జమ్మూకశ్మీర్‌లో ఉన్న ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదని అక్కడి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఏ మతం ప్రజలను చంపమని హింసను ప్రోత్సహించమని చెప్పదని కశ్మీర్ యువతకు ఉగ్రవాదులతో సంబంధాలు లేవన్నారు. ఢిల్లీ ఎర్రకోట బాంబుదాడి కేసులో కొంతమంది కశ్మీర్ డాక్టర్లను అరెస్టు చేసిన నేపథ్యంలో అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఒక విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కశ్మీర్ ప్రజలందరూ టెర్రరిస్టులు కాదు. వారితో సంబంధాలు లేవు. కానీ కొంతమంది మాత్రం ప్రతిసారి ఇక్కడి ప్రశాంతతను దెబ్బతీయాలని, సోదరభావాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కశ్మీర్ యువత ఎవరికివారు ప్రత్యేక మైన భావజాలం కలిగి ఉంటారు. అందరూ ఒకే రకమైన భావజాలం అందరూ టెర్రరిస్టులే అనుకుంటే అది సరైన పద్దతికాదు" అని ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు దాడి కేసులో ప్రధాన నిందితులైన డా.ఒమర్ మహమ్మద్, డా.ముజామిల్ లు పుల్వామాకు చెందిన వారు కాగా డా. ఆదిల్ అనంత్ నాగ్ ప్రాంతానికి చెందిన వారు. వీరిపై ఎన్ఐఏ జరిపిన దర్యాప్తులో వీరికి ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ తో సంబంధాలున్నట్లు తేలింది.
ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల కేసులో సంబంధమున్న వారిని కఠినంగా శిక్షించాలని అదే సందర్భంలో అమాయికులైన వారిని అరెస్టు చేయడం సరికాదని అబ్దుల్లా తెలిపారు. ఎర్రకోట బాంబు పేలుళ్లకు సంబంధించిన భద్రతా వైఫల్యం అంశపైనా ఒమర్ అబ్దుల్లా కేంద్రాన్ని ప్రశ్నించారు.


