న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషన్‌పై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మరోసారి ధ్వజమెత్తింది. కొత్త ఏర్పాటైన ‘సర్’తో ఓటర్ల జాబితాలో తారుమారు జరుగుతుందంటూ మండిపడింది. ఈరోజు(బుధవారం, డిసెంబర్ 31) సీఈసీని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ.. కలిసి పశ్చిమబెంగాల్ ఓటర్ల జాబితా సవరణ అంశానికి సంబంధించి నివేదిక సమర్పించారు. అనంతరం సీఈసీతో చర్చించారు.
అయితే ఆపై బయటకొచ్చిన అభిషేక్ బెనర్జీ.. సీఈసీ టార్గెట్ తీవ్ర విమర్శలు చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్న జ్ఞానేష్ కుమార్‌ను.. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఇష్టమొచ్చినట్లు వాడుకుంటుందని ఘాటు వ్యాఖ్యలుచేశారు.
దేశాన్ని విచ్చిన్నం శక్తిగా జ్ఞానేష్ కుమార్‌ను కేంద్రం ఉపయోగించుకుంటుందన్నారు. తమకు ఈవీఎంల ఓటింగ్‌తో ఎటువంటి సమస్యా లేదని, కానీ ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్నారనే అనుమానం మాత్రం ఉందన్నారు. ‘ మా ప్రశ్నలకు దేనికి కూడా సీఈసీ సరైన క్లారిటీ ఇవ్వలేదు. సుమారు 20 ప్రశ్నల వరకూ సీఈసీని అడిగాం. కానీ వాటిలో స్పష్టత లేదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్‌ను ఓటర్ల జాబితా ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. మీరు తయారు చేస్తున్న ఓటర్ల జాబితాను ప్రజల ముందు బహిర్గతం చేయండి. కనీసం అది కుదరకపోతే.. దాన్ని లాజికల్‌గానైనా నిరూపించండి. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత లేదనేది మా అనుమానం’ అని విమర్శించారు.


