్కువ నష్టమని హెచ్చరించారు. గురువారం రాత్రి పాకిస్తాన్ చేసిన దాడుల్లో ఒక్క డ్రోన్ కూడా లక్ష్యాన్ని చేరుకోకుండా వేగంగా స్పందించిన సాయుధ దళాలను ఒమర్ ప్రశంసించారు. జమ్మూ, సాంబా జిల్లాల్లోని సహాయ శిబిరాలను, సరిహద్దు రేఖ వెంబడి పాక్ షెల్లింగ్‌లో గాయపడిన వారున్న ఆసుపత్రులను సందర్శించిన సీఎం.. విజయ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘1971 యుద్ధం పాక్ చేసిన అత్యంత తీవ్రమైన దాడులివే.. జమ్మూలోని పలు ప్రాంతాలు, అనంత్‌నాగ్‌లోని మందుగుండు సామగ్రి డిపోను లక్ష్యంగా చేసుకున్నారు. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు కొనసాగడం పాక్‌ను దెబ్బతీస్తుంది. దీనివల్ల పాకిస్తాన్‌కు ఒరిగేదేమీ లేదు. ఆ దేశం విజయం సాధించలేదు. కాబట్టి వారు తుపాకులను పక్కన పెట్టి సాధారణ స్థితిని తీసుకురావడానికి సహకరిస్తే మంచిది. గురువారం రాత్రి తరువాత జరిగిన సంఘటనలు ఉద్రిక్తతను పెంచే ప్రయత్నాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. దీనివల్ల వారే ఎక్కువగా బాధపడతారు’’అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. పూంచ్‌లో పరిస్థితి క్లిష్టంగా ఉంది పాక్ షెల్లింగ్ వల్ల పూంచ్ నగరానికి భారీ నష్టం వాటిల్లిందని, పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది అక్కడి వారేనన్నారు. తాను జమ్మూలోని ఆస్పత్రిని సందర్శించానని, గాయాలతో అక్కడ అడ్మిడ్ అయిన వారంతా పూంచ్‌కు చెందిన వారేనని చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని శస్త్రచికిత్స కోసం పీజీఐ చండీగఢ్‌కు తరలించామన్నారు. జమ్మూ జిల్లాలోని మిష్రివాలా, నాగ్బానీ, కోట్ భల్వాల్, సాంబాలోని విజయపూర్ పునరావాస శిబిరాలను సందర్శించిన ఆయన నిర్వాసిత కుటుంబాలతో మాట్లాడి, వారికి ప్రభుత్వ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. శిబిరాల్లో అసౌకర్యాన్ని తగ్గించడానికి కృషి చేస్తానని చెప్పారు. ఆట సామగ్రి కావాలని అడిగిన పిల్లలకు.. తన సొంత వాహనంలో తెచ్చి అప్పగించిన మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్న క్షతగాత్రులను కూడా పరామర్శించారు. -
ఆపరేషన్ సిందూర్ పై జమ్మూ సీఎం రియాక్షన్
-
జమ్మూ కశ్మీర్ లో పరిస్థితి ఎలా ఉంది?
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీతో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సమావేశమయ్యారు. ఈరోజు( శనివారం) ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వచ్చిన ఒమర్ అబ్దుల్లా.. దాదాపు అరగంట పాటు మోదీతో చర్చించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు గురించి మోదీకి ఒమర్ అబ్దుల్లా వివరించారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. పహల్గామ్ పరిస్థితిపై ప్రత్యేకంగా మోదీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 22వ తేదీన కశ్మీర్ ప్రాంతమైన పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత మోదీతో ఒమర్ అబ్దుల్లా సమావేశం కావడం ఇదే తొలిసారి.ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ చానెళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. VIDEO | Jammu and Kashmir CM Omar Abdullah (@OmarAbdullah) met PM Modi (@narendramodi) at 7 Lok Kalyan Marg in Delhi earlier today.(Full video available on PTI Videos - https://t.co/dv5TRAShcC) pic.twitter.com/seB0yY1XkY— Press Trust of India (@PTI_News) May 3, 2025 -
భారత్, పాక్ మధ్య యుద్ధమే.. ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
శ్రీనగర్: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదని చెప్పుకొచ్చారు. అలాగే, ఈ ఘటనకు భద్రత, నిఘా లోపాలు కూడా ఒక కారణమని అన్నారు.పహల్గాం ఘటనపై తాజాగా ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ..‘పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోంది. రేపటి రోజు ఎలా ఉండబోతోందో ఎవరికీ తెలియదు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు. ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పహల్గాం ఉగ్ర దాడి జరగడానికి కారణమైన ఉగ్రవాదులను పట్టుకోవాలి. అలాగే, ఈ ఘటన వెనక ఉన్న వారిని వీలైనంత తొందరగా పట్టుకోవాలి. అప్పుడే యుద్ధాన్ని నివారించే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. భద్రత, నిఘా లోపాలు కూడా ఉగ్ర దాడి జరిగేందుకు ఒక కారణమని అనడంలో సందేహం లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు.. పహల్గాం ఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ఉగ్రవాదుల బారి నుంచి అతిథుల(పర్యాటకులు)ను కాపాడటంలో తాను విఫలమయ్యానని రాష్ట్ర శాసనసభ వేదికగా ప్రకటించారు. బైసరన్‌లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పనిచేయలేకపోయాను. పహల్గాం ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర హోదాను డిమాండ్ చేయాలి. నా రాజకీయాలు అంత చౌకబారువి కాదు. గతంలో రాష్ట్ర హోదా అడిగాం.. భవిష్యత్తులో కూడా అడుగుతాం. కానీ, 26 మంది చనిపోయారు.. ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు. ప్రజలు మాకు మద్దతు ఇస్తే.. ఉగ్రవాదం అంతమవుతుంది’ అని పేర్కొన్నారు. -
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో సీఎం ఒమర్ అబ్దుల్లా ఉద్వేగభరిత ప్రసంగం
-
పహల్గాం హీరో అతడే.. ఉగ్రవాదులతో పోరాడిన పోనీవాలా
న్యూఢిల్లీ: ఒక జంటది హనీమూన్. కొందరిది పెళ్లి రోజు. ఇంకొందరికి ఎన్నో ఏళ్ల కల. పహల్గాం మారణకాండ 26 కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఒక్కొక్క పర్యాటకున్నీ పేరు, వ్యక్తిగత వివరాలు అడిగి మరీ ముష్కరులు బలి తీసుకున్న తీరు హృదయాలను కలచివేస్తోంది. దాదాపుగా అందరినీ ఆధార్ కార్డులు చూపించాలని, ఖురాన్ పంక్తులు అప్పజెప్పాలని అడిగి మరీ కాల్చేశారు.మృతుల్లో ఇద్దరు మినహా అంతా హిందువులే. వారిలో మహారాష్ట్రకు చెందిన వారు ఆరుగురు, గుజరాత్, కర్నాటక నుంచి ముగ్గురేసి, పశి్చమబెంగాల్ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్, యూపీ, బిహార్, పంజాబ్, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరితో పాటు ఒక నేపాలీ పర్యాటకునితో పాటు స్థానికుడు కూడా దాడిలో మరణించారు.హార్స్ రైడింగ్‌కని బయటికొచ్చి...ఉగ్ర కాల్పులకు బలైన వారిలో యూపీలోని కాన్పూర్‌కు చెందిన శుభం ద్వివేది అనే 31 ఏళ్ల వ్యాపారవేత్త కూడా ఉన్నాడు. ఆయనకు గత ఫిబ్రవరిలోనే పెళ్లైంది. భార్య, తల్లిదండ్రులు, సోదరి, ఆమె అత్తామామలు, బావమరిది తదితరులతో కలిసి సరదాగా గడిపేందుకు బైసారన్ వెళ్లాడు. మంగళవారం కుటుంబీకులంతా హోటల్‌కే పరిమితం కాగా భార్యతో కలిసి శుభం హార్స్ రైడింగ్‌కు వెళ్లాడు. ఉగ్రవాదులు అతన్ని కూడా పేరడిగారు. కల్మా చదవమన్నారు. రాదనడంతో నేరుగా తలపై కాల్చి భార్య కళ్లముందే పొట్టన పెట్టుకున్నారు.CM Omar Abdullah, joined by thousands, offered funeral prayers for Syed Adil Hussain—killed in the Pahalgam militant attack that left 26 tourists dead—at his native village on Wednesday.Photos KM / @UmarGanie1 pic.twitter.com/nXCD0vbsnh— The Kashmir Monitor (@Kashmir_Monitor) April 23, 2025👉కేరళలోని ఎడప్పల్లికి చెందిన రామచంద్రన్ (65) కూడా కాల్పులకు బలయ్యాడు. పర్యాటకప్రియుడైన ఆయన భార్య, ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చిన కూతురు, ఆమె పిల్లలతో కలిసి కశ్మీర్ వెళ్లాడు. వాళ్ల కళ్లముందే ఉగ్రవాదులు ఆయన్ను కాల్చేశారు. ఆయన్ను కూడా ఖురాన్ పంక్తులు చదవాలని అడిగి, తాను ముస్లింను కాదని చెప్పగానే చంపేశారు.👉ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన దినేశ్ మిరానియా అనే వ్యాపారవేత్త పెళ్లి రోజును సరదాగా జరుపుకునేందుకు కుటుంబీకులతో కలిసి పహల్గాం వచ్చారు. భార్యాపిల్లల కళ్లముందే ఉగ్ర తూటాలకు బలయ్యారు.👉కశ్మీర్ వెళ్లాలన్నది ఒడిశాకు చెందిన ప్రశాంత్ సత్పతి (41) కల. నెలల తరబడి డబ్బు కూడబెట్టి మరీ బైసారన్ వెళ్లాడు. భార్య, 9 ఏళ్ల కొడుకు కళ్లముందే నిస్సహాయంగా మృత్యువాత పడ్డాడు.పోరాడిన పోనీవాలా.. ఉగ్రవాదుల నుంచి పర్యాటకులను కాపాడేందుకు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా (30) అనే స్థానిక పోనీవాలా వీరోచితంగా ప్రయత్నించాడు. ఉగ్ర వాదుల నుంచి తుపాకులను లాక్కునే ప్రయత్నంలో వారి కాల్పులకు బలయ్యాడు. ఆదిల్ గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించాడంటూ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రస్తుతించారు. బుధవారం అతని అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. -
ఢిల్లీ వెళ్లాల్సిన విమానం జైపూర్‌లో ల్యాండ్.. సీఎం ఒమర్ అబ్దుల్లా ఫైర్
ఢిల్లీ: ఇండిగో విమానం ఆలస్యంపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం వాతావరణం అనుకూలించక.. జైపూర్‌లో ల్యాండ్ కావడంపై తీవ్ర అసహనం వ్యక్త పరిచారు. ఈ క్రమంలో సెల్ఫీ తీసుకుని.. పరుష పదజాలంతో తన బాధను చెప్పుకొచ్చారు.వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం రాత్రి ఇండిగో విమానంలో ఢిల్లీలోకి బయలుదేరారు. ఈ సమయంలో ఢిల్లీలో వాతావరణం అనుకూలించకపోవడంతో, విమానాశ్రయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో సదరు ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. దీంతో, విమానం రాజస్థాన్‌లోని జైపూర్ ల్యాండ్ అయ్యింది. దాదాపు నాలుగు గంటల తర్వాత మళ్లీ విమానం.. ఢిల్లీ చేరుకుంది. ఈ నేపథ్యంలో విమానం ఆలస్యం కావడంపై సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. జమ్ము నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం దాదాపు మూడు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఢిల్లీ విమానాశ్రయంలో దిగాల్సిన విమానం.. జైపూర్‌లో ల్యాండ్ అయ్యింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నేను విమానం మెట్లపై నిలుచుని మాట్లాడుతున్నాను. స్వచ్ఛమైన గాలిని పొందుతున్నాను. ఇక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతామో నాకు తెలియదు. ఢిల్లీ విమానాశ్రయం బ్లడీ షిట్ షో అంటూ పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల విషయంలో వీరి అలసత్వం చూస్తుంటే.. సహనం కోల్పోతున్నామని.. మర్యాదగా మాట్లాడే పరిస్థితుల్లో కూడా తాను లేనని అన్నారు. Delhi airport is a bloody shit show (excuse my French but I’m in no mood to be polite). 3 hours in the air after we left Jammu we get diverted to Jaipur & so here I am at 1 in the morning on the steps of the plane getting some fresh air. I’ve no idea what time we will leave from… pic.twitter.com/RZ9ON2wV8E— Omar Abdullah (@OmarAbdullah) April 19, 2025దాదాపు మూడు గంటల తర్వాత ఒమర్ అబ్దుల్లా మరో పోస్టులో స్పందిస్తూ..‘ఎవరైనా ఆలోచిస్తుంటే, నేను తెల్లవారుజామున 3:00 గంటల తర్వాత ఢిల్లీకి చేరుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ప్రతికూల వాతావరణం కారణంగా శనివారం శ్రీనగర్ విమానాశ్రయంలో ఆరు విమానాలు రద్దు అయినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగినందువల్ల ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల తరబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని ప్రభావం ఇతర కనెక్టింగ్ విమానాలపై కూడా పడినట్లు తెలుస్తోంది. ఈ అసౌకర్యంపై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ.. తమ బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని.. జమ్మూలో భారీ వర్షాలు, వడగళ్లు కురవడం వల్ల ఈ అంతరాయం కలిగిందని తెలిపింది. వాతావరణం మెరుగైన వెంటనే తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తామని పేర్కొంది. -
ఒమర్, రిజిజు భేటీపై రాజకీయ వివాదం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్లో కలుసుకోవడం రాజకీయ దుమారం రేపుతోంది. వక్ఫ్ చట్టం విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) సానుకూల వైఖరి అవలంబించిన నేపథ్యంలోనే వీరిద్దరు కలుసుకున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, తన తండ్రి, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కోరిక మేరకు తులిప్ గార్డెన్‌కు వెళ్లిన ఒమర్‌కు అనూహ్యంగా అదే రోజు ఉదయం గార్డెన్‌కు వచ్చిన మంత్రి రిజిజు కలిశారని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ అంటోంది. యోగక్షేమాలు తెలుసుకున్న అనంతరం ఎవరికి వారు వెళ్లిపోయారని చెబుతోంది. ఇదంతా కేవలం అనుకోకుండా జరిగిన పరిణామమని, దీన్ని అనవసరంగా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించింది. అయితే, రిజిజు ‘ఎక్స్’లో అబ్దుల్లాలతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేయడం వివాదాన్ని రేపింది. వక్ఫ్ సవరణ చట్టంపై బీజేపీకి ఎన్సీకి లొంగిపోయిందని ప్రతిపక్ష పీడీపీ ఆరోపించింది. పార్లమెంట్లో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి రిజిజుకు తులిప్ గార్డెన్లో ఎన్సీ ఎర్ర తివాచీ పరిచిందని మరో నేత అన్నారు. సీఎం ఒమర్ తులిప్ గార్డెన్లో తారసపడిన కేంద్ర మంత్రి రిజిజుకు కనీసం దూరంగా ఉండటం ద్వారా నిరసన తెలిపి ఉండాల్సిందని పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సజాద్ లోనె పేర్కొన్నారు. -
జమ్ము కశ్మీర్లో ఎల్జీ సిన్హా Vs సీఎం ఒమర్.. కేంద్రానికి వార్నింగ్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ పరిపాలనా సర్వీస్(జేకేఏఎస్)కు చెందిన 48 మంది అధికారులను లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)మనోజ్ సిన్హా బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది. పరిపాలనా సంబంధమైన అంశాల్లో ఇప్పటికే రాజ్‌భవన్, ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న విభేదాలకు ఇది ఆజ్యం పోసినట్లయింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం అబ్దుల్లా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎల్జీ సిన్హా, చీఫ్ సెక్రటరీ అటల్ దుల్లూకు లేఖలు రాశారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు.ఈ సందర్బంగా లేఖలో.. ఎన్నికైన ప్రభుత్వ అధికారాన్ని కాదని ఎల్జీ జారీ చేసిన ఉత్తర్వులకు ఎలాంటి చట్టబద్ధత లేదని అందులో పేర్కొన్నారు. ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్‌కు వెంటనే ఖరారు చేయాలని కోరారు. అధికారులను ఏకపక్షంగా బదిలీ చేయడంపై సమీక్ష చేపట్టాలని ఎల్జీకి రాసిన లేఖలో సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. సీఎం అనుమతి లేకుండా అఖిల భారత సర్వీసేతర అధికారులను బదిలీ చేయవద్దని చీఫ్ సెక్రటరీని కోరారు. ఈ అంశంపై చర్చించేందుకు శుక్రవారం డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి నివాసంలో జరిగిన అత్యవసర భేటీలో సీఎం ఒమర్‌తోపాటు ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పాల్గొన్నారు. హోం మంత్రి అమిత్ షా పర్యటన వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.ఈ క్రమంలోనే ‘ఇప్పటికే అనేకసార్లు చెప్పాం. ఇదే చిట్టచివరి విజ్ఞప్తి. ఇక మా సహనాన్ని పరీక్షించొద్దు’అని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)ప్రతినిధి, ఎమ్మెల్యే జడిబల్ తన్వీర్ సాదిఖ్ అనంతరం మీడియా ఎదుట వ్యా ఖ్యానించారు. తమ సహకార వైఖరిని, మౌ నాన్ని బలహీనతగా భావించరాదని పేర్కొ న్నారు. ఈ సమావేశంలో వక్ఫ్ బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని ఖండిస్తూ తీర్మానించిందని, అదేవిధంగా, ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలంటూ ఎల్జీకి హితవు పలుకుతూ మరో తీర్మానం చేసిందని ఆయన తెలిపారు. పరిధిని అతిక్రమించలేదు: ఎల్జీ అధికార పార్టీ ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం చేసిన తీర్మానంపై ఎల్జీ సిన్హా దీటుగా స్పందించారు. ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని 2019లో పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం పరిధిని అతిక్రమించి నేను ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విషయాన్ని స్పష్టం చేయదల్చుకున్నా. నా పరిధి, నా పరిమితులు నాకు బాగా తెలుసు. అంతకుమించి ఎన్నడూ ఏమీ చేయలేదు’అని న్యూస్18కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. -
రంజాన్ వేళ కశ్మీర్లో అర్ధనగ్న ఫ్యాషన్ షో.. సీఎం ఒమర్‌కు ఝలక్!
శ్రీనగర్: పవిత్ర రంజాన్ మాసం వేళ జమ్ము కశ్మీర్లో అర్ధనగ్న ఫ్యాషన్ షో తీవ్ర దుమారం రేపుతోంది. ఫ్యాషన్ షోలో మహిళలు, పురుషులు పొట్టి పొట్టి దుస్తులతో తెల్లటి మంచుపై ర్యాంప్ వాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పర్యాటకంపై ప్రచారం పేరుతో ఈ అశ్లీల ప్రదర్శన ఏమిటని విపక్షాలు, ప్రజలు.. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో కశ్మీర్లో నిర్వహించిన ఫ్యాషన్ షో కార్యక్రమంపై సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి ఫ్యాషన్ షో జరగడం పట్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ప్రజల కోపాన్ని తాము అర్థం చేసుకున్నట్లు చెప్పారు. తన కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ పరిణామంపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.మరోవైపు.. ఈ ఫ్యాషన్ షో వ్యవహారం అటు జమ్ము కశ్మీర్ అసెంబ్లీని సైతం తాకింది. రంజాన్ వేళ ఇలాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని ప్రతిపక్ష నేతలు ఒమర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దీంతో, అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. A fashion show in Gulmarg has ignited controversy in J&K, with critics calling it "obscene" for being held during Ramzan. pic.twitter.com/4P77B8mtbf— Briefly (@Brieflybynewj) March 10, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు ఉత్తర కశ్మీర్ గుల్మార్గ్లోని ప్రముఖ స్కై రిసార్టులో ఆదివారం ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారు రెచ్చగొట్టే తరహాలో దుస్తులు ధరించారని స్థానిక మత పెద్దలతో పాటు హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దారుణంగా ఉందని విమర్శించారు. ఫ్యాషన్ షోకు సంబంధించిన చిత్రాలు, వీడియో తమను దిగ్భ్రాంతికి గురి చేశాయని అన్నారు. సూఫీ, సాధు సంస్కృతి, ప్రజల మతపరమైన దృక్పథానికి పేరుగాంచిన లోయలో దీన్ని ఎలా సహించాలి? ఇందులో పాల్గొన్న వారిని వెంటనే జవాబుదారీగా చేయాలి అని మండిపడ్డారు.#Watch: Noisy scenes in J&K #assembly over #Kathua killings, #Gulmarg fashion show pic.twitter.com/R80BG1YQ7A— Greater Kashmir (@GreaterKashmir) March 10, 2025 -
ఊబకాయంపై పోరు : 10 మంది కీలక వ్యక్తులను నామినేట్ చేసిన పీఎం మోదీ
ఊబకాయం (Obesity)పై అవగాహన పెంచడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Modi) వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను నామినేట్ చేశారు. ఆరోగ్య ముప్పును అరికట్టడానికి చర్యలు తీసు కోవాలని ప్రజలను ఉద్బోధించిన ప్రధాని తాజాగా ఊబకాయంపై పోరాటంలో సహాయం చేయడానికి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah), వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా( Anand Mahindra), నటుడు మోహన్ లాల్ (Mohanlal)తోపాటు వివిధ రంగాలకు చెందిన 10 మందిని సోమవారం నామినేట్ చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఉద్యమాన్ని విస్తరిస్తూ, ఒక్కొక్కరు మరో 10 మందిని నామినేట్ చేయాలని ఆయన వారిని కోరారు.As mentioned in yesterday’s #MannKiBaat, I would like to nominate the following people to help strengthen the fight against obesity and spread awareness on reducing edible oil consumption in food. I also request them to nominate 10 people each so that our movement gets bigger!… pic.twitter.com/bpzmgnXsp4— Narendra Modi (@narendramodi) February 24, 2025 దేశంలో ఊబకాయం తీవ్ర సమస్యగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దీన్ని అధిగమించడానికి చర్యలు చేపట్టాలని ఆదివారం జరిగిన మన్ కీ బాత్ వేదికగా పిలుపునిచ్చారు. ప్రజలు ఆహారంలో తక్కువ నూనె వాడాలని, నూనె తీసుకోవడం 10 శాతం తగ్గించడంతోపాటు, ఈ చాలెంజ్‌ను మరో పది మందికి అందించాలని ఆదివారం తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని కోరారు. ప్రధానమంత్రి డబ్ల్యూహెచ్‌వో WHO డేటాను ఉటంకిస్తూ, 2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఈ లెక్కలు చాలా తీవ్రమైనవని, ఇలాఎందుకు జరుగుతుందో మనమందరం ఆలోచించాలని పిలుపినిచ్చారు. అధిక బరువు లేదా ఊబకాయం అనేక రకాల సమస్యలు, వ్యాధులకు దారితీస్తుంది అని అన్నారు.ఇదీ చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిఅలాగే దీనికి సంబంధించిన ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి, ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించడంపై అవగాహనను విస్తృతం చేసేందుకు తానుఈ క్రింది వ్యక్తులను నామినేట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఉద్యమం పెద్దదిగా మారడానికి ఒక్కొక్కరు మరో 10 మందిని నామినేట్ చేయాలని కూడా వారిని అభ్యర్థిస్తున్నాను అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని నామినేట్ చేసిన ప్రముఖులుజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆనంద్ మహేంద్ర, ప్రముఖ నటుడు మోహన్‌లాల్ భోజ్‌పురి గాయకడు, నటుడు నిరాహువాహిందుస్తానీ, షూటింగ్ ఛాంపియన్ ఒలింపిక్ విజేత మను భాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, నటుడు ఆర్ మాధవన్, గాయని శ్రేయ ఘోషల్, రచయిత్రి, ఎంపీ సుధా మూర్తి ఉన్నారు. ఈ పదిమంది ఎంతమందిని నామినేట్ చేస్తారో.. ఈ లిస్టులో ఎవరెవరు ఉంటారో చూద్దాం.! -
‘హోదా’ పునరుద్ధరణకిదే సమయం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా త్వరలోనే వస్తుందని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సమయం ఆసన్నమైనట్లుగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన పీటీఐ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ‘కేంద్ర హోం మంత్రితో ఏడాది క్రితమే ఈ విషయం చర్చించాను. రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ఇదే సరైన సమయం’అని ఆయన వివరించారు. ‘ఇటీవల హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో ఈ విషయమై చర్చ సానుకూలంగా జరిగింది. త్వరలోనే రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రకటన వెలువడుతుందని ఆశిస్తున్నా. ఈ అంశాన్ని చట్టపరమైన ముగింపు లభించాలని కోరుకుంటున్నా’అని అబ్దుల్లా చెప్పారు. సీఎంగా పగ్గాలు చేపట్టాక కేంద్రం, జమ్మూకశ్మీర్ మధ్య అంతరం తగ్గిందన్న విషయమై ఆయన స్పందిస్తూ..కొన్ని ఘటనల వల్లే దూరం పెరుగుతుందని చెప్పారు. ఇటీవల బారాముల్లా జిల్లా సొపోర్, కథువా జిల్లా బిల్లావర్‌లో జరిగిన రెండు హత్యలు నివారించదగినవని చెప్పారు. వీటిపై కేంద్రం పారదర్శకంగా దర్యాప్తు చేయించి, బాధ్యులను తగు విధంగా శిక్షించాలన్నారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఇటువంటి పరిణామాలు అవరోధంగా మారుతాయని వ్యాఖ్యానించారు. భద్రత, పోలీసు విభాగాలు కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికైన ప్రభుత్వానికి జవాబుదారీ కానప్పటికీ, ఇటువంటివి చోటుచేసుకోకుండా చూడాల్సిన సమష్టి బాధ్యత ఉందని వివరించారు. ఈ విషయంపైనా హోం మంత్రితో మాట్లాడానని వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు అనుమానమున్న 26 ఏళ్ల వ్యక్తి పోలీసులు వేధిస్తున్నారంటూ ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మరునాడే, సొపోర్‌లోని చెక్‌పోస్ట్ వద్ద ఆగకుండా వెళ్తున్న ట్రక్కు డ్రైవర్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో చనిపోయాడు.100 రోజుల పాలనపై.. ‘ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది వంద రోజులు కోసం కాదు, ఐదేళ్లూ పాలించడానికే. మా పని మమ్మల్ని చేయనివ్వండి. జమ్మూకశ్మీర్‌లో పాలన అంటే మామూలు విషయం కాదు. 2009–2015లోనూ తేలిగ్గా లేదు. ఇప్పుడూ అంతే. ఎవరికైనా ఈ ఇబ్బంది తప్పేది కాదు. ఇది కేంద్ర పాలిత ప్రాంతం. ఈ పరిస్థితుల్లో ఎలా పనిచేయాలో నేర్చుకుంటున్నాం. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకూ ఇది కొత్తే. ఆయనా నేర్చుకుంటున్నారు’అని ఒమర్ అబ్దుల్లా వివరించారు.కేంద్రం నుంచి ఒత్తిళ్లు.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లపై ఆయన మాట్లాడుతూ..ఇక్కడ తమకు రాజకీయ పరమైన ఒత్తిళ్లకంటే వాతావరణ పరమైన సవాళ్లే ఎక్కువగా ఉన్నాయంటూ నవ్వారు. ఫిబ్రవరిలోనే ఎండలు మార్చి, ఏప్రిల్‌లో మాదిరిగా మండిపోతున్నాయి. రానున్న వేసవిలో నీటి కొరత తీవ్రం కానుందంటూ ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ‘వేడి ఎక్కువగా ఉంది. అయితే, అది కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్ నుంచీ, ఎవరైనా అధికారీ నుంచీ కాదు. వేడి వాతావరణం కారణంగా ఈసారి నీటి సమస్య తలెత్తనుంది. ఇతరత్రా సమస్యల కంటే దీనిని తీర్చడమెలాగన్నదే మాకు అతిపెద్ద సవాల్ కానుంది’అని ఆయన వివరించారు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని విభాగాల అధికారులతో సమావేశం కానున్నామన్నారు. వచ్చే రోజుల్లో మంచు, వాన కురిస్తే బాగుంటుందని ప్రార్థిస్తున్నానన్నారు. -
ఇండియా కూటమిపై జమ్మూ కశ్మీర్ సీఎం విమర్శలు
ఇండియా కూటమిపై జమ్మూ కశ్మీర్ సీఎం విమర్శలు గుప్పించారు. మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఇలా ఉంటాయంటూ ఒమర్ అబ్దులా వ్యాఖ్యానించారు. రామాయణం వీడియోను ఆయన షేర్ చేశారు.కాగా, ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా తలపడిన కాంగ్రెస్.. తన అస్థిత్వాన్ని నిలుపుకునేందుకు చేసిన ఆఖరి పోరాటం నిరాశే మిగిల్చింది. పూర్వ వైభవాన్ని చాటుకునే పరిస్థితులు లేకున్నా, కనీస 10 స్థానాలనైనా గెలుచుకునేలా చివరి దశ ప్రచారం చేసింది. కనీసం ఒక ఖాతా కూడా తెరవలేదు. 1998 నుంచి 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్, ప్రస్తుత ఎన్నికల్లో పూర్తిగా చతికిల పడింది2008లో 48శాతం ఓట్లతో 43 సీట్లు సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ 2013లో 24.70 శాతం సీట్లతో 7 సీట్లకు పరిమితమయింది. తర్వాత 2015 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 9.7 శాతం, 2020లో 4.3 శాతం ఓట్లు రాగా ఒక్క సీటును గెలువలేదు. Aur lado aapas mein!!! https://t.co/f3wbM1DYxk pic.twitter.com/8Yu9WK4k0c— Omar Abdullah (@OmarAbdullah) February 8, 2025కాంగ్రెస్‌తో చేతులు కలిపే ప్రసక్తే లేదని.. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆప్ షాక్ ఇచ్చింది. దీంతో ఒంటరి పోటీ విషయంలో కాంగ్రెస్ ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది. ఫలితంగా అభ్యర్థుల ప్రకటన విషయంలో కాంగ్రెస్ వెనుకబడిపోయింది. -
అలా చేయడం బీజేపీతో కలిసిన్నట్టు కాదు: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు చెప్పారు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించడమే తమ లక్ష్యమని అన్నారు. ఇదే సమయంలో ఇలా చేయడం బీజేపీ పార్టీతో కలిసినట్టు కాదు అని క్లారిటీ ఇచ్చారు. కేంద్రంలో ఎవరు ఉన్నా తాము ఇలాగే ముందుకెళ్తామని స్పష్టం చేశారు.సీఎం ఒమర్ అబ్దుల్లా కన్వాల్‌లో జాతీయ చానెల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒమర్.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిశాను. నేను కేంద్రం తీరు పట్ల సానుకూలంగా ఏమీ లేను. ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే వారు చేసే ప్రతిదాన్ని నేను అంగీకరిస్తున్నాను అని కాదు. బీజేపీ చేసే పనిని నేను అంగీకరిస్తున్నానని దీని అర్థం కాదు. జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన అంశాలపై మాత్రమే కేంద్రంతో అనుకూలంగా ఉంటున్నాం. అంతమాత్రాన మేము బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు కాదు.రాష్ట్రం పురోగతి సాధించాలంటే కేంద్రం అవసరం ఎంతో ముఖ్యం. అభివృద్ధి జరగడం, రాష్ట్ర హోదా పునరుద్ధరించడం మా ముందున్న లక్ష్యాలు. పార్టీలు ముఖ్యం కాదు.. కావాల్సింది అభివృద్దే. అవసరం లేని చోట నేను కేంద్రంతో పోరాటం ఎంచుకోవాలా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేక ధోరణితో ఉంటే రాష్ట్రానికే నష్టం జరుగుతుంది అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. గత సంవత్సరం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అనంతరం, రెండుసార్లు అమిత్ షాను కలిశారు. ఇటీవల సోనామార్గ్‌లో జరిగిన సొరంగం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీని కలిశారు. దీంతో, ఒమర్..బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఒమర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
ప్రధాని మోదీపై ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు
శ్రీనగర్:కశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీని నెరవేర్చినందుకు ప్రధాని మోదీ(PM Modi)పై కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(Omar Abdulla) ప్రశంసలు కురిపించారు. సోమవారం జెడ్‌మోర్ టన్నెల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఒమర్అబ్దుల్లా మాట్లాడారు.‘ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తామని మీరిచ్చిన హామీని నెరవేర్చారు.ప్రజలు వారికి కావాల్సిన వారిని ఎన్నుకున్నారు. దీంతో నేను సీఎం హోదాలో ఇక్కడ మాట్లాడుతున్నాను.దీంతో పాటు కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తానన్న హామీని కూడా మీరిచ్చారు. త్వరలో ఈ హామీని కూడా మీరు నెరవేరుస్తారని నేను ఆశిస్తున్నాను’అని ఒమర్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్‌లోని గాందర్బల్ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్ సొరంగాన్ని భారత ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారిపై 2,400 కోట్ల రూపాయలతో ఈ టన్నెల్‌ను నిర్మించారు. ఇది 6.4 కిలో మీటర్ల పొడవుండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లద్దాఖ్‌ను రోడ్డు మార్గం ద్వారా ఈజీగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక, 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తయ్యాయి. -
Jammu Kashmir: మాట ఇస్తే నిలబెట్టుకుంటా!
సోనామార్గ్: ‘‘మోదీ మాటిచ్చాడంటే తప్పడు. నెరవేర్చి తీరతాడు. అన్ని పనులనూ సరైన సమయంలో సక్రమంగా పూర్తి చేసి చూపిస్తా’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. జమ్మూకశ్మీర్‌లో వ్యూహాత్మకంగా కీలకమైన 6.5 కిలోమీటర్ల పొడవైన నూతన సొరంగాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. నిర్మాణ దశలో జెడ్–మోర్హ్ టన్నెల్‌గా పిలిచిన ఈ సొరంగానికి సోనామార్గ్గా నామకరణం చేశారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మోదీ ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘‘మోదీ మాటిస్తే నెరవేరుస్తాడు. కేంద్రంలో మా ప్రభుత్వం తొలిసారి కొలువుతీరాకే అత్యంత సంక్లిష్టమైన ఈ సొరంగ పనులు మొదలయ్యాయి. మేం మొదలు పెట్టిన పనులను మేమే పూర్తి చేశాం. మూడోసారి అధికారంలోకి రాగానే సొరంగం నిర్మాణం పూర్తి చేశాం. గతంలో చలికాలంలో 3 నుంచి 4 నెలలు భారీ మంచు, కొండచరియలు విరిగిపడటం, హిమపాతం వంటి ప్రతికూల వాతావరణంతో ఈ ప్రాంతం గుండా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులుండేవి. ఇప్పుడు ఏ సీజన్లోనైనా శ్రీనగర్, సోనామార్గ్, లేహ్ మధ్య రాకపోకలు సాగించవచ్చు. లద్దాఖ్ ప్రాంతానికి ఇకపై ఎలాంటి ప్రయాణ ఇబ్బందులు లేకుండా సాఫీగా చేరుకోవచ్చు’’ అని ప్రధాని చెప్పుకొచ్చారు. కశ్మీర్లో మార్పు తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం ‘‘ మా ప్రభుత్వ కృషి వల్లే కశ్మీర్ లోయలో పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఆంక్షల చట్రంలో నలిగిన శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో ఇప్పుడు ఎంతో మార్పులు చూస్తున్నాం. ఇప్పుడు ఐస్‌క్రీమ్ కోసం కుటుంబాలు రాత్రిపూట కూడా లాల్‌చౌక్‌కు వెళ్తున్నాయి. కళాకారులైన నా స్నేహితులు ఇక్కడి పోలో వ్యూ పాయింట్‌ను నేడు ముఖ్య వ్యాపార కూడలిగా మార్చేశారు. శ్రీనగర్‌లో జనం ఎంచక్కా కుటుంబంతో కలిసి సినిమాలకూ వెళ్లగలుగుతున్నారు. ఇంతటి పెను మార్పులు గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. కొన్ని నెలల క్రితం శ్రీనగర్‌లో ఏకంగా అంతర్జాతీయ మారథాన్ జరిగింది. ఆరోజు మారథాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సైతం పాల్గొన్నారు. ఆ వీడియో వైరల్ అయింది. ఢిల్లీలో కలిసినప్పుడు ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందించా’’ అని అన్నారు. నూతన శకమిది ‘‘ఇది జమ్మూకశ్మీర్‌కు నిజంగా నూతన శకం. జమ్మూకశ్మీర్ భారత్‌కు కిరీటం. అదెప్పుడూ మరింత అందంగా, సుసంపన్నంగా ఉండాలి. జమ్మూకశ్మీర్‌లో శాంతియుత వాతావరణం వెల్లివిరుస్తోంది. అదిప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. కశ్మీర్ తన సొంత అభివృద్ధి అధ్యయనాన్ని లిఖించుకుంటోంది’’ అని అన్నారు. టన్నెల్‌ను ప్రారంభించాక మోదీ ఓపెన్‌టాప్ వాహనంలో సొరంగంలోకి వెళ్లి పరిశీలించారు. అక్కడి నిర్మాణ కార్మికులతో మాట్లాడి వారిని అభినందించారు. టన్నెల్ నిర్మాణ సమయంలో గత ఏడాది అక్టోబర్ 20న కార్మికులపై ఉగ్రదాడి సందర్భంగా చనిపోయిన ఏడుగురికి మోదీ నివాళులరి్పంచారు. సున్నా డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను సైతం లెక్కచేయకుండా టన్నెల్ ప్రారంభోత్సవానికి సోనామార్గ్, గగన్‌గిర్, గుండ్, కంగన్ గ్రామాల నుంచి వేలాది మంది స్థానికులు రావడం విశేషం. దిల్, దిల్లీ మధ్య దూరం చెరిపే నేత మోదీపై ఒమర్ పొగడ్తలు కార్యక్రమంలో పాల్గొన్న జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మోదీనుద్దేశించి మాట్లాడుతూ పొగడ్తల్లో ముంచెత్తారు. ‘‘ దిల్‌కు, దిల్లీకి మధ్య దూరాల ను చెరిపేసే నేత మీరు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్నారు. గత 15రోజుల్లోనే మీరు పాల్గొంటున్న రెండో కార్యక్రమం ఇది. జనవరి ఆరున జమ్మూ కోసం ప్రత్యేకంగా రైల్వేడివిజన్ ఏర్పాటుచేశారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి నాలుగు నెలల్లోనే ఆ హామీ నెరవేర్చారు. ఇక ఈ ప్రాంతానికి మళ్లీ రాష్ట్రహోదా ఇస్తామన్న హామీనీ త్వరలో నెరవేరుస్తారని బలంగా విశ్వసిస్తున్నాం. సోనామార్గ్ టన్నెల్ వంటి ప్రాజెక్టుల పూర్తితో జమ్మూకశ్మీర్‌కు ఢిల్లీకి మధ్య దూరాలు తగ్గి అనుసంధానత పెరుగుతోంది’’ అని ఒమర్ అన్నారు. రూ.2,716 కోట్ల వ్యయంతో.. రూ.2,716 కోట్ల వ్యయంతో సముద్రమట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఈ సొరంగాన్ని నిర్మించారు. గందేర్బల్ జిల్లాలో శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిపై గగన్‌గిర్, సోనామార్గ్ గ్రామాల మధ్యలో ఒకేసారి ఇరువైపుల వాహనాలు వెళ్లేలా టన్నెల్ నిర్మాణం పూర్తిచేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సొరంగంలో చిక్కుకుపోతే బయట పడేందుకు వీలుగా సొరంగానికి సమాంతరంగా 7.5 మీటర్ల వెడల్పుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారాలను నిర్మించారు. టన్నెల్ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం ఒమర్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం పాల్గొన్నారు. #WATCH | Jammu & Kashmir: Prime Minister Narendra Modi inaugurates the Z-Morh tunnel in Sonamarg today. CM Omar Abdullah and LG Manoj Sinha, Union Minister Nitin Gadkari are also present. (Source: DD/ANI)#KashmirOnTheRise pic.twitter.com/GF7rwZaVn1— ANI (@ANI) January 13, 2025 #WATCH | Sonamarg, Jammu & Kashmir: After inaugurating the Z-Morh tunnel, Prime Minister Narendra Modi inspects the tunnel. CM Omar Abdullah, LG Manoj Sinha and Union Minister Nitin Gadkari are also present. (Source: DD/ANI) #KashmirOnTheRise pic.twitter.com/FbOP7COfzm— ANI (@ANI) January 13, 2025 -
ఆర్టికల్ రద్దుతో సంబంధమే లేదు.. మోదీకి ఒమర్ అబ్దుల్లా ఝలక్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటన వేళ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్టికల్-370 రద్దుతో సంబంధమే లేదన్నారు. 370 రద్దు కంటే ముందే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన చెప్పుకొచ్చారు. అభివృద్ధికి, ఆర్టికల్ రద్దుకు లింక్ పెట్టొద్దు అంటూ ఘాటు విమర్శలు చేశారు.తాజాగా సీఎం ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ..‘జమ్ము కశ్మీర్‌లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆర్టికల్ 370తో ముడిపెట్టవద్దు. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. ఈ ప్రాజెక్టులు ఏవీ ఆగస్టు 5, 2019 తర్వాత ప్రారంభించినవి కావు. అంతకంటే ముందుగానే ఇవి ప్రణాళిక చేయబడ్డాయి. ఆర్టికల్ 370 రద్దుతో సంబంధం లేకుండా జరిగిన అభివృద్ధి ఇది. ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో లేవు అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో జమ్ము కశ్మీర్లో 2008, 2010, 2016లో ప్రముఖంగా కనిపించిన రాళ్ల దాడులు, నిరసనలు వంటి కార్యకలాపాలు ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. దీన్ని నేను అంగీకరిస్తున్నాను. అయితే, ఇది కొంతవరకు ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల కారణంగా ఇది జరిగింది. సీఐడీ విభాగాన్ని ఆయుధంగా మార్చడం, ఉద్యోగులను తొలగించడం, వ్యక్తులను బ్లాక్‌లిస్ట్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. మార్పును ప్రజలు అంగీకరించాలి. వారు మనస్పూర్తిగా అంగీకరిస్తే అది ప్రశంసనీయం అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ముఖ్యమంత్రి ఒమర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. "Let's not link the infrastructure projects in J&K to the politics surrounding Article 370. Most of these projects are not located in any areas that saw activities like stone-pelting and protests": CM Omar Abdullah@OmarAbdullah pic.twitter.com/gbODYR3KdH— Rahul Kanwal (@rahulkanwal) January 13, 2025ఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్‌లోని గాందర్బల్ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్ సొరంగాన్ని భారత ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు. శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారిపై 2,400 కోట్ల రూపాయలతో ఈ టన్నెల్‌ను నిర్మించారు. ఇది 6.4 కిలో మీటర్ల పొడవుండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లద్దాఖ్‌ను రోడ్డు మార్గం ద్వారా ఈజీగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక, 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తి అయ్యాయి. -
‘‘అలాగైతే ఇండియా కూటమిని రద్దు చేయండి’’
ఒకవైపు విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు నడుస్తుండగా.. భాగస్వామ్య పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసం మాత్రమే కూటమి మనుగడ కొనసాగాలనుకుంటే.. వెంటనే దానిని రద్దు చేయాలని సూచించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్‌లు తలపడుతుండడమే అందుకు కారణం. ఎన్సీ అధినేత, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ‘‘ఢిల్లీ ఎన్నికల్లో ఏం జరుగుతుందో నేను మాట్లాడదల్చుకోలేదు. ఎందుకంటే ఆ ఎన్నికలతో మాకు సంబంధం లేదు కాబట్టి. కానీ, మా ఇండియా కూటమికి ఓ కాలపరిమితి అంటూ లేకుండా పోయింది.దురదృష్టవశాత్తూ.. ఇండియా కూటమి సమావేశాలు జరిగినా నాయకత్వం, ఎజెండా, దాని మనుగడ గురించి స్పష్టత లేకుండా పోయింది. కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసమే కూటమి అనుకుంటే గనుక దానిని రద్దు చేస్తేనే మంచిది అని అభిప్రాయపడ్డారాయన.#WATCH | Jammu: J&K CM Omar Abdullah says, "... I cannot say anything about what's going on in Delhi because we have nothing to do with Delhi Elections... As far as I remember, there was no time limit to the INDIA alliance. Unfortunately, no INDIA alliance meeting is being… pic.twitter.com/u9w9FazeJG— ANI (@ANI) January 9, 2025ఇదిలా ఉంటే.. కిందటి ఏడాదిలో జరిగిన జమ్ము కశ్మీర్(Jammu Kashmir) అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, ఎన్సీ కలిసే పోటీ చేసి విజయం సాధించాయి. అయితే.. మొన్నీమధ్య ఈవీఎంల వ్యవహారంలో ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీతో విబేధించారు. ఈవీఎంలను నిందించడం ఆపేసి గెలుపోటములను అంగీకరించాలని సలహా కూడా ఇచ్చారు. అయితే సీఎం అయ్యాక ఆయన ధోరణి మారిందంటూ కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది. ఈ మధ్యలో..బీజేపీపైనా ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు గుప్పించడంతో ఆయన విపక్ష కూటమికి దూరం అవుతున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. ఆ వెంటనే ఆయన అమిత్ షాను కలవడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. అయితే.. జమ్మూకశ్మీర్‌కు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నానని, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రహోదా పునరుద్దరణ కోసమే కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసినట్లు స్పష్టత ఇచ్చారు.తేజస్వి కామెంట్లతో.. ఒమర్ అబ్దుల్లా ఇండియా కూటమి రద్దు వ్యాఖ్యలు ఊరికనే చేయలేదు. ఇండియా కూటమిలో గత కొంతకాలంగా నాయకత్వం విషయంలో బేధాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియా కూటమిని కాంగ్రెస్ ముందుండి నడిపించాలని భావిస్తుండగా.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఎస్పీ, ఆర్జేడీ లాంటి కొన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో మొన్నటి పార్లమెంట్ సమావేశాల సమయంలోనూ కాంగ్రెస్ వెంట ‘బీజేపీ వ్యతిరేక నిరసనల్లో’’ ఈ రెండు పార్టీలు కలిసి రాలేదు. దీంతో ఇండియా కూటమి మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయనన్న చర్చ నడిచింది. ఈ తరుణంలో.. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ ఫైట్ ఈ గ్యాప్‌ను మరింతగా పెంచాయి. ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, దానిని ఇండియా కూటమి నుంచి దూరం పెట్టాలని ఆప్ డిమాండ్ సైతం చేసింది. ఈ పోటీని ఉద్దేశించి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన కామెంట్లపైనే ఆయన అలా స్పందించాల్సి వచ్చింది. ఇంతకీ తేజస్వి ఏమన్నారంటే.. ‘‘2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ఇండియా కూటమి లక్ష్యం. కాబట్టి కూటమి ఆ లక్ష్యం వరకే కట్టుబడి ఉంటుంది. అలాంటప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఆప్‌లు తలబడడం అసాధారణమైనదేం కాదు’’ అని తేజస్వి యాదవ్ అభిప్రాయపడ్డారు. ఇక ఈ పరిణామంపై బీజేపీ సైతం స్పందించింది. ‘‘దేశీయంగా, అంతర్జాతీయంగా కుంభకోణాలు చేసినవాళ్లు, కేసులు ఉన్నవాళ్లు.. నిజాయితీపరుడైన మోదీకి వ్యతిరేకంగా ఒక్కతాటి మీదకు వచ్చాయి’’ అని ఎద్దేవా చేసింది. -
Omar Abdullah: బీజేపీకి దగ్గరవుతున్నారా?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది బాగా వాడుకలో ఉన్న నానుడి. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్పరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా తాజా ప్రకటనలు ఇదే తరహాలో ఉన్నాయి. కాషాయ పార్టీకి ఆయన దగ్గరవుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంపై ఆయన చేసిన వాఖ్యలు బీజేపీతో సామీప్యతను సంతరించుకోవడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. ఇదంతా కాకతాళీయంగా జరిగింది కాదన్న అభిప్రాయాలు ప్రత్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత రోజే ఒమర్ అబ్దుల్లా కూడా మాట్లాడారు. అయితే స్వపక్షమైన కాంగ్రెస్ పార్టీని తప్పుబడుతూ ఆయన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో విజయాలను తమ ఖాతాలో వేసుకుని, అపజయాలను మాత్రం ఈవీఎంలపైకి నెట్టేయడం సరికాదన్న చందంగా ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. సరిగ్గా అమిత్ షా ఏదైతే అన్నారో అలాగే కశ్మీర్ సీఎం స్పందించారు. ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.రాహుల్ గాంధీకి అమిత్ షా కౌంటర్లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 ఎంపీ సీట్లు గెలిచినప్పుడు సంబరాలు చేసుకున్నారని, ఈ దశాబ్దంలోనే ఉత్తమ పనితీరు కనబరిచామని పొంగిపోయారని రాహుల్ గాంధీని ఉద్దేశించి అమిత్ షా కమెంట్ చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో తాను గెలిచాను కాబట్టి ఈవీఎంలు బాగా పనిచేశాయని రాహుల్ గాంధీ నమ్ముతున్నారు. జార్కండ్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈవీఎంలు కరెక్ట్‌గానే పనిచేస్తున్నాయని అనుకున్నారు. మహారాష్ట్రలో ప్రజలు ఓడించేసరికి ఈవీఎంలు వారికి చెడుగా కన్పిస్తున్నాయి. పని చేతగానివాడు పనిముట్లను నిందించిట్టుగా రాహుల్ గాంధీ వ్యవహారం ఉంద’ని అమిత్ షా అన్నారు.కాంగ్రెస్‌ను తప్పుబట్టిన ఒమర్ అబ్దుల్లామరుసటి రోజు ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే లైన్లో మాట్లాడారు. గెలిచినప్పుడు ఒకలా, ఓడిపోయినప్పుడు మరో విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం తగదని హితవు పలికారు. ఈవీఎంలతోనే లోక్‌సభ ఎన్నికల్లో 100 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ మహారాష్ట్ర ఫలితాల తర్వాత మాట మార్చడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజాతీర్పుపై విశ్వాసం లేనట్టుగా మాట్లాడం మానుకోవాలని, ఓటమికి ఈవీఎంలను బాధ్యులు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలకు కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. సీఎం అయ్యాక ఆయన ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందో అంటూ ప్రశ్నించింది.చదవండి: EVMలపై పోరు.. ధోరణి మారింది ఎందుకో?బీజేపీపై సీఎం అబ్దుల్లా ప్రశంసలుఅయితే ఇక్కడితో ఆగిపోకుండా బీజేపీపై ప్రశంసలు కురిపించారు కశ్మీర్ సీఎం అబ్దుల్లా. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఎంతో మంచిదని, కొత్త పార్లమెంటు భవనం నిర్మించడం అద్భుతమైన ఆలోచన అంటూ కాషాయపార్టీని పొగిడారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీని తప్పుబడుతూ బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారన్న వాదనను ఒమర్ అబ్దుల్లా కొట్టిపారేశారు. జమ్మూకశ్మీర్‌కు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నానని, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. కాగా, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్దరణ కోసం అమిత్‌షాను బుధవారం ఢిల్లీలో సీఎం అబ్దుల్లా కలవనున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది. -
‘EVMలపై పోరు.. ధోరణి మారింది ఎందుకో?’
ఈవీఎంల వ్యవహారంపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సీఎం అయ్యాక ఆయన ధోరణి మారిందా? అంటూ ప్రశ్నించింది. ఈవీఎంలతో ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ సహా పలు పార్టీలు ‘న్యాయ’ పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. ఈ తరుణంలో.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంలను) నిందించడాన్ని వదిలేసి ఫలితాలను అంగీకరించాలంటూ విపక్ష కూటమిలోని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాశంమైంది. అయితే..ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. పార్టీ తరఫున సీనియర్ నేత మాణికం ఠాగూర్.. ‘‘సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ, శివసేన యూబీటీ.. ఇవన్నీ ఈవీఎంలకు వ్యతిరేకంగానే మాట్లాడాయి. ఒమర్ అబ్దుల్లా.. మీ తరఫున ఓసారి వాస్తవాల్ని పరిశీలించండి. కాంగ్రెస్ సీడబ్ల్యూసీ తీర్మానం కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని స్పష్టంగా ప్రస్తావించింది. సీఎం అయ్యాక మా భాగస్వాముల ధోరణి ఎందుకు మారిందో? అని ప్రశ్నించారాయన. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై.. ఎంవీఏ కూటమి నుంచి పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో ఈవీఎంలపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చింది. అయితే ఇండియా కూటమిలో భాగమైన నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా మాత్రం ఈవీఎం అవకతవకలపై విరుద్ధంగా స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌నే ప్రధానంగా టార్గెట్ చేసి ఆయన మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. It’s the Samajwadi Party, NCP, and Shiv Sena UBT that have spoken against EVMs. Please check your facts, CM @OmarAbdullah. The Congress CWC resolution clearly addresses the ECI only. Why this approach to our partners after being CM? https://t.co/rr3mpyJqx8— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) December 16, 2024‘‘గెలిచినప్పుడు ఒకలా, ఓడినప్పుడు మరో విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం తగదు. వందమందికి పైగా సభ్యులు అదే ఈవీఎంలతో మీ పార్టీ(కాంగ్రెస్‌ను ఉద్దేశించి..) తరఫున నెగ్గినప్పుడు దానిని ఘన విజయంగా తీసుకున్నారు. కొన్ని నెలల తర్వాత మీరు అనుకున్న ఫలితాలు రాకపోయేసరికి ఈవీఎంలను నిందిస్తున్నారు. పక్షపాతంతో కాకుండా సిద్ధాంతాల ఆధారంగానే నేను మాట్లాడుతున్నా...ఓటింగు విధానంపై విశ్వాసం లేనప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఈవీఎంలతో ఏదైనా సమస్య ఉంటే దానిపై పోరాటం చేయాలి. ఫలితాలకు ఈవీఎంలతో సంబంధం లేదు. ఓటర్లు ఒకసారి మనల్ని ఎన్నుకుంటారు. మరోసారి ఎన్నుకోరు. నేనే దీనికి ఉదాహరణ. లోక్‌సభ ఎన్నికల్లో నేను ఓడిపోయాను. సెప్టెంబరులో అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించాను. యంత్రాలను నేనెప్పుడూ ఆడిపోసుకోలేదు’’ అని అన్నారు. మొన్నటి జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసే పోటీ చేశాయి.ఇదీ చదవండి: ఆ కుటుంబం కోసం రాజ్యాంగాన్నే మార్చేశారు! -
కాంగ్రెస్‌కు ఒమర్ అబ్దుల్లా షాక్!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎంల)పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ కాంగ్రెస్‌కు ఫ్రెండ్లీపార్టీ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నుంచే గట్టి షాక్ తగిలింది. ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ విమర్శలను జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తప్పుపట్టారు. తాజాగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒమర్ మాట్లాడారు. ఓడినప్పుడు మాత్రమే ఈవీఎంలను నిందించడం సరికాదన్నారు. ఓటింగ్ విధానంపై విశ్వాసం లేనప్పుడు ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఒమర్ సూచించారు. ఎన్నికల్లో ఫలితం ఏదైనా అంగీకరించాలన్నారు. ఈవీఎంలతో ఏదైనా సమస్య ఉంటే వాటిపై పోరాటం చేయాలన్నారు. అవే ఈవీఎంల సాయంతో 100 మంది సభ్యులు పార్లమెంటులో అడుగుపెట్టినప్పుడు, పార్టీ విజయం సాధించినప్పుడు సంబరాలు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఒమర్ గుర్తుచేశారు. కొన్ని నెలల తర్వాత తాము ఆశించిన విధంగా ఫలితాలు రాలేదని ఈవీఎంలపై విమర్శలు చేయడం సరికాదనిదని ఒమర్ అన్నారు. ఫలితాలకు ఈవీఎంలతో సంబంధం లేదని, ఓటమికి సాకుగా వాటిని చూపించకూడదన్నారు. ఓటర్లు ఒక్కోసారి ఒక్కో వ్యక్తిని ఎన్నుకుంటారన్నారు.గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తాను ఓటమి చెందినప్పటికీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ఇందుకు ఓ ఉదాహరణ అని చెప్పారు. ఇటీవల జరిగిన హర్యానా,మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఈవీఎంలపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. -
అమిత్‌షాతో సీఎం ఓమర్ అబ్దుల్లా భేటీ.. రాష్ట్ర హోదాపై హామీ?
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని అమిత్‌షా హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే విధంగా జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించడంపై హోంమంత్రి సానుకూలంగాస్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని హోంమంత్రి చెప్పినట్లు సమాచారం.కాగా జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగం అందించిన 370 ఆర్టికల్ కేంద్రం 2019లో రద్దు చేసిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను తొలగిస్తూ జమ్ము కశ్మీర్, లడఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే ఇది జరిగిన అయిదేళ్ల తర్వాత రాష్ట్ర హోదాను పునరుద్దరించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించే అవకాశం ఉంది. ఇక గత వారం జరిగిన మొదటి కేబినెట్ భేటీలో జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ఓ తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. అబ్దుల్లా నేడు సాయంత్రం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని ఆ తీర్మానం కాపీని సమర్పించే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ 90 స్థానాలకు గాను 42 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయాన్ని సాధించింది. దీంతో పార్టీ నేత ఓమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. -
జమ్మూకశ్మీర్ రాష్ట్రహోదా తీర్మానానికి ఎల్జీ ఓకే
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలంటూ ఒమర్ అబ్దుల్లా కేబినెట్ చేసిన తీర్మానానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదముద్రవేశారు. గురువారం సమావేశమై కేబినెట్ ఆమోదించిన తీర్మానానికి ఎల్జీ ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. జమ్మూకశ్మీర్ ప్రజల గుర్తింపు, రాజ్యాంగబద్ధ హక్కులను తిరిగి పొందేందుకు పాత గాయాలను మాన్పే పూర్తిరాష్ట్ర హోదా పొందే ప్రక్రియలో ఈ తీర్మానం తొలి అడుగు అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జమ్మూకశ్మీరీల ప్రత్యేక గుర్తింపే నూతన ప్రభుత్వం అనుసరించనున్న విధాననిర్ణయాలకు భూమిక అని ఆయన అన్నారు. నవంబర్ నాలుగోతేదీన అసెంబ్లీ సమావేశాలు జరపనున్నారు. రాష్ట్ర పునరుద్ధరణకు సంబంధించిన విషయాలపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో చర్చించేందుకు సీఎం ఒమర్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే రద్దయిన 370 ఆరి్టకల్‌ను తిరిగి తీసుకొచ్చే విషయంలో ఎలాంటి తీర్మానాలు జరగకపోవడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. కొలువుతీరిన కొద్దిరోజులకే ఒమర్ సర్కార్ అప్పుడే కేంద్రప్రభుత్వానికి లొంగిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశాయి. -
జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్రహోదా !
సాక్షి,న్యూఢిల్లీ: త్వరలో జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా పునరుద్ధరించే అవకాశాలున్నాయి. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కోరుతూ కొత్తగా ఏర్పడ్డ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవలే అసెంబ్లీలో తీర్మానం చేసింది.ఈ తీర్మానాన్ని రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా ఆమోదం తెలిపారు. దీంతో కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రహోదా ఇవ్వనుందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా రద్దైన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: తమిళనాడు గవర్నర్ వర్సెస్ స్టాలిన్ -
Jammu & Kashmir: రాష్ట్ర హోదా పునరుద్దరణకు తీర్మానం ఆమోదం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ నూతన సీఎం ఓమర్ అబ్దుల్లా నేతృత్వంలోని కేబినెట్ రాష్ట్ర హోదా పునరుద్దరణకు తీర్మానాన్ని ఆమోదించింది. గురువారం జరిగిన మొదటి సమావేశంలో జమ్ముకశ్మీర్ మంత్రివర్గం రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి, మంత్రులు సకీనా మసూద్ ఇటూ, జావేద్ అహ్మద్ రాణా, జావైద్ అహ్మద్ దార్, సతీష్ శర్మ హాజరయ్యారు.‘తీర్మానం ముసాయిదా సిద్ధం అయ్యింది. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ తీర్మానం ముసాయిదాను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయడానికి ముఖ్యమంత్రి రెండు రోజుల్లో న్యూఢిల్లీకి వెళతారు’ అంటూ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.కాంగ్రెస్ జమ్ముకశ్మీర్ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర హోదాను పునరుద్ధరించకపోతే తమ పార్టీ కేబినెట్లో భాగం అవ్వదని వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదాను కేంద్రం పునరుద్ధరిస్తుందని ఆశిస్తున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విశ్వాసం వ్యక్తం చేశారు."మేము రాజ్యాధికారం గురించి ఇంతకు ముందు కూడా మాట్లాడాము. ఇప్పుడు కూడా అదే కోరుతున్నాం. రెండు నెలల్లో రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషిన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం త్వరలోదీనిని ఖచ్చితంగా పునరుద్ధరిస్తుందని భావిస్తున్నాను’ అని అబ్దుల్లా తెలిపారు. ఇదిలా ఉండగా 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా, స్వయంప్రతిపత్తి నికూడా రద్దు చేసింది. దాంతో పాటు, జమ్మూ కాశ్మీరు రాష్ట్ర హోదాను తొలగిస్తూ జమ్ము కశ్మీర్. అలాగే లడఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.. -
ఎంపీగా ఓడిన కొద్ది వారాలకే సీఎం
శ్రీనగర్: జూన్‌లో లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లాలో ఓటమిని చవిచూసిన ఒమర్ అబ్దుల్లా కేవలం కొద్ది వారాల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. గతంలోనూ ఇలాగే 38 ఏళ్ల వయసులో తొలిసారిగా జమ్మూకశ్మీర్ సీఎంగా పగ్గాలు చేపట్టి రికార్డ్ సృష్టించారు. అత్యంత పిన్న వయసులో సీఎం అయి 2009–14 కాలంలో రాష్ట్రాన్ని పాలించారు.స్కాట్లాండ్లోని స్ట్రాత్క్లీడ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేస్తూ చదువును మధ్యలో వదిలేసిన ఒమర్ 1998లో తొలిసారిగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. 28 ఏళ్ల వయసులో 12వ లోక్‌సభకు ఎన్నికై అత్యంత పిన్న వయసులో ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. 1999లోనూ జయకేతనం ఎగరేసి పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. గోధ్రా ఉదంతాన్ని తీవ్రంగా నిరసిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత జమ్మూకశ్మీర్ శాసనసభ సమరంలో అడుగుపెట్టి చతికిలపడ్డారు. 2002లో నేషనల్ కన్ఫెరెన్స్ కంచుకోట గందేర్బల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అనామక ఖాజీ మొహమ్మద్ అఫ్జల్చేతిలో ఓడిపోయారు. తర్వాత 2004లో మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టారు. తర్వాత జమ్మూకశ్మీర్ అటవీప్రాంతాన్ని శ్రీ అమర్నాథ్ ఆలయబోర్డ్కు 2008లో ఇచ్చేందుకు నాటి అటవీమంత్రిగా అఫ్జల్ తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా అసంతృప్తి నెలకొంది. దీన్ని అవకాశంగా మలచుకున్న ఒమర్ ఆందోళనలు లేవనెత్తారు. పార్టీ బలాన్ని పెంచి ఆనాటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచించి ఎన్సీని అతిపెద్ద పార్టీగా అవతరింపజేశారు. దీంతో 38 ఏళ్ల వయసులో ఒమర్ కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 54 ఏళ్ల ఒమర్ ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అబ్దుల్లాల కుటుంబం నుంచి సీఎం అయిన మూడోవ్యక్తి ఒమర్. గతంలో ఈయన తాతా షేక్ అబ్దుల్లా, తండ్రి ఫరూక్ అబ్దుల్లా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. చదవండి: నేనెందుకు అరెస్టయ్యానో మీకు తెలుసా? -
రాష్ట్ర హోదా త్వరగా రావాలి
శ్రీనగర్: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌కు తొలి సీఎంగా బుధవారం బాధ్య తలు స్వీకరించిన కొద్దిసేపటికే పీటీఐ వీడియోస్‌తో ఒమర్ అబ్దుల్లా ముఖాముఖి మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘ కాంగ్రెస్ పార్టీతో కలిసి రాష్ట్ర హోదా సాధనకు కృషిచేస్తాం. త్వరలోనే రాష్ట్ర హోదా దక్కొచ్చని భావిస్తున్నాం. ఖాళీగా ఉన్న మంత్రిపదవుల భర్తీ కోసం కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నాం. కాంగ్రెస్‌తో బేధాభి ప్రాయా లు అబద్ధం. నిజంగానే సఖ్యత చెడితే ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక వంటి అగ్రనేతలు మా ప్రమాణ స్వీకార కార్య క్రమానికి రారుకదా. ప్రభు త్వంలో చేరాలా వద్దా అనేది వాళ్ల ఇష్టం. శాసనమండలి కూడా లేని జమ్మూ కశ్మీర్లో తక్కువ మంది మంత్రులతో ప్రభు త్వాన్ని నడపాలని భావిస్తున్నాం. గతంలోలాగా 40, 45 మంది మంత్రులుండే కాలం పోయింది. 2018 నుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కశ్మీర్లో లేదు. తమ సమస్యల్ని పట్టించుకున్న నాథుడే లేడని ప్రజలు నిరాశలో కుంగిపోయారు. అందుకే కొత్తగా ఏర్పడిన మా ప్రభుత్వ తక్షణ కర్తవ్యం వారి సమస్యలను పరిష్కరించడమే. కేంద్రపాలిత ప్రాంతంగా కశ్మీర్‌ను పాలించడం కొత్త రకం సవాల్. అందివచ్చిన తొలి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడం పెద్ద నేరంతో సమానం. గత తప్పిదాలు చేయబోను. కేజ్రీవాల్‌సహా దేశంలో పరిపా లనా అనుభవం ఉన్న కీలక వ్యక్తులు అందరి నుంచి పాఠాలు నేర్చుకుంటా’’ అని ఒమర్ వ్యాఖ్యానించారు. -
J&K: ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం
-
జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని మోదీ విషెస్..
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా నేడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. శ్రీనగర్‌లోని షెరి కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయనతో ప్రమాణం చేయించారు. సురిందర్ కుమార్ చౌదరీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు సేవ చేసేందుకు ఆయన చేస్తున్న కృషికి మంచి జరగాలని ఆకాంక్షించారు. జమ్ముకశ్మీర్ ప్రాంత అభివృద్ధి కోసం తాము ఒమర్ అబ్దుల్లా సర్కారుతో కలిసి పనిచేస్తామని చెప్పారు. అంతేగాక ప్రమాణస్వీకారానికి ముందు ఒమర్ అబ్దుల్లా కూడా జమ్ముకశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తానని చెప్పారు.చదవండి: J&K cabinet: మంత్రి పదవి ఆఫర్.. తిరస్కరించిన కాంగ్రెస్ <Congratulations to Shri Omar Abdullah Ji on taking oath as the Chief Minister of Jammu and Kashmir. Wishing him the very best in his efforts to serve the people. The Centre will work closely with him and his team for J&K's progress. @OmarAbdullah— Narendra Modi (@narendramodi) October 16, 2024ఇక జమ్ముకశ్మీర్ రాష్ట్రం జమ్ముకశ్మీర్, లఢఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత తొలిసారి జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఘన విజయం సాధించడంతో.. ఆ పార్టీ అగ్రనేత ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌కు తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా గుర్తింపు పొందారు. గతంలో ఆయన జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు.ఓమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు హాజరయ్యారు. వీరితో పాటు ఇండియా కూటమికి చెందిన ఇతర నేతలు వచ్చారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత ఏర్పాటైన తొలి ప్రభుత్వం ఇది. -
J&K cabinet: మంత్రి పదవి ఆఫర్.. తిరస్కరించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత బుధవారం కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శ్రీనగర్‌లో ఉన్న షేర్ యే కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ.. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. అయితే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓ మినిస్టర్ బర్త్ ఇచ్చేందుకు ఎన్సీ ఆఫర్ చేసింది. కానీ జమ్ముకశ్మీర్ పరిపాలనలో భాగం కావడానికి అయిష్టత చూపుతున్న హస్తం పార్టీ.. ఎన్సీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. ప్రభుత్వానికి బయట నుంచే సపోర్టు ఇవ్వాలని భావిస్తున్నట్లు వినికిడి.కాగా 2014 తర్వాత పదేళ్లకు జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 90 సీట్లకుగానూ 42 చోట్ల విజయం దక్కించుకుంది. ఎన్సీతో పొత్తుతో వెళ్లిన కాంగ్రెస్ కేవలం ఆరు చోట్ల మాత్రమే గెలిచింది.ఇక నేడు ఒమర్ అబ్ధుల్లాతోపాటు 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమానికి ఇండియా కూటమికి చెందిన ఇతర నేతలకు ఆహ్వానాలు అందాయి.ఇప్పటికే ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్, డీఎంకే నేత కనిమొళితో పాటు ఇతర నేతలు శ్రీనగర్ చేరుకున్నారు. ఫారూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాతో కలిసి ఆ నేతలు ఫోటోలు దిగారు. చెన్నైలో వర్షాల వల్ల ప్రమాణ స్వీకారోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరుకాలేకపోతున్నారు. -
J&K: సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
Updates కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ తొలి ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణం చేశారు.శ్రీనగర్‌లోని షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ)లో జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సీఎంగా ఒమర్‌తో ప్రమాణం చేయించారు.#WATCH | Omar Abdullah takes oath as the Chief Minister of Jammu and Kashmir.The leaders from INDIA bloc including Lok Sabha LoP Rahul Gandhi, Congress leader Priyanka Gandhi Vadra, JKNC chief Farooq Abdullah, Samajwadi Party chief Akhilesh Yadav, PDP chief Mehbooba Mufti, AAP… pic.twitter.com/IA2ttvCwEJ— ANI (@ANI) October 16, 2024 ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇండియా కూటమి నేతలు.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఎన్‌న్సీపీ-ఎస్స్పీ ఎంపీ సుప్రియా సూలే, సీపీఐ నేత డీ. రాజా హాజరయ్యారు.అంతకు ముందు.. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శ్రీనగర్ చేరుకున్నారు. #WATCH | Congress President Mallikarjun Kharge reaches Srinagar to attend the swearing-in ceremony of Omar Abdullah as the Chief Minister of Jammu and Kashmir. pic.twitter.com/3OCIoQKqMP— ANI (@ANI) October 16, 2024 ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శ్రీనగర్ చేరుకున్నారు. Rahul Gandhi, Priyanka Gandhi arrive in Srinagar to attend swearing-in ceremony of Omar AbdullahRead @ANI Story | https://t.co/u7dPfwgpJc#RahulGandhi #OmarAbdullah #PriyankaGandhi #SwearingInCeremony #JKChiefMinister pic.twitter.com/SRTlRKJ6N8— ANI Digital (@ani_digital) October 16, 2024 జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు.. నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ భారత ప్రభుత్వంతో సహకారంతో పనిచేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. అయితే ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సీఎంగా స్వంత హక్కు ఉంది. నేను విచిత్రమైన సవాళ్లను కలిగి ఉన్నా. పూర్తి ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసిన చివరి ముఖ్యమంత్రిని నేను. ఇప్పుడు నేను జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి ముఖ్యమంత్రిని అవుతాను. జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం ద్వారా మా పాలన మొదలవుతుంది’’ అని అన్నారు.ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ఇప్పటికే ఇండియా కూటమి నేతలు.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఎన్‌న్సీపీ-ఎస్స్పీ ఎంపీ సుప్రియా సూలే, సీపీఐ నేత డీ. రాజా చేరుకున్నారు. Samajwadi Party chief Akhilesh Yadav, DMK MP Kanimozhi Karunanidhi, NCP-SCP MP Supriya Sule and CPI leader D Raja in Srinagar to attend the swearing-in ceremony of J&K CM-designate Omar AbdullahOmar Abdullah to take oath as J&K CM today. (Pics: Akhilesh Yadav's social media… pic.twitter.com/TO4tSGzFmn— ANI (@ANI) October 16, 2024ఆర్టీకల్ 370 ఆర్టీకల్ రద్దు అనంతరం మొదటిసారిగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి విజయం సాధించడం తెలిసిందే. -
నేడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం
శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ తొలి ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా నేడు ప్రమాణం చేయనున్నారు. ఆర్టీకల్ 370 ఆర్టీకల్ రద్దు అనంతరం మొదటిసారిగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి విజయం సాధించడం తెలిసిందే. బుధవారం శ్రీనగర్‌లోని షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ)లో జరిగే కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సీఎంగా ఒమర్‌తో ప్రమాణం చేయించనున్నారు.పలువురు మంత్రులుగా ప్రమాణం చేస్తార ని భావిస్తున్నారు. ఇందుకోసం ఎస్కేఐసీసీలో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమానికి ఇండియా కూటమి పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన ఐదుగురితో కలుపుకుంటే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సభ్యుల సంఖ్య 95కు చేరుకుంది. ఇటీవలి ఎన్నికల్లో ఎన్సీ 40, భాగస్వామ్య కాంగ్రెస్ ఆరు, సీపీఎం ఒక సీటు గెలుచుకున్నాయి. ఇవికాకుండా, ఒమర్ అబ్దుల్లాకు ఆప్ ఏకైక సభ్యుడు, ఐదుగురు ఇండిపెండెంట్లు మద్దతు పలికారు. -
ఒమర్అబ్దుల్లా ప్రమాణ స్వీకార తేదీ ఖరారు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార తేదీ ఫైనల్ అయింది. తాను సీఎంగా బుధవారం (అక్టోబర్ 16) ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఈమేరకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా నుంచి తనకు లేఖ అందిందని చెప్పారు.సీఎంగా ప్రమాణ స్వీకారానికి లేఖలో తనను ఆహ్వానించారన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరం ఇటీవలే జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా అక్కడ రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది.దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.ఇదీ చదవండి: హిమాచల్‌లో రెండు డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు -
J&K: ఎన్సీ శాసనసభాపక్షనేతగా ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ -కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్షనేతగా ఎన్సీ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని గురువారం ఎన్సీ సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. ఎన్సీ శాసనసభాపక్షనేతగా ఎన్నికైన అనంతరం మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు.‘‘ఈరోజు నేషనల్ కాన్ఫరెన్స్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. అందులో నేను లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకోబడ్డాను. పార్టీ ఎమ్మెల్యేలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.#WATCH | Srinagar, J&K: JKNC vice president Omar Abdullah says, "Today in the meeting of the National Conference Legislature Party, I have been elected as the leader of the Legislature Party. I express my gratitude to the MLAs. Talks are going on to get the letter of support from… pic.twitter.com/uM86jG9rc9— ANI (@ANI) October 10, 2024అదేవిధంగా 4 స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఎన్సీ ప్రభుత్వాన్ని ఏర్పాటు తమ మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ఎన్సీ 42 ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు నలుగురిని కలుపుకొని మొత్తం 46 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉన్నాం. కాంగ్రెస్ నుంచి మద్దతు లేఖ అందిన వెంటనే మేము జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని రాజ్‌భవన్‌కు వెళ్తాం’ అని అన్నారు. -
Omar Abdullah: బీజేపీ నుంచి ఆశించడం మూర్ఖత్వం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ప్రజల ప్రత్యేక హక్కులను లాక్కున్న బీజేపీ నుంచి ఆర్టికల్ 370 పునరుద్ధరణను ఆశించడం మూర్ఖత్వమని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. అయితే బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై తమ పార్టీ వైఖరి మారబోదన్నారు. ఆర్టికల్ 370పై మాట్లాడబోమని కానీ, అదిప్పుడు సమస్య కాదని తామెప్పుడూ చెప్పలేదని అబ్దుల్లా స్పష్టం చేశారు. భవిష్యత్‌లో దేశంలో ప్రభుత్వం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఒమర్... అప్పుడు జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించే కొత్త వ్యవస్థ ఏర్పడుతుందని ఆశిస్తున్నామన్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోరుతూ ఎన్సీ–కాంగ్రెస్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేస్తుందని తెలిపారు. ఢిల్లీ తరహాలో కాకుండా జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం సజావుగా నడుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీకి జమ్మూకశ్మీర్‌కు చాలా తేడా ఉందని, 2019కు ముందు జమ్మూకశ్మీర్ ఒక రాష్ట్రమని గుర్తు చేశారు. జమ్మూకశ్మీర్‌లో మూడు చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రధాని, హోంమంత్రి, సీనియర్ మంత్రులు చెప్పారని, డీలిమిటేషన్, ఎన్నికలు జరిగాయని, రాష్ట్ర హోదా మాత్రమే మిగిలి ఉందని, దానిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో ఘర్షణ పడటం వల్ల సమస్యలను పరిష్కరించలేమన్నారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడానికి ఎన్సీ గురువారం శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని అబ్దుల్లా చెప్పారు. ఆ తర్వాత కూటమి సమావేశంలో నాయకుడిని ఎన్నుకుంటారని, ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు హక్కును కోరుతామని తెలిపారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో పీడీపీ భాగస్వామ్యం అవుతుందా అన్న ప్రశ్నకు ఎన్సీ నేత సమాధానమిస్తూ ప్రస్తుతానికి దానిపై ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు.హిందువుల్లో విశ్వాసాన్నిపెంచుతాం: ఫరూక్జమ్మూకశ్మీర్ మధ్య బీజేపీ సృష్టించిన విభేదాలను తగ్గించి, హిందువుల్లో విశ్వాసాన్ని పెంపొందించడమే ఎన్సీ–కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. రెండు ప్రాంతాల మధ్య భేదం చూపబోమని తెలిపారు. కొత్త ప్రభుత్వం ముందు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అతిపెద్ద సవాళ్లున్నాయన్నారు. యువతకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఎవరనేది కూటమి నిర్ణయిస్తుందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించడంపై ఫరూక్ స్పందిస్తూ.. తాను నిర్ణయించిందే జరుగుతుందని స్పష్టం చేశారు. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అభ్యర్థని ఫరూక్ అబ్దుల్లా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపైనే తొలి తీర్మానం: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్:తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే జమ్మూ-కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రధానికి సమర్పిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)నేత ఒమర్అబ్దుల్లా అన్నారు.నియోజకవర్గాల పునర్విభజన,రాష్ట్ర హోదా వరుసగా ఉంటాయన్నారు.కొందరు నేతలు జమ్ముకశ్మీర్‌ను ఢిల్లీతో పోల్చడంపై ఒమర్ మండిపడ్డారు. కశ్మీర్‌ను ఢిల్లీతో పోల్చొద్దన్నారు.దేశ రాజధానికి రాష్ట్ర హోదా ఇస్తామని ఎవరూ చెప్పలేదన్నారు.కానీ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని,హోంమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు.2019 వరకు జమ్మూకశ్మీర్ రాష్ట్రంగానే ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కశ్మీర్లో శాంతిని నెలకొల్పి అభివృద్ధికి బాటలు వేయాలంటే రాష్ట్ర హోదా తప్పనిసరి అని పేర్కొన్నారు. -
కశ్మీరంలో కూటమి
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఆర్టీకల్ 370 రద్దయ్యి, కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మూడు పార్టీ లతో కూడిన విపక్ష ‘ఇండియా’ కూటమికే పట్టంగట్టారు. శాసనసభలో మొత్తం 90 స్థానాలకు గాను ఆ కూటమి 49 స్థానాలు సొంతం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించింది. ఇండియా కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్ 42 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ ఆరు, సీపీఎం ఒక స్థానం దక్కించుకున్నాయి. మూడు పార్టీ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.జమ్మూకశ్మీర్‌లో మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ బలం పెరిగింది. ఆ పార్టీ ఓట్లశాతం 2014లో 20.77 ఉండగా, ఇప్పుడు 23.43 శాతానికి చేరుకుంది. మరో ప్రాంతీయ పార్టీ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) ఈ ఎన్నికల్లో కేవలం 3 సీట్లకే పరిమితమైంది. ఆ పార్టీ ఓట్ల శాతం 22.67 నుంచి 8.87కు పడిపోయింది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ మెరుగైన ఫలితాలే సాధించింది. సొంతంగా 29 సీట్లలో జెండా ఎగురవేసింది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి 25 స్థానాలు దక్కగా, ఈసారి మరో నాలుగు స్థానాలు పెరగడం గమనార్హం. అంతేకాకుండా ఓట్ల శాతం 23 శాతం నుంచి 25.64 శాతానికి పెరిగింది. కానీ, జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రైనా ఓటమి పాలయ్యారు. మహిళలు ముగ్గురే తమ కూటమికి అధికారం దక్కినప్పటికీ కాంగ్రెస్‌కు మాత్రం ఈ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. పదేళ్ల క్రితం ఆ పార్టీ 12 సీట్లు గెలుచుకోగా, ప్రస్తుతం కేవలం ఆరు సీట్లు దక్కాయి. కశ్మీర్ లోయలో ఐదు స్థానాలు, జమ్మూ ప్రాంతంలో కేవలం ఒక స్థానం లభించింది. ఓట్ల శాతం కూడా 18 నుంచి 12 శాతానికి తగ్గిపోయింది. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయం సాధించింది. ఒక స్థానంలో పాగా వేసింది. జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్(జేపీసీ)కు ఒక స్థానం లభించింది. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 90 మంది నూతన ఎమ్మెల్యేల్లో మహిళలు ముగ్గురే ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి సకీనా మసూద్, షమీమా ఫిర్దోస్, బీజేపీ నుంచి షగున్ పరిహర్ గెలిచారు. జమ్మూకశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. -
హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్.. కూటమిదే కశ్మీర్
ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మరోసారి ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (46 స్థానాలు) దాటింది. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. దీంతో బీజేపీ మూడోసారి హర్యానాలో అధికారం చేపట్టనుంది. బీజేపీ భారీ విజయం సాధించటంతో హైకమాండ్ మళ్లీ హర్యానాకు సీఎంగా నయాబ్ సింగ్ సైనీకి ప్రకటించింది. ఇక.. ఇక్కడి ఆప్, జేజేపీ పార్టీలు ఒక్కసీటు కూడా గెలువలేదు. మంగళవారం ఓట్ల లెక్కింపులో ఒక సయయంలో బీజేపీ పలు స్థానాల్లో వెనకంజలో ఉన్నా.. అనూహ్యంగా ఫలితాలు బీజేపీకి ఏకపక్షంగా వచ్చాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బీజేపీ అనుకూలమైన తాజా ఫలితాల తలకిందులు చేశాయి.ప్రస్తుతం సీఎం హర్యానా సైనీ.. ఆరు నెలల ముందే సీఎం పీఠంపై కూర్చున్నా.. పార్టీని హర్యానాలో గెలిపించుకున్నారు. ఆశలు లేని స్థాయి నుంచి అనూహ్యంగా బీజేపీ విజయం సాధించింది. 1966 నుంచి హర్యానాలో ఏ పార్టీ కూడా వరసగా మూడు సార్లు అధికారం చేటపట్టలేదు. తాజాగా బీజేపీ ముచ్చటగా మూడోసారి గెలిచి ఆ ఆనవాయితీని బ్రేక్ చేసింది. హర్యానాలోబీజేపీ: గెలుపు-48కాంగ్రెస్: గెలుపు- 37ఇతరులు:గెలుపు-5 ఇప్పటివరకు ఎన్నికల సంఘం వెల్లడించిన అధికారిక ఫలితాలు..జమ్ము కశ్మీర్లో కాంగ్రెస్ కూటమి విజయంజమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు వెలువడిన మ్యాజిక్ ఫిగర్ స్థానాలను కూటమి గెలుపొందింది. ఇక్కడ బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న సీపీఎం స్థానంలో గెలుపు. కాంగ్రెస్ ఆరు స్థానాల్లో విజయం సాధించింది.ఇక.. పీడీపీ కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. జమ్ము రీయన్లో కూటమికి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా అవుతారని ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు.జమ్ముకశ్మీర్లోనేషనల్ కాన్ఫరెన్స్ - 42 సీట్లుబీజేపీ - 29కాంగ్రెస్ - 06పీడీపీ - 03సీపీఎం - 01ఆప్ - 01జేపీసీ - 01స్వతంత్రులు - 07మొత్తం స్థానాలు: 90 -
జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లానే: ఫరూఖ్ అబ్దులా
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీల కూటమి దూసుకుపోతోంది. ఇప్పటివరకు వరకు ఏడు స్థానాల్లో గెలుపు నమోదు చేసుకొని 45 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆధిక్యంలో మ్యాజిక్ దాటి ముందుకు వెళ్లుతోంది. దీంతో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. ‘‘ ప్రజలు వారి తీర్పును ఇచ్చారు. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లానే అవుతారు. పదేళ్ల తర్వాత ప్రజలు మాకు తమ అవకాశం ఇచ్చారు. మేము ప్రజల అంచనాలను అందుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. #WATCH | Srinagar, J&K | National Conference chief Farooq Abdullah says, "After 10 years the people have given their mandate to us. We pray to Allah that we meet their expectations...It will not be 'police raj' here but 'logon ka raj' here. We will try to bring out the innocent… pic.twitter.com/j4uYowTij4— ANI (@ANI) October 8, 2024ఇక.. ఇక్కడ ‘పోలీసుల రాజ్యం ఉండదు. ప్రజల రాజ్యం ఉంటుంది. మేము జైలులో ఉన్న అమాయకులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం.. హిందువులు, ముస్లింల మధ్య విశ్వాసాన్ని పెంపొందించుతాం. ఇక.. హర్యానాలో కాంగ్రెస్ గెలవకపోవడం బాధాకరం. ఇక్కడ పార్టీలో అంతర్గత వివాదాల కారణంగానే ఇలాంటి ఫలితం వచ్చినట్లు భావిస్తున్నా’ అని అన్నారు.ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించడం లేదనే విషయం ఈ ఫలితాల ద్వారా అర్థమైందని మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. బుడ్గామ్ నియోజకవర్గంలో ఒమర్ అబ్దుల్లా ఘన విజయం సాధించారు.చదవండి: హర్యానాలో ఆప్ ఓటమికి 10 కారణాలు -
‘హంగ్’ రావొద్దనే... కాంగ్రెస్‌తో పొత్తుపై ఒమర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల అనంతరం హంగ్ పరిస్థితి రాకుండా ప్రజలకు ఒక అవకాశం కల్పించేందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దులా వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు కాదేమోనన్న అనుమానాలు అక్కర్లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. దాల్ సరస్సులో ఆదివారం షికారా(పడవ)లతో చేపట్టిన ర్యాలీలో అబ్దుల్లా మాట్లాడారు. ఎన్నికల తర్వాత జమ్మూకశ్మీర్‌లో హంగ్ ఏర్పడాలని బీజేపీ కోరుకుంటోందని, తద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ పాలనను పొడిగించాలని చూస్తోందని ఆరోపించారు. అయితే, ప్రజలు బీజేపీకి ఆ అవకాశం ఇవ్వబోరని చెప్పారు. కశ్మీర్ లోయలో ప్రచారంతో ఫలితం ఉండదని ముందుగానే గ్రహించిన బీజేపీ నేతలు జమ్మూలో మాత్రమే పర్యటిస్తున్నారని ఒమర్ వ్యాఖ్యానించారు. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జమ్మూకశ్మీర్‌లో మూడు కుటుంబాల పాలన అంటూ విమర్శలు చేస్తోందన్నారు. -
నేను జైలులో ఉన్నప్పుడు.. వాళ్లు తోలు బొమ్మలు: ఇంజనీర్ రషీద్
శ్రీనగర్: బీజేపీ అనుకూల వ్యక్తిగా తనపై వస్తున్న ఆరోపణలను అవామీ ఇత్తెహాద్ పార్టీ(ఏఐపీ) చీఫ్, బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ (షేక్ అబ్దుల్ రషీద్) ఖండించారు. సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు ప్రధాని మోదీ ‘నయా కశ్మీర్’ విధానాల వల్ల ప్రజల్లో కలిగిన అసంతృప్తికి నిదర్శరనమని అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.‘‘నాపై బీజేపీ అనుకూల వ్యక్తిని అనే ఆరోపణలు చేయటం చాలా సిగ్గుచేటు. ఇలాంటి ఆరోపణలు చేసినవాళ్లు సిగ్గుపడాలి. నేను ఒక్కడినే బీజేపీ చేతిలో బలిపశువును అయ్యాను. ఆర్టికల్ 370 రద్దు సమయంలో ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలను కొన్ని నెలల పాటు గృహనిర్బంధంలో ఉంచారు. కానీ, నేను మాత్రం తిహార్ జైల్లో ఉన్నా. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఒమర్ అబ్దుల్లా , పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)కి చెందిన మెహబూబా ముఫ్తీలు ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత జమ్ము కశ్మీర్ ప్రజలను ఏకం చేయటంలో విఫలమయ్యారు. కశ్మీర్ ప్రజలు దృష్టిలో ఒమర్ అబ్దుల్లా.. మహాత్మా గాంధీ లేదా సుభాష్ చంద్రబోస్ కాలేదు. మెహబూబా ముఫ్తీ రజియా సుల్తాన్ లేదా మయన్మార్‌కు చెందిన ఆంగ్ సాన్ సూకీ కాలేకపోయారు. తోలుబొమ్మలు, రబ్బరు స్టాంపులుగా మిగిలి పోయారు.2019లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన ఆరోపణలపై రషీద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. జమ్ము కశ్వీర్ ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబర్ 10న తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు ఆయను అక్టోబర్ 2 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలో రషీద్ ఒమర్ అబ్దుల్లాపై విజయం సాధించారు.చదవండి: ఎన్నికల వేళ.. హర్యానా బీజేపీలో ట్విస్ట్! -
అఫ్జల్ గురుకు పూల మాల వేయాలా?: రాజనాథ్ సింగ్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపుతోందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. జమ్ము కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం ఓ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.‘నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉగ్రవాదుల పట్ల సానూభూతి ప్రదర్శిస్తోంది. ఇటీవల పార్టీకి చెందిన నేత ఒమర్ అబ్దుల్లా పార్లమెంట్ మీద దాడి చేసిన దోషి అఫ్జల్ గురుకు మరణశిక్ష విధించటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. నేను ఒమర్ అబ్దులా అడుగుతున్నా.. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష బదులుగా పూలమాల వేయమంటారా?. ఆ పార్టీ జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌న పునరుద్ధరిస్తామని చెబుతోంది. ...కానీ, గత ఐదేళ్లలో రాష్ట్రంలో 40వేల ఉద్యోగాలు కల్పించాం. జమ్ము కశ్మీర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ప్రజలు భారత్‌లో భాగం కోరుకునే స్థాయిలో మేము కశ్మీర్‌ను అభివృద్ధి చేస్తాం. పీవోకేలోని ప్రజలను పాకిస్తాన్ విదేశీలుగా చూస్తే.. భారత్ తమ సొంతవారిగా చూస్తుంది’ అని అన్నారు. ఇక.. జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.చదవండి: అఫ్జల్ గురు ఉరిశిక్ష వల్ల ప్రయోజనం లేదు: ఒమర్ అబ్దుల్లా -
అఫ్జల్ గురు ఉరిశిక్ష వల్ల ప్రయోజనం లేదు: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. 2001లో పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన ఘటనలోని దోషి అఫ్జల్‌గురుకు మరణశిక్ష విధించటంలో ఎటువంటి ప్రయాజనం లేదని అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.‘అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించటంపై జమ్ము కశ్మీర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో శిక్ష విధించాల్సి ఉండేది. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష వేయటంపై వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరులేదని నమ్ముతున్నా. ఉరిశిక్ష విధించడాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే కోర్టులు సైతం వందశాతం సరైన తీర్పులు వెల్లడిస్తాయని భావించలేము. మాకు సాక్ష్యాలను పదేపదే చూపించారు. ఇలా ఉరి శిక్ష విధించటాన్ని మాత్రం ఇతర దేశాలు సమర్థించలేదు’ అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలవేళ ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీ ఎన్నికల్లో గందర్బాల్, బుద్గామ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాలలోను విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.డిసెంబర్13, 2001న పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్ గురుకు మరణశిక్ష విధించాలంటూ సెప్టెంబర్ 26, 2006న సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. అనంతరం రాష్ట్రపతి క్షమాభిక్షకు ప్రయత్నించినప్పటికీ అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అఫ్జల్ గురు కుటుంబం అభ్యర్థనను తిరస్కరించారు.దీంతో ఫిబ్రవరి 9, 2013న ఢిల్లీలోని తిహార్ జైలులో అఫ్జల్ గురుకి మరణశిక్ష అమలుచేశారు. -
ఢిల్లీ నేతలకు నేనంటే ద్వేషం : ఒమర్
శ్రీనగర్: జమ్మూకశీ్మర్‌లో ఎన్నికల వేళ బీజేపీ అగ్రనాయకత్వంపై నేషనల్ కాన్ఫెరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పరోక్ష విమర్శలు చేశారు. శుక్రవారం గాందర్బల్ అసెంబ్లీ స్థానంలో ఎన్నికల ప్రచారంలో ఒమర్ మాట్లాడారు. ‘‘ ఢిల్లీలో ఉన్న నేతలకు నేనంటే ద్వేషం. ఎన్నికల్లో ఓడించి నా నోరు మూయించాలని చూస్తున్నారు. పని గట్టుకుని స్వతంత్య అభ్యర్థులను నాపై పోటీకి నిలుపుతున్నారు. నన్ను ఓడించి చట్టసభల్లో నా గొంతు వినపడకుండా చేయాలని కుట్ర పన్నారు. ఢిల్లీ నేతలపై నేను పోరాడుతున్నది నా కోసమో, నా కుటుంబం కోసమో కాదు. జమ్మూకశ్మీర్ పౌరుల కోసం. నేనేం మాట్లాడిన ప్రజల గొంతుక వినిపిస్తా’’ అని ఒమర్ అన్నారు. -
జమ్ములో భావసారూప్య పార్టీలతో కూటమికి కాంగ్రెస్ సై
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) వేగంగా సిద్ధమవుతోంది. సోమవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ హామీలిచ్చింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్ 18, 25, అక్టోబరు 1వ తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ కు 1953కు ముందున్న స్వయం ప్రతిపత్తిని కోరతామని ఎన్సీ మేనిఫెస్టో పేర్కొంది. ఈ మేరకు 2000 జూన్‌లో ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగా.. అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి సారథ్యంలో కేంద్ర కేబినెట్ దీన్ని తిరస్కరించింది. 2019లో నరేంద్ర మోదీ సర్కారు ఆరి్టకల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్ర హోదా తొలగించి జమ్మూకశీ్మర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. రాజకీయ ఖైదీలకు క్షమాభిక్ష కోరతామని, కశీ్మరి పండిట్లు గౌరవప్రదంగా తిరిగి వచ్చేలా చూస్తామని మేనిఫెస్టోలో ఎన్సీ హామీ ఇచి్చంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కరెంటు, నీటి కష్టాల నుంచి ఉపశమనం కలిగిస్తామని పేర్కొంది. పేదలకు ఏడాదికి 12 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చింది. అమలు చేయగలిగిన హామీలను మాత్రమే ఇచ్చామని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మేనిఫెస్టోను విడుదల చేస్తూ అన్నారు. అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హోదాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తొలి సమావేశాల్లో తీర్మానం చేస్తామని ఒమర్ వెల్లడించారు. పేద కుటుంబాలకు చెందిన ప్రతి గృహిణికి నెలకు రూ.5,000 ఆర్థికసాయం అందజేస్తామని, యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేస్తామని మేనిఫెస్టో హామీ ఇచ్చింది. భావసారూప్య పార్టీలతో కూటమికి సిద్ధంజమ్మూకశ్మీర్ కాంగ్రెస్ నూతన చీఫ్ తారిక్ హమీద్ కర్రా శ్రీనగర్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పారీ్ట(పీడీపీ)సంసిద్ధత వ్యక్తం చేశాయని జమ్మూకశీ్మర్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా వెల్లడించారు. ఎన్సీ ఇప్పటికే కేంద్ర నాయకత్వంతో ఈ విషయమై ఇప్పటికే చర్చించినట్లు తనకు తెలిసిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం గత వారం పార్టీ జమ్మూకశీ్మర్ చీఫ్‌గా కర్రాను నియమించింది. సోమవారం న్యూఢిల్లీ నుంచి శ్రీనగర్ చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విషయంలో ఎన్సీ, పీడీపీలు ఇప్పటికే కాంగ్రెస్‌కు పచ్చజెండా ఊపాయన్న తారిక్ అహ్మద్..భావ సారూప్యం కలిగిన ప్రాంతీయ పారీ్టలతో చర్చలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అధిష్టానం ఇప్పటికే ఇందుకోసం ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టే ఉద్దేశంతో కాంగ్రెస్‌ను వీడిన గులాం నబీ ఆజాద్‌తో, ఆయన సొంతపార్టీ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీతో మాత్రం చర్చల ప్రశ్నే లేదన్నారు. రాష్ట్ర హోదా పునరుద్ధరించకుంటే సుప్రీంకు: ఒమర్ కేంద్ర ప్రభుత్వం జమ్మూకశీ్మర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్ధరించకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. ఈ విషయంలో తమదే విజయమని, రాష్ట్ర హోదా సాధించుకుంటామని అన్నారు. తమ పార్టీ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని ఒమర్ చెప్పారు. అదే సమయంలో, ఇతర పార్టీల ఓటు బ్యాంకు చీలి పోయిందని చెప్పారు. ఈ విషయం ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో తేలిపో యిందన్నారు. ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థులతోనే అసలైన ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. -
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదంపై కేంద్రానిదే బాధ్యత: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదం అంతం కాబోతోందని కేంద్ర చెబుతోంది, కానీ అలా జరగుతున్నట్లు తమకు కనిపించటంలేదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘జమ్ము కశ్మీర్లో ఇటీవల దోడా జిల్లాలో జరిగిన ఉగ్రవాద ఘటన మొదటి కాదు. నిజం ఏమింటే.. గత ఏడాది నుంచి ఇక్కడ ఉగ్రవాద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జమ్ములోని పలు ప్రాంతాల్లో కూడా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇక్కడ చోటు చేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వం, పోలీసులు బాధ్యత వహించాలి. ఇప్పటివరకు 55 మంది సైనికులు మృతి చెందారు. ఇలాంటి పరిస్థితులో అసలు ప్రభుత్వం ఏం చేస్తోందని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం మాత్రం తరచూ జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గుతోందని చెబుతోంది. కానీ, ఇక్కడి పరిస్థితిని చూస్తే ఉగ్రవాదం ఇంకా కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. అదీకాక ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఏమాత్రం చర్యలు తీసుకోవటం లేదు. కేంద్రం చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.ఇటీవల జమ్ము కశ్మీర్ ఉగ్రవాదం పెరగడానికి ఇక్కడి ప్రాంతీయ పార్టీల రాజకీయాలే కారణమని డిజీపీ ఆర్ఆర్ స్వైన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. డీజీపీ చేసిన వాఖ్యలను మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ‘డీజేపీ రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. రాజకీయాలను రాజకీయ నాయకులకు వదిలిపెట్టాలి. ఆయన జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదం ఎలా కరికట్టాలో చర్యలు తీసుకోవటంలో దృష్టి పెట్టాలి. డీజీపీగా ఆయన పని.. ఆయన చేస్తే.. మా పని మేము చేస్తాం’అని ఒమర్ అబ్దుల్లా అన్నారు. -
విడాకుల పిటిషన్: మాజీ సీఎం భార్యకు సుప్రీం నోటీసులు
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా దాఖలు చేసిన విడాకుల పిటిషన్లో ఆయన భార్య పాయల్ అబ్దుల్లాకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో తన భార్యతో విడాకులను కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీం కోర్టు ఆశ్రయించగా.. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ అహ్సానుదిన్ అమానుల్లా ధర్మాసనం విచారణ జరిపి ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆయన భార్యకు నోటీసులు జారీ చేసింది.ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే 15 ఏళ్ల నుంచి విడిగా ఉంటున్నారని ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలియజేశారు. ఇన్ని ఏళ్లపాటు విడిగా ఉన్న వారి వివాహం బంధం సజీవంగా లేదని కోర్టుకు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కేసు ఆర్టికల్ 142ను ఉపయోగించి తన క్లైంట్ ఒమర్ అబ్దుల్లాకు విడాకులు మంజూరు చేయాలని కోర్టును కోరారు.2016తో తనకు తన భార్య నుంచి విడాకులు కావాలని ఒమర్ అబ్దుల్లా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. ఆయన చెప్పిన కారణాలు సరైనవి కాదని, నిరూపించాడానికి అవకాశం లేదని విడాకుల పిటిషన్‌ను తిరస్కరిచింది. అనతరం ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించటంతో ఒమర్ అబ్దుల్లా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.ఒమర్ అబ్దుల్లా, పాయల్ ఢిల్లీలోని ఒబేరాయ్‌లో పని చేస్తున్న సమయంలో తొలిసారి కలిశారు. అనంతరం వారు 1, సెప్టెంబర్ 1994న పెళ్లి చేసుకోగా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒమర్ అబ్దుల్లా 2009 నుంచి విడిగానే ఉంటున్నారు. -
నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
శ్రీనగర్: లోక్‌సభ 2024 ఎన్నికలు ఇప్పటికి రెండు దశల్లో పూర్తయింది. ఈనెల 7న మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు, ఐదో దశల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మాత్రమే కాకుండా.. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కూడా ఓటింగ్ జరగనుంది. ఈ తరుణంలో నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ 'ఒమర్ అబ్దుల్లా' జమ్మూ కాశ్మీలోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గానికి గురువారం నామినేషన్ దాఖలు చేశారు.నేషనల్ కాన్ఫరెన్స్ ట్రెజరర్ షమ్మీ ఒబెరాయ్, జమ్మూ & కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జీఎన్ మోంగాతో పాటు ఒమర్ అబ్దుల్లా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈయన పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజాద్ లోన్‌తో పోటీపడనున్నట్లు తెలుస్తోంది. పీడీపీ ఈ స్థానం నుంచి రాజ్యసభ మాజీ ఎంపీ మీర్ ఫయాజ్ను బరిలోకి దింపింది.నామినేషన్ వేయడానికి మే 3 చివరి తేదీ. కాగా మే 20న పోలింగ్ జరగనుంది. బారాముల్లాలో విలేకరులతో మాట్లాడుతూ.. పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కట్టుబడి ఉంటే.. తాను తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటానని చెప్పారు.నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడైన ఒమర్ అబ్దుల్లా 2009 తర్వాత తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా దక్కే వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన ప్రమాణం చేశారు. దీంతో సుమారు 20 సంవత్సరాల తరువాత మళ్ళీ లోక్‌సభ ఎన్నికల బరిలో అడుగుపెట్టారు. -
‘ఆర్టికల్ 370 రద్దుపై ఓటుతో కేంద్రానికి సందేశం పంపండి’
శ్రీనగర్: 2024 లోక్‌సభ ఎన్నికలు జమ్మూ కశ్మీర్‌కు చాలా ముఖ్యమైనవని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ ఎన్నికల ద్వారా కేంద్రానికి కశ్మీర్ ప్రజలు ఒక ప్రశ్నకు గట్టి సమాధానం ఇవ్వాలని తెలిపారు. ఎన్నికల ద్వారా 5 ఆగస్టు, 2019 రోజున కేంద్రంలోని బీజేపీ తీసుకున్న నిర్ణయం సరైందా?.. కాదా? అనేది తెలియజేయాలన్నారు. బుధవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఒమర్ అబ్దుల్లా పాల్గొని మాట్లాడారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తి మీది తీసుకున్న నిర్ణయం సరైందే అనిపిస్తే.. నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఓటు వేయకండి. మీ జీవితాలు గతం కంటే మేరుగ్గా మారినట్లు భావిస్తే మాకు ఓటు వేయకండి. కేంద్రం తీసుకున్న నిర్ణయం మనకు ఏమాత్రం ఆమెదయోగ్యం కాదని మీ ఓటు ద్వారా కేంద్రంలోని బీజేపీకి సందేశం పంపండి. 5, ఆగస్టు 2019న కేంద్రం తీసుకున్న నిర్ణయం అన్యాయమని భావిస్తే నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఓటు వేయండి. నిరసన చేపట్టడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఓటు ద్వారా కేంద్రానికి స్పష్టమైన సందేశం పంపాలి. మనం శాంతిని దూరం చేసే రాళ్లు విసిరే యువత కాదు. మనం శాంతిని నెలకొల్పడం కోసం త్యాగాలు చేసిన వాళ్లం’ అని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. లోకసభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మూడు స్థానాల్లో పోటీ చేస్తోంది. శ్రీనగర్, బారాముల్లా, అనంత్‌నాగ్ పోటీ చేయగా.. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి జమ్ములోని రెండు స్థానాలు దక్కాయి. అయితే పీడీపీ పార్టీ ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ తాము ఒంటిరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించటం గమనార్హం. అయితే పొత్తులో భాగంగా అనంత్ నాగ్ స్థానాన్ని తమకు కేటాయించాల్సిందిగా పీడీపీ డిమాండ్ చేసింది. ఈ ప్రతిపాదనపై నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే అక్కడి నుంచి పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పోటి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జమ్ము కశ్మీర్లో ఏప్రిల్ 19నుంచి మే 20 వరకు ఐదు దఫాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. -
‘బీజేపీకి ఒమర్ అబ్దుల్లా సవాల్.. ఎన్నికలు నిర్వహించండి’
ముంబై: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ జమ్ము కశ్మీర్లో అభివృద్ధి, శాంతి స్థాపనకు కృషి చేశామని చెప్పుకోవటాన్ని తప్పుపట్టారు. ముంబైలో 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సమ్మిట్‌లో ఒమర్ అబ్దుల్లా పాల్గొని మట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘంతో కాకుండా సుప్రీం కోర్టుతో జమ్ము కశ్మీర్ ఎన్నికల నిర్వహిస్తామని చెప్పించటం బీజేపీకి సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. తమ పార్టీ జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘2019 తర్వాత ఐదేళ్లు గడుస్తోంది. ఇప్పటికీ జమ్ము కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించకపోవటం సిగ్గుచేటు. 2024లో జమ్ము కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలి. మేము బీజేపీతో పోరాడుతాం. జమ్ము కశ్మీర్ ప్రజలు హక్కులు, భూములు, 2019లో దెబ్బతిన్న కశ్మీర్‌ను మరల యథాస్థానానికి తీసుకురావటానికి పోరాడుతాం’ అని అన్నారు. ‘ఈ ప్రభుత్వం సామాన్య ప్రజలకు చేరువలో లేదు. మేము 2014 నుంచి ఎన్నికలు చూడలేదు. 2019 తర్వాత కశ్మీర్ ప్రజల్లో శాంతి స్థాపన జరిగే మరి ఎందుకు ఎన్నికలు నిర్వహించరు?. 2024లో ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేస్తున్నా’ అని ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. ఇక.. ఇప్పటికే ఇండియా కూటమిలో పొత్తులేకుండా తమ జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ లోక్‌సభ ఎన్నికలో ఒంటరిగా పోటీ చేస్తుందని ఫరూక్ అబ్దుల్లా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ సీట్ల కేటాయింపుల విషయంలో 3-3 ఫార్ములతో నేషనల్ కాన్ఫరెన్స్‌తో ఒప్పించేందుకు కసరత్తు చేస్తోంది. -
కశ్మీర్లో సీట్ల సర్దుబాటు: ఒమర్ అబ్దుల్లాతో చర్చించనున్న కాంగ్రెస్
లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమితో పొత్తు లేకుండా తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఇటీవల జమ్మూకశ్మీర్‌కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి మూడు స్థానాల్లో పోటీకి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ 3-3 సీట్ల పంపకం ఫార్మూలాను ప్రతిపాదించింది. అయితే ఈ విషయంపై ఈరోజు (శుక్రవారం) నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రతిపాదనకు నేషనల్ కాన్ఫరెన్స్ అంగీకరిస్తే.. మెహబూబా ముఫ్తికి చెందిన పీడీపీ పార్టీకి పొత్తులో చోటు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. పీడీపీ కూడా ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షం కావటం గమనార్హం. అయితే ఫిబ్రవరి 15న ఫరూక్ అబ్దుల్లా తాము లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రకటన అనంతరం.. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మాత్రం తమ పార్టీ ఇండియా కూటమితో పొత్తుకు కట్టుబడి ఉందని తెలిపారు. జమ్మూలో రెండు, లడఖ్‌లో ఒక స్థానంలో తమ పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పారు. ఇక మరోవైపు పీడీపీ ఇండియా కూటమి నుంచి వైదొలిగి తన పార్టీ కూడా ఒంటరిగా బరిలోకి దిగుతుందని వార్తలు వచ్చాయి. వాటిపై ఆమె స్పందిస్తూ.. తాను ఇండియా కూటమితోనే ఉంటానని స్పష్టం చేశారు. -
నేషనల్ కాన్ఫరెన్స్ యూ టర్న్
శ్రీనగర్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కొనే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ దూరమవుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్ని కల్లో తమ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగు తుందని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా గురువారం ప్రకటించారు. కొద్దిసేపటికే పార్టీ నేత, ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా అలాందేమీ లేదంటూ ప్రకటించారు. ఇండియా కూటమిలోనే కొనసాగుతామని జమ్మూకశ్మీర్‌లోని ఎంపీ స్థానాల్లో పోటీపై భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కశ్మీర్ లోని అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీ ఇండియా కూటమితోపాటు ప్రాంతీయ గుప్కార్(పీఏజీడీ) అలయెన్స్‌లోనూ కీలకంగా ఉంది. -
మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడాకులపై కోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ఆయన భార్య పాయల్ అబ్ధుల్లా నుంచి విడాకులు మంజూరు చేసేందుకు ఢిల్లీ హై కోర్టు నిరాకరించింది. ఒమర్ అబ్దుల్లా విడాకుల పిటిషన్‌ను కొట్టివేస్తూ ఫ్యామిలీ కోర్టు తీసుకున్న నిర్ణయం సరైనదేనని హై కోర్టు వ్యాఖ్యానించింది. ఒమర్ అబ్దుల్లాపై ఆయన భార్య చూపిన క్రూరత్వం ఏమీ లేదని అందుకే విడాకుల మంజూరు కుదరదని తేల్చి చెప్పింది. ‘ఒమర్ అబ్దుల్లా పిటిషన్లో క్రూరత్వానికి సంబంధించిన ఆరోపణలు స్పష్టంగా లేవు. వాటికి పెద్దగా ఆధారాలు లేవు. కింది కోర్టు తీర్పుపై వేసిన అప్పీల్ పిటిషన్లో ఎలాంటి మెరిట్స్ లేవు. అందుకే ఈ అప్పీల్‌ను డిస్మిస్ చేస్తున్నాం’అనిజస్టిస్ సంజీవ్ సచ్దేవ,జస్టిస్ వికాస్ మహాజన్లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ ఇప్పటికే విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒమర్ అబ్దుల్లా విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు. పాయల్ రాజస్థాన్ కాంగ్రెస్ అగ్రనేత సచిన్ పైలట్ చెల్లెలు కావడం విశేషం. ఇదీచదవండి..నా పై దాడికి సీఎం కుట్ర: గవర్నర్ సంచలన ఆరోపణలు -
Article 370: సుప్రీం కోర్టు తీర్పుపై నిరుత్సాహ పడం: మెహబూబా ముఫ్తీ
సాక్షి, ఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ, ఆ పార్టీ నేతలు స్వాగతించగా కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు, పలువురు నేతలు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ.. సుప్రీం కొర్టు తీర్పుకు నిరుత్సాహ పడటం లేదు. ఈ విషయంలో జమ్ము కశ్మీర్ ఎన్నో ఒడిదుడుకులు చూసింది. 370 నిబంధన తాత్కాలికమన్న వ్యాఖ్యలతో తాము ఓడిపోనట్లు కాదు. ఇది భారత దేశ ఆలోచనల ఓటమి. #WATCH | On SC verdict on Art 370 in J&K, PDP chief Mehbooba Mufti says, "...We should not be disheartened... J&K has seen several ups and downs... SC's verdict stating Article 370 was a temporary provision, is not our defeat, but the defeat of the idea of India... I want to say… pic.twitter.com/moTm2HPzpO — ANI (@ANI) December 11, 2023 ప్రస్తుతం జమ్ము కశ్మీర్ జైలులా మారింది. దుకాణాలు ఉదయం 10 గంటలలోపు తెరవద్దని ఆదేశించారు. మేము అంతా గృహ నిర్భందంలో ఉన్నాం. ఏళ్ల నుంచి కొనసాగుతున్న రాజకీయం యుద్ధం ఇది. మేము ఇక్కడి నుంచి వెళ్లము. మీమంతా ఏకమై.. కలిసిపోరాడుతాం’అని తెలిపారు. డొమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ... సుప్రీకోర్టు తీర్పు చాలా విచారకరం, దురదృష్టకరమైందని తెలిపారు. కానీ సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు. On SC verdict on Article 370, National Conference leader Omar Abdullah says, "We had knocked on the doors of the Supreme Court because we were hoping for justice...We respect the Supreme Court...Our attempts will not end here. Will we approach the courts again? We will decide… pic.twitter.com/eWWbPhY9Pp — ANI (@ANI) December 11, 2023 అదే విధంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘న్యాయం కోసం ఆశించి సుప్రీంకోర్టు ఆశ్రయించాం. మాకు న్యాయం దక్కుతుందని ఆశించాం. అయితే సుప్రీం కోర్టుపై మాకు గౌరవం ఉంది. మా ప్రయత్నాలు ఇక్కడితో ఆగిపోతాయా? మళ్లీ కోర్టులను ఆశ్రయిస్తామా? అనే దానిపై న్యాయ సంప్రదింపుల అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. -
రాహల్ జోడో యాత్రకు సడెన్ బ్రేక్! కేవలం కిలోమీటర్ తర్వాతే..
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టి భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం జమ్ముకాశ్మీర్‌లోని బనిహాల్‌లో సాగుతున్న రాహుల్ యాత్రలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్పీ) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దల్లా పాల్గొన్నారు. ఈ మేరకు ఒమర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఈ భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఇమేజ్ను పెంచడం కోసం కాదని, దేశంలోని పరిస్థితిని మార్చడం కోసమేనని చెప్పారు. అందువల్లే తాను ఈ యాత్రలో పాల్గొన్నట్లు వివరించారు. ఈ యాత్రను గాంధీ వ్యక్తిగత కారణాలతో ప్రారంభించలేదని, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించి, మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో చేస్తున్న యాత్రగా అభివర్ణించారు. ఈ ప్రభుత్వం అరబ్ దేశాలతో స్నేహం చేస్తున్నప్పటికీ దేశంలోని అతిపెద్ద మైనారిటీ నుంచి ఒక్కరూ కూడా ప్రభుత్వంలో ప్రతినిధులుగా లేరని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రస్తావిస్తూ..దీని పునరుద్ధణ కోసం కోర్టులో పోరాడతాం అన్నారు. ఈ సందర్భంలో ఆ రాష్ట్రంలోని ఎన్నికలు జరిగి ఎనిమిదేళ్లు పూర్తయిందని, చివరి అసెంబ్లీ ఎన్నికలు 2014లో జరిగాయన్నారు. రెండు ఎన్నికల మధ్య ఈ గ్యాప్ చాలా ఎక్కువే అని చెప్పారు. తీవ్రవాదం ఉధృతంగా ఉన్నప్పుడూ కూడా జరగలేదన్నారు. ఈ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఎన్నికలు కోసం అడుక్కోవాలని కోరుకుంటోందని అన్నారు. అయినా తాము బిచ్చగాళ్లం కాదని దాని కోసం తాము అడుక్కోమని తేల్చి చెప్పారు. కాగా ఈ యాత్రలో ఇరు నాయకులు ఒకేలాంటి టీషర్ట్‌ల ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. యాత్రకు బ్రేక్ చక్కగా సాగిసోతున్న రాహుల్ జోడో యాత్రకు సడెన్ బ్రేక్ పడింది. ఆయన భద్రతా దృష్ట్యా అనుహ్యంగా రద్దైంది. ఈ రోజు రాహుల్ జోడో యాత్రలో 11 కిలోమీటర్లు నడవాల్సి ఉండగా ..కేవలం కిలోమీటర్ తర్వాత ఆగిపోవాల్సి వచ్చింది. ఐతే కాశ్మీర్లో ఆయన కోసం ఊహించని విధంగా ప్రజలు ఎదురు చూస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. భద్రతా సిబ్బందిని ఆకస్మికంగా ఉపసంహరించుకోవడంతో తీవ్రమైన భద్రతా ఉల్లంఘనకు కారణమైందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపణలు చేశాయి. రాహుల్ శ్రీనగర్‌కు సమీపంలోని బనిహాల్ టన్నెల్ దాటిన తర్వాత పెద్ద ఎత్తున భారీ జన సముహం రావడంతో దాదాపు 30 నిమిషాల పాటు రాహుల్ కదలేకపోయినట్లు తెలిపాయి, అదీగాక అక్కడ తగిన విధంగా భద్రత లేకపోవడంతోనే యాత్ర ఆపేయవలసి వచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే గాంధీని భద్రతా వాహనంలో తీసుకెళ్లి యాత్రను విరమింపజేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి ఈ యాత్రలో రాహుల్ గాంధీ, ఒమర్ అబ్దుల్లాల భద్రతకు సంబంధించి తగిన సంఖ్యలో పోలీసుల లేరని, తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నట్లు సమాచారం. (చదవండి: ప్రధాని మోదీని ప్రశ్నించిన తెలంగాణ విద్యార్థిని) -
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కూలిపోవడం చూస్తుంటే బాధగా, భయంగా ఉంది
శ్రీనగర్: కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ సభ్యుత్వానికి, పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా భారత్‌లోని ఒక ప్రముఖ గ్రాండ్ ఓల్డ్ పార్టీ కూలిపోడం చూస్తుంటే బాధగానూ, భయంగానూ ఉందని ఆవేదనగా అన్నారు. గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్‌కి రాజీనామా చేయడం పార్టీకి అతి పెద్ద శరాఘాతంగా ఆయన అభివర్ణించారు. గత కొంతకాలంగా ఆజాద్ రాజీనామ చేస్తున్నారంటూ పుకార్లు వచ్చాయి. ఇలాంటి రాజీనామాలు కాంగ్రెస్‌కి కొత్తేం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీలోని అతి సీనియర్ నాయకుడైన గులామ్ నబీ ఆజాద్ రాజీనామ చేయడం మాత్రం పార్టీకి తీరని లోటుగా పేర్కొన్నారు. అంతేకాదు పార్టీ నుంచి వైదొలగిన అత్యంత సీనియర్ నాయకుడు గులామ్ నబీ అజాద్ రాజీనామా లేఖ చదవడం చాలా బాధకరం అని ఆయన ట్వీట్ చేశారు. Long rumoured to be in the offing but a body blow to the Congress none the less. Perhaps the senior most leader to quit the party in recent times, his resignation letter makes for very painful reading. It’s sad, and quite scary, to see the grand old party of India implode. https://t.co/Z6gj9AophE — Omar Abdullah (@OmarAbdullah) August 26, 2022 (చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి ఆజాద్ రాజీనామా.. రాహుల్‌పై ఫైర్) -
టీమిండియాలో ఉమ్రాన్.. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఆసక్తికర ట్వీట్
దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 18 సభ్యుల టీమిండియాను ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో ఐపీఎల్ 2022 స్పీడ్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్, పంజాబ్ యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తొలిసారి చోటు దక్కించుకున్నారు. ప్రస్తుత సీజన్లో వేగంతో పాటు వికెట్లు కూడా సాధించి ఐదో అత్యధిక వికెట్ టేకర్‌గా (14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు) నిలిచిన ఉమ్రాన్‌ను దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయాలని భారీ స్థాయిలో డిమాండ్లు వినిపించిన నేపథ్యంలో సెలెక్టర్లు కశ్మీరీ పేసర్‌కు అవకాశానిచ్చారు. ఈ సీజన్లో నిలకడైన పేస్‌తో బుల్లెట్లలాంటి బంతుల్ని సంధించిన ఉమ్రాన్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని (157 కిమీ) విసిరి రికార్డు సృష్టించాడు. Well done Umran Malik. We will be watching the forthcoming T20 series against the Proteas very keenly. https://t.co/KdoAfflAdZ — Omar Abdullah (@OmarAbdullah) May 22, 2022 ఇదిలా ఉంటే, ఉమ్రాన్ మాలిక్ టీమిండియాకు ఎంపిక అయిన నేపథ్యంలో అతని సొంత రాష్ట్రపు మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించాడు. తొలిసారి టీమిండియాకు ఎంపికైన ఉమ్రాన్‌కి అభినందనలు తెలిపిన అబ్దుల్లా.. సన్‌రైజర్స్ స్పీడ్ గన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. త్వరలో ప్రారంభమయే దక్షిణాఫ్రికా సిరీస్‌ను చాలా ఆసక్తిగా అనుసరిస్తామని ట్విటర్ వేదికగా తన సందేశాన్ని పంపాడు. కాగా, ప్రొటీస్‌తో సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చి ఉమ్రాన్, అర్ష్‌దీప్‌లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సఫారీలతో టీ20 సిరీస్ జూన్ 9 నుంచి 19వ తేదీ వరకు జరగనుంది. చదవండి: Ind Vs SA: వాళ్లందరికీ అవకాశం.. మీరు పశ్చాత్తాపపడక తప్పదు! జరిగేది ఇదే! -
The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ సినిమాపై సంచలన ఆరోపణలు
ది కశ్మీర్ ఫైల్స్ సినిమా సంచలనాలతో పాటు రాజకీయ పరమైన చర్చలకూ నెలవైంది ఇప్పుడు. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, సినిమా కలెక్షన్లు సంగతి పక్కనపెడితే.. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా కశ్మీర్ ఫైల్స్ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇక విమర్శలకతీతంగా.. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై ప్రశంసలు గుప్పిస్తున్నారంతా. మరోపక్క విపక్షాలు సినిమాపై తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా The Kashmir Files అబద్ధాలు చూపించిందని సెటైర్లు గుప్పించారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సైతం సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా ఈ అంశంపై వీడియో పోస్ట్‌తో ఓ ట్వీట్ చేశారు. #kashmirifiles this propaganda film … is it healing wounds or sowing seeds of hatred and inflicting wounds #Justasking pic.twitter.com/tYmkekpZzA — Prakash Raj (@prakashraaj) March 18, 2022 ఇదిలా ఉండగా.. ఎన్డీఏ భాగస్వామి నేత ఒకరు కశ్మీర్ ఫైల్స్‌పై సంచలన ఆరోపణలకు దిగారు. ఎన్డీఏ కూటమిలో భాగమైన Hindustani Awam Morcha వ్యవస్థాపకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ సంచలన ఆరోపణలు చేశారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా మేకర్లకు ఉగ్రవాద సంబంధిత గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు ఆయన. फिल्म के नाम पर जो माहौल बनाया जा रहा है, उससे हिन्दु-मुस्लिम सहित विभिन्न धर्मों के बीच खाई और बढ़ेगी, जो किसी भी प्रकार से देशहित में नहीं है। — Ashok Gehlot (@ashokgehlot51) March 17, 2022 ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు బీహార్‌లో ట్యాక్స్ మినహాయింపు ప్రకటించింది ప్రభుత్వం. ఆ మరునాడే జితన్ మాంఝీ విమర్శలు గుప్పించడం విశేషం. ‘‘ఈ మూవీ కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్‌కు తిరిగి రాకుండా వారిలో భయాందోళనలు రేకెత్తించేందుకు ఉగ్రవాద సంస్థల కుట్రగా కనిపిస్తుంద’’ని ట్వీట్ చేశారు మాంఝీ. అంతేకాదు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రితో సహా కశ్మీర్ ఫైల్స్ చిత్ర యూనిట్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉండొచ్చన్న మాంఝీ.. ఈ విషయంపై సీరియస్‌గా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. “द कश्मीर फाइल्स”आतंकवादियों की एक गहरी साजिश भी हो सकती है,जिसे दिखाकर आतंकी संगठन कश्मीरी ब्राम्हण मे खौफ एवं डर का माहौल बना रहें हैं ताकि डर से कश्मीरी ब्राम्हण पुनः कश्मीर ना जा पाएं। “द कश्मीर फाइल्स”फिल्म यूनिट सदस्यों के आतंकी कनेक्शन की जांच होनी चाहिए। .@AnupamPKher — Jitan Ram Manjhi (@jitanrmanjhi) March 18, 2022 इबादतों और बख्शीश की रात शब-ए-बारात की दिली मुबारकबाद। अल्लाह से दुआ है कि वह हम सभी की गलतियों को माफ कर हमारी अर्जियां कबूल फरमाएं। — Jitan Ram Manjhi (@jitanrmanjhi) March 18, 2022 ఇదిలా ఉండగా.. ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి వై కేటగిరీ భద్రతను అందించింది కేంద్రం. కశ్మీర్ ఫైల్స్ విడుదల అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆయనకు బెదిరింపులు వస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే ఏడు నుంచి ఎనిమిది సీఆర్పీఎఫ్ కమాండోలు ఆయనకు భద్రత కల్పించనున్నారు. -
గుప్కార్ నేతల గృహనిర్బంధం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనలకు నిరసనగా ర్యాలీ తలపెట్టిన ముగ్గురు మాజీ సీఎంలు సహా గుప్కార్ కూటమి రాజకీయ నేతలను పోలీసులు శనివారం గృహనిర్బంధంలో ఉంచారు. ‘గుడ్‌మార్నింగ్, 2022కు స్వాగతం. సాధారణ ప్రజాస్వామ్య కార్యకలాపాలకు భయపడిన జమ్మూకశ్మీర్ పోలీసులు చట్టవిరుద్ధంగా మళ్లీ ప్రజలను గృహనిర్బంధం చేశారు’అంటూ నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా శనివారం ఉదయం ట్విట్టర్లో పేర్కొన్నారు. తన తండ్రి, మాజీ సీఎం ఫరూక్ ఇంటి లోపలి గేటును పోలీసులు మూసివేశారన్నారు. మరో మాజీ సీఎం మెహబూబా ముఫ్తీని పోలీసులు నిర్బంధంలో ఉంచారు. -
‘తాలిబన్ ఉగ్రవాద సంస్థా? కాదా? సమాధానం చెప్పాలి’
జమ్మూ కశ్మీర్: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లతో భారత్ జరిపిన చర్చలను జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఓమర్ అబ్దుల్లా తప్పుపట్టారు. ఆయన బుధవారం మీడియాతో మట్లాడుతూ.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు. తాలిబన్లను ఉగ్రవాద సంస్థగా కేంద్రం పరిగణిస్తుందా? లేదా? అని సూటిగా ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్రం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తాలిబన్ ఉగ్రవాద సంస్థ అయితే మంగళవారం వాళ్లతో ఎందుకు చర్చలు జరిపారని మండిపడ్డారు. తాలిబన్లు ఉగ్రవాదులు కాకపోతే.. ఐక్యరాజ్య సమితికి వెళ్లి ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించాలని చెప్పగలరా? అని నిలదీశారు. చదవండి: Afghanistan Cinema: అఫ్గన్ థియేటర్ల మూత, బాలీవుడ్‌కు ఆర్థిక ముప్పు ఈ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని ఓమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. కేంద్రం తాలిబన్లను ఉగ్రవాదులుగా పరిణిస్తున్న క్రమంలో ఎందుకు చర్చలు జరిపారో సమాధానం చెప్పాలన్నారు. మంగళవారం తాలిబన్ నేత షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్‌తో ఖతార్‌లో భారత్ రాయబారి దీపక్ సమావేశమైన విషయం తెలిసిందే. అఫ్గాన్ గడ్డపై భారత వ్యతిరేకశక్తులను అడ్డుకోవడం, భారతీయుల స్వదేశానికి రాక తదితర అంశాలు చర్చకొచ్చాయి. తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తాలిబన్లు హామీ ఇచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. చదవండి: Taliban Attack On Panjshir: 8 మంది తాలిబన్లు మృతి! -
భారత్‌కు ముప్పేమీ లేదు: ఒమర్ అబ్దుల్లా
పటాన్చెరు: అఫ్గానిస్తాన్‌లో తాజా పరిణామాల వల్ల దేశానికి ఎలాంటి ముప్పూ లేదని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అఫ్గాన్‌పై తాలిబన్లు పట్టు సాధించడం వల్ల భారత్‌కు ఎలాంటి నష్టం ఉండబోదన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని గీతం యూనివర్సిటీ ప్రముఖ రాజకీయవేత్తలతో చేపట్టిన చర్చా వేదికలో సోమవారం ఆయన ‘పాలసీ మేకింగ్ ఇన్ నేషన్ బిల్డింగ్’అంశంపై మాట్లాడారు. ‘గీతం’లో కొత్తగా ప్రారంభించిన మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ కోర్సులో చేరిన 48 మంది విద్యార్థులతో ముచ్చటించారు. మీరే ప్రధాని అయితే అఫ్గానిస్తాన్‌లో తాజా పరిణామా లపై ఎలా స్పందిస్తారని ఓ విద్యార్థి అడగ్గా ‘మానవతా దృక్పథంతో ఎక్కువ మంది అఫ్గాన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించే వాడిని’అని బదులిచ్చారు. తనకు ప్రధాని అయ్యే అలోచనలేవి లేవని కూడా ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీ ఉచ్చులో ప్రతిపక్షాలు: కేంద్రంలోని అధికార పార్టీ ఉచ్చులో ప్రతిపక్షాలు ఇరుక్కుపోతున్నాయని, ఫలితంగా లోపభూయిష్టమైన చట్టాలు అమల్లోకి వస్తున్నాయని ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. అంతకుముందు జరిగిన మరో చర్చలో ఒవైసీ మాట్లాడారు. -
కశ్మీరీల్లో అపనమ్మకాన్ని తొలగించాలి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హోదాను బలవంతంగా తీసేయడంతో కశ్మీరీల్లో నెలకొన్న అపనమ్మకాన్ని కేంద్రప్రభుత్వం తొలగించాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూఖ్ అబ్లుల్లా సూచించారు. విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రతిపత్తి కల్పనతోపాటు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ముందుగానే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను ఇవ్వాలని ఆ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా కోరారు. కశ్మీర్లో రాజకీయాలకు పునరుజ్జీవం పోసేందుకు ప్రధాని మోదీతో అఖిలపక్ష సమావేశంలో తమ డిమాండ్లను స్పష్టం చేశాక శ్రీనగర్ చేరుకున్న ఫరూఖ్, ఒమర్‌లు శనివారం మీడియాతో మాట్లాడారు. తదుపరి కార్యాచరణ వివరాలను తమ పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) సభ్యులతో మాట్లాడాకే వెల్లడిస్తామని వారు చెప్పారు. ‘జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తిపై నాడు జవహర్ లాల్ నెహ్రూ ప్రజాభిప్రాయం ద్వారా సాకారం చేస్తానని మాటిచ్చి తర్వాత వెనకడుగు వేశారు. ఆ తర్వాత ప్రధాని పీవీ నరసింహారావు సైతం పార్లమెంట్ సాక్షిగా మాటిచ్చారు. మేమెన్నడూ స్వాతంత్య్రం కావాలని అడగలేదు. స్వతంత్ర ప్రతిపత్తే కావాలన్నాం. ఇప్పుడు అదెక్కడుంది?. రాష్ట్ర హోదా తీసేసి కశ్మీరీల్లో ఉన్న నమ్మకాన్ని కేంద్రం పోగొట్టుకుంది. ఇక మీదటైనా కేంద్ర ప్రభుత్వం నమ్మకం పెరిగేలా ఏదైనా చేస్తుందేమో చూస్తాం’ అని ఫరూఖ్ మీడియాతో అన్నారు. గుప్కార్ అలయన్స్‌కు ఇక ముగింపు పలకనున్నా రనే వాదనలను ఆయన కొట్టిపారేశారు. ‘నియోజక వర్గాల పునర్విభజన పూర్తయ్యాక ఎన్నికలు జరిపి ఆ తర్వాతే రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్రం చెబుతోంది. దీనికి మేం అస్సలు ఒప్పకోం. రాష్ట్ర హోదా ఇచ్చాకే ఎన్నికలు పెట్టండి’ అని ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. అఖిలపక్ష భేటీ తర్వాత గుప్కార్ అలయన్స్‌లో ఐక్యత లోపించిందనే వాదనను ఒమర్ తోసిపుచ్చారు. ‘ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే తమ కలను బీజేపీ 70 ఏళ్ల తర్వాత సాకారం చేసుకుంది. మేం కూడా పోరాటంలో విజయం సాధించేందుకు 70 వారాలు.. 70 నెలలు.. అంతకంటే ఎక్కువ కాలం పట్టినా సరే ఎన్నాళ్లయినా పోరాడతాం’ అని ఒమర్ అన్నారు. -
కరోనాతో ఆస్పత్రిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆయన శనివారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని తెలుస్తోంది. అయితే ముందస్తు జాగ్రత్తలో భాగంగా చేరినట్లు ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మార్చి 30వ తేదీన 83 ఏళ్ల ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అప్పటి నుంచి ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అప్పటి నుంచి ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. అయితే వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఈ మేరకు ఫరూక్ శ్రీనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆయన కరోనా వ్యాక్సిన్ పొందిన తర్వాత పాజిటివ్ రావడం గమనార్హం. ‘తన తండ్రి కోసం ప్రతిఒక్కరూ చేస్తున్న ప్రార్థనలు, మద్దతు తెలుపుతున్నందుకు మా కుటుంబం గర్వపడుతుంది’ అని పేర్కొన్నారు. ఫరూక్ అబ్దుల్లా ఆరోగ్యం విషయమై ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయన ఆరోగ్య వివరాలు తెలుసుకుని ఆయన వెంటనే కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. Based on the advice of doctors to enable them to better monitor my father, he has been admitted to hospital in Srinagar. Our family remains grateful to everyone for their messages of support & their prayers — Omar Abdullah (@OmarAbdullah) April 3, 2021 -
ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్
శ్రీనగర్: సీనియర్ రాజకీయనాయకుడు, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా (82) కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ట్వీట్ ద్వారా మంగళవారం తెలియజేశారు. తండ్రికి పాజిటివ్ రావడంతో తానూ ఐసోలేషన్లోకి వెళ్లానని, తనను కలిసిన వారంతా కూడా పరీక్షలు చేయించు కోవాల్సిందిగా సూచించారు. ఫరూక్ కోవిడ్ బారిన పడటంపై ప్రధాని మోదీ స్పందిం చారు. ఆయన త్వరగా కోలుకోవాలని, కుటుంబమంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తు న్నట్లు మోదీ పేర్కొన్నారు. తిరిగి స్పందించిన ఒమర్ అబ్దుల్లా మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ఫరూక్ అబ్దుల్లా ఈ నెల 2న కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. చదవండి: పెళ్లిలో జోష్‌గా స్టెప్పులేసిన కశ్మీర్ మాజీ సీఎం.. -
ఒమర్ అబ్దుల్లా కుటుంబం గృహనిర్బంధం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ పోలీసులు తనని, తన కుటుంబ సభ్యుల్ని, తన తండ్రి ఎంపీ అయిన ఫరూక్ అబ్దుల్లాని గృహ నిర్బంధంలో ఉంచార ని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆదివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. శ్రీనగర్‌లోని గుప్కార్ ప్రాంతం లో తన ఇంటి బయట ఉన్న పోలీసు వాహనా లకు సంబంధించిన ఫోటోల ను కూడా ఆయన షేర్ చేశారు. ‘‘ఆగస్టు, 2019 తర్వాత కనిపిస్తున్న కొత్త కశ్మీర్ ఇది. ఎలాంటి కారణం లేకుండా మమ్మల్ని మా ఇంట్లో ఉంచి తాళాలు వేశారు. పార్లమెంటు సభ్యుడైన నా తండ్రిని కూడా నిర్బంధించడం దారుణం. నా సోదరి, పిల్లల్ని కూడా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు’’ అని ఒమర్ అబ్దుల్లా ఆ ట్వీట్లో వెల్లడించారు. తమ ఇంట్లో పని చేసే సిబ్బం దినెవరినీ కూడా లోపలికి రానివ్వడం లేదని తెలిపారు. ‘‘ఎలాంటి కారణాలు లేకుండానే ఇంట్లో బంధించి ఉంచారు. ఇంటిలో పనులు చేసుకునే వారిని లోపలికి రానివ్వడం లేదు. మీ కొత్త ప్రజాస్వామ్యం అంటే ఇదేనా’’ అని ఒమర్ ప్రశ్నించారు. అయితే పోలీసులు మాత్రం పుల్వామా దాడి జరిగి రెండేళ్లయిన సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా, కొందరు వీఐపీలు, భద్రత కల్పించాల్సిన వారిని గృహనిర్బంధంలో ఉంచినట్టుగా తెలిపారు. వాళ్లు బయటకొచ్చి తిరిగితే ఎలాంటి వ్యతిరేకత వస్తుందోనని అలా చేసినట్టుగా శ్రీనగర్ పోలీసులు అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. -
వైరల్: మైండ్ బ్లోయింగ్ బ్యాలెన్సింగ్
జిమ్నాస్టిక్స్ గేమ్స్ గురించి అందరికీ తెలిసిందే. చైనా, రష్యాలో ఎక్కువగా ప్రాచూర్యం పొందిన ఈ క్రీడ.. అంత సులువైన కాదు. ఎంతో శ్రమతో కూడుకున్నది కావడంతో చాలా తక్కువ మంది దీనిని ఎంచుకుంటున్నారు. ఒక్కోసారి ఈ గేమ్‌లో విజయం సాధించడానికి రోజుల తరబడి ప్రాక్టీస్ చేయకతప్పదు. అయితే ఇలాంటి ఓ గేమ్‌లో సస్సెస్ అయ్యేందుకు ఓ క్రీడాకారుడు పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేశాడు. చివరికి 148వ ప్రయత్నంలో తన లక్ష్యాన్ని చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఫ్రీ స్టయిల్ స్కైయర్ తన ట్విటర్లో షేర్ చేశారు. 148 ప్రయత్నాలు విఫలమయ్యాక 149 వసారి సరిగ్గా వచ్చిందంటూ కామెంట్ చేశారు. ఈ విన్యాసాన్ని ముఖానికి మాస్క్ ధరించి చేయడం మరో ప్రత్యేకం. ఈ వీడియోలో ఎలాంటి పరికరాల సహాయం లేకుండా ముందుగా ఏర్పాటు చేసుకున్న వస్తులను దాటడం ద్వారా ఒక పాయింట్ నుంచి మరొకదానికి చేరుకోవడానికి ఆండ్రీ విన్యాసాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. వీడియో మొత్తం స్కేట్ బోర్డులు, వివిధ వస్తులు, బంతులు, తాడులపై బ్యాలెన్స్ చేస్తూ చివరిగా సరైన ల్యాండింగ్‌ను అందుకున్నాడు. ఈ వీడియోను ఇప్పటికే వేల మంది వీక్షించగా అనేక మంది లైక్ చేశారు. ‘పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధ్యం అవుతుందని నిరూపించాడు. అద్భుతంగా ఉంది’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు .కాగా ఈ స్టంట్‌పై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు కురిపించారు. ఆండ్రీ మెలుకువలను ఆయన ప్రశంసించారు. ఈ బ్యాలెన్సింగ్ క్రేజీగా ఉందంటూ, జీవితాన్ని కూడా ఇలా సమన్వయం చేసుకుంటూ పోవాలనే అర్థం వచ్చేలా రీట్వీట్ చేశారు. -
ముఫ్తీని కలిసిన ఫరూఖ్, ఒమర్
శ్రీనగర్: పద్నాలుగు నెలల నిర్బంధం తరువాత విడుదలైన జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని, మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలు శ్రీనగర్‌లోని ఆమె నివాసంలో కలిసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఫరూఖ్ అబ్దుల్లా గురువారం ఏర్పాటు చేసిన గుప్కర్ డిక్లరేషన్ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పీడీపీ నాయకురాలు ముఫ్తీని కోరామని, అందుకు ఆమె సమ్మతించినట్లు ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఆగస్టు 4, 2019న జరిగిన అఖిల పక్ష సమావేశం గుప్కర్ డిక్లరేషన్ తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ, కశ్మీర్ స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక హోదాను, గుర్తింపులను కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఒక రోజు ముందు జరిగిన సమావేశంలో అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి. ఈ యేడాది ఆగస్టులో సమావేశమైన పార్టీలు తమ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి గురువారం ఏర్పాటు చేయనున్న సమావేశానికి అన్ని పార్టీలను ఫరూఖ్ అబ్దుల్లా ఆహ్వానించారు. నిర్బంధం నుంచి విడుదలైన ముఫ్తీ మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టు 5న అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా మన నుంచి లాగేసుకున్న జమ్మూకశ్మీర్‌ని తిరిగి సాధించుకోవడానికి ప్రతిజ్ఞ పూనాలని అన్నారు. -
త్వరలో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తా..
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్‌లోని గుప్కర్ రోడ్లో తనకు కల్పించిన ప్రభుత్వ వసతి గృహన్ని అక్టోబర్ చివరి నాటికి ఖాళీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది తాను స్వచ్చందంగా తీసుకున్న నిర్ణయమని బుధవారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే గతేడాది ప్రభుత్వ వసతి గృహంలో ఆయన అక్రమంగా ఉంటున్నారని వెంటనే దానిని ఖాళీ చేసి ప్రభుత్వానికి ఆయన అప్పగించాలని జమ్మూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు మీడియాల్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు. దీనిపై జమ్మూ కశ్మీర్ అడ్మిస్ట్రేషన్‌కు ఆయన లేఖ కూడా రాశారు. ‘జమ్మూకశ్మీర్ పరిపాలనకు నా లేఖ. నేను శ్రీనగర్‌లోని నా ప్రభుత్వ వసతిని అక్టోబర్ చివరికి ముందే ఖాళీ చేస్తాను. నేను మీకు తెలియజేయాలనుకుంటుంది ఏమిటంటే నేను తగిన వసతి కోసం అన్వేషణ ప్రారంభించాను. అయితే కరోనా కారణంగా ఆ ప్రక్రియకు ఆలస్యమైంది. అన్ని విధాల సౌకర్వవంతమైన ఇంటి కోసం చుస్తున్నాను. త్వరలో ఇళ్లు దొరకగానే గుప్కర్ ప్రభుత్వ వసతిని ఖాళీ చేస్తాను. దీనికి నాకు 8 నుంచి 10 వారాల సమయం పట్టోచ్చు. అప్పటి వరకు నాకు సమయం ఇవ్వాలని విజ్క్షప్తి’’ అంటూ జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వాన్ని ఆయన విజ్క్షప్తి చేశారు. అంతేగాక ప్రభుత్వ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలన్న ఉద్దేశం తనకు లేదని లేఖలో తెలిపారు. జమ్ము-కశ్యీర్ మాజీ సీఎంల హక్కులలో కొన్ని నెలల క్రితం చేసిన మార్పుల ప్రకారం తాను ఈ వసతి గృహంలో అనధికారికంగా ఉన్నట్లు చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు గతేడాది మీడియాలో వార్తలు ప్రచురితమయ్యాయన్నారు. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని స్ఫస్టం చేశారు. త్వరలో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలన్నది నా స్వంతంగా తీసుకున్న నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిడి లేదన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు శ్రీనగర్ లేదా జమ్మూలోని వసతి గృహల్లో ఉండాలనే ప్రభుత్వ నిబంధనల మేరకే తాను శ్రీనగర్‌లోని వసతి గృహన్ని ఎంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఐపీఎల్ : ఒమర్ అబ్దుల్లా సెటైర్లు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2020)నిర్వహణకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై స్పందించారు. చైనా కంపెనీలు ఐపీఎల్ క్రికెట్ టోర్నీ టైటిల్ స్పాన్సర్లుగా ఉండటంపై అబ్దుల్లా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (10న ‘ఫైనల్’ చేశారు) వివో సహా ఇతర చైనా కంపెనీలను కొనసాగించాలన్న బీసీసీఐ కౌన్సిల్ నిర్ణయంపై ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. ఒకవైపు చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలకు చెబుతారు మరోవైపు చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీలను స్పాన్సర్ కంపెనీలుగా కొనసాగిస్తారంటూ విమర్శలు గుప్పించారు. లడాఖ్ సరిహద్దుల్లో చైనా దళాలు మన భూభాగాల్లోకి చొరబడుతుంటే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్లుగా వీవోను కొనసాగించడంలో అర్థం లేదన్నారు. చైనీస్ మనీ, ఇన్వెస్ట్ మెంట్, స్పాన్సర్ షిప్, అడ్వర్టైజింగ్ విషయాల నిర్వహణలో ఈ గందరగోళ వైఖరిపై చైనా ముక్కున వేలేసుకోవడంలో ఆశ్చర్యం లేదంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ పరిణామం తరువాత చైనా టీవీలను బాల్కనీల నుంచి విసిరి పారేసిన వారి మానసిక పరిస్థితిపై ఆయన విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. పాపం ఇడియట్స్ అంటూ అబ్దుల్లా సెటైర్లు వేశారు. ఇండియాలో కరోనా మహమ్మారి నేపధ్యంలో యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ తేదీలను బీసీసీఐ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వరకూ ఐపీఎల్ పోటీలు జరగనున్నాయి. అబుదాబి, దుబాయ్, షార్జాలలో 51 రోజుల పాటు జరగనున్న క్రికెట్ మ్యాచ్ లకు స్పాన్సర్ కంపెనీలుగా చైనా కంపెనీల్ని కూడా ఆమోదించడం విమర్శలకు తావిస్తోంది. BCCI/IPL governing council has decided to retain all sponsors including the big Chinese ones. I feel bad for those idiots who threw their Chinese made TVs off their balconies only to see this happen. — Omar Abdullah (@OmarAbdullah) August 2, 2020 BCCI/IPL governing council has decided to retain all sponsors including the big Chinese ones. I feel bad for those idiots who threw their Chinese made TVs off their balconies only to see this happen. — Omar Abdullah (@OmarAbdullah) August 2, 2020 -
చంద్రబాబు పచ్చి అవకాశవాది
-
చంద్రబాబు విశ్వాస ఘాతకుడు
సాక్షి, అమరావతి, సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది అని, ఆయన ఏమాత్రం నమ్మదగిన నేత కాదని జమ్మూ–కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. దాదాపు ఏడాదిపాటు కేంద్ర ప్రభుత్వం విధించిన గృహ నిర్బంధం నుంచి విడుదల అయిన ఆయన ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం వంటి అంశాల్లో వివిధ పార్టీల వైఖరి ఎలా ఉందన్న ప్రశ్నలపై స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీరును తీవ్రంగా ఎండగట్టారు. రాజకీయ అవసరాలకు, మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు తమను వాడుకున్న చంద్రబాబు తమ రాష్ట్రానికి సమస్య వచ్చినప్పుడు స్పందించకుండా ముఖం చాటేశారని మండిపడ్డారు. ‘2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతున్నారని, ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తున్నారని అందరికీ తెలుసు. మా నాన్న ఫరూక్ అబ్దుల్లా తాను పోటీచేస్తున్న నియోజకవర్గంలో ప్రచారాన్ని విడిచిపెట్టి ఏపీకి వచ్చి చంద్రబాబు పార్టీ కోసం ప్రచారం చేశారు. మా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తే చంద్రబాబు మాకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదీ ఆయన నైజం..’ అని పేర్కొన్నారు. ఒమర్ అబ్దుల్లా ఇంకా ఏమన్నారంటే.. ► ఓటర్లను టీడీపీకి అనుకూలంగా ప్రభావితం చేయడానికి మా నాన్నను చంద్రబాబు ఏపీలో ప్రచారానికి ఆహ్వానించారు. చంద్రబాబు ఘోరంగా ఓడిపోతారని తెలిసినా మా నాన్న ప్రచారం చేశారు. అందుకోసం తాను పోటీ చేస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలో కీలక సమయంలో ప్రచారాన్ని విడిచిపెట్టి మరీ ఏపీ వెళ్లారు. ► కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని అన్యాయంగా గృహ నిర్బంధంలో దాదాపు ఏడాదిపాటు ఉంచితే చంద్రబాబు మాకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ► ఆయన కోసం మేం అంతచేస్తే మా రాష్ట్రం కోసం, మాకు నైతిక మద్దతు ఇచ్చేందుకు బాబు ఒక్కమాట కూడా మాట్లాడలేరా? ► మాకు మద్దతు ఇచ్చేందుకు శ్రీనగర్ రావాలని ఆయన అనుకోలేదు. కనీసం ఎయిర్పోర్ట్ వరకు వచ్చేందుకైనా ప్రయత్నించలేదు. ► కేంద్ర ప్రభుత్వం ఆయన్ను అడ్డుకుని ఉంటే అది వేరు. అప్పుడు మా రాష్ట్రానికి మద్దతు లభిస్తోందని దేశానికి తెలుస్తుంది. కానీ చంద్రబాబు ఆ పని చేయలేదు. ఆయన విశ్వాసఘాతకుడు. ► భవిష్యత్‌లో చంద్రబాబుగానీ ఆయన లాంటి నేతలను గానీ నమ్మేది లేదు. వారికి ఏ విషయంలోనూ మద్దతుగా నిలిచేది లేదు. -
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఒమర్ అబ్దుల్లా
-
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఒమర్ అబ్దుల్లా
సాక్షి, ఢిల్లీ : జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఢిల్లీలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవకాశవాది అని విమర్శించారు. చంద్రబాబు కోసం తన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా తన సొంత ఎన్నికలు వదులుకొని ఏపీకీ ప్రచారానికి వెళ్లారని గుర్తుచేశారు. ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి క్లీన్‌స్వీప్ చేస్తారని తెలిసినా తన తండ్రి బాబు తరపున ప్రచారం చేయడానికి వెళ్లారన్నారు. బాబు ఓడిపోతున్నారన్న విషయం ఆయనకు తప్ప అందరికి తెలుసన్నారు. కానీ తాము హౌజ్ అరెస్ట్‌లో ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు కనీసం ఒక్క మాట మాట్లాడకపోగా కనీస మద్దతుగా ఒక ప్రకటన కూడా చేయలలేకపోయారన్నారు. అందుకే చంద్రబాబు నమ్మదగిన నేత కాదంటూ అబ్దుల్లా మండిపడ్డారు.(‘వేల ఏళ్లుగా ఉన్న రామ మందిరాన్ని ఎవరు ధ్వంసం చేశారు’) ఒమర్ అబ్దుల్లా మార్చి నెలలో నిర్బంధం నుంచి విడుదలయ్యారు. పబ్లిక్ సేఫ్టీచట్టం కింద ఆయనను 8నెలల కింద గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. 370 అధికరణ కింద జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసిన అనంతరం గతేడాది ఆగస్టు 5 నుంచి ఆయన ఆ రాష్ట్ర గెస్ట్ హౌస్ హరినివాస్‌లో ఉన్నారు. ఆయన తండ్రి, మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా కూడా 221 రోజుల నిర్బంధం నుంచి ఈ ఏడాది మార్చి 13న విడుదలయ్యారు. -
ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఎన్నికల్లో పోటీ చేయనని కీలక నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నంత కాలం తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనని తెలిపారు. ‘జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నంత కాలం ఆసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. అత్యంత సాధికారత కలిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి సభ్యుడిగా ఉన్నాను. ఆరేళ్లపాటు సభానాయకుడిగా విధులు నిర్వర్తించాను.సాధికారతలేని అసెంబ్లీలో సభ్యుడిగా ఉండాలనుకోవడం లేదు. అందుకోసం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నాను’ అని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. జమ్మూ కశ్మీర్ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొంది. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయబడింది. కానీ, జమ్మూ కశ్మీర్‌కి ఇచ్చిన వాగ్దానం మాత్రం నెరవేరలేదన్నారు. ఆర్టికల్ 370ని తొలగించడం జనాదారణ పొందిన చర్య అయి ఉండవచ్చు. కానీ, దేశ సార్వభౌమ విధానానికి చాలా వ్యతిరేకమని తెలిపారు. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదాను తొలగించడం సరికాదన్నారు. (ఛత్తీస్‌గఢ్ సీఎంపై మండిపడ్డ ఒమర్ అబ్దుల్లా) ఒమర్ అబ్దుల్లా మార్చి నెలలో నిర్బంధం నుంచి విడుదలయ్యారు. పబ్లిక్ సేఫ్టీచట్టం కింద ఆయనను 8నెలల కింద గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. 370 అధికరణ కింద జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసిన అనంతరం గతేడాది ఆగస్టు 5 నుంచి ఆయన ఆ రాష్ట్ర గెస్ట్ హౌస్ హరినివాస్‌లో ఉన్నారు. ఆయన తండ్రి, మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా కూడా 221 రోజుల నిర్బంధం నుంచి ఈ ఏడాది మార్చి 13న విడుదలయ్యారు. -
సచిన్ పైలట్ బావ మరిది కాబట్టే..
శ్రీనగర్: రాజస్తాన్‌లోని రాజకీయ పరిణామాలు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తన బావ సచిన్ పైలట్‌ను లక్ష్యంగా చేసుకుని తమపై విమర్శలకు దిగిన భూపేశ్ భగేల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఒమర్ హెచ్చరించారు. హానికరమైన, తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి తీరుతో విసిగిపోయానని.. అందుకే పార్టీ పరిస్థితి ఇలా ఉందంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన భూపేశ్ భగేల్.. తాను అడిగింది కేవలం ఒక ప్రశ్నేనని, ఇకపై కూడా అలాగే అడుగుతూ ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని.. ఇలాంటి సమయంలో తన మాటలను అవకాశంగా మలచుకునేందుకు ప్రయత్నించవద్దంటూ హితవు పలికారు. ఇందుకు బదులిచ్చిన ఒమర్.. ‘‘నా లాయర్లకు మీరు మీ సమాధానాలు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పు ఇదే. మీకు మీ స్నేహితులెవరో, వ్యతిరేకులు ఎవరో తెలియదు. అందుకే ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. మీ ప్రశ్న హానికరమైనది’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. (నిర్బంధం నుంచి ఒమర్ అబ్దుల్లా విడుదల) సచిన్ పైలట్ బావమరిది కాబట్టే.. కాగా గత కొన్ని రోజులుగా రాజస్తాన్‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై భూపేశ్ భగేల్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సచిన్ పైలట్ తిరుగుబాటుకు, జమ్మూ కశ్మీర్ నేతలు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా గృహ నిర్బంధం నుంచి విడుదల కావడానికి సంబంధం ఉన్నట్లు భావిస్తున్నానన్నారు. సచిన్ పైలట్ మామ, బావ మరిది అయినందు వల్లే వీరికి విముక్తి కలిగి ఉండవచ్చని సందేహం వ్యక్తం చేశారు. ఈ మేరకు.. ‘‘రాజస్తాన్‌లో జరుగుతున్న సంఘటనలను, సచిన్ పైలట్ తీరును జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఒమర్ అబ్దుల్లా ఎందుకు విడుదలయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ఒమర్‌తో పాటు మెహబూబా ముఫ్తి(జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం)కూడా హౌజ్ అరెస్ట్ అయ్యారు. కానీ ముఫ్తీజీ మాత్రం నేటికీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ సచిన్ పైలట్ బావ మరిది అయినందు వల్ల ఒమర్‌కు విముక్తి లభించింది’’అంటూ సచిన్ పైలట్ ఎపిసోడ్, ఆయనతో రాజస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్ని.. అందుకు ప్రతిఫలంగా ఒమర్‌ను విడుదల చేశారనే అర్థంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన ఒమర్ అబ్దుల్లా... తమ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన భూపేశ్ భగేల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని.. ఆయన తన లాయర్లకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అన్యాయంగా తమ నాయకులను నిర్బంధంలో ఉంచితే చట్టపరంగా సవాలు చేసి విముక్తి పొందారంటూ భూపేశ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎన్సీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఒమర్ అబ్దుల్లా సోదరి సారా అబ్దుల్లా సచిన్ పైలట్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉన్నప్పటికీ తొలుత వీరి ప్రేమకు అంగీకారం లభించకపోవడంతో పెద్దలను ఎదిరించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్నాళ్లు గడిచిన తర్వాత విభేదాలన్నీ తొలగిపోయి ఇరు కుటుంబాలు కలిసి పోవడంతో కథ సుఖాంతమైంది. I am fed up of the downright malicious and false allegation that what Sachin Pilot is doing is somehow linked to my or my father’s release from detention earlier this year. Enough is enough. Mr @bhupeshbaghel will be hearing from my lawyers. Cc @RahulGandhi @INCIndia @rssurjewala https://t.co/Gojb7vN1V3 — Omar Abdullah (@OmarAbdullah) July 20, 2020 -
క్వారంటైన్ సెంటర్లో క్రికెట్
-
క్వారంటైన్ సెంటరా? క్రికెట్ స్టేడియమా?
క్వారంటైన్ సెంటర్లలో రోజులకు రోజులు నాలుగు గోడల మధ్య ఖాళీగా ఉండటం అంటే మామూలు విషయం కాదు! అందుకే ఊసుపోదు.. ఉండనీదు.. వెళ్లనీదు.. అంటూ తెగ ఫీలైపోతున్నారు కరోనా పేషంట్లు. కానీ, క్వారంటైన్ సెంటర్లలో వెసలు బాట్లను బట్టి కొంతమంది తమకు తోచినట్లుగా టైం పాస్ చేయటం.. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టటం పరిపాటిగా మారింది. తాజాగా క్వారంటైన్ టైంపాస్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జమ్మూకశ్మీర్‌లోని ఓ క్వారంటైన్ సెంటర్లో రోగులు చక్కగా క్రికెట్ ఆడుతున్న వీడియో అది. ( వైరల్: ఈ కొండముచ్చు చాలా డిఫరెంట్) జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘స్థలం ఉంది.. ఆడుకోనీ.. క్వారంటైన్ టైం పాస్’’ అని పేర్కొన్నారు. ఈ వీడియో గంటల వ్యవధిలోనే కొన్ని వేల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘కేసులు పెరగటంలో ఆశ్చర్యమేమీ లేదు.. గడ్డు సమయంలో కూడా మన భారతీయులు వినోదం కోసం ఏదో ఒకదాన్ని అన్వేషిస్తూనే ఉంటారు.. క్వారంటైన్ అన్న పదానికి అర్థాన్నే మార్చేశారు.. క్వారంటైన్ సెంటరా? క్రికెట్ స్టేడియమా?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (ఇందులో పిల్లి ఎక్కడుందిరా బాబూ?) -
‘పాకిస్తాన్‌కు తలొగ్గిన మాజీ సీఎంలు’
పనాజీ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీ మహ్మద్ సయ్యద్‌లపై గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలో (2018) ఒమర్, ముఫ్తీలు కశ్మీరీ ప్రజల నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించారని అన్నారు. 2018లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, పాకిస్తాన్ ఒత్తిడితో ఆ ఇద్దరు సీఎంలు ఎన్నికలను బాయ్‌కాట్ చేశారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా పాక్ ప్రమేయంతో వారు కుట్రపన్నారని విమర్శించారు. అంతేకాకుండా కశ్మీరీ వ్యతిరేకులతో వారిద్దరూ చేతులు కలిపారని వివాదాస్పద రీతిలో వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తాను ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయగలిగామని చెప్పుకొచ్చారు. తాను కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలో స్థానిక ప్రజల అనేక సమస్యలను పరిష్కరించానని పేర్కొన్నారు. -
జ్యోతి కుమారి నిజంగా అద్భుతం : ఇవాంక
న్యూయార్క్ : లాక్డౌన్ నేపథ్యంలో హర్యానాలోని గుర్గ్రాం నుంచి బిహార్‌లోని దర్భంగా జిల్లాకు సైకిల్‌పై తండ్రిని కూర్చోపెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణించిన బాలిక జ్యోతి కుమారిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కూతురు ఇవాంక ట్రంప్ జ్యోతిని మెచ్చుకున్నారు. 15 ఏళ్ల జ్యోతి కుమారి చేసిన సాహసం అద్భుతమని ట్విటర్ వేదికగా కొనియాడారు. (లాక్డౌన్ : 1200 కి.మీ దాటి సైకిల్‌పై స్వగ్రామానికి..) ఈ మేరకు ఇవాంక ట్రంప్ ట్విటర్లో స్పందిస్తూ.. ' 15 ఏళ్ల జ్యోతి కుమారి గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకొని ఏడు రోజుల పాటు 1200 వందల కిలోమీటర్ల ప్రయాణం చేయడం అత్యంత అద్భుతమనే చెప్పాలి. భారతీయ ప్రజలో ఇంత ఓర్పు, సహనం, ప్రేమ ఉంటాయనేది ఈమె ద్వారా నాకు తెలిసింది. ఇది కేవలం నన్ను మాత్రమే గాక సైక్లింగ్ ఫెడరేషన్‌ను ఆకర్షించిందంటూ' ట్వీట్ చేశారు. ఇవాంక చేసిన ట్వీట్‌పై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. లాక్డౌన్ వేళ ప్రభుత్వం విఫలమైన వేళ ఆమె పేదరికం, తండ్రిని కాపాడుకోవాలనే తాపత్రయం జ్యోతిని 1200 కి.మీ సైకిల్ తొక్కేలా చేసిందంటూ పేర్కొన్నారు. మే 10న గురుగ్రామ్ నుంచి ప్రారంభమైన జ్యోతి ప్రయాణం మే 16న తన సొంతూరైన దర్భంగాకు చేరుకోవడంతో ముగిసింది. ప్రస్తుతం వీరిద్దరు క్వారంటైన్ సెంటర్లో ఉన్నారు. అయితే దేశ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దృష్టిలో పడింది. ఏకంగా జ్యోతి కుమారికి సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ట్రయల్స్‌కు రమ్మని పిలుపువచ్చింది. '1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆమెలో అసాధ్యమైన ప్రతిభ ఉంది. ఏడు లేదా ఎనిమిది ప్రమాణాలను తాను దాటితే.. తను జాతీయ జట్టులోకి ఎంపిక అవుతుంది. అంతేకాక.. ట్రైనింగ్ సమయంలో తను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు' అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. -
ప్రభుత్వానిది క్రూరమైన చర్య
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం గడువును మరోమారు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ఆమె మరో మూడు నెలలపాటు గృహ నిర్బంధంలోనే ఉండనున్నారు. ఈ నిర్ణయంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. ఆమె ఏమీ చేయకపోయినా, నోరు విప్పి ఎలాంటి సందేశాలివ్వకపోయినా ప్రభుత్వం అదుపులోకి తీసుకోవడమే కాక తన చర్యను సమర్థించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మడానికి కూడా వీలు లేనంత కౄరమైన చర్యగా అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని దశాబ్ధాల వెనక్కు నెట్టివేసిందనడానికి నిర్బంధం పొడిగింపే సజీవ సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. (ఒమర్ అబ్దుల్లా నిర్ణయం, ప్రధాని మోదీ ప్రశంసలు) జమ్ము కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు ప్రజా భద్రతా చట్టం కింద పలువురు నేతలకు గృహ నిర్బంధం విధించిన విషయం తెలిసిందే. అందులో మెహబూబా ముఫ్తీతో పాటు ఒమర్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దుల్లా, తదితరులు ఉన్నారు. వీరందరికీ పలు దఫాలుగా నిర్బంధం నుంచి విముక్తినిచ్చిన ప్రభుత్వం మెహబూబా ముఫ్తీతోపాటు అలీ మహమ్మద్ సాగర్, సర్తాజ్ మదానీల నిర్బంధం గడువును మూడు నెలలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా ఈ చట్టాన్ని ఒమర్ అబ్దుల్లా తాత షేక్ అబ్దుల్లా హయాంలో 1978లో రూపొందించారు. కలప స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. (‘మళ్లీ డిటెన్షన్..! ఇదంతా పక్కా ప్లాన్’) -
ఇంతకీ కరోనా పోయినట్టేనా: ఒమర్
శ్రీనగర్ : ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును ఎగతాళి చేయబోయిన జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాకు బీజేపీ నేతలు ధీటైన సమాధానాలిచ్చారు. కరోనా వ్యతిరేక పోరాటానికి ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు దీపాలు లేదా క్యాండిల్స్ వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో కుల, మత తేడాలు లేకుండా అన్ని వర్గాల వారు దీపాలు వెలిగించి తమ ఐక్యతను చాటిచెప్పారు. దీనిపై ఒమర్ అబ్దుల్లా ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. "ఢిల్లీలో టపాసులు కాల్చుతున్నారు. ఇప్పుడేం వేడుక జరుగుతోందని!" "ఇంతకీ కరోనా వెళ్లిపోయినట్టేనా మరి?" అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన బీజేపీ నేతలు అతనికి కౌంటర్లివ్వడం ప్రారంభించారు. (‘ఒమర్..బాదం తిని మెమరీ పెంచుకో’) "అవును, ఆర్టికల్ 370, 35ఏ రద్దయి సరిగ్గా ఎనిమిది నెలలు అవుతున్నందున పండగ చేసుకుంటున్నాం.. అయితే ఆసుపత్రిలో ఉంటున్న తగ్లిబి జమాత్ సభ్యులు నర్సులతో అనుచితంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. మీరేమైనా వారికి కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే.. అప్పుడు భారత్‌లో తప్పకుండా కరోనా నియంత్రణలోకి వస్తుంద"ని సురేంద్ర పూనియా అనే బీజేపీ నాయకుడు సలహా ఇచ్చారు. ఏదైతేనేం, మరోసారి ఈ ఆర్టికల్ అంశం ట్రెండింగ్‌లో నిలిచిందని ఒమర్ ఓ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా గతేడాది ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆ సమయంలో ఎలాంటి ఆందోళనలు చెలరేగకుండా ఉండేందుకు పబ్లిక్ సేఫ్టీ చట్టం కింద మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను గృహ నిర్బంధం చేసింది. ఈ క్రమంలో ఏడు నెలల తర్వాత మార్చి 24న ఒమర్ అబ్దుల్లా నిర్బంధం నుంచి విడుదలయ్యారు. (ఏడు నెలల నిర్బంధం.. ఎట్టకేలకు విముక్తి) -
జమ్ముకశ్మీర్ : కేంద్రం మరో సంచలన నిర్ణయం
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌కు సంబంధించి కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్‌లో నివాసితుల ఉద్యోగ అర్హతకు సంబంధించి సరికొత్త నిబంధనలతో కూడిన మార్గదర్శకాలు జారీచేసింది. దీని ప్రకారం జమ్ముకశ్మీర్‌లో 15 ఏళ్లుగా నివసిస్తన్నవారు లేదా ఒకటి నుంచి ఏడవ తరగతి చదివి, పది లేదా పన్నెండో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌కి హాజరైన వారిని మాత్రమే అక్కడి స్థిర నివాసులుగా గుర్తించనున్నారు. తాజా చట్టం ప్రకారం గ్రేడ్-4 వరకు ఉన్న ఉద్యోగాలు జమ్ముకాశ్మీర్ స్థిరనివాసితులకే వర్తించున్నాయి. కేంద్రం విడుదల చేసిన ఈ మార్గదర్శకాలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దల్లా ఘాటుగా స్పందించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్డౌన్లో ఉన్న సమయంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్లయాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇది తమ భద్రతకు భంగం కలిగించేలా ఉందని అన్నారు. ఇప్పటికే ఆర్టికల్ 370 రద్దు చేసిన గాయం మానకముందే.. మరో గాయం చేస్తున్నారంటూ విమర్శించారు. -
ఒమర్ అబ్దుల్లా నిర్ణయం, ప్రధాని మోదీ ప్రశంసలు
శ్రీనగర్ : దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒమర్ అబ్దుల్లా మామయ్య డా. మహ్మద్ అలీ మట్టూ ఆదివారం రాత్రి తీవ్ర అనారోగ్యం కారణంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా షేర్ చేసిన ఓమర్ తన బంధువులు, స్నేహితులనుద్దేశించి కీలక ట్వీట్ చేశారు. కరోనా వైరస్ తో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్న కారణంగా ఎవ్వరూ అధిక సంఖ్యలో గుమిగూడవద్దని, నిబధనలను పాటించాలని కోరారు. మామయ్య అలీ ఇంటి ముందుగానీ, లేదా శ్మశాన వాటికకు వద్దకుగానీ అధిక సంఖ్యలో గుమిగూడవద్దని కోరారు. ఈ కష్ట కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. ఇంటి నుంచి చేసే ప్రార్థనల ద్వారానే ఆయన ఆత్మకు శాంతి లభిస్తుందని ఒమర్ ట్వీట్ చేశారు. డా. మహ్మద్ అలీ మృతిపై , వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అలాగే ఒమర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. ఈ శోక సమయంలో కూడా ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడవద్దని తీసుకున్న అభినందనీయమని పేర్కొన్నారు. తద్వారా కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న యుద్ధానికి మరింత శక్తిని అందించారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధాని మోదీ ట్వీట్ కు ఒమర్ అబ్దుల్లా కూడా మర్యాదపూర్వకంగా సమాధానమిచ్చారు. Condolences to you and the entire family, @OmarAbdullah. May his soul rest in peace. In this hour of grief, your call to avoid any large gathering is appreciable and will strengthen India’s fight against COVID-19. https://t.co/2xz814elbq — Narendra Modi (@narendramodi) March 30, 2020 -
నిర్బంధం నుంచి ఒమర్ అబ్దుల్లా విడుదల
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా నిర్బంధం నుంచి విడుదలయ్యారు. పబ్లిక్ సేఫ్టీ చట్టం కింద ఆయనను 8 నెలల కింద గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు, ఆయన మద్దతుదారులు ఆయన ఇంటి ముందు మాస్కులు ధరించి ఎదురుచూశారు. 370 అధికరణ కింద జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసిన అనంతరం గతేడాది ఆగస్టు 5 నుంచి ఆయన ఆ రాష్ట్ర గెస్ట్ హౌస్ హరినివాస్‌లో ఉన్నారు. ఆయన తండ్రి, మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా కూడా 221 రోజుల నిర్బంధం నుంచి ఈ ఏడాది మార్చి 13న విడుదలయ్యారు. అయితే పీడీపీ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ నిర్బంధం మాత్రం ఇంకా కొనసాగనుంది. -
ఏడు నెలల నిర్బంధం.. ఎట్టకేలకు విముక్తి
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా గృహనిర్బంధం నుంచి ఎట్టకేలకు విడుదల కానున్నారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ పాలనా యంత్రాంగ శుక్రవారం ఫరూక్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. కశ్మీర్‌ను స్వయం ప్రత్తిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు, కశ్మీర్ విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం అతన్ని నిర్బంధించిన విషయం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ నుంచి (ఏడు నెలలుగా) ఆయన నిర్బంధం కొనసాగుతోంది. 83 ఏళ్ల ఫరూక్‌తో పాటు ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ ముఫ్తీ మహ్మద్‌లను నిర్బంధం నుంచి విడుదల చేయాలని కోరుతూ ప్రతిపక్షాలు గతకొంత కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశంను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ సభల్లోనూ విపక్ష సభ్యులు లేవనెత్తారు. ఈ మేరకు స్పీకర్‌కు లేఖను కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ఫరూక్‌ను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు అక్కడి అధికారులు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీల నిర్బంధం మాత్రం ఇంకా కొనసాగుతోంది. -
ఒమర్ నిర్బంధంపై సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నిర్బంధాన్ని సవాల్ చేస్తూ ఆయన సోదరి సారా అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం జమ్ము కశ్మీర్ అధికార యంత్రాంగానికి నోటీసులు జారీ చేసింది. ప్రజా భద్రత చట్టం కింద ఒమర్ నిర్బంధం సరైనదేనా అనే అంశంలో విచారణను చేపట్టిన సర్వోన్నత న్యాయస్ధానం తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేసింది. ఒమర్‌ను తక్షణమే కోర్టులో హాజరుపరిచి ఆయనను విడుదల చేయాలని సోదరి సారా అబ్దుల్లా తన పిటిషన్లో కోర్టును అభ్యర్ధించారు. కాగా ఒమర్ త్వరలో విడుదలవుతారని సారా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉందని, మిగిలిన దేశ ప్రజలందరి మాదిరిగానే కశ్మీరీలకూ అవే హక్కులున్నాయని తాము నమ్ముతున్నామని అన్నారు. ఆ రోజు కోసం తాము వేచిచూస్తున్నామని చెప్పారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన క్రమంలో గత ఏడాది ఆగస్ట్ 5 నుంచి జమ్ము కశ్మీర్ మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా సహా ఒమర్ అబ్దుల్లాను గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు, రాళ్ల దాడులకు పాల్పడే వారిపై ప్రయోగించే ప్రజా భద్రత చట్టం కిందే వీరందరినీ ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకోవడం గమనార్హం. కాగా ఈ పిటిషన్ స్వేచ్ఛకు సంబంధించిందని తక్షణమే విచారణకు చేపట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ చేసిన వినతిని తోసిపుచ్చిన కోర్టు మార్చి 2నే తదుపరి విచారణ చేపడతామని స్పషం చేసింది. చదవండి : ఆ రోజు అస్సలు మర్చిపోను.. చపాతీలో.. -
‘మళ్లీ డిటెన్షన్..! ఇదంతా పక్కా ప్లాన్’
న్యూఢిల్లీ : మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను మరోసారి నిర్బంధంలోకి తీసుకోవడంపై ఆయన సోదరి సారా అబ్దుల్లా పైలట్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన సోదరుడి భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని, ఆయన్ను వెంటనే కోర్టులో ప్రవేశ పెట్టేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. సరైన కారణాలు లేకుండా ఇప్పటికే ఓసారి డిటెన్షన్‌లో పెట్టారని, మళ్లీ నిర్బంధించి వారి హక్కులను కేంద్రం పెద్దలు కాలరాస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థుల నోళ్లు నొక్కడానికి పక్కా ప్లాన్‌తో ఇదంతా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. (చదవండి : ఒమర్ ప్రజలను ప్రభావితం చేస్తారు) కాగా, జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రకటించిన కేంద్రం.. ఒమర్ అబ్దుల్లా, మెహబూబాలతోపాటు మరికొందరు నేతలను నిర్బంధించడంతోపాటు ఇంటర్నెట్పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే, డిటెన్షన్ గడువు (ఆరు నెలలు) ముగియడానికి కొన్ని గంటల ముందు (ఈ నెల 6వ తేదీన) వీరిద్దరితో పాటు మరికొందరినీ ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద నిర్బంధంలోకి తీసుకున్నారు. వీరితో పాటు శ్రీనగర్‌లో మంచి పట్టున్న నేషనల్ కాన్ఫరెన్స్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అలీ మొహమ్మద్ సగర్‌పై, పీడీపీ కీలక నేత సర్తాజ్ మదానీపై కూడా పీఎస్ఏ కింద నోటీసులు జారీ చేశారు. మదానీ మెహబూబా ముఫ్తీకి మామ అవుతారు. పీఎస్‌ఏలోని ‘పబ్లిక్ ఆర్డర్’ సెక్షన్ ప్రకారం విచారణ లేకుండా ఆరు నెలలు, ‘రాజ్య భద్రతకు ప్రమాదం’ అనే సెక్షన్ ప్రకారం విచారణ లేకుండా రెండు సంవత్సరాల వరకు అనుమానితులను నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ చట్టం ఒమర్ అబ్దుల్లా తాత షేక్ అబ్దుల్లా హయాంలో 1978లో రూపొందింది. ముఖ్యంగా కలప స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు. -
ఒమర్ ప్రజలను ప్రభావితం చేస్తారు
శ్రీనగర్: ‘మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(49) ప్రజలను ప్రభావితం చేసే శక్తి ఉంది... మరో మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ(60) నిషేధిత ఉగ్రసంస్థకు మద్దతు ప్రకటించారు’ ఈనెల 6వ తేదీన ఒమర్, మెహబూబాను ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద నిర్బంధంలోకి తీసుకున్నట్లు ప్రకటించిన పోలీసులు.. అందుకు కారణాలను తెలుపుతూ రూపొందించిన నివేదికలోని అంశాలివి. జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రకటించిన కేంద్రం.. ఒమర్, మెహబూబాలతోపాటు మరికొందరు నేతలను నిర్బంధించడంతోపాటు ఇంటర్నెట్పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. డిటెన్షన్ గడువు (ఆరు నెలలు) ముగియడానికి కొన్ని గంటల ముందు వీరిద్దరినీ పోలీసులు పీఎస్ఏ కింద నిర్బంధంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ చట్టం కింద వీరిని మూడు నెలలపాటు నిర్బంధంలో ఉంచొచ్చు. ఇప్పటికే ఒమర్ తండ్రి, కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాను ఈ చట్టం కింద నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ‘ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒమర్‌కు ప్రజల్లో పలుకుబడి ఉంది. రాష్ట్రంలో ఉగ్రవాదం ప్రబలంగా ఉన్న సమయంలో ఎన్నికలను బహిష్కరించాలంటూ ఉగ్రవాద సంస్థలు పిలుపు నిచ్చినప్పటికీ ప్రజలను ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రభావితం చేయగలిగారు. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దుకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు యత్నించారు’ అని ఆ నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఒమర్ చేసిన కామెంట్లను మాత్రం అందులో ప్రస్తావించలేదు. ‘పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అయిన మెహబూబా ‘ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడారు. కశ్మీర్‌ను భారత్ అన్యాయంగా ఆక్రమించుకుందని వ్యాఖ్యానించారు. నిషేధిత జమాతే ఇస్లామియా సంస్థకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు’ అని పోలీసులు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇంటర్నెట్పై తాత్కాలిక నిషేధం కశ్మీర్లో ఆదివారం ఉదయం ఇంటర్నెట్పై ఆంక్షలు విధించిన యంత్రాంగం సాయంత్రానికి ఆంక్షలు సడలించింది. పార్లమెంట్‌పై ఉగ్రదాడి ఘటనలో దోషి అఫ్జల్ గురుకు ఉరి శిక్ష అమలై ఏడేళ్లవుతున్న సందర్భంగా వేర్పాటువాద సంస్థ జేకేఎల్ఎఫ్ ఆదివారం బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ను బంద్ చేశారు. -
ఆ రోజు అస్సలు మర్చిపోను.. చపాతీలో..
శ్రీనగర్: కశ్మీర్ ప్రజల ప్రాథమిక హక్కులు నేటికీ ఉల్లంఘనకు గురవుతున్నాయని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి కుమార్తె ఇల్తిజా జావేద్ ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీరీల ఆర్థిక, మానసిక కష్టాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన నాటి (2019, ఆగస్ట్ 5) నుంచి మెహబూబా ముఫ్తి సహా మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని సొంత నివాసాలకు తరలిస్తున్నట్లు అధికారులు ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే వారిద్దరిపై కఠినమైన ప్రజా భద్రత చట్టం(పబ్లిక్ సేఫ్టీ యాక్ట్-పీఎస్ఏ) కింద గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మెహబూబా ముఫ్తి కుమార్తె తాజా పరిణామాలపై ముఫ్తి ట్విటర్ అకౌంట్లో ఓ లేఖ పోస్టు చేశారు.(కశ్మీర్ నేతలకు మరోషాక్!) ‘‘ఆర్టికల్ 370 రద్దు జరిగిన నాటి నుంచి గత ఆరు నెలలుగా మా అమ్మ గృహ నిర్బంధంలో ఉన్నారు. అమ్మను అరెస్టు చేసి జైలుకు తీసుకువెళ్లిన రోజును నేను ఎన్నటికీ మర్చిపోలేను. గృహ నిర్బంధంలోకి వెళ్లిన నాటి నుంచి ఆమెను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూశాను. ఓ రోజు టిఫిన్ బాక్సులో ఉత్తరాన్ని చూసి ఆశ్చర్యపోయాను. తన కోసం పంపిన బాక్సులో... ‘‘నా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా సందేశాలు పోస్టు చేసిన వారిని కూడా వాళ్లు అరెస్టు చేస్తారు. లవ్ యూ మిస్ యూ’’ అనే ఉత్తరం కనిపించింది. అయితే అమ్మకు ఎలా బదులివ్వాలో అర్థం కాలేదు. అప్పుడే గ్రానీ ఒక ఐడియా ఇచ్చారు. అప్పుడు లెటర్ రాసి.. దానిని చిన్నగా మలిచి.. చపాతీలో చుట్టిపెట్టాను. (‘ఏం చేశాను.. నన్ను కూడా బంధించారు’) ఇలా నేను ఒక్కదాన్నే కాదు ఎంతో మంది తమ ప్రియమైన వారితో మాట్లాడే అవకాశం కోల్పోయారు. అంతేకాదు ఆర్థికంగా కూడా జమ్మూ కశ్మీర్ ఎంతో నష్టపోయింది. కేవలం ఇవే కాదు.. పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్య తీర్పు వంటివి ఇలాంటి కష్టాలను మరింతగా పెంచుతున్నాయి. ప్రభుత్వం మాత్రం వీటిని చూసి ఎంజాయ్ చేస్తోంది. ఒక కూతురిగా మా అమ్మను భద్రతా బలగాలు బంధించడం నేను చూశాను. ఆమెను విముక్తురాలు చేసేందుకు చిన్నపాటి యుద్ధం చేశాను. ఇక బతుకు పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలి’’ అని ఇల్తిజా తన లేఖలో రాసుకొచ్చారు. కాగా తాజాగా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లాపై నమోదైన (పీఎస్ఏ) ‘పబ్లిక్ ఆర్డర్’ సెక్షన్ ప్రకారం విచారణ లేకుండా ఆరు నెలలు, ‘రాజ్య భద్రతకు ప్రమాదం’ అనే సెక్షన్ ప్రకారం విచారణ లేకుండా రెండు సంవత్సరాల వరకు అనుమానితులను నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ చట్టం ఒమర్ అబ్దుల్లా తాత షేక్ అబ్దుల్లా హయాంలో 1978లో రూపొందింది. ముఖ్యంగా కలప స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు. pic.twitter.com/whizycBCP9 — Mehbooba Mufti (@MehboobaMufti) February 6, 2020 -
కశ్మీర్ నేతలకు మరోషాక్!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ(పీడీపీ)లపై కఠినమైన ప్రజా భద్రత చట్టం(పబ్లిక్ సేఫ్టీ యాక్ట్–పీఎస్ఏ) కింద గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. వారిద్దరి ఆరు నెలల ముందస్తు నిర్బంధం ముగియడానికి కొన్ని గంటల ముందు వారిపై ఈ కేసు పెట్టడం గమనార్హం. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన 2019, ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆ ఇద్దరు నేతలు గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. పోలీసులతో పాటు వచ్చిన మెజిస్ట్రేట్ సంబంధిత నోటీసులను వారి నివాసాల్లో ఆ ఇద్దరు నేతలకు అందించారు. ఆ ఇద్దరితో పాటు శ్రీనగర్‌లో మంచి పట్టున్న నేషనల్ కాన్ఫరెన్స్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అలీ మొహమ్మద్ సగర్‌పై, పీడీపీ కీలక నేత సర్తాజ్ మదానీపై కూడా పీఎస్ఏ కింద నోటీసులు జారీ చేశారు. మదానీ మెహబూబా ముఫ్తీకి మామ అవుతారు. పీఎస్‌ఏలోని ‘పబ్లిక్ ఆర్డర్’ సెక్షన్ ప్రకారం విచారణ లేకుండా ఆరు నెలలు, ‘రాజ్య భద్రతకు ప్రమాదం’ అనే సెక్షన్ ప్రకారం విచారణ లేకుండా రెండు సంవత్సరాల వరకు అనుమానితులను నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ చట్టం ఒమర్ అబ్దుల్లా తాత షేక్ అబ్దుల్లా హయాంలో 1978లో రూపొందింది. ముఖ్యంగా కలప స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు. -
'ఒమర్ అబ్దుల్లాకు షేవింగ్ రేజర్ పంపించాం'
సాక్షి, చెన్నై: గృహ నిర్బంధంలో పెరిగిన గడ్డంతో ఉన్న జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు షేవింగ్ రేజర్ పంపినట్లు తమిళనాడులోని బీజేపీ శ్రేణులు ట్వీట్ చేశారు. జమ్ముకశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు నాటి నుంచి గృహనిర్బంధంలో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఫొటో ఇటీవల ఇంటర్నెట్ ద్వారా బయటకు వచ్చింది. గతంలో ఎప్పుడూ శుభ్రంగా షేవింగ్ చేసుకునే ఒమర్ అబ్దుల్లా ఆ ఫొటోలో దట్టంగా గడ్డం పెరిగిన స్థితిలో వృద్ధునిలా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ఈ ఫొటోను మాధ్యమాల్లో పెట్టినట్లు సమాచారం. అంతేగాక పలుపార్టీల నేతలు ఉమర్ అబ్దుల్లాకు గృహనిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని కోరారు. కేంద్రప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ప్రకటనలు చేశారు. ఇదిలా ఉండగా, తమిళనాడు బీజేపీ నేతలు ఉమర్ అబ్దుల్లా ఫొటోను హేళన చేశారు. ఉమర్ అబ్దుల్లాతో కలిసి అవినీతి, అక్రమాలకు పాల్పడిన నేతలంతా స్వేచ్ఛగా తిరుగుతుండగా ఆయన మాత్రం ఇంటికే పరిమితం కావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అంతేగాక అమేజాన్ ద్వారా షేవింగ్ రేజర్‌ను జమ్ముకశ్మీర్‌లోని ఉమర్ అబ్దుల్లా విలాసానికి బుక్ చేశారు. దయచేసి దీనిని స్వీకరించండి, ఏదైనా అవసరమైతే మీ కాంగ్రెస్ నేతల సహకారం తీసుకోండని ట్వీట్ చేశారు. (ఆయనను అలా చూడటం కష్టంగా ఉంది: స్టాలిన్) -
ఆయనను అలా చూడటం కష్టంగా ఉంది: స్టాలిన్
చెన్నై: జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి (ఆర్టికల్ 370)ని కేంద్రం గతేడాది ఆగస్టులో తొలగించడం తెల్సిందే. అప్పట్నుంచి కశ్మీర్ ముఖ్యనేతలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. వారిలో ఒమర్ కూడా ఉన్నారు. దాదాపు ఐదు నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్న ఆయన ఫొటో ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో యువకుడిలా ఉండే ఒమర్ అబ్దుల్లా బారు గడ్డంతో చిరునవ్వు చిందిస్తున్న ఓ ఫోటో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. (ఆ ఫోటో చూసి షాకయ్యాను : మమత) రాజకీయ ప్రముఖులు ఎవరూ ఆ ఫొటోలో ఉన్నది ఒమర్ అంటే నమ్మలేకపోయారు. ఒమర్‌ను తాను గుర్తుపట్టలేకపోయానని ఈ మధ్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ట్వీట్ చేశారు. తాజాగా.. డీఎంకే చీఫ్ స్టాలిన్ ఈ ఫొటోపై స్పందించారు. ఒమర్‌ను అలా చూడడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తదితర నేతల పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. Deeply troubled to see this picture of @OmarAbdullah Equally concerned about Farooq Abdullah, @MehboobaMufti & other Kashmiri leaders who are incarcerated without trial or due process. Union Govt must immediately release all political prisoners and restore normalcy in Valley. pic.twitter.com/JaPBf2EFJJ — M.K.Stalin (@mkstalin) January 27, 2020 -
ఆ ఫోటో చూసి షాకయ్యాను : మమత
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా ఫోటోపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో యువకుడిలా ఉండే ఒమర్ అబ్దుల్లా బారు గడ్డంతో చిరునవ్వు చిందిస్తున్న ఓ ఫోటో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తొలుత చూడగానే తాను గుర్తుపట్టలేదని, ఒక్కసారిగా షాక్‌కి గురయ్యానని మమత అన్నారు. ఒమర్ తాజా ఫోటోపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఘటనలు (గృహ నిర్బంధం) జరగడం దురుదృష్టకరమని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఎప్పుడు ముగింపు పలకాలని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం రాత్రి మమత ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగూ ఒమర్ తాజా ఫోటోపై మెహాబూబా ముఫ్తితో పాటు పలువురు విపక్ష నేతలూ స్పదించారు. ఆయన్ని ఇలా చూసి నివ్వెరపోయారని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి (ఆర్టికల్ 370)ని కేంద్రం గతేడాది ఆగస్టులో తొలగించడం తెల్సిందే. అప్పట్నుంచి కశ్మీర్ ముఖ్యనేతలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. వారిలో ఒమర్ కూడా ఉన్నారు. అప్పట్నుంచి గడ్డం తీయకపోవడంతో ఒమర్ ఇలా కొత్త వేషంలో కనిపించారు. అయితే ఆరునెలల నుంచి కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను కేంద్ర ప్రభుత్వం తొలగించడంతో ఇన్ని రోజులు ఈ ఫోటో బయటకు రాలేదు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
ఈ గడ్డం మనిషిని గుర్తుపట్టారా?
న్యూఢిల్లీ: బారు గడ్డంతో చిరునవ్వు చిందిస్తున్న ఈ వ్యక్తిని గుర్తుపట్టారా..? ఈయన ఒమర్ అబ్దుల్లా. జమ్మూ, కశ్మీర్ మాజీ సీఎం. ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో యువకుడిలా ఉండే ఒమర్ తాజా ఫొటో ఇది. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి (ఆర్టికల్ 370)ని కేంద్రం గతేడాది ఆగస్టులో తొలగించడం తెల్సిందే. అప్పట్నుంచి కశ్మీర్ ముఖ్యనేతలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. వారిలో ఒమర్ ఉన్నారు. అప్పట్నుంచి గడ్డం తీయకపోవడంతో ఒమర్ ఇలా కొత్త వేషంలో కనిపించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
ఈ మాజీ సీఎం ఎవరో గుర్తుపట్టగలరా?
న్యూఢిల్లీ: తెల్లటి గుబురు గడ్డం, ముడతలు పడిన కళ్లు వయసు మళ్లిన వ్యక్తిలా కనిపిస్తున్న ఈ నాయకుడిని గుర్తు పట్టారా? ముఖంతో చిరునవ్వుతో ఈ ఫొటోలోని వ్యక్తిని మొదట చూసినవారు ఎవరైనా ఆయన సాహసికుడని అనుకుంటారు. మంచు కొండల్లో చిక్కుపోయి చాలా కాలం తర్వాత వెలుగులోకి వచ్చినట్టు కూడా అనిపించవచ్చు. అయితే ఇందులో కొంతమేరకు వాస్తవం ఉంది. ఈ ఫొటోలో ఉన్నది మరెవరో కాదు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఉపాధ్యక్షుడు, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. ఎప్పుడూ నున్నటి గడ్డంతో కనిపించే ఆయనను ఇలా పోల్చుకోవడం కష్టమే. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన ఫొటో బయటి ప్రపంచానికి కనిపించింది. కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత గతేడాది ఆగస్టు నుంచి శ్రీనగర్‌లో ఆయనను గృహనిర్బంధంలో ఉంచారు. అప్పటి నుంచి బయట ప్రపంచంతో ఆయనకు సంబంధాలు లేకుండా పోయాయి. అక్టోబర్‌లో కొంచెం పెరిగిన గడ్డంతో ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అప్పుడు ఆయనను గుర్తుపట్టేలా ఉన్నారు. కానీ ఇప్పుడు గడ్డం ఎక్కువగా పెరగడంతో ఆయనను పోల్చుకోవడం కష్టం. గృహనిర్బంధం నుంచి బయటకు వచ్చే వరకు గడ్డం తీయరాదని ఒమర్ నిర్ణయించుకున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మార్చి 10న ఆయన 50వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోలో మాత్రం ఆయన వయసు మళ్లిన వృద్ధుడిలా కన్పిస్తున్నారని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘ఒమర్ అబ్దుల్లా ఆరు నెలలుగా నిర్బంధంలో ఉన్నారు. కానీ తాజా ఫొటోలో ఆయనను చూస్తుంటే 30 ఏళ్లు గడిచిపోయినట్టుగా కన్పిస్తున్నార’ని సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ అశోక్ దామిజా పేర్కొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్, ఒమర్ అబ్దుల్లాతో రాజకీయ విభేదాలున్నా ఆయనను ఇంతకాలం నిర్బంధంలో ఉంచడాన్ని ఖండిస్తున్నానని ప్రముఖ కాలమిస్ట్, రాజకీయ విశ్లేషకుడు జునైద్ ఖురేషీ అన్నారు. ఎటువంటి నేరారోపణలు లేకుండా మాజీ ముఖ్యమంత్రిని ఆరు నెలలుగా నిర్బంధంలో ఉంచడాన్ని ఆయన తప్పుబట్టారు. బీజేపీ మద్దతుదారులు మాత్రం ఒమర్ ఫొటోపై వ్యంగ్యంగా స్పందించారు. కశ్మీర్లో జరుగుతున్న పరిణామాలపై ఆయన సంతోషంగా ఉన్నారనడానికి ఒమర్ ముఖంలో చిరునవ్వే రుజువని వ్యాఖ్యానిస్తున్నారు. నిర్బంధంలో ఉన్న ఒమర్ మళ్లీ ట్విటర్‌లోకి వచ్చారని చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేత సల్మాన్ సోజ్ ఖండించారు. ప్రధాన రాజకీయ నాయకులకు కశ్మీర్లో ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేదని వెల్లడించారు. కాగా, ఒమర్‌తో పాటు ఆయన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు కూడా గృహనిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. (చదవండి: భూతల స్వర్గం నరకంగా మారిన వేళ..) -
ఫరూక్‌తో ఎన్సీ బృందం భేటీ
శ్రీనగర్/ ఇస్లామాబాద్: కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు తర్వాత తొలి కీలక రాజకీయ పరిణామం సంభవించింది. గవర్నర్ సత్యపాల్ మాలిక్ అనుమతి మేరకు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేతలు గృహ నిర్బంధంలో ఉన్న పార్టీ అగ్ర నేతలు ఫరూక్, ఒమర్ అబ్దుల్లాలతో ఆదివారం ఆ పార్టీ నేతలు భేటీ అయ్యారు. జమ్మూ ప్రొవెన్షియల్ ఎన్సీ చీఫ్ దేవీందర్ సింగ్ రాణా నేతృత్వంలోని 15 మంది నేతల బృందం వారితో రాష్ట్రంలో పరిణామాలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించింది. కేంద్రం ఆర్టికల్ 370 రద్దు ప్రకటన విడుదల చేసిన తర్వాతి రోజు ఆగస్టు 5 నుంచి మాజీ సీఎంలు, ఎన్సీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా తదితర ప్రధాన పార్టీల నేతలను గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ఎన్సీ నేతలు మొదటగా ఒమర్ అబ్దుల్లాతో అరగంటపాటు సమావేశమయ్యారు. గడ్డంతో కొత్తగా కనిపించిన తమ నేతతో వారంతా సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తర్వాత ఫరూక్ అబ్దుల్లాను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం రాణా మీడియాతో మాట్లాడుతూ.. తమ నేతలు ప్రజలపై ఆంక్షల విషయంలో కలత చెందుతున్నారని తెలిపారు. ‘రాష్ట్రం మొత్తం దిగ్బంధంలో ఉంది. మా పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాను ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) చట్టం కింద నిర్బంధించారు. ఆయన లేకుండా ఎన్నికల మేనిఫెస్టో ఎలా సాధ్యం? నేతలను వెంటనే విడుదల చేయాలి’అని పేర్కొన్నారు. నేడు మెహబూబాతో సమావేశం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీతో సోమవారం భేటీ అయ్యేందుకు ఆ పార్టీకి చెందిన 10 మంది నేతల బృందానికి నిర్బంధంలో ఉన్న పార్టీ గవర్నర్ అనుమతించారు. -
ఆర్టికల్ 370: రెండు నెలల తర్వాత తొలిసారి
శ్రీనగర్: రెండు నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధినేత ఫరూక్ అబ్దుల్లా ఆదివారం తన పార్టీ నేతలను కలుసుకున్నారు. ఎన్సీ జమ్మూ అధ్యక్షుడు దేవేందర్ సింగ్ రానా నేతృత్వంలో 15మంది సీనియర్ నాయకులు ఫరూక్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ ఆయ్యారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకుని.. జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితులపై చర్చించారు. అంతకుముందు ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాతోనూ పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆగస్ట్ 4వ తేదీ నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాతోపాటు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీలను ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. గవర్నర్ సత్యపాల్ మాలిక్ వద్ద ప్రత్యేక అనుమతి తీసుకుని ఎన్సీ నేతలు ఫరూక్, ఒమర్ అబ్దుల్లాలను కలిశారు. -
ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకు మాజీ సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన శనివారం న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేశారు. కశ్మీర్‌ను విభజిస్తూ.. ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. కశ్మీరీల అభిప్రాయానికి వ్యతిరేకంగా, రాష్ట్రాన్ని విభజించారని సుప్రీం దృష్టికి తీసుకువచ్చారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 5వ తేదిన పార్లమెంట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై కశ్మీర్ నేతలు న్యాయశాఖను ఆశ్రయిస్తారని వార్తలు వచ్చాయి. దీనికి అనుగుణంగానే బీజేపీ ప్రభుత్వం కూడా న్యాయనిపుణలతో చర్చించి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా వ్యూహాలు రచించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఒమర్ అబ్దుల్లా పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
‘మా అమ్మను హరి నివాస్‌లో బంధించారు’
శ్రీనగర్ : ‘మా అమ్మను నిర్బంధంలో ఉంచారు. పార్టీ కార్యకర్తలు, న్యాయవాదులు.. ఆఖరికి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేందుకు ఆమెకు అనుమతి లేదు’ అంటూ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి కుమార్తె ఇల్తిజా జావేద్ ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయాల నేపథ్యంలో మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లాలను గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆర్టికల్ 370, 35ఏ రద్దు నేపథ్యంలో కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఇక రాష్ట్ర పునర్విభజన బిల్లు సభలో ప్రవేశపెట్టే సమయానికి వారిద్దరిని అదుపులోకి తీసుకుని శ్రీనగర్‌లో ఉన్న ప్రభుత్వ అతిథి గృహానికి తరలించారు. ఈ క్రమంలో..‘ కశ్మీరీల పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల గురించి గళం విప్పేందుకు మా అమ్మకు ఉన్న అన్ని దారులు మూసివేశారు. ఇలా చేయడం ద్వారా ప్రజలను భయాందోళనకు గురిచేశారు. మా అమ్మతో మాట్లాడేందుకు, కనీసం చూసేందుకు కూడా వీలు లేకుండా పోయింది. హరినివాస్‌లో ఆమెను బంధించారు. వారు చేసే పని సరైందే అయినపుడు నిర్బంధించడం ఎందుకు. ఈ విషయం కేవలం మా అమ్మ లేదా ఒమర్ అబ్దుల్లాకు మాత్రమే సంబంధించినది కాదు. సాధారణ ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ప్రజాప్రతినిధులను బందిపోట్లలా, నేరస్తుల్లా చూడటం వారికే చెల్లింది. వారు తీసుకుంటున్నవి చట్ట వ్యతిరేక నిర్ణయాలు కాబట్టే ఇలా వ్యవహరిస్తున్నారు’ అంటూ ఇల్తిజా ఎన్డీటీవీకి ఇచ్చిన ఆడియో మెసేజ్‌లో మోదీ సర్కారు తీరును విమర్శించారు. కాగా జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. మంగళవారం లోక్‌సభలో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు- 2019కు అనుకూలంగా 370 మంది, వ్యతిరేకంగా 70 సభ్యులు ఓటు వేశారు. ఇక జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35–ఏలను రద్దు చేసిన తీర్మానం కూడా లోక్‌సభ ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 351 మంది, వ్యతిరేకంగా 72 మంది ఓటు వేశారు. ఒకరు సభకు గైర్హాజరు కాగా.. తృణమూల్ కాంగ్రెస్, జేడీ(యూ) పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. -
ఆర్టికల్ 370 రద్దు, మాజీ సీఎంలు అరెస్ట్
జమ్ము కశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభలో ఆమోదించిన వెనువెంటనే జమ్ముకశ్మీర్‌లో కీలక పరిణామాలు చకాచకా చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్ర కీలక నేతలను అదుపులోకి తీసుకోవడం కలకలం సృష్టించింది. ఇప్పటికే గృహ నిర్బంధంలో ఉంచిన మాజీ ముఖ్యమంత్రి , పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీని సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను శ్రీనగర్‌లోని ప్రభుత్వ గెస్ట్‌హౌస్ హరినివాస్కు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా ముఫ్తీని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరో మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా కూడా అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఒమర్ అరెస్ట్‌పై అధికారిక నిర్ధారణ రావాల్సి వుంది. జమ్మూకశ్మీర్‌కు భారీగా బలగాలను తరలించిన రోజు దగ్గరినుంచీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి నుంచి 144 సెక్షన్ విధించారు. అలాగే రాష్ట్రంలోని ముగ్గురు ప్రధాన నేతలు పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజాద్‌లోన్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను హౌజ్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారత ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా ముఫ్తీ అభివర్ణించారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమనీ, ఇది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని ఆమె ట్వీట్ చేశారు. ఇది ఇలా వుంటే ఆర్టికల్ 370 రద్దుతో పాటు జమ్మూకశ్మీర్ పునర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘమైన చర్చ అనంతరం 370 ఆర్టికల్ రద్దు బిల్లు మూజువాణి ఓటుతో నెగ్గింది. అయితే, జమ్మూకశ్మీర్ పునర్ విభజన బిల్లుకు సవరణలుకోరిన నేపథ్యంలో బిల్లుపై ఓటింగ్ జరగగా.. అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు రాగా ఒకరు తటస్థంగా ఉన్నారు. -
కేంద్రం మౌనం వహిండం సరికాదు
-
గవర్నర్ మాటిచ్చారు..కానీ..
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 35ఏపై కేంద్రం వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఎన్సీ అధినేత ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో కేంద్ర బలగాల మోహరింపు, అమర్నాథ్ యాత్రను అర్ధారంతరంగా నిలిపివేయడం తదితర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఆయన శనివారం గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...‘ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ప్రత్యేక హోదాను నిలిపివేసే ఉద్దేశం లేదని గవర్నర్ తెలిపారు. కానీ ఈ విషయంలో ఆయన మాటలే అంతిమం కాదు కదా. ఆర్టికల్ 35ఏ విషయంలో భారత ప్రభుత్వమే పార్లమెంటులో సరైన సమాధానమివ్వాలి. తమ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి’ అని ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ‘ గురువారం ఇక్కడ 25 వేల బలగాలను దింపారు. వారం గడవకముందే మరో 10 వేల మంది సైనికులను పంపారు. ఈ విషయాల గురించి ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. పౌరులను ఎంతో వేదనకు, ఒత్తిడికి గురిచేస్తున్నారు’ అని మండిపడ్డారు. కాగా బీజేపీ- పీడీపీ కూటమిలో చీలికలో ఏర్పడిన అనంతరం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ గవర్నర్ పాలన కొనసాగుతోంది. -
ట్రిపుల్ తలాక్ బిల్లు; కశ్మీర్లో పంచాయతీ..!
శ్రీనగర్ : రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఓమర్ అబ్దుల్లా మధ్య ట్విటర్లో విమర్శల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రం వైఖరిని ముఫ్తీ తప్పుబట్టారు. ఆగమేఘాల మీద ట్రిపుల్ తలాక్ బిల్లును తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు. సుప్రీం కోర్టు సైతం ఈ బిల్లును చట్ట విరుద్దమైనదిగా ప్రకటించిందని గుర్తు చేశారు. కేవలం ముస్లింలపై కక్ష సాధించడానికే ట్రిపుల్ తలాక్ తీసుకువచ్చారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ బిల్లుకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఏముందని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, ముఫ్తీ వ్యాఖ్యలపై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మెహబూబా ముఫ్తీ జీ.. రాజ్యసభలో బిల్లుపై ఓటింగ్ జరుగుతున్నప్పుడు మీ ఎంపీలు ఎక్కడున్నారు. ఉద్దేశపూర్వకంగానే సభ నుంచి మీ పార్టీ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ తగ్గిపోవడానికి, బిల్లు గట్టెక్కడానికి ప్రభుత్వానికి పరోక్షంగా సహకరించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. మీ ఆంతర్యం ఏమిటీ అని’ ప్రశ్నించారు. ముఫ్తీ స్పందిస్తూ.. ‘ఓటింగ్ సమయంలో ప్రభుత్వ తీసుకొచ్చే బిల్లులకు నిరసనగా సంయమనం పాటించడం కూడా వ్యతిరేకించినట్టే. ఈ విషయం మీరు తెలుసుకుంటే మంచింది. 1999లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన మీ పార్టీ సభ్యుడు సోజ్ సాహెబ్‌ను బహిష్కరించారు. అక్కడే మీ నైతికత ఏంటో తెలిసిపోతోంది’ అన్నారు. దీనిపై ‘మీ పార్టీ వంచనను కప్పిపచ్చుకోడానికి ఇరవై ఏళ్ల సంఘటనను గుర్తుచేశారు. మీ ఎంపీలను రాజ్య సభకు గైర్హాజరు కావాలని ఆదేశించినట్టు అంగీకరిస్తున్నారు. సంయమనం పాటించటం ఓటు కాదు. బీజేపీకి సాయం చేసినట్టు అవుతుంది’ అని ఒమర్ విమర్శించారు. కాగా, ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో మంగళవారం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 ఓట్లు రావడంతో ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో ట్రిపుల్ తలాక్ రాజ్యసభలో గట్టెక్కింది. -
వైరల్ ఫోటోలు: స్పెషల్ ఫ్రెండ్‌తో మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు ఆయన అభిమానులతో పాటు.. మీడియా వర్గాల్లో కూడా కాసేపు చర్చనీయాంశంగా మారాయి. పార్లమెంట్లో మోదీ.. ఓ చిన్నారితో ఆడుతున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘చాలా ప్రత్యేకమైన స్నేహితుడు ఒకరు ఈ రోజు పార్లమెంటులో నన్ను కలుసుకున్నారు’ అనే క్యాప్షన్ ఇచ్చారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఫోటోలు లక్షల్లో లైక్‌లతో తెగ వైరల్ అయ్యాయి. View this post on Instagram A very special friend came to meet me in Parliament today. A post shared by Narendra Modi (@narendramodi) on Jul 23, 2019 at 2:12am PDT దాంతో పాటు మోదీ చేతుల్లో ఉన్న చిన్నారి ఎవరో తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ప్రయత్నం చేశారు. తొలుత మోదీని కలవడానికి వచ్చిన సందర్శకులకు సంబంధించిన వారి బిడ్డగా భావించారు. అయితే చివరకు ఆ బుడతడు బీజేపీ పార్లమెంట్ మెంబర్ సత్యనారాయణ జతియా మనవడిగా తెలీంది. అయితే ఈ ఫోటోలపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సెటైర్లు వేశారు. ‘క్యూట్ ఫోటోలు. గత రాత్రి నుంచి ప్రతిపక్షాలు ట్రంప్ మధ్యవర్తిత్వం గురించి మోదీని ప్రశ్నిస్తున్నాయి. వాటికి సమాధానంగా మోదీ ఇలాంటి ఫోటోలను పోస్ట్ చేసి.. ప్రతిపక్షాలకు ఎంత విలువ ఇస్తున్నారో చెప్పకనే చెప్పారు’ అంటూ విమర్శిస్తూ ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ‘సురక్షితమైన చేతుల్లో భవిష్యత్తు’ అంటూ బీజేపీ నాయకులు ఈ విమర్శలను తిప్పి కొట్టారు. Cute pictures. While the oppostion parties yell themselves hoarse demanding the PM explain last night’s mediation brouhaha he lets them know what he thinks of their demand by putting pictures like these on his Instagram feed 😀 https://t.co/8IeRNXXSa0 — Omar Abdullah (@OmarAbdullah) July 23, 2019 -
అత్యంత శుభ్రమైన ప్రాంతంలో స్వచ్ఛ భారత్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీలు శనివారం పార్లమెంట్ ఆవరణలో స్వచ్ఛ భారత్ అభియాన్‌కు పూనుకున్నారు. ఎంపీలు హేమా మాలిని, కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్‌లు పార్లమెంట్ బయట చీపురుకట్ట చేతబట్టి శుభ్రం చేశారు. త్వరలో మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల దృష్ట్యా 'స్వచ్ఛ భారత్ అభియాన్'కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే వీరిపై నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఒమర్ అబ్దుల్లా వ్యంగ్యంగా స్పందించారు. ‘‘దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన ప్రాంతంలో (పార్లమెంట్) స్వచ్ఛ భారత్‌ను చేస్తున్నారు. దేశంలో ఎక్కడా కూడా పార్లమెంట్ ముందు పాటించిన శుభ్రత పాటించరు. ముఖ్యంగా సమావేశాలు జరిగే రోజుల్లో ఇంకా శుభ్రతను పాటిస్తారు. మీరు మాత్రం అక్కడే శుభ్రం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో ఏమో?. కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికే ఈ కార్యక్రమానికి దిగినట్టు ఉంది’’ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మధుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి హేమా మాలిని గెలిచిన విషయం తెలిసిందే. -
జైరా వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం
న్యూఢిల్లీ: ఇస్లాంకు దూరం కావడం ఇష్టంలేక సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ‘దంగల్’ సినిమా నటి జైరా వసీమ్ ప్రకటించడం సినీ, రాజకీయవర్గాల్లో దుమారం లేపింది. కొందరు జైరా వసీమ్ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం తప్పుపడుతున్నారు. తన జీవితం గురించి ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు జైరాకు ఉందనీ, దాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. జైరా వ్యక్తిగత నిర్ణయాన్ని తాము గౌరవిస్తామనీ, మతానికి–కళకు ఏమాత్రం సంబంధం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. ఇస్లాం అసహనంతో కూడిన మతం అనేలా జైరా వ్యాఖ్యలు ఉన్నాయని శివసేన నేత ప్రియాంకా చతుర్వేది విమర్శించారు. అన్నీ ఇచ్చిన సినీపరిశ్రమకు కొందరు రుణపడి ఉండరనీ, అలాంటివాళ్లు తమ మ్రౌనంగా వెళ్లిపోవడం మంచిదని నటి రవీనా టాండన్ అన్నారు. -
ఉపశమనం లభించింది; ఇది సరిపోదు!
శ్రీనగర్ : దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా అత్యాచారం కేసులో పఠాన్కోర్టు వెలువరించిన తీర్పును జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. ఎనిమిదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసులో ఆరుగురిని దోషులుగా తేలుస్తూ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాంజీ రామ్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, మరో ఇద్దరిని కోర్టు దోషులుగా నిర్థారించింది. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి స్పందించారు. ‘ కథువా కేసులో తీర్పుతో కాస్త ఉపశమనం లభించింది. ఈ గొప్పదనమంతా.. క్రైమ్‌బ్రాంచ్ టీమ్‌ను ముందుండి నడిపించిన ఐజీపీ ముజ్తాబా, ఎస్ఎస్పీ జాలా, ఇతర పోలీసు ఉన్నతాధికారులు నవీద్, శ్వేతాంబరి, లాయర్ దీపికా రజావత్, తాలిబ్లకే దక్కుతుంది. వీరంతా ప్రాణాలు పణంగా పెట్టిమరీ నిజాలను వెలుగులోకి తెచ్చారు. చిన్నారికి మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఈ తీర్పును స్వాగతిస్తున్నా. ఎనిమిదేళ్ల చిన్నారికి మత్తు పదార్థాలు ఇచ్చి, పలుమార్లు అత్యాచారం జరిపి, పాశవికంగా హత్య చేసిన క్రూరులకు చట్టంలోని లోపాలు ఆయుధం కాకూడదు. హేయమైన నేరానికి పాల్పడిన వాళ్లకు కచ్చితంగా శిక్ష అమలు కావాలి అని ఆమె పేర్కొన్నారు. ఈ శిక్ష సరిపోదు.. ‘ఈ తీర్పును స్వాగతిస్తున్నా. అయితే దోషులకు జీవిత ఖైదు సరిపోదు. అంతకంటే కఠినమైన శిక్షను అమలు చేయాలి. నిందితులకు మద్దతుగా నిలిచిన కొంతమంది రాజకీయ నాయకులకు కనువిప్పు కలగాలి. బాధిత కుటుంబాన్ని, పోలీసులు, లాయర్లను బెదిరించిన వారిని ఏమనాలో అర్థం కావడం లేదు’ అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. చదవండి : ఏదో ఒకరోజు నన్ను కచ్చితంగా చంపేస్తారు కాగా కశ్మీర్‌లోని కథువాలో గిరిజన తెగకు చెందిన ముస్లిం బాలికపై కొంతమంది వ్యక్తులు అతి కిరాతకంగా అత్యాచారం జరిపి హతమార్చిన సంగతి తెలిసిందే. గతేడాది జనవరిలో బాలికను గ్రామంలోని ఓ దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. పాశవికమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు,. నిరసనలు హోరెత్తాయి. ఈ కేసులో గ్రామ పెద్ద సాంజి రామ్, అతని కొడుకు విశాల్, మైనర్ మేనల్లుడితోపాటు ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు దీపక్ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సాంజిరామ్ నుంచి నాలుగు లక్షలు లంచం తీసుకుని ఆధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలపై కానిస్టేబుల్ తిలక్‌రాజ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ దత్తా కూడా అరెస్టయ్యారు. ఈ కేసులో బాధితురాలి తరఫున వాదిస్తే చంపేస్తామని బెదిరింపులు రావడంతో..ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో దీపికా సింగ్ రజావత్ చిన్నారి తరఫున వాదించేందుకు సిద్ధమయ్యారు. అయితే నిందితులకు కొంతమంది బీజేపీ నాయకులు మద్దతు తెలపడం, ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తతలు చెలరేగడంతో.. కేసు విచారణను సుప్రీంకోర్టు పఠాన్‌కోట్ కోర్టుకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం కోర్టు తీర్పు వెలువరించింది. -
‘ఒమర్..బాదం తిని మెమరీ పెంచుకో’
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో రాజకీయ వారసులు ఒమర్ అబ్ధుల్లా, మెహబూబా ముఫ్తీ మరోసారి ట్వీట్ వార్‌కు దిగారు. ఈసారి మాలెగావ్ పేలుళ్ల నిందితురాలు సాధ్వి ప్రజ్ఞ బీజేపీలో చేరడం వారి ట్వీట్ దాడికి కేంద్ర బిందువైంది. బీజేపీలో చేరిన సాధ్వి ప్రజ్ఞను బీజేపీ భోపాల్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై పోటీగా బరిలోకి దింపింది. బీజేపీలో ప్రజ్ఞ చేరికపై పీడీఎఫ్ చీఫ్ మెహబూబా ముఫ్తీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తాను ఉగ్రవాద నిందితుడిని పోటీలో నిలిపితే ఎలాంటి ఆగ్రహం పెల్లుబుకుతుందో ఊహించండి..మీడియా ఛానెల్స్ విపరీత ధోరణితో ప్రచారం చేసేవని ట్వీట్ చేశారు. ఉగ్రవాదానికి మతం లేదని చెప్పే వీరే ముస్లింలంతా ఉగ్రవాదులేనని చెబుతారని, నిర్ధోషిగా నిరూపించుకునేవరకూ ముద్దాయిలేనని మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న సాధ్వి ప్రజ్ఞను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మెహబూబా ట్వీట్‌కు స్పందించిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్ధుల్లా ఘాటైన వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. ఇదే బీజేపీ మిమ్మల్ని అధికారం నుంచి తప్పించేవరకూ మీ మిత్ర పక్షంగా ఉన్నారని, 2014లో అధికారంలోకి రాకముందే బీజేపీ తీరు ఇలాగే ఉన్నా జూన్ 2018 తర్వాతే వారి పాపాలను మీరు గుర్తించారని, అధికార దాహంతో మీకు వారి పాపాలు కనిపించలేదని దుయ్యబట్టారు. ఒమర్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ మెహబూబా ముఫ్తీ మరో ట్వీట్లో.. అటల్ బిహారి వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో నేషనల్ కాన్ఫరెన్స్ భాగస్వామిగా ఉన్నప్పుడు బీజేపీ హిందుత్వ రాజకీయాల గురించి ఒమర్ అబ్ధుల్లాకు ఏమీ తెలియదని సెటైర్లు వేశారు. గోద్రా ఘటనల అనంతరం బీజేపీతో నేషనల్ కాన్ఫరెన్స్ అంటకాగిన విషయం గుర్తులేదా అంటూ ఒమర్‌కు చురకలు వేశారు. ఒమర్ బాదం పప్పు తిని జ్ఞాపక శక్తి పెంచుకోమని మెహబూబా తనదైన శైలిలో స్పందించారు. -
‘ఈవీఎంలో కాంగ్రెస్ బటన్ పనిచేయడం లేదు’
శ్రీనగర్ : దేశ వ్యాప్తంగా మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మరో ఐదేళ్ల పాటు తమ భవిష్యత్తును నిర్ణయించే నేతలను ఎన్నుకునేందుకు ప్రజలంతా పోలింగ్ సెంటర్ల ముందు బారులు తీరారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల ఈవీఎంలు మోరాయించడంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈవీఎంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు బటన్ పని చేయడం లేదని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో కాంగ్రెస్ బటన్ పని చేయలేదని ఆయన తెలిపారు. ఈ క్రమంలో స్థానిక మీడియాలో ప్రసారం అయిన వార్తను ఆయన తన ట్వీటర్లో షేర్ చేశారు. Congress symbol button not working in Poonch polling stations ||Mangnar ... https://t.co/g9f6q4Phw4 via @YouTube — Omar Abdullah (@OmarAbdullah) April 11, 2019 ఈ సంఘటన షాపూర్ పోలింగ్ స్టేషన్లో చోటు చేసుకుంది. వీడియోలో పోలింగ్ అధికారి ఈ విషయంపై స్పందిస్తూ.. ‘ఈవీఎంలోని 4వ నంబర్ హస్తం గుర్తు బటన్ పని చేయడం లేదు. ఈ కారణంగా పోలింగ్‌కు ఆలస్యం అయ్యింది. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. బటన్ పని చేయకపోవడానికి గల కారణాలు తెలియదు’ అని పేర్కొన్నారు. అయితే పలు నియోజకవర్గాల్లో ఇదే సమస్య తలెత్తిందని ఓటర్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో పూంచ్ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన జుగల్ కిషోర్ విజయం సాధించాడు. ఈ సారి ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. -
గంభీర్‌కు వార్నింగ్ ఇచ్చిన అబ్దుల్లా
న్యూఢిల్లీ : టీమిండియా మాజీ క్రికెటర్, తాజా బీజేపీ నాయకుడు గౌతమ్ గంభీర్‌పై కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విటర్ వేదికగా మండిపడ్డారు. జమ్ము కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసి ప్రధాన మంత్రి కావాలని అబ్దుల్లా చూస్తున్నాడంటూ గంభీర్ చేసిన ట్వీట్‌కు ఆయన మంగళవారం రీ ట్వీట్ చేశారు. ‘గంభీర్, నేను ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు.. ఎందుకంటే నాకు క్రికెట్ గురించి ఎక్కువగా తెలియదు. నీకు జమ్ము కశ్మీర్ గురించి తెలియదు. జమ్ము కశ్మీర్ చరిత్ర, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేషనల్ కాన్ఫరెన్స్ చేసిన కృషి గురించి గంభీర్‌కు ఏం తెలుసు. ఇకనైనా గంభీర్ తనకు తెలిసిన విషయాలపై మాట్లాడితే మంచిది. తనకు తెలిసిన ఐపీఎల్ గురించి ట్వీట్లు పెడితే అందరూ స్వాగతిస్తారు.’అంటూ అబ్దుల్లా గంభీర్‌కు వార్నింగ్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేకంగా ప్రధానిని నియమించే దిశగా నేషనల్ కాన్ఫరెన్స్ మరోసారి ప్రయత్నం చేస్తుందన్న ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ గంభీర్ ట్వీట్ చేయడంతో వీళ్ల మధ్య గొడవ ప్రారంభమైంది. ‘ఒమర్ అబ్దుల్లా.. జమ్ము కశ్మీర్‌కు ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. నేను సముద్రాలపై నడవాలంటే వీలవుతుందా. ఆయనకు విశ్రాంతి కావాలి. ఓ స్ట్రాంగ్ కాఫీ తాగి నిద్రపోండి. లేదంటే పాకిస్తాన్ పాస్‌పోర్ట్ తీసుకోవాలి’అంటూ గంభీర్ ఘాటుగా వ్యాఖ్యనించారు. ఇక రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత గంభీర్ తన మాటలకు పదును పెడుతున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కూడా గంభీర్ తీవ్రస్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే. -
మా మంచు ఇల్లు
హైదరాబాద్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇంటిని చూసి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముగ్ధుడైపోయారు. ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్‌లోని మంచు కప్పిన తన ఇంటిని ఫొటో తీసి బుధవారం ట్విట్టర్లో పెట్టారు. అయితే ఈ ఫొటోను చూసిన కేటీఆర్..శ్రీనగర్‌లో తనకు ఓ ఇల్లు ఉంటే బాగుండేదని ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన ఒమర్ అబ్దుల్లా...‘ఈ ఇంటికి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావొచ్చ’ని బదులిచ్చారు. దీనికి కేటీఆర్..‘‘కోరికలు తీర్చే యంత్రమేదైనా ఉంటే మాత్రం కచ్చితంగా అక్కడ ఇల్లు ఉండాలని కోరుకుంటాను’’అని సమాధానమిచ్చారు. దీనికి మళ్లీ స్పందించిన ఒమర్ అబ్దుల్లా...నన్ను నీవాడిగా భావించి ఇక్కడ ఉండాల్సిందిగా కోరుతున్నాను’’అన్నారు. దీనికి మళ్లీ కేటీఆర్...ఒమర్ సాబ్..మీరు ఇచ్చే ఈ ఆఫర్‌ను సీరియస్‌గానే తీసుకుంటున్నాను’’అని బదులిచ్చారు. -
‘మోదీ మీ పాత్రలో సల్మాన్ ఐతే బాగుండేది’
ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ట్రైలర్‌తోనే ఈ సినిమా వివాదాలను రేపుతోంది. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వివేక్ ఒబేరాయ్ మోదీ పాత్రలో నటిస్తున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ పట్ల ఇప్పటికే పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. వివేక్ ఒబేరాయ్ మోదీ పాత్రను దారుణంగా ఖూనీ చేశారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పుడు వీరి వరుసలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా చేరారు. ది యాక్సిడెంటల్ ప్రైమ్ పినిస్టర్ సినిమాను, మోదీ బయోపిక్‌ను కంపేర్ చేస్తూ అబ్దుల్లా కామెంట్ చేశారు. ‘మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ బాగానే సూట్ అయ్యారు.. కానీ మోదీ మీ పాత్ర కోసం వివేక్ అంతగా సెట్ అవ్వలేదు. వివేక్ బదులు మీరు సల్మాన్ ఖాన్ తీసుకుంటే మజా వచ్చేది’ అంటూ ట్వీట్ చేశారు. Life is unfair Dr Manmohan Singh got someone of the calibre of Anupam Kher. Poor Modi ji has to settle for Vivek Oberoi. Salman Khan hota toh kya maza aata. — Omar Abdullah (@OmarAbdullah) January 8, 2019 -
‘మరి ఇంత పదవి వ్యామోహమా..?!’
పణాజి : ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి బాధ్యతలు నిర్వహిస్తోన్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ని సొంత పార్టీ నాయకులు అభినందిస్తోండగా.. విపక్షాలు మాత్రం అంత పదవి వ్యామోహం అవసరమా అంటూ విమర్శిస్తున్నాయి. వివరాలు.. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న పారికర్ అక్టోబర్‌లో డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న పారికర్ ఆదివారం తొలిసారి ప్రజల మధ్యకు వచ్చారు. అధికారులతో కలిసి పణాజీలోని మండోవి నదిపై నిర్మిస్తోన్న వంతెన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా సీనియర్ నాయకురాలు ప్రీతి గాంధీ.. ‘నిబద్ధతకు, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం’ అంటూ పారికర్ని ప్రశంసించారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం బీజేపీ అధికార దాహానికి నిలువెత్తు నిదర్శనమంటూ ఆరోపణలు చేస్తున్నాయి. ‘ఎంత అమానుషం.. పూర్తిగా కోలుకొని మనిషిని బాధ్యతలు నిర్వహించమని, ఫోటోలకు ఫోజులివ్వమని ఒత్తిడి చేయడం దారుణమం’టూ జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా విమర్శించారు. He has a tube inserted through his nose into his digestive tract. How inhuman to force him to continue working & doing photo ops. Why can’t he be allowed to deal with his illness without all this pressure & tamasha? https://t.co/iq0dwXCHmE — Omar Abdullah (@OmarAbdullah) December 16, 2018 కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది కూడా ‘సీఎం ముక్కులో ట్యూబ్ ఉందా? పదవి దాహంతో ఉన్న పార్టీ(బీజేపీ) ఓ వ్యక్తి అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా బాధ్యతలు నిర్వహించమని కోరుతుందా? కానీ అధికారంలోకి రావడం కోసం బీజేపీ ఏమైనా చేయగలదు. సీఎం సాబ్ జాగ్రత్త.. ఇక మీ పార్టీ గిమ్మిక్కులు కొనసాగవు’ అంటూ ట్వీట్ చేశారు. Is that a tube that is inserted in his nose? Can a party be so power hungry to make a man work despite his illness? With BJP impossible is nothing....to grab power, latch on to power. Take care CM Saab, because clearly, your party won’t. https://t.co/xBwv5qXvtb — Priyanka Chaturvedi (@priyankac19) December 16, 2018 -
కశ్మీర్ అసెంబ్లీ రద్దు అన్ని విధాల తప్పే!
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని హఠాత్తుగా రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ బుధవారం నాడు తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యకరమే కాకుండా చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని కూడా చెప్పవచ్చు. జమ్మూ కశ్మీర్ రాజ్యాంగంలోని అధికరణ 53 (2బీ) ప్రకారం రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉంది. అయితే అది భారత రాజ్యాంగంలోని 172 (2బీ) అధికరణలోని అంశాలకు అనుగుణంగా ఉండాలి. సత్యపాల్ మాలిక్ తీసుకున్న నిర్ణయం అందుకు భిన్నంగా ఉండడమే కాకుండా, ఇలాంటి సందర్భాల్లో పరిగణలోకి తీసుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు గతంలో సూచించిన మార్గదర్శకాలకు కూడా భిన్నంగా ఉంది. ఓ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే అంశంలో హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలంటూ సూచిస్తున్న భారత రాజ్యాంగంలోని 172 (2బీ) అధికరణంలో అంత స్పష్టత లేకపోవచ్చేమోగానీ ‘ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ భారత ప్రభుత్వం’ కేసులో 1994, మార్చి 11న, ఆ తర్వాత ‘రామేశ్వర ప్రసాద్ వర్సెస్ భారత ప్రభుత్వం’ కేసులో 1996, జనవరి 24వ తేదీన సుప్రీం కోర్టు స్వయంగా ఇచ్చిన తీర్పుల్లో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ తీర్పుల ప్రాతిపదికనే కశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, ఎన్సీపీలు కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. పరస్పర భిన్న విధానాలు కలిగిన ఈ పార్టీల మధ్య సరైన సఖ్యత ఉండదని, అవి స్వార్థ ప్రయోజనాలకు కోసం అక్రమ పద్ధతిలో కూటమిగా చేతులు కలపవచ్చని గవర్నర్ మాలిక్ భావించడం, అందుకని సుస్థిర ప్రభుత్వాన్ని అందించలేవని అనుకోవడం, అందుకని రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తున్నానని ప్రకటించడం అర్థరహితం. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చిన పార్టీలకు తగిన సంఖ్యా బలం ఉందా, లేదా అన్నదే తప్ప, వాటి సిద్ధాంతాలు, విధానాలు ఏమిటీ? అని చూడాల్సిన అవసరం లేదు. అలా చూసిన సందర్భాలు కూడా లేవు. అంతకుముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ–పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీల విధానాలు పరస్పర భిన్నమైనవి కావా? ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదా? అందుకే ఆ ప్రభుత్వం ఎక్కువకాలం నిలబడలేదనుకుంటే, ఈ పార్టీలకు కూడా ఓ సారి అవకాశం ఇచ్చి చూస్తే వచ్చే నష్టం ఏముంది? ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చిన పార్టీలకు సరైన సంఖ్యా బలం ఉందా, లేదా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు సంఖ్యాబలాన్ని తనిఖీ చేయవచ్చు, ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేల బేరసారాలకు పాల్పడతారని అనుమానించిన సందర్భాల్లో 24 గంటల్లోగా విశ్వాస పరీక్షను కోరవచ్చు. అలాంటి సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. ‘కనిపించని చీకటిలో జరిగే బేరసారాల ద్వారా ముడుపులు తీసుకొని ఓ పార్టీకి లేదా కూటమికి మద్దతు ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు ముందుకు వచ్చారని ఓ గవర్నర్ అనుమానించడం, భావించడం తప్పు. అందుకు స్పష్టమైన ఆధారాలు ఉండాలి. అప్పుడే ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా లేకపోవడమో, అనవసరమైన ఖర్చు ఎందుకనో, మరే కారణంగానో భిన్న విధానాలు, సిద్ధాంతాలు కలిగిన పార్టీలకు కూడా మద్దతుకు ముందుకు రావచ్చు. ఓ పార్టీ నాయకుడు ఒప్పుకోకపోయినా, అందుకు భిన్నంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతివ్వవచ్చు’ అని రామేశ్వర ప్రసాద్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అంతేకాకుండా ‘ఈ కారణంగా అసెంబ్లీని రద్దు చేయవచ్చనే ఉద్దేశంతో అసెంబ్లీ రద్దుకు గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వం ఏర్పాటుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయా, లేవా అన్న విషయాన్ని పరిశీలించాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం లేదని సుస్పష్టంగా భావించినప్పుడు మాత్రమే అసెంబ్లీ రద్దుకు నిర్ణయం తీసుకోవాలి’ అని ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ రెండు తీర్పుల కారణంగా కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ మాలిక్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు రేపు తప్పు పట్టవచ్చు. అంత మాత్రాన అసెంబ్లీని గవర్నర్ పునరుద్ధరిస్తారని భావించలేం. అలా పునరుద్ధరిస్తే తప్పు ఒప్పుకున్నట్లు అవుతుందని గవర్నర్ భావించవచ్చు. గవర్నర్ నిర్ణయం తప్పో, ఒప్పో చెబుతానుగాని, రాజ్యాంగపరంగా ఆయన నిర్వహించాల్సిన విధుల్లో తాను జోక్యం చేసుకోనని సుప్రీం కోర్టు చెబుతుంది. అందుకనే గతంలో ఓ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టినా, ఆ అసెంబ్లీని పునరుద్ధరించకపోగా ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటయింది. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోవడం దేశంలోని గవర్నర్లకు అలవాటుగాను, పరిపాటుగాను మారిపోయింది. అందుకే అప్పుడప్పుడు గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలనే నినాదం బయటకు వస్తుంది. దీన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏదోనాడు సుప్రీం కోర్టే జోక్యం చేసుకోవాలేమో!? -
పాక్ కనుసన్నల్లో కశ్మీర్ పార్టీలు
న్యూఢిల్లీ/శ్రీనగర్: కశ్మీర్ అసెంబ్లీ రద్దయ్యాక గురువారం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. పాకిస్తాన్ ప్రోద్బలంతోనే బద్ధ శత్రువులైన పీడీపీ, ఎన్సీలు చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాయన్న బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ వ్యాఖ్యలపై ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణల్ని రుజువుచేయాలని లేదంటే క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో రామ్ మాధవ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరిగే అవకాశాలున్నాయని వచ్చిన నివేదికల్ని బహిర్గతం చేయాలని గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను ఒమర్ కోరారు. కశ్మీర్ ప్రాంతీయ పార్టీలు పాక్ కనుసన్నల్లో పనిచేస్తున్నాయన్న బీజేపీ వ్యాఖ్యలపై రాష్ట్ర మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. బీజేపీతో పొత్తుపెట్టుకున్నప్పుడు మాత్రం పీడీపీ, ఎన్సీల దేశభక్తి, విశ్వసనీయతను ఆ పార్టీ ప్రశ్నించలేదని అన్నారు. ‘ఒక పార్టీ జాతీయవాదం, దేశభక్తిని ఎలా నిర్ణయిస్తారు. కేంద్రంతో ఉంటే దేశభక్తులు.. లేకుంటే జాతి వ్యతిరేకులా?’ అని సూటిగా ప్రశ్నించారు. కలసి పోటీచేయగలరా?: రామ్ మాధవ్ బీజేపీ, ఎన్సీల మధ్య ట్వీటర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. పీడీపీ, ఎన్సీల స్నేహం నిజమైనదైతే వచ్చే ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీలు కలసి పోటీచేయాలని కశ్మీర్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జీ రామ్ మాధవ్ సవాలు విసిరారు. ప్రభుత్వ ఏర్పాటుకు కలసిరావాలని కశ్మీర్ ప్రాంతీయ పార్టీలకు పాక్ నుంచి ఆదేశాలు అందాయన్నారు. పాక్ సూచనల మేరకు ఎన్సీ, పీడీపీలు స్థానిక సంస్థల ఎన్నికల్ని బహిష్కరించాయన్నారు. మాధవ్ ఆరోపణల్ని ఒమర్ అబ్దుల్లా తిప్పికొడుతూ ‘ ఐబీ, రా, సీబీఐ లాంటి సంస్థలు మీ నియంత్రణలోనే ఉన్నాయి. ధైర్యముంటే మీ ఆరోపణల్ని నిరూపించే సాక్ష్యాలు బయటపెట్టండి’ అని డిమాండ్ చేశారు. దీనికి మాధవ్ బదులిస్తూ ‘ మీ దేశభక్తిని శంకించడం లేదు. కానీ పీడీపీ, ఎన్సీల మధ్య హఠాత్తుగా పుట్టుకొచ్చిన ప్రేమ సందేహాలకు తావిస్తోంది. విదేశీ ఒత్తిడి లేదని లేదంటున్నారు కాబట్టి నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీచేసి మీ మధ్య స్నేహం నిజమైనదే అని నిరూపించండి’ అని అన్నారు. ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు.. కేంద్రం ఒత్తిడితోనే అసెంబ్లీని రద్దుచేశారన్న ఆరోపణల్ని గవర్నర్ తోసిపుచ్చారు. ‘భారీ స్థాయిలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు నివేదికలొస్తున్నాయి. ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. తెరచాటుగా చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయి. తన వర్గం ఎమ్మెల్యేలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) సాకుతో బెదిరిస్తున్నారని మెహబూబా ఆరోపించారు. మరో వర్గం ఎమ్మెల్యేలకు గుర్తుతెలియని వారు భారీగా డబ్బు ఆశ చూపారు. ఈ బేరసారాలు 20 రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి’ అని మీడియాకు వివరించారు. మే లోపే ఎన్నికలు: సీఈసీ కశ్మీర్లో మే లోపు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్‌సభ ఎన్నికల కన్నా ముందే అక్కడ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రావత్ చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అసెంబ్లీ రద్దయితే ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాలి. కశ్మీర్ విషయంలో ఆ గడువు మే వరకు ఉంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొనే పోలింగ్ తేదీల్ని ఖరారుచేస్తామని రావత్ చెప్పారు. అసెంబ్లీ రద్దయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోందని, తెలంగాణలోనూ ఇదే నియమాన్ని వర్తింపజేస్తున్నామని తెలిపారు. మెహబూబాకే మేలు! కశ్మీర్ రాజకీయ డ్రామాలో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీదే విజయమా? కాంగ్రెస్, ఎన్సీ మద్దతుతో ఆమె ముఖ్యమంత్రి కాకుండా గవర్నర్ సత్యపాల్ మాలిక్ అడ్డుకోవడం తాత్కాలికమేనా? అంటే..అసెంబ్లీ రద్దు పరోక్షంగా బీజేపీకి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజ్జన్ గని లోన్ని సీఎం చేసి కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటుచేయాలనుకున్న బీజేపీ ప్రయత్నాలకు అసెంబ్లీ రద్దుతో గండిపడినట్లయింది. పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్‌లు తమకున్న ఎమ్మెల్యేల బలంతోనే ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నాయని, ఈ ఆలోచన ప్రతిపాదిత కూటమికి మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. జూన్ 19న పీడీపీ–బీజేపీ సంకీర్ణం కుప్పకూలిన తరువాత పీడీపీ అస్తిత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జన్ గని బీజేపీతో చేతులు కలిపి సీఎం అవుతారనే ప్రచారంతో..కొందరు పీడీపీ సభ్యులు ఆయన గూట్లో చేరారు. బుధవారం మధ్యాహ్నం వరకు అత్యంత నిరాశాజనకంగా ఉన్న పీడీపీ శిబిరంలో ఒక్కసారిగా ఆశావహ వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీల మద్దతు తనకు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ రాయడం ద్వారా ముఫ్తీ.. సజ్జద్ ఫ్రంట్‌లోకి మరిన్ని వలసల్ని నిలువరించారు. గవర్నర్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయాలని మెహబూబా యోచిస్తున్నట్లు సమాచారం. -
అసెంబ్లీ రద్దు అనుచితం
సరిగ్గా అయిదు నెలలక్రితం పీడీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత జమ్మూ– కశ్మీర్లో రాజకీయం వేడెక్కింది. చకచకా జరిగిన పరిణామాల పర్యవసానంగా హఠాత్తుగా బుధవారం అసెంబ్లీ రద్దయింది. ఎప్పుడూ పరస్పరం కత్తులు నూరుకునే ప్రాంతీయ పక్షాలు మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ, ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్‌లు కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేయడం మొదలు పెట్టగానే బీజేపీ నాయకత్వం అప్రమత్తమైంది. ఫలితంగా పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్ గని లోన్ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇప్పించాలంటూ వాట్సాప్ మాధ్యమం ద్వారా గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు లేఖ పంపారు. తాము లేఖ ఇవ్వబోతే గవర్నర్ కార్యాలయం స్పందించలేదని, దాన్ని ఫ్యాక్స్ చేయడానికి ప్రయత్నిస్తే అవాంతరాలు వచ్చాయని మెహబూబా చెబుతున్నారు. కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు రాష్ట్రాల్లో తమకనుకూలమైన పరిస్థితులు ఉంటే ఒకరకంగా, లేనట్టయితే మరో రకంగా వ్యవహరించడం మన దేశంలో రివాజుగా మారింది. ఈ సంస్కృతిని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీయే అయినా ఇతర పక్షాలు కూడా అందుకు భిన్నంగా లేవు. ఇష్టానుసారం ప్రభుత్వాలను బర్తరఫ్ చేయడం, బలహీనులకు అధికారం కట్టబెట్టడం ఆనవాయితీ అయింది. ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డాక ఈ ధోరణికి కాస్త అడ్డుకట్ట పడినా పూర్తిగా సమసిపోలేదు. ఇప్పుడు జమ్మూ–కశ్మీర్ గవర్నర్ చేసింది ఇటువంటిదే. 87మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసే పార్టీకి లేదా కూటమికి కనీసం 44మంది మద్దతు అవసరం. సభలో 28మంది సభ్యులున్న పీడీపీ, 12మంది సభ్యులున్న కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. 15మంది సభ్యులున్న నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) దీనికి బయటినుంచి మద్దతిస్తానని చెప్పింది. అంటే మొత్తంగా ఈ పార్టీలకు 56మంది ఎమ్మెల్యేలున్నట్టు లెక్క. అటు సజ్జాద్ తమకు 25మంది సభ్యులున్న బీజేపీతోపాటు మరో 18మంది ఎమ్మెల్యేల మద్దతున్నదని గవర్నర్‌కు పంపిన లేఖలో చెప్పారు. అంటే ఆ పక్షం తమకు 44మంది సభ్యుల బలం ఉందని చెప్పింది. ఇక్కడ న్యాయంగా గవర్నర్ విశ్వసించాల్సింది ఎవరిని? సజ్జాద్ పార్టీకి ఆయనతోపాటు మరో ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఈ ఇద్దరికీ బీజేపీ మద్దతు ఉన్నట్టు అర్ధమవుతూనే ఉంది. కానీ మరో 18మంది ఎక్కణ్ణుంచి వచ్చినట్టు? సజ్జాద్ వారి పేర్లు ఇచ్చారా? ఆ ఎమ్మెల్యేల నుంచి వచ్చిన మద్దతు లేఖలు గవర్నర్‌కి సమర్పించారా? ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధపడిన రెండు పక్షాల్లో ఎవరికీ సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పే సత్తా లేదన్న నిర్ణయానికి ఆయనెలా వచ్చినట్టు? వాస్తవానికి పీడీపీలో చీలిక తీసుకొచ్చి, తమ సన్నిహితుడు సజ్జాద్ గని లోన్‌కు అధికార పగ్గాలు కట్టబెట్టాలని బీజేపీ కొంతకాలంగా అనుకుంటోంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు 2020 డిసెంబర్‌తో ముగుస్తుంది. ప్రస్తుతానికి సజ్జాద్‌తో నెట్టుకొచ్చి, ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేయించి ఆర్నెల్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలతోపాటు దానికి కూడా ఎన్నికలు జరిపించాలని బీజేపీ వ్యూహం రచించింది. ఈ విషయం మీడియాలో గుప్పుమన్నా పీడీపీలో మొదట్లో పెద్దగా కదలిక లేదు. తగినంత రాజకీయ అనుభవం లేకనో, తమ పార్టీనుంచి ఎవరూ బయటికి పోరన్న ధీమానో... మొత్తానికి మెహబూబా నిర్లిప్తంగా ఉండిపోయారు. కానీ మంగళవారం ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ఎంపీ ముజఫర్ హుస్సేన్ బేగ్ చేసిన ప్రకటనతో ఆమె మేల్కొన్నారు. సజ్జాద్ తన కుమారుడితో సమానమని ఆయన చెప్పడంతో కొందరు ఎమ్మెల్యేలు జారుకునేలా ఉన్నారని మెహబూబాకు అర్ధమైంది. అందుకే బుధవారం ఆదరా బాదరాగా కాంగ్రెస్, ఎన్సీలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రాజకీయాల సంగతెలా ఉన్నా...జమ్మూ–కశ్మీర్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న సున్నితమైన ప్రాంతం. అక్కడ అటు వేర్పాటువాదం, ఇటు ఉగ్రవాదం దశాబ్దాలుగా సమస్యగా మారాయి. అందుకే అక్కడ అస్థిరత నెలకొన్నప్పుడు ప్రధాన రాజకీయ పక్షాలు, కేంద్ర ప్రభుత్వమూ ఆచి తూచి అడుగులేయాలి. తమకు అలవాటైన రాజకీయపుటెత్తులు అక్కడ ప్రయోగిస్తే పరిస్థితి వికటిస్తుంది. అది దేశ ప్రయో జనాలకు చేటు తెస్తుంది. తాజా పరిణామాలపై బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు విపరీత ధోరణులతో ఉన్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రధాన పక్షాలూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ నడంలో కుట్ర దాగున్నదని అనడం అత్యంత దారుణం. ప్రజలెన్నుకున్న పార్టీలు తమ విభేదాలు మరిచి ఒకటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనడం ఏమంత అపరాధం? ఎలాంటి కుట్ర? వాస్తవానికి జమ్మూ–కశ్మీర్లో ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో గవర్నర్ పాలన కన్నా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం ఉండటం అత్యవసరం. రెండేళ్ల వ్యవధి ఉండగానే అసెంబ్లీ రద్దు చేయడం తప్పుడు సంకేతాలు పంపుతుంది. గవర్నర్ అన్ని ప్రత్యామ్నాయాలూ పరిశీలించి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా లేదని సంతృప్తి చెందాక ఆ నిర్ణయా నికొస్తే ఎవరూ అభ్యంతరం చెప్పరు. అందుకోసం అసెంబ్లీని సమావేశపరిచి అక్కడే బలా బలాలు తేలిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేది. కానీ దానికి విరుద్ధంగా జమ్మూ–కశ్మీర్లో బూటకపు ప్రజాస్వామ్యం నడుస్తున్నదన్న వేర్పాటువాదుల ప్రచారానికి బలం చేకూర్చే విధంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే వ్యవహరించడం విడ్డూరం. అసెంబ్లీ రద్దు అంశాన్ని ఏ పార్టీ అయినా కోర్టులో సవాలు చేస్తే గవర్నర్ నిర్ణయం న్యాయ పరీక్షకు నిలబడుతుందా అన్నది సందేహమే. రాజకీయ పక్షాల బలాబలాలు తేలాల్సింది చట్టసభల్లో తప్ప రాజ్భవన్లలో కాదని పలుమార్లు న్యాయ స్థానాలు స్పష్టం చేశాయి. అయినా స్వీయ రాజకీయ ప్రయోజనాలకోసం ఎంతకైనా తెగించటం అధికారంలో ఉన్నవారికి అలవాటైపోయింది. ఇది విచారకరం. -
దీదీనే పీఎం అభ్యర్థి..
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయేతర ఫ్రంట్‌కు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని అభ్యర్థిగా సారథ్యం వహిస్తారని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా సంకేతాలు పంపారు. అబ్దుల్లా శుక్రవారం కోల్‌కతాలో మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. మమతా బెనర్జీ బెంగాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అందించేందుకు ఆమెను జాతీయ రాజకీయాల్లోకి తీసుకువెళతామని దీదీతో భేటీ అనంతరం ఆయన చెప్పారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై తాము చర్చించామని, మైనారిటీలు ఎదుర్కొంటున్న భయానక వాతావరణంపై భీతిల్లామన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్, తృణమూల్ వైఖరుల్లో ఎలాంటి వైరుధ్యం లేదని అన్నారు. బీజేపీని వ్యతిరేకించే వారంతా తమతో చేతులు కలపవచ్చని, ఆ పార్టీని మట్టికరిపించేందుకు తమతో కలిసిరావాలని పిలుపు ఇచ్చారు. మరోవైపు బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలన్నీ సమిష్టిగా ప్రజల పక్షాన పోరాడాలని మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు. బీజేపీ పాలన నియంత పోకడలను తలపిస్తోందని ఆరోపించారు. -
మార్ఫింగ్ కానేకాదు.. నిజం
ఒక్క ఫోటో.. ఒకే ఒక్క ఫోటో... నిన్న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇంటర్నెట్ను షేక్ చేసి పడేసింది. మాజీ ప్రధాని దేవె గౌడ తన ఇంట్లో బెడ్‌పై యోగా చేస్తున్న ఫోటో ఒక్కటి విపరీతంగా చక్కర్లు కొట్టింది. జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆ ఫోటోను ట్వీట్ చేయగా.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ‘అది మార్ఫింగ్ కాదు కదా?’ అని ప్రశ్నించటం, నేతలతోపాటు పలువురు సెలబ్రిటీలు, మరికొందరు ఆ ఫోటోను సరదాగా రీట్వీట్ చేయటం... నిన్నంతా ఈ ఫోటోనే హల్ చల్ చేసింది. అయితే కాసేపటికే ఆయన బెడ్ రూమ్‌లో యోగా చేస్తున్న ఫోటోలు మొత్తం బయటికి వచ్చేశాయి. ‘తాను ప్రతీరోజు ఆసనాలు వేస్తానని.. యోగా డే సందర్భంగా కాస్త ఎక్కువ సేపే చేశానని’ ఈ సందర్భంగా దెవె గౌడ స్థానిక మీడియాతో కూడా చెప్పారు. ఇంతకు ముందు ప్రధాని మోదీ ఫిట్నెస్ ఛాలెంజ్‌కు కర్ణాటక సీఎం కుమారస్వామి రియాక్ట్ కాకపోయినా.. 86 ఏళ్ల ఈ మాజీ పీఎం మాత్రం స్పందించినట్లు కొన్ని ఫోటోలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు బెడ్రూమ్లో ఆసనాలతో ఆయన చేసిన ఫోటోషూట్ తెగ వైరల్ అవుతోంది. ఇక ట్రోలింగ్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకోండి. Deve Gowda on #WorldYogaDay is my new spirit animal. pic.twitter.com/7L0ZQN4kJn — Sayantan Ghosh (@sayantansunnyg) 21 June 2018 When you win only 37 seats in the polls, but life still comes up trumps....#InternationalDayofYoga2018 #HDDeveGowda pic.twitter.com/WH4WFBc3M0 — Nistula Hebbar (@nistula) 21 June 2018 #India's former prime minister HD Deve Gowda with some of the moves on #WorldYogaDay in his bedroom. 🙄🙄 🙈 (h/t @nistula) pic.twitter.com/B8pFoLBVo0 — Bhuvan Bagga (@Bhuvanbagga) 21 June 2018 Former Prime Minister of India, H.D. Devegowda, 85, alliance partner of @INCIndia, in throes of International Yoga Day in his bedroom in Bengaluru. NDA alliance partner Nitish Kumar did not celebrate International Yoga Day in Patna. pic.twitter.com/W9YgBl9QQs — Shivam Vij (@DilliDurAst) 21 June 2018 Devegowda and Yoga 🧘♂️ ! pic.twitter.com/zbW6fWSTdc — Vishweshwar Bhat (@VishweshwarBhat) 21 June 2018 Deve Gowda on #WorldYogaDay is a mood. pic.twitter.com/5cw74k1JKT — ¯\_(ツ)_/¯ (@karishmau) 21 June 2018 Confusion > Either he is doing yoga or Sleeping ??? More Confusion > What Media people are shooting ??? — AmAr K ChAndrA (@iamAKC7432) 21 June 2018 what media is doing in his bedroom? — Anant (@TooMuchToSay_) 21 June 2018 Looks like he’s singing ‘Pehla Nasha’ 😂 — Harsha (@harsha_rama) 21 June 2018 Good heavens what is this — Sudeshna (@SudeshnaShome) 21 June 2018 Jab mujhe school jaane ka man nahi hota tha, This was my yoga pose. — Puneet (@PuneetVuneet) 21 June 2018 -
పీడీపీలో చీలిక ఏర్పడే అవకాశం!!
శ్రీనగర్ : అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య కశ్మీర్లో గవర్నర్ పాలన విధించిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ 92 కింద గవర్నర్ పాలనను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఎన్ఎన్ వోహ్రా.. అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచుతున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం జమ్ము కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఓ జాతీయ మీడియాకు గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పీడీపీ(పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ)లో చీలిక ఏర్పడే అవకాశం ఉందన్న అబ్దుల్లా.. మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు పీడీపీలోని ఓ వర్గం బీజేపీలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు. అధికారమే పరమావధిగా భావించే బీజేపీ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనకాడబోదన్నారు. ‘మా పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టిందంటూ’ బీజేపీ నేత, కశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవిందర్ గుప్తా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అబ్దుల్లా వ్యాఖ్యానించారు. అసెంబ్లీని రద్దు చేయాలి.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా గవర్నర్ వోహ్రా పదవీ కాలాన్ని పొడగించడం సరైన నిర్ణయమని అబ్దుల్లా పేర్కొన్నారు. అయితే జమ్ము కశ్మీర్ అసెంబ్లీని వెంటనే రద్దు చేయాలని.. లేనిపక్షంలో బీజేపీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీ ముందుకు రాని నేపథ్యంలో అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచడం వల్ల ప్రజా ధనం దుర్వినియోగమవుతుందని వ్యాఖ్యానించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యానే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని... అయితే బీజేపీ ఎత్తుగడలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న అశాంతికి బీజేపీ, పీడీపీల అధికార దాహమే కారణమని ఆయన ఆరోపించారు. -
శ్రీనగర్ డౌన్టౌన్లో బీభత్సకాండ
శ్రీనగర్: రంజాన్ మాసంలో దూకుడు వద్దన్న కేంద్రం ఆదేశాలకు విరుద్ధంగా సీఆర్పీఎఫ్ వాహనంతో పౌరులను తొక్కి చంపేసిన ఘటన జమ్ముకశ్మీర్‌లో మళ్లీ అలజడికి దారితీసింది. శ్రీనగర్ డౌన్టౌన్లో బీభత్సం సృష్టించి, ముగ్గురి దుర్మరణానికి కారణమైన సీఆర్పీఎఫ్ వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అతిత్వరలోనే అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో తాజా ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. ఏం జరిగింది?: ఓ ఉన్నతాధికారిని ఇంట్లో దిగబెట్టిన సీఆర్పీఎఫ్ వాహనం.. నౌహట్టా ప్రాంతం మీదుగా తిరిగివెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. రంజాన్ మాసం, అందునా శుక్రవారం కావడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో రోడ్లపై గుమ్మికూడారు. సాధారణంగా అటువైపునకు రాని సీఆర్పీఎఫ్ వాహనాన్నిచూసి అక్కడివారు ఒకింత ఆగ్రహానికి గురై, జిప్సీకి ఎదురెళ్లారు. దీంతో ఆ డ్రైవర్ ఒక్కసారే వేగం పెంచి, జనంపైకి దూసుకెళ్లాడు. ఈక్రమంలో జీపుకింద నలిగిపోయి ఇద్దరు చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ మరొకరు ఆస్పత్రిలో కన్నుమూశారు. నిరసన కారులు సీఆర్పీఎఫ్ వాహనాన్ని ధ్వంసం చేయగా, డ్రైవర్ చాకచక్యంగా అక్కడినుంచి ప్రాణాలతో బయటపడగలిగాడు. బుల్లెట్లతో చేసే పనిని జీపుతో చేస్తున్నారా?: ‘‘రంజాన్ మాసంలో ఉద్రిక్తతలకు తావు ఇవ్వరాదని కేంద్రం చెప్పింది. అయినాసరే ఆందోళనకారుల్ని రెచ్చగొట్టేరీతిలో డౌన్‌టౌన్ మీదుగా సీఆర్పీఎఫ్ వాహనానికి అనుమతించారు. కాల్పుల విరమణ అంటూనే బుల్లెట్లతో రోజూ చేసే(చంపేసే) పనిని జీపుతో చేస్తున్నారా?’’ అని మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. మొత్తం ఫుటేజీ చూశాక మాట్లాడండి: కాగా, జరిగిన ఘటనలో సీఆర్పీఎఫ్ తప్పుపట్టాల్సిన పనిలేదని, కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే బయటికొచ్చాయని, మొత్తం వీడియో ఫుటేజీ చూస్తే తప్పు ఎవరిదో తెలుస్తుందని జమ్ముకశ్మీర పోలీసు అధికారులు అన్నారు. జూన్ 28 నుంచి అమర్నాథ్ యాత్ర: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర జూన్ 28 నుంచి ఇదే జమ్ములో ప్రారంభంకానుంది. ఇందుకోసం ఇప్పటికే సుమారు 1.8 లక్షల మంది భక్తులు పేర్లను నమోదు చేయించుకున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ దఫా మూడు వారాలు అదనంగా యాత్ర కొనసాగనుండటం విశేషం. అమర్నాథ్ ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒకటిరెండు రోజుల్లో శ్రీనగర్ వెళ్లనున్నారు. భద్రతా బలగాలతోపాటు పలువురు వేర్పాటువాద నేతలతోనూ ఆయన మంతనాలు చేయనున్నారు. శుక్రవారం నాటి సీఆర్పీఎఫ్ వాహన బీభత్సకాండపై హోం మంత్రి ఓ ప్రకటన చేసే అవకాశంఉంది. -
కశ్మీర్లో మళ్లీ రెచ్చిపోయిన అల్లరిమూకలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో స్కూల్ బస్‌పై రాళ్ల దాడి ఘటన మరువకముందే సోమవారం మరో బస్సుపై దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన పర్యాటకుడు కన్ను మూశారు. పలువురు పర్యాటకులు, స్థానికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి చెన్నైకి చెందిన ఆర్.తిరుమణి(22) గా గుర్తించారు.ఆదివారం సోఫియాన్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు హిజ్బుల్ ముజాయిద్దీన్ తీవ్రవాదులను సైన్యం మట్టుబెట్టడంతో దీనికి వ్యతిరేకంగా వేర్పాటువాదులు ఆందోళనలు నిర్వహించారు. జాతీయ రహదారిపై ఆందోళనకు దిగిన నిరసనకారులు ఒక్కసారిగా టూరిస్ట్‌ల వాహనాలపై రాళ్లదాడికి దిగారు. ఈ దాడిలో తిరుమణికి తీవ్రగాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడే మరణించాడు. ఈ ఘటనపై ఎస్పీ తెజిందర్ సింగ్ మాట్లాడుతూ.. దుండగులపై కేసు నమోదు చేశాము. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. సిగ్గుతో తలదించుకుంటున్నాం: మెహబూబా ముఫ్తి రాళ్లదాడిలో మరణించిన చెన్నై పర్యాటకుడు తిరుమణి కుంటుంబనికి జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ విషాదకర ఘటన జరిగినందుకు క్షమించాలని తిరుమణి తల్లిదండ్రులను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ ఈ ఘటన జరిగినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను. నిందితులను ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టం. వారికి తగిన శిక్ష పడేలా చేస్తాం’ అని తెలిపారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: ఓమర్ రాళ్ల దాడిని ప్రతిపక్షనేత ఓమర్ అబ్దుల్లా సైతం తీవ్రంగా ఖండించారు.అమాయకులపై రాళ్ల దాడి చేయడం సిగ్గు చేటని తెలిపారు. నిరసనకారులు పద్దతి, వారి ఆలోచనలు సరైనవి కాదన్నారు.‘ తిరుమణి కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి’ అని ఓమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. -
జమ్మూకశ్మీర్ లో స్కూల్ బస్సుపై రాళ్ల దాడి..
శ్రీనగర్: జమ్మూ-కశ్మీరులో అల్లరి మూకలు రోజురోజూకి రెచ్చిపోతున్నారు. ఏదో ఒక నెపంతో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. మానవత్వం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అభం శుభం తెలియని స్కూలు చిన్నారులు ప్రయాణిస్తున్న బస్సుపై బుధవారం ఉదయం అల్లరి మూకలు రాళ్లు రువ్వారు. షోపియాన్ జిల్లా, కానిపొర గ్రామంలో జరిగిన ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులకు గాయలయ్యాయి. కాగా ఒక్కసారిగా రాళ్లదాడి జరగడంతో విద్యార్థులంతా దిక్కుతోచని స్థితిలో పరుగులు పెట్టారు. గాయపడిన విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ఇద్దరిలో రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని, మరో విద్యార్థికి పెద్దగా ప్రమాదం ఏమి లేదని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ..రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ బస్సుపై దాడి జరిగిన సమయంలో 50 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని తెలిపారు. వీరంతా దాదాపు నాలుగేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ వయసువారేనని చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి తండ్రి మాట్లాడుతూ తన కుమారుడిపై జరిగిన దాడి మానవత్వానికే వ్యతిరేకమని అన్నారు. ఎవరి బిడ్డకైనా ఇలా జరగవచ్చునన్నారు. మరోవైపు ఈ ఘటనను ముఖ్యమంత్రి మహబూబ ముఫ్తీ, ప్రతిపక్షనేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండిస్తూ, పిరికిపంద చర్యగా వర్ణించారు. పసిపిల్లలపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి మహబూబ ముఫ్తీ హామీ ఇచ్చారు. రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి -
‘రాహుల్..మోదీ సవాల్‌ను స్వీకరించు’
సాక్షి, శ్రీనగర్ : కర్ణాటకలో పాలక కాంగ్రెస్ విజయాలపై 15 నిమిషాల పాటు పేపర్ చూడకుండా ప్రసంగించాలని ప్రధాని నరేంద్ర మోదీ విసిరిన సవాల్‌ను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్వీకరించాలని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా సూచించారు. ‘ప్రధాని సవాల్‌ను రాహుల్ అంగీకరిస్తారని ఆశిస్తున్నా...ఇక ప్రధాని నరేంద్ర మోదీ రెండు నిమిషాల పాటు మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగికదాడులపై మాట్లాడాలని తాము కోరుతున్నా’మని ఒమర్ ట్వీట్ చేశారు.కాగా, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రాహుల్‌ను ఉద్దేశించి కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ సాధించిన విజయాలపై ఎలాంటి పేపర్ చూడకుండా 15 నిమిషాల పాటు ఏ భాషలోనైనా ప్రసంగించాలని సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఏ పార్టీకి అధికారం అప్పగించాలో అప్పుడు కర్ణాటక ప్రజలే నిర్ణయిస్తారని మోదీ ఎన్నికల ప్రచార ర్యాలీలో పేర్కొన్నారు. మరోవైపు జమ్మూకాశ్మీర్‌లోని పీడీపీ-బీజేపీ సర్కార్ కథువాలో మైనర్ బాలికపై హత్యాచారం కేసును చేపడుతున్న తీరుపై ఒమర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రేపిస్టులకు అనుకూలంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నఇద్దరు బీజేపీ మంత్రులను తొలగించిన ప్రభుత్వం, అదే ర్యాలీకి హాజరైన ఎమ్మెల్యేకు మాత్రం మంత్రి పదవి కట్టబెట్టారని విమర్శించారు. కథువా కేసుపై బీజేపీ, పీడీపీ సర్కార్ గందరగోళంగా వ్యవహరిస్తోందన్నారు. -
మోదీ.. మాట్లాడు
న్యూఢిల్లీ: అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిని ఓ ఆలయంలో బంధించి ఎనిమిది రోజులపాటు గ్యాంగ్ రేప్ చేసి చివరికి కొట్టిచంపేసిన దారుణ ఘటన దేశాన్ని కదిలిస్తున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ‘మోదీ.. మాట్లాడు’ అంటూ సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతున్నది. జమ్మూ కశ్మీరులోని కథువా జిల్లా హీరానగర్ మండల పరిధిలోని రస్సానాలో ఆసిఫా అనే ఎనిమిదేళ్ల బాలిక హత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా సంచలనంగా మారింది. అన్ని మాట్లాడతారుగా ఇప్పుడేమైంది మోదీజీ?: ‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. మీ మౌనం ఏమాత్రం అంగీకారం కాదు. చిన్నపిల్లలు, మహిళలపై నానాటికీ పెరిగిపోతున్న దురాగతాల గురించి మీరేమనుకుంటున్నారు? దారుణాలకు పాల్పడిన నిందితులకు ప్రభుత్వాలు అండగా నిలవడం ఎంతవరకు సమంజసం?’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మరో అడుగు ముందుకేసి మోదీని తూర్పారబట్టారు. ‘‘మన్‌కీ బాత్ అనో, ఇంకో పేరుతోనో నిత్యం మీ ఆలోచనలను, మాటలను దేశ ప్రజలతో పంచుకుంటారే.. మరి ఎనిమిదేళ్ల చిన్నారిని దారుణంగా చిదిమేస్తే, నిందితులను బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కాపాడుతుంటే మీరు నోరు తెరవకపోవడం ఏమైనా బాగుందా? ఎప్పుడూ మీకు అవసరమైన విషయాలమీదే మాట్లాడతారా? ఇతరులకు అత్యవసరమైన విషయాలమీద నోరు మెదపరా?’’ అని అబ్దుల్లా ఫైరయ్యారు. అసలేం జరిగింది?: జనవరి 11న కథువాకు చెందిన ముస్లిం బాలిక ఆసిఫా(8) ఇంటి పరిసరాల్లో గుర్రాలను మేపుతుండగా అదృశ్యమైంది. పాప తండ్రి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. జనవరి 17న సమీపంలోని అడవిలో పాప మృతదేహం దొరికింది. బాలికకు డ్రగ్స్ ఇచ్చి దారుణంగా గ్యాంగ్ రేప్ చేసినట్లు పోస్ట్‌మార్టంలో తేలింది. అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి సాంజీరామ్.. ఆసిఫాపై అత్యాచారం చేయాలంటూ తన కుటుంబీకులను ఉసిగొల్పాడు. బాలికను క్రూరమృగాలకంటే దారుణంగా చిదిమేసినవారిలో పోలీసులు కూడా ఉండటం గమనార్హం. సాంజీరామ్కే చెందిన ఆలయంలో పాపను బంధించి మత్తుమందు ఇస్తూ ఒకరితర్వాత మరొకరు అత్యాచారం చేశారు. తొలుత సాంజీరామ్ మేనల్లుడు, వాడి స్నేహితుడు కలిసి బాలికపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత మీరట్(యూపీ) నుంచి వచ్చిన సాంజీరామ్ కుమారుడు విశాల్, పోలీసు అధికారి దీపక్ ఖజూరియా, మరో ఇద్దరు స్పెషల్ పోలీసులూ చిన్నారిపైకి ఎగబడ్డారు. చివరికి జనవరి 14న సాంజీ మేనల్లుడు.. పాపను కర్రతో కొట్టి చంపేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురిని నిదితులుగా చేర్చారు. ఘటన జరగడానికి కొద్దిరోజుల ముందు.. : ఆసిఫాపై అకృత్యానికి కొద్దిరోజుల ముందు కథువా గ్రామంలో నివసిస్తోన్న బకర్వాల్ వర్గానికి చెందిన ముస్లింలను అక్కడి నుంచి తరిమేయాలని గ్రామపెద్దలు తీర్మానించారు. ముస్లింలు గోవధ, డ్రగ్స్ స్మగ్లింగ్ తదితర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, దానివల్ల తమ పిల్లలు చెడిపోతున్నారన్నది గ్రామపెద్దల ఆలోచన. ఈ క్రమంలోనే ముస్లిముల గుర్రాలను పొలాల్లో మేపనివ్వరాదని, వాళ్లకు భూములు సైతం అమ్మకూడదని సాంజీరామ్, ఇంకొందరు సూచనలు చేశారు. తీర్మానాలు జరిగిన కొన్ని గంటలకే.. తన ఇంటి బయట గుర్రాలను మేపుతున్న ఆసిఫా అపహరణకు గురైంది. -
బీజేపీలోని దోస్తులకు ఒమర్ థ్యాంక్స్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తిరేపిన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫూల్పుర ఉప ఎన్నికలు బీజేపీకి గట్టిషాక్‌ను ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అనూహ్యంగా పుంజుకొని ఘనవిజయం దిశగా సాగుతోంది. ఎస్పీకి బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) మద్దతుగా నిలువడంతో.. బీజేపీకి తన కంచుకోటల్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఎం యోగిఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం, కాషాయ కంచుకోటగా భావించిన గోరఖ్‌పూర్‌లోనూ బీజేపీకి ఎదురుగాలి వీచింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు రాజకీయ సమీకరణాలను నిర్దేశించేవిగా భావించిన ఈ ఎన్నికలు.. కమలం శ్రేణులకు గట్టి గుణపాఠమే నేర్పాయి. అధికార పార్టీగా ఉన్నప్పటికీ, తను రాజీనామా చేసిన సీట్లను ఆ పార్టీ నిలబెట్టుకోకపోవడం మారిన రాజకీయ సమీకరణలను చాటుతోంది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ, మాయావతి అధినేత్రిగా ఉన్న బీఎస్పీ చేతులు కలిపి.. రాజకీయంగా కీలకమైన యూపీలో బీజేపీకి ఎదురుగాలి తప్పదని ఈ ఉప ఎన్నికలు సంకేతం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల ఫలితాలపై రాజకీయ నాయకులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో అఖిలేశ్‌కు, మాయావతికి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. బిహార్‌లోని అరారియా, జెహానాబాద్ ఉప ఎన్నికల్లో ఆర్జేడీ విజయం దిశగా సాగుతుండటంతో ఆ పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కు కూడా మమత కంగ్రాట్స్ చెప్పారు. మరోవైపు ఈ ఫలితాల నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీలోని నా స్నేహితులకు ధన్యవాదాలు. మీ కటోరమైన శ్రమ, నిరంతర కృషితో నా అంచనా తప్పు అని నిరూపించారు. ఇందుకు నేను కృతజ్ఞుడిని. మీ ఫ్రెండ్లీ ప్రతిపక్ష నేత’ అంటూ ఒమర్ ట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి.. గత ఏడాది మార్చిలో చేసిన ట్వీట్‌ను ఉటంకిస్తూ ఆయన ఈ కామెంట్ చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో.. ఇక ప్రతిపక్షాలు 2019 లోక్‌సభ ఎన్నికల సంగతిని మరిచిపోయి.. 2024 ఎన్నికల కోసం సన్నాహాలు ప్రారంభిస్తే మేలు అని ఆయన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ తప్పు అని బీజేపీలోని తన స్నేహితులు నిరూపించారని ఆయన తాజాగా చమత్కరించారు. -
మళ్లీ పెళ్లి కోసం కోర్టుకు మాజీ సీఎం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విడాకుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ వివాహబంధం తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతిందనీ.. కాబట్టి మరో వివాహం చేసుకునేందుకు వీలుగా భార్య పాయల్ నుంచి విడాకులు ఇప్పించాలని విన్నవించారు. వాదనలు విన్న జస్టిస్ సిద్ధార్థ మ్రిదుల్, జస్టిస్ దీపా శర్మల ధర్మాసనం.. ఈ విషయమై ఏప్రిల్ 23లోగా స్పందనను తెలియజేయాలని పాయల్‌ను ఆదేశించింది. ఈ పిటిషన్‌ను త్వరితగతిన విచారించాలన్న ఒమర్ విజ్ఞప్తిపై కూడా పాయల్ అభిప్రాయాన్ని హైకోర్టు కోరింది. 2016, ఆగస్టు 30న తనకు పాయల్ నుంచి విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఒమర్ ట్రయల్‌కోర్టును ఆశ్రయించగా.. ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. తమ వివాహబంధం కోలుకోలేనంతగా దెబ్బతిందని నిరూపించడంలో ఒమర్ విఫలమయ్యారని అప్పట్లో కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఒమర్, పాయల్‌లకు 1994, సెప్టెంబర్ 1న వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. అయితే 2007లో ఒమర్–పాయల్ల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2009 నుంచి వీరు విడిగా ఉంటున్నారు. -
ప్రధాని వేషంతో.. పరేషాన్..!!
న్యూఢిల్లీ: దుమారం రేగుతోంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విమర్శల పాలవుతున్నారు. వారం రోజుల పాటు ఇండియాలో పర్యటించేందుకు ఫిబ్రవరి 17న వచ్చిన ట్రూడో సంప్రదాయానికి భిన్నంగా కాషాయ వస్త్రాలతో కూడిన బాలీవుడ్ వేషధారణలో తిరగడంతో ఈ విమర్శల పరంపర ప్రారంభమైంది. దీనిపై నెటిజన్లు, మీడియా కెనడియన్ ప్రధానిపై మండిపడుతున్నారు. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దీనిపై స్పందిసూ..''ఇంతలా నటించాల్సిన అవసరం లేదు. ట్రూడో వ్యవహారం ఆక్షేపనీయంగా ఉంది. మీలా మేము రోజూ అంత ఆహార్యంగా బట్టలు ధరించలేము. బాలీవుడ్లో కూడా అలాంటి వస్త్రాలు వేసుకోరు'' అంటూ ట్వీట్ చేశారు. ట్రూడో చేతులు జోడించి ప్రజలకు దండాలు పెడుతున్న ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. విమర్శలకు బదులిస్తూ.. ట్రూడో తనకు సంప్రదాయ దుస్తుల అంటే అమితమైన ఇష్టమని తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత తాను సూట్ వేసుకోలేదనా? లేదా సంప్రదాయ దుస్తులు ఎందుకు వేసుకున్నాననా? తేల్చుకోవాలన్నారు. చేతులకు గోరింటాకు పెట్టుకో.. ఓ ట్వీ్టర్ ఖాతాదారుడు 90వ దశకంలో వచ్చిన బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ 'దిల్వాలే దుల్హానియా లేజాయెంగే' చిత్రంలోని సందర్భాన్ని గుర్తుచేస్తూ చేతులకు గోరింటాకు పెట్టుకో.. అని ట్రూడోను గేలీ చేశాడు. ట్రూడో సినిమా ఆడిషన్స్‌కి వచ్చినట్టున్నాడు.. హాస్యనటుడు ట్రెవర్ నొహ ట్రూడోని ఉద్దేశించి..కెనడా ప్రధాని ఆస్కార్ పురస్కార చిత్రం 'స్లమ్‌డాగ్ మిలియనీర్' లోని జయహో పాట ఆడిషన్స్‌కి వచ్చినట్టున్నారని జోక్ పేల్చారు. కాగా వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ట్రూడో చేస్తున్న ఇండియా పర్యటనను 'విపత్తుని కొని తెచ్చే సందర్శన' అంటూ వ్యాఖ్యానించింది. స్వేచ్ఛావహ వాతావరణం గల దేశానికి అధినేత, స్త్రీవాది, సినిమా హీరోని పోలిన రూపం, ప్రజల పక్షపాతి అన్న పేరున్న జస్టిన్ ట్రూడో వ్యవహారం చూసి అందరూ నివ్వెర పోయారని తెలిపింది. ట్రూడో తన వారం రోజుల ఇండియా పర్యటనను ఏ మాత్రం ప్రయోజనం లేకుండా నిరాశతో నింపేశారని చురకలంటించింది.


