Nizamabad
-
పరవశింపజేసే అందాలు..
ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తీరం ప్రకృతి అందాలతో అలరిస్తోంది. సాయంకాలానికి ముందు నీరు, పచ్చికబయళ్లు, నిలువెత్తున నిలిచిన తాటి చెట్లతో అలరించిన ఆ ప్రాంతం.. సూర్యాస్తమయ సమయానికి ఇలా సిందూర వర్ణంలోకి మారింది. అస్తమిస్తున్న భానుడి కిరణాలు నిశ్చలమైన నీటిలోపడగా ఆ ప్రాంతం బంగారు వర్ణంతో మెరిసిపోయింది. ఈ సుందరమైన దృశ్యాలను డొంకేశ్వర్ మండలం పాత జీజీ నడ్కుడలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వద్ద ‘సాక్షి’ కెమెరాలో బంధించింది. – డొంకేశ్వర్(ఆర్మూర్) -
ప్రజల కోసం పని చేస్తేనే ఆదరణ
● కోర్ కమిటీ సమావేశంలో ఎంపీ అర్వింద్ ● నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ తీరుపై అసహనం? సుభాష్‌నగర్: ‘ప్రజా సమస్యలపై ప్రభుత్వ తీరు ను నియోజకవర్గ నాయకులు ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. పలు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమా లు మచ్చుకు కూడా నిర్వహించడం లేదు. ప్రజల కోసం పని చేసినప్పుడే వారి ఆదరణ దక్కుతుంది. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు ఆశించిన మేరకు జరగడం లేదు’ అని ఎంపీ అర్వింద్ ధర్మపురి కోర్ కమిటీ సమావేశంలో అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆదివారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పా ర్టీ కార్యక్రమాల నిర్వహణపై అర్వింద్ పలు సూచనలు చేసినట్లు సమాచారం. ప్రజల ఆదరణ పొందినవారే వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా ఎంపికయ్యే అవకాశం ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, కోర్ కమిటీ సభ్యులు, ఆయా నియోజకవర్గాల నాయకులు వడ్డి మోహన్‌రెడ్డి, ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి, కంచెట్టి గంగాధర్ పాల్గొన్నారు. -
ఎప్‌సెట్‌లో ‘కాకతీయ’ ప్రభజనం
రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులుఖలీల్వాడి: ఎప్‌సెట్ ఫలితాలలో కాకతీయ కాలేజీ విద్యార్థులు తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన స్టేట్ ర్యాంకులు సాధించినట్లు విద్యాసంస్థల చైర్పర్సన్ విజయలక్ష్మి, డైరెక్టర్ రజినీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తరగతులు, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, వీక్లీ, మంత్లీ పరీక్షలు నిర్వహించడంతోపాటు లెక్చరర్లతో ప్రత్యేకంగా సిలబస్ చెప్పడం ద్వారా ఉత్తమ ఫలితాలు వచ్చాయని అన్నారు. కాకతీయ రెసిడెన్షియల్ కాలేజ్ విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం అభినందించారు. ఎప్‌సెట్‌లో అబ్దుల్ షాహిద్ (3406), ఆత్రిజ్ (3862), ఎ. వచన్ (4974), భవకీర్తన్ (5963), లోక సమీక్ష (6085), ఈ. శరత్చంద్ర (7003), సిద్ధి వినాయక్ (7350), మైరతైతెల్ (7390), సదియా ఫిర్దౌస్ (7830), సుజానా(8450), తుబా ఫాతిమా (9666), ఐషా ఆలం(10990) ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. -
ఇందూరు చరిత్ర మ్యూజియంలోనే..
చరిత్రక నగరాల్లో ఇందూరు ప్రధానమైంది. వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవ జీవన ఆనవాళ్లు ఉన్నాయి. అంతేకాకుండా అతి పురాతనమైన జైన ఆలయాలూ నిర్మించబడ్డాయి. ఉన్నతమైన చరిత్ర కలిగిన జిల్లాలో ఉన్న పురావస్తు పరిశోధన శాఖ కార్యాలయం మూతబడడం, విశేష చారిత్రక ఆధారాలతో ఉన్న మ్యూజియం ప్రజలకు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మ్యూజియాన్ని తెరిపించాలి. – కలువకోట నరేశ్‌కుమార్, విశ్రాంత చరిత్ర విభాగాధిపతి, గిరిరాజ్ కళాశాల మ్యూజియాన్ని తెరవాలి.. చరిత్ర మనకి ఎన్నో పాఠాలను నేర్పుతుంది. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని జాతికి భవిష్యత్ ఉండదని ఎంతోమంది చరిత్రకారులు చెప్పారు. ఎంతో ప్రత్యేకమైన ఇందూరు జి ల్లా చరిత్ర ప్రస్తుత విద్యార్థులకు, యువతకు పరిచయం లేకుండా పోయింది. ఈ కారణంగానే ఇందూరు జిల్లా చారిత్రక పరంగా వెనుకబడిపోయింది. ఈ దుస్థితి నుంచి ఈ జిల్లాను బయటకు తీసుకురావాలి. మూసి ఉన్న మ్యూజియాన్ని తెరిపించాలి. – డాక్టర్ మర్రిపల్లి భూపతి, హిస్టరీ ప్రొఫెసర్ -
ఆధునిక భారత్ నిర్మాణానికి రాజీవ్‌గాంధీ కృషి
నిజామాబాద్ రూరల్: ఆధునిక భారత దేశ నిర్మాణానికి రాజీవ్‌గాంధీ కృషి చేశారని, ఆ యన దూరదృష్టి నేటి యువతకు ప్రేరణగా నిలుస్తోందని డీసీసీ, కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు నగేష్‌రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ అన్నారు. ఇటీవల తమిళనాడులోని చైన్నె నుంచి బయల్దేరిన రాజీవ్ మెమోరియల్ జ్యోతియాత్రకు ఆదివారం వారు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగేశ్‌రెడ్డి మా ట్లాడుతూ రాజీవ్ గాంధీ సేవలను దేశం గ ర్వంగా స్మరించుకుంటోందని, ఆయన తన పాలనలో టెలికమ్యూనికేషన్, సాంకేతిక విజ్ఞానం, విద్యా రంగాల్లో కీలక సంస్కరణ లు చేపట్టి ఆధునిక భారత నిర్మాణానికి బ లమైన పునాది వేశారన్నారు. యువత సాధికారత, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రాష్ట్ర గీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ శేఖర్‌గౌడ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జగడం సుమన్, డీసీసీ ఉపాధ్యక్షుడు కౌడపు శరత్, రఘు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి టూరిజం వీక్ సెలబ్రేషన్స్ సుభాష్‌నగర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు టూరిజం వీక్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా పర్యాటకశాఖ అధికా రి పవన్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎక్స్‌ఫ్లోర్ తెలంగాణ – ఎక్స్పీరియన్స్ ది వరల్డ్’ అనే నినాదంతో నిర్వహించనున్న వారోత్సవాల ద్వారా తెలంగా ణ రాష్ట్ర పర్యాటక వైభవం, వారసత్వ సంప ద, ప్రకృతి సౌందర్యం, పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను ప్రజలకు పరిచయం చేయ డం లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నా మని పేర్కొన్నారు. 18న యువ టూ రిజం క్లబ్‌ల ఏర్పాటు, పోస్టర్ విడుదల, 19న ప ర్యాటక అవగాహన ర్యాలీ, ప్రచార కార్యక్రమం, 20న హెరిటేజ్ వాక్, 21న టూ రిజం ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లతో సమావే శం, 22న స్వచ్ఛతాకార్యక్రమాలు, 23న బ్రాండ్ కిట్ పోస్టర్ విడుదల కార్యక్రమం ని ర్వహిస్తామన్నారు. పర్యాటక అభిమానులు, విద్యార్థులు, యు వత, ట్రావెల్ బ్లాగర్లు, యూట్యూబర్లు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పవన్‌కుమార్ కోరారు. యోగా విజేతలకు బహుమతులు సుభాష్‌నగర్: ఎన్ఎస్సీఎన్పీఎల్ ఆధ్వర్యంలో ఇటీవల నగరంలోని కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో నిర్వహించిన జిల్లాస్థాయి యోగాసన పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. నగరంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న ఆరోగ్య రక్ష యోగా నేచర్ కేర్ సెంటర్లో ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహించగా.. ముఖ్యఅతిథిగా ఎన్ఎస్సీఎన్పీఎల్ ప్రతినిధులు హి తిన్ బీమాని, సీహెచ్ రజినీకాంత్, డీవైఎస్వో పవన్‌కుమార్, ఆరోగ్య రక్ష నిర్వాహకులు డాక్టర్ ఐశ్వర్య కాలే, సీహెచ్ గంగాధ ర్, యోగా గురువులు కమలవాణి, గాయ త్రి, లోహిదాస్ హాజరయ్యారు. పోటీలకు 250 మందికిపైగా హాజరయ్యారని, రెండు విభాగాల్లో పోటీలు నిర్వహించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేశామని యోగా అసోసియేషన్ సెక్రెటరీ గంగాధర్ తెలిపారు. క్రీడాకారులు, యోగా గురువులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
కూనలమ్మలు
కూచిపూడిఆర్మూర్: వేసవి సెలవులను వృథా చేయకుండా ఆర్మూర్‌లోని నటరాజ నృత్యనికేతన్ లో చిన్నారులు ఆంధ్రానాట్యం, కూచిపూడి నేర్చుకుంటున్నారు. మాడవేడి నారాయణ స్థాపించిన నటరాజ నృత్య నికేతన్‌లో నాట్య గురువు డాక్టర్ బాశెట్టి మృణాళిని శిష్యరికంలో సమ్మర్ క్యాంప్‌లో మువ్వల సవ్వడి, అభినయం, లయలతో వేదికలను ఉర్రూతలూగిస్తున్నారు. పట్టణంలోని గంగా ఆస్పత్రి సమీపంలో కళాకారులను బ్యాచులుగా విభజించి నేర్పిస్తున్నారు. చిన్నారులు గజ్జె కట్టి అబ్బురపరిచే నృత్యరీతులతో మెప్పిస్తున్నారు. నేను చాలా చిన్నదాన్ని కాబట్టి మొదట్లో భయం వేసేది. గురువు గారు ప్రోత్సహించారు. ఇప్పుడు స్టేజ్ ఎ క్కితే భయం లేదు.అందరూ నవ్వుతూ చూస్తారు. అ మ్మ ఫో న్లో వీడియో తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టింది. మా చుట్టా లు అందరూ నన్ను ‘డ్యాన్సర్’ అని పిలుస్తున్నారు. – శ్రీవర్షవేసవిలో ఫ్రెండ్స్‌తో కలిసి ఆడదామనుకున్నా. కానీ అమ్మా, నాన్న ఆంధ్ర నాట్యం గురించి చెప్పారు. తెలిసిన వాళ్లు డ్యాన్స్ క్లాస్‌కు వెళ్తుంటే నేను కూడా చేరా. ఇప్పుడు నాకు డ్యాన్సే ప్రాణం అయిపోయింది. – నైనిత యూట్యూబ్‌లో డ్యాన్స్ వీడియోలు చూసి ఇంట్లోనే స్టెప్పులు వేసేదాన్ని. మేడమ్ దగ్గర చేరాక తప్పు, ఒప్పు తెలిసింది. ఇప్పుడు ఆంధ్ర నాట్యంలో మెళకువలు నేర్చుకుంటున్నాను. వేదికలపై నాట్యం చేసి అందరి మన్ననలు పొందాలని ఉంది. – సహస్రకూచిపూడి, ఆంధ్ర నాట్యం రెండూ వేరు అని మేడమ్ చెప్పేవరకు నాకు తెలియదు. ఇప్పుడు రెండూ వచ్చు. స్కూల్స్ ఉన్నప్పుడు రోజూ చదువులు, పరీక్షలతో గడిచి పోయేది. ప్రస్తుత వేసవి సెలవులు నృత్యంతో తెలియకుండా గడిచిపోతున్నాయి. – సుదీప్తినేను చిన్న క్లాస్. కానీ గురువు గారి సూచనల మేరకు నా ట్యం చేయడం నేర్చుకున్నా. మొదట భయమేసింది. ఇప్పుడు హాయి గా చేస్తున్నా. సెల్ఫోన్లో రీల్స్ చేయడం కాదు, స్టేజ్‌పైన రియల్ డ్యాన్స్ చేయా లని మేడమ్ చెప్పారు. అమ్మ, నాన్న కూడా హ్యాపీ. – సాయినేత్ర అడుగుల సవ్వడిలో ఆంధ్ర నాట్యం ఆర్మూర్‌లో నటరాజ నృత్యనికేతన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు ఆంధ్రనాట్యం, కూచిపూడి నేర్చుకుంటున్న చిన్నారులు -
ఎప్‌సెట్‌లో జిల్లా విద్యార్థుల సత్తా
ఖలీల్‌వాడి: ఎప్‌సెట్‌లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఫలితాలు ఆదివారం విడుదలకాగా, వెయ్యిలోపు ర్యాంకులను ఇద్దరు కై వసం చేసు కున్నారు. ఎస్ఆర్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థి జక్క గురుమోహన్‌చరణ్ 369వ ర్యాంకు, జెట్టి శ్వేత అగ్రి, ఫార్మ విభాగంలో 351వ ర్యాంకు సాధించారు. అలాగే ఆరుగురు విద్యార్థులు ఐదువేల లోపు ర్యాంకులు సాధించారు. కాకతీయ విద్యార్థులు ఇద్దరు, వెక్టార్ కళాశాల విద్యార్థులు ముగ్గురు 5వేల లోపు ర్యాంకులు సాధించారు. ఆల్ఫోర్స్ విద్యార్థులు వివిధ కేటగిరిల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఎలక్ట్రిక్ వాహనంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సుభాష్‌నగర్: ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలనే ఉద్దేశంతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆదివారం ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్)లో ప్రయాణించారు. నగరంలోని పలు కార్యక్రమాలకు ఈవీ కారులోనే హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధ వాతావరణ నేపథ్యంలో క్రూడ్ ఆయి ల్ ధరలు పెరుగుతున్నాయని, వాటిని ని యంత్రించేందుకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారన్నారు. మనదేశం 85 శాతం పెట్రోల్, డీజిల్‌లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రధాని పి లుపును పాటించాలని ధన్పాల్ కోరారు. శ్వేత (351వ ర్యాంకు – అగ్రి, ఫార్మా)గురుమోహన్‌చరణ్ (369వ ర్యాంకు) -
భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే బాధ్యత గురువులదే..
● సమాజంలో గురువులకు గొప్పస్థానం ● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ● ఘనంగా విద్యా విజయోత్సవం సుభాష్‌నగర్: విద్యాబుద్ధులు నేర్పించి భవిష్యత్ త రాలను తీర్చిదిద్దే బాధ్యతను ఉపాధ్యాయులు సమ ర్థవంతంగా నిర్వర్తించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. విద్యా వారోత్సవాల ముగింపును పురస్కరించుకు ని ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విద్యా విజయోత్సవ దినోత్సవాన్ని నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే, కలెక్టర్ ఇలా త్రిపాఠితోపాటు రా ష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యాశాఖ ప్రగతిని డీఈవో అశోక్ వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చక్కటి భవిష్యత్‌ను అందించాల్సిన బాధ్యత గురువులదేనని, అందుకే సమాజంలో గురువులకు ఎంతో గౌరవం, గొప్ప స్థానం ఉందన్నారు. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్న ఫలితంగా ప్రయివేట్, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు నమోదు చేస్తున్నాయన్నారు. జిల్లాలో ప్రభు త్వ బడుల విద్యార్థులు సాధించిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ప్రతిఒక్కరి జీవితంలో విద్యార్ధి దశ ఎంతో కీలకమన్నారు. భవిష్యత్‌లో స్థిరపడేందుకు పదోతరగతి తర్వాత ఎంచుకునే మార్గం ఎంతో కీలకమని, ఇష్టమైన సబ్జెక్టులతో కూడిన కోర్సుల్లో చేరాలన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ తన స్వీయ అనుభవాలను గుర్తు చేసుకుంటూ, అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా నిరంతర కృషి, పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు నర్సయ్య, కృష్ణవేణి, డీపీఆర్వో ఎన్ పద్మశ్రీ, డీసీఈబీ సెక్రెటరీ సీతయ్య, జీఈసీవో భాగ్యలక్ష్మి, ఎంఈవోలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఎస్ఆర్ విజయఢంకా
ఖలీల్‌వాడి: ఎప్‌సెట్‌లో ఫలితాల్లో నిజామాబాద్ ఎస్ఆర్ కాలేజీ విద్యార్థులు విజయభేరి మోగించినట్లు ఎస్ఆర్ డీజీఎం గోవర్ధన్‌రెడ్డి, జోనల్ ఇంచార్జి శ్రీకాంత్ తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో జె.గురుమోహన్‌చరణ్ (369), ఎం.నివాస్(2,824), ఆర్.అభినయ్ (3194), ఎ.చరణ్‌తేజ(3200), డి. వర్షత్ (4114), బి.వాగ్మీ (4181)లు సాధించగా 5 వేల ర్యాంకులు ఆరుగురు విద్యార్థులు, 10 వేల ర్యాంకులు 17 మంది, 15 వేల ర్యాంకులోపు 71 మంది, 20 వేల లోపు ర్యాంకులు 139 మందికి వచ్చినట్లు తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో జె.శ్వేత(351), పి.సాయిరుద్రాతేజ(1677), పి.హన్మిత(2182), పి.రాహుల్ ఆదిత్య(2491), జి.సరిత(4303), ఆర్. రిషిక్(4308), ఎల్. సిమిలిత(4623) సాధించగా 5 వేల లోపు ఏడుగురు, 10 వేల లోపు 17 మంది, 15 వేల లోపు 64 మంది, 20 వేల లోపు 102 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. ఎప్‌సెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. అనంతరం ఎస్ఆర్ డీజీఎం గోవర్ధన్‌రెడ్డి, జోనల్ ఇంచార్జి శ్రీకాంత్ మాట్లాడుతూ అధ్యాపకుల ద్వారా అప్డేట్ మెటీరియల్‌తోపాటు ప్రత్యేక క్లాసులు తీసుకోవడంతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. ఎస్ఆర్ చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, సీఈవో సురేందర్‌రెడ్డి విద్యార్థులను అభినందించారు. అకడమిక్ డీన్ రాంబాబు, ప్రిన్సిపాళ్లు ఆగేందర్రెడ్డి, హన్మంత్‌రా వు, శ్రీధర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, మహిపాల్ రెడ్డి, ము రళీధర్, నర్సింహారెడ్డి, జోనల్ అకౌంటెంట్ ఆఫీసర్ రమేశ్‌రెడ్డి, తల్లిదండ్రులు, లెక్చరర్లు పాల్గొన్నారు. -
ఆల్ఫోర్స్ విజయదుందుభి
ఖలీల్‌వాడి: నిజామాబాద్ ఆల్ఫోర్స్ విద్యార్థులు ఎప్‌సెట్ ఫలితాల్లో విజయఢంకా మోగించినట్లు కాలేజీ ప్రిన్సిపల్ విఠల్‌రావు తెలిపారు. ఆదివారం విడుదలైన ఎప్‌సెట్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు వివిధ కేటగిరిలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారన్నారు. ప్రత్యేక తరగతులు, అధ్యాపకుల కృషితో మెరుగైన ఫలితాలు సాధించినట్లు తెలిపా రు. సాయిబా సమ్రాన్ (5627), సీహెచ్. ప్రణవి (7921), డి.అక్షయ (8758), శ్రీవర్షిణి (9511), ఎం.యోగేష్ (10934), టి.లకిత (12227), జె.గోపిక (14202), పి.శ్రీహిత (14512), జి.లోక్య (17436), ఆర్ అపర్ణ (18552) ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి అభినందించారు. -
గల్ఫ్‌లో గతి తప్పుతున్న జీవితాలు
మోర్తాడ్(బాల్కొండ): జిల్లాలోని డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లికి చెందిన మొద్దు గంగాధర్ స్టీల్ ఫిక్సర్‌గా పని చేసేందు కు ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీన దుబాయికి వెళ్లాడు. ఈనెల 4న కనిపించకుండా పోయిన అతడి ఆచూకీ 7వ తేదీన లభించింది. గంగాధర్ దుబాయికి వెళ్లక ముందు డైజోఫాం, క్లోరోఫామ్, అల్ప్రా జోలం వంటి మత్తు పదార్థాలు కలిపిన కల్లును సేవించేవాడని తెలిసింది. ఉన్నట్టుండి కల్లుకు దూరం కావడంతో మానసిక అస్థిరతకు గురయ్యాడు. ప్రస్తుతం అతడు దుబాయిలో సొంత బావమరిది భానుచందర్ సంరక్షణలో ఉన్నాడు. పనిచేసే పరిస్థితిలో లేని గంగాధర్‌ను తిరిగి ఇంటికి పంపిస్తే డీ అడిక్షన్ సెంటర్‌కు తీసుకువెళ్లి చికిత్స చేయించుకుంటామని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ పరిస్థితి ఒక్క గంగాధర్‌కు ఎదురైంది కాదు. ఎంతో మంది స్వగ్రామంలో ఉన్నప్పు డు మత్తు పదార్థాలు కలిపిన కల్లును సేవిస్తూ గల్ఫ్ దేశాలకు వెళ్లిన తరువాత మానసిక అస్థిరతకు గురవుతున్నారు. పనిచేసే చోటు లేదా ని వాసం ఉన్న చోటు నుంచి కనిపించకుండా పో తున్నారు. మరి కొందరైతే మానసిక ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నా రు. ఇటువంటి కేసులు వందల సంఖ్యలో న మోదవుతున్నాయి. ఇక్కడ మత్తుకు బానిసలై గల్ఫ్ వెళ్లిన తరువాత వారి జీవితాలు గతి తప్పుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, ని ర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన వందలాది మంది కొన్ని రోజులపాటు కనిపించకుండా పోవడం, మరికొందరు ఏదో ఒక విధంగా మరణించడం వంటి ఘటనలు చోటు చేసు కున్నాయి. గల్ఫ్ వెళ్లే ముందు మెడికల్ టెస్టులు చేయించుకుంటున్నా తమలోని లోపాలను బయటపడనివ్వకుండా కొంత మంది మేనేజ్ చేసుకుంటున్నారు. ఇలాంటి తప్పుడు విధా నం వల్ల వలస కార్మికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్వగ్రామంలో కల్తీ కల్లుకు అలవాటుపడి గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు మానసిక అస్థిరతకు గురై తప్పిపోతున్న వారు కొందరు.. బలవన్మరణాలకు పాల్పడుతున్న ఇంకొందరు -
నిజామాబాద్
మంచి మామిడిని.. బండ్ల మీద పసుపు రంగు మామిడి పండ్లు నోరూరిస్తున్నాయి. కానీ మంచి మామిడిని గుర్తించాల్సిన అవసరం ఉంది. సోమవారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2026– 8లో uజిల్లా కేంద్రంలోని మ్యూజియం భవనం ధ్వంసమైన కాకతీయుల కులౖదైవ విగ్రహం ఇందూరు చరిత్రకు మూలాధారం జైనతీర్థంకరుల విగ్రహంవందల సంవత్సరాల చరిత్ర కలిగిన కాకతీయ కళాతోరణం సాక్షిప్రతినిధి, నిజామాబాద్: మనదైన ఘన చరిత్రను ప్రజలకు, భవిష్యత్ తరాలకు ప్రత్యక్షంగా పరిచయం చేయాల్సిన జిల్లా కేంద్రంలోని మ్యూజియానికి తాళం పడింది. సుమారు పది సంవత్సరాలకుపైగా కాల నుంచి మ్యూజియం ఆదరణకు నోచుకోవడం లేదు. కనీసం సందర్శనకు కూడా అవకాశం లేకుండా మూసి ఉంటోంది. దేశంలోనే ఇందూరుకు సుదీర్ఘమైన చారిత్రక నేపథ్యం ఉండగా, జిల్లా కేంద్రంలోని పురావస్తు పరిశోధన శాఖ మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడం ఏమిటని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పురావస్తు పరిశోధన శాఖలో ఉద్యోగులు లేకపోవడం, మ్యూజియం నిర్వహణకు ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో చివరకు తాళం పడింది. ఎంతో అమూల్యమైన శిల్ప సంపద, చారిత్రక ఆధారాలు ధ్వంసమవుతున్నాయి. అలాగే బోధన్ నగరానికి సుమారు 2వేల సంవత్సరాలకు పైగా చారిత్రక నేపథ్యం ఉండగా, ఎన్నో పుస్తకాల్లో ఆధారాలు సైతం ఉన్నాయి. ఆయా ఆధారాల్లో ముఖ్యమైన జైన తీర్థంకరుడి విగ్రహం మ్యూజియం బయట నిర్లక్ష్యంగా పెట్టబడి ఉన్నది. మ్యూజియం వెనకాల ఏర్పాటు చేసిన విగ్రహాలు ఆకతాయిల చేతిలో ధ్వంసమవుతున్నాయి. అదే విధంగా జిల్లాలోని ఎన్నో చారిత్రక ప్రదేశాల్లో పలు తవ్వకాలలో లభించిన అతి పురాతన విగ్రహాలు, పనిముట్లు, చారిత్రక ఆధారాలు మ్యూజియంలో లోపల ఉన్నాయి. కానీ వాటి సందర్శన భాగ్యం ప్రజలకు కలగకపోవడం బాధాకరమని చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర తెలుసుకోని జాతికి భవిష్యత్ ఉండదని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన మాటలను అనుసరించి కనీసం ఇకనైనా ప్రభుత్వం చొరవ చూపి మ్యూజియం తెరిపించాలని, పురావస్తు పరిశోధన శాఖలో రెగ్యులర్ ఉద్యోగులను నియమించి చరిత్రకు పూర్వవైభవం తీసుకురావాలని ప్రజలు, చరిత్ర పరిశోధకులు కోరుతున్నారు. చరిత్రను తెలియజెప్పాల్సిన మ్యూజియం మూతపడింది. ఇందూరు ఘన చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియకుండా పోతోంది. జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న మ్యూజియం మూతపడినా పట్టించుకునే వారు కరువయ్యారు. ఆరుబయట ఉన్న విగ్రహాలు ధ్వంసమవుతున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో దశాబ్దకాలంగా మ్యూజియానికి వేసిన తాళం అలాగే ఉంది. -
క్రైం కార్నర్
వర్ని: మండలంలోని జలాల్ పూర్ గ్రామ శివారులో గిరిజన రైతు సఖి( 52) కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. సిద్దాపూర్ గ్రామానికి చెందిన సఖి జలాల్పూర్ శివారులో సొంత పొలంతోపాటు సుమారు 20 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలు చేస్తున్నారు. ఆదివారం పొలం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గడ్డిమందు సేవించిన వృద్ధుడు..జక్రాన్‌పల్లి: మండలంలోని సికింద్రాపూర్ గ్రా మానికి చెందిన పతిపాకల నడ్పి రాజన్న (70) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై మ హేశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న రెండేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ ఒంటరిగా తన పాత ఇంట్లో నివసిస్తున్నాడు. కుమార్తె, కోడలు అవసరమైన సేవలు అందిస్తూ చికిత్స చేయిస్తున్నారు. ఈ నెల 12న రాజన్న గడ్డి మందును సేవించి అపస్మారక స్థితిలో ఉండగా కుటుంబసభ్యులు నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆదివారం చికిత్స పొందుతూ రాజన్న మృతి చెందినట్లు తెలిపారు. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఉల్లాసంగా... ఉత్సాహంగా
● వేసవి శిబిరంలో విద్యార్థుల ఆటపాటలు దోమకొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవికాల శిబిరంలో విద్యార్థులు ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతున్నారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సందడి నెలకొన్నది. ఆటపాటలు, చిత్రలేఖనం, యోగా తదితర విద్యార్థి మనో వికాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 100 మంది విద్యార్థులు రోజూ వస్తున్నట్లు ఉపాధ్యాయులు చెప్తున్నారు. యోగా, మెడిటేషన్, ఇండోర్ గేమ్స్, సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు అల్పాహారం అందిస్తున్నారు. గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్, చెలిమి కార్యక్రమ ఇంచార్జి ఎస్. వెంకటేశ్వర్లు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇంచార్జిగా నవీన్, ఆర్ట్స్ ఇంచార్జిగా నర్సింలు, యోగా మెడిటేషన్ ఇంచార్జిగా త్రివేణి, పాటలు సాంస్కృతిక కార్యక్రమాల ఇంచార్జిగా కమలాకాంత్ వ్యవరిస్తున్నారు. మనోహరాబాద్‌లోని వ్యవసాయ కుండీలో స్నానం చేస్తున్న పిల్లలు జక్రాన్‌పల్లి: భానుడి భగభగ మంటున్నాడు. ఎండలు తీవ్రత మరింత పెరిగింది. జనాలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో పిల్లలు వ్యవసాయ కుండీలలో స్నానాలు చేయడానికి పరుగులు పెడుతున్నారు. గ్రామాల్లోని రైతులు నీటి నిల్వ కోసం వ్యవసాయ పంట పొలాల వద్ద ఏర్పాటు చేసుకున్న కుండీల్లో జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్...నా పేరు మద్దికుంట చారుశ్రీ. టేక్రియాల్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాను. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న జిల్లా యో గా భవన్లో నిర్వహించిన కళలు–సాంస్కృతిక కార్యక్రమంలో జానపద నృత్యం ప్రదర్శించాను. నా నృత్య ప్రదర్శనను మెచ్చి డీఈవో సార్ ప్రథమ బహుమతి అందజేసి ప్రశంసించారు. -
‘ల్యాబ్ టెక్నీషియన్’కు దరఖాస్తులు ఆహ్వానం
సుభాష్‌నగర్ : నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఏఆర్టీ సెంటర్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగానికి కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ(డీఎంఎల్టీ) పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 18 నుంచి 21 వరకు జీజీహెచ్‌లోని ఏఆర్టీ సెంటర్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులను పొందాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 21వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అందించాలని సూపరింటెండెంట్ తెలిపారు. మాక్లూర్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో మాక్లూర్ సొసైటీ పాలకవర్గ సభ్యులు శనివారం కలిశారు. రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ధాన్యం కొనుగోళ్లను ముమ్మరంగా చేపట్టి తుది దశకు తీసుకొచ్చామని మంత్రికి వివరించారు. దీంతో పాలకవర్గాన్ని మంత్రి తుమ్మల అభినందించారు. వచ్చే వర్షాకాలం సీజన్లోనూ రైతులకు ఇబ్బందులు కలగకుండా పనిచేయాలని సూచించా రు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వెల్మల్ గోపి, మాక్లూర్ సొసైటీ చైర్మన్ బూరోల్ల అశోక్, మాజీ చైర్మన్, ప్రస్తుత డైరెక్టర్ దయాకర్‌రావు, వైస్‌చైర్మన్ గుండారం శేఖర్,డీకంపల్లి సర్పంచ్ మచ్చర్ల చిన్న య్య,డైరెక్టర్లు కాశీనాథ్‌రావు, మచ్చర్ల రమేశ్, ప్రసాద్‌రావు, అశోక్ తదితరులు ఉన్నారు. సుభాష్‌నగర్: నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించిన తొలి యాంజియోగ్రామ్ ప్రక్రియ విజయవంతమైనట్లు జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ రావు తెలిపారు. సింకోపల్ అటాక్స్‌తో బాధపడుతున్న యాదయ్యకు శనివారం జీజీహెచ్‌లో యాంజియోగ్రామ్ నిర్వహించారు. కార్డియాలజీ, వైద్య బృందం సమష్టి కృషితో ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆధునిక గుండె వైద్యసేవల బలోపేతానికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రి నిరంతరం కృషి చేస్తుందని నాగమోహన్ రావు పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజుల్లో 169 డ్రంకెన్‌డ్రైవ్ కేసులు నమోదైనట్లు సీపీ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఏడుగురు నిందితులకు కోర్టు వారం రోజులపాటు జైలు శిక్ష, మిగిలిన వారికి రూ.10,80,000 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ : ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్ శివారులో శనివారం పేకాట స్థావరంపై టాస్క్ఫోర్సు సిబ్బంది దాడి చేశారు. పేకాడుతున్న ఐదుగురిని అరెస్టు చేసి, రూ.1,25,344 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఆరో టౌన్ పోలీసులకు అప్పగించారు. -
రేపటి నుంచి యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్
కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ అర్బన్: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం తన కార్యాలయంలో కార్యక్రమ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలపై ఆసక్తి, నాయకత్వ లక్షణాల పెంపు కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తామన్నారు. 18న ఫిట్ అండ్ యాక్టివ్ పేరిట రాజారాం స్టేడియంలో మారథాన్, 19న కెరీర్ నైపుణ్యాభివృద్ధిపై శివాజీనగర్‌లోని ఏటీసీలో కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 20న ఏటీసీలో నాయకత్వ లక్షణాలపై అవగాహన, 21న జిల్లా స్థాయిలో స్పోర్ట్స్ డే, 22న స్వచ్ఛ తెలంగాణ, 23న జాబ్‌మేళాలో ఉద్యోగం సాధించిన వారికి నియామక పత్రాలు, క్రీడా పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, జిల్లా యువజన క్రీడల అధికారి పవన్ కుమార్ పాల్గొన్నారు. బీఎల్ఏల నియామకానికి తక్షణ చర్యలు బూత్ లెవెల్ ఏజెంట్ల(బీఎల్ఏ) నియామకానికి తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బీఎల్ఏల జాబితాను నిర్ణీత ఫార్మాట్ ప్రకారం అందించాలని రాజకీయ పార్టీలను మరోమారు లిఖిత పూర్వకంగా కోరాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అమలు తీరుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేశామని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి సీఈవో దృష్టికి తెచ్చారు. అర్బన్ నియోజకవర్గంలో సైతం మ్యాపింగ్ ప్రక్రియలో ఆశించిన పురోగతి వచ్చిందన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ జూన్ 15వ తేదీ లోపు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మ్యాపింగ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, డీఆర్వో గీత, నిజామాబాద్, బాన్సువాడ ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రవీందర్, డీఆర్డీవో సాయన్న, సీపీవో రతన్ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని కుప్రియాల్ స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు శుక్రవారం రాత్రి దుర్మరణం చెందాడు. మండల కేంద్రానికి చెందిన అనంతసేన కృష్ణ(36) ద్విచక్ర వాహనంపై కామారెడ్డి నుంచి స్వగ్రామమైన సదాశివనగర్‌కు వస్తున్నాడు. అదే సమయంలో కుప్రియాల్ నుంచి వడ్ల లోడ్‌తో వస్తున్న లారీ కామారెడ్డికి వెళ్లేందుకు యూటర్న్ అవుతుండగా లారీకి తాకడంతో ద్విచక్రవాహనంతో లారీ కిందికి దూసుకెళ్లాడు. దీంతో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లావణ్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. డీసీఎం బోల్తా ● డ్రైవర్ దుర్మరణం కామారెడ్డి క్రైం: ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొని డీసీఎం వ్యాన్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదురుగా జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గాంధారికి చెందిన సుప్పని నవీన్ (30) డీసీఎం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మక్కల లోడ్‌ను అన్లోడ్ చేసుకొని హైదరాబాద్ వైపు నుంచి గాంధారి వైపు తిరిగి వస్తుండగా డీసీఎం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. దీంతో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీస్తున్న బాల భవన్
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● ‘కళావైభవం– కలర్స్ ఆఫ్ చైల్డ్ హుడ్’ నిర్వహణ నిజామాబాద్ రూరల్: చిన్నారులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ, వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు బాల భవన్ ఆధ్వర్యంలో వేసవిలో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు ఉపయుక్తంగా నిలుస్తున్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రశంసించారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నగరంలోని బాల భవన్లో శనివారం ‘కళా వైభవం – కలర్స్ ఆఫ్ చైల్డ్ హుడ్‘ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి నగర మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాల భవన్లో శిక్షణ పొందుతున్న బాలబాలికలు తమ సృజనను చాటుతూ అందంగా ఆకట్టుకునే రీతిలో తయారు చేసిన కళాకృతులు, గీసిన కళాకృతులను ఆసక్తితో తిలకించారు. పేరిణి, కోలాటం నృత్యాలతో అలరింపజేసిన చిన్నారులను, వెంట్రిలాక్విజంతో ఆకట్టుకున్న జాదూ యుగంధర్ రంగనాథ్‌ను కలెక్టర్ ప్రశంసించారు. చిన్నారుల మధ్యకు వెళ్లి న కలెక్టర్ ఆయా అంశాలపై ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. చిన్నారులకు చాక్లెట్లు పంచుతూ, బహుమతులు అందజేశారు. చిన్నారులు వేసవి సెలవుల ను సద్వినియో గం చేసుకునే లా తల్లిదండ్రు లు తమ పిల్లలను బాల భవన్లో చేర్పించా లని కలెక్టర్ సూచించారు. వేస వి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అ న్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. మే యర్ ఉమారాణి మాట్లాడుతూ నేటి చదువులు ఎంతో ఒత్తిడితో కూ డుకుని ఉంటున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో బాల భవన్ అందిస్తున్న వేసవి శిక్షణ కార్యక్రమాలు చిన్నారులకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తూ, వారిలో సృజనాత్మకతను, నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. కార్యక్రమంలో డీఈవో అశోక్, బాలభవన్ సూపరింటెండెంట్ ఉమాబాల,మాజీ పర్యవేక్షకుడు ప్రభాకర్, రాఘవేందర్, వెంకటలక్ష్మి, పుష్పలత, శ్వేత,సోనాలి,రిచా,మాధవి,గణేశ్,రాంచందర్, పవన్, నవీన్, మాధవి తదితరులు పాల్గొన్నారు. పేరిణి నృత్యం ప్రదర్శిస్తున్న విద్యార్థినులు -
దోమల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి
● డీఎంహెచ్‌వో రాజశ్రీ ● జాతీయ డెంగీ దినోత్సవ అవగాహన ర్యాలీ సుభాష్‌నగర్ : దోమల నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని డీఎంహెచ్‌వో రాజశ్రీ తెలిపారు. శనివారం జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా నగరంలోని చంద్రశేఖర్ కాలనీ పట్టణ ఆరో గ్య కేంద్రం పరిధిలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఐక్యత, ఆచరించు, నిర్మూలించు అనే నినాదంతో ఏడాది పొడవునా డెంగీ నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జి ల్లా ఇమ్యూనైజేషన్ అధికారి అశోక్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సికందర్ నాయక్,ప్రోగ్రాం అధికారులు వెంకన్న,సుప్రియ,మెడికల్ ఆఫీసర్ కీర్తి, వైద్యసి బ్బంది,ఏఎన్ఎంలు,ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు. మాతృ మరణాలపై సమీక్ష.. నగరంలోని కలెక్టరేట్లో డీఎంహెచ్‌వో రాజశ్రీ మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించారు. గర్భిణుల పేర్లను 12 వారాల్లోపు నమోదు చేయడమే కాకుండా నాలుగుసార్లు వైద్యులతో పరీక్షించేలా చూడాలని తెలిపారు. ధనుర్వాతం రాకుండా టీకాలు ఇప్పించాలని, ప్రమాదకర లక్షణాలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్వోలు రవీందర్, సికందర్ నాయక్, సమత తదితరులు పాల్గొన్నారు. -
జీవన్‌రెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డిని విమర్శించే అర్హత ఆ ర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి లేదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. జీవన్‌రెడ్డి నీచ రాజకీయాలకు మారుపేరన్నారు. సుదర్శన్‌రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోర న్నారు. ఇక మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వే ముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు రైతుల ముసుగులో పచ్చ కండువాలు వేసు కుని ధర్నాలు చేయడం హాస్యాస్పదమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన ప్రతి హా మీని నెరవేర్చేలా ముందుకెళ్తున్నారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 5.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. జిల్లాకు 70 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం కొనుగోలుకు అనుమతి వస్తే ఇప్పటికే 50 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారన్నా రు. అలాగే 32 కొనుగోలు కేంద్రాల ద్వారా 38,556 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేసి నట్లు తెలిపారు. రైతులు ఆందోళన చెందొద్దన్నా రు. సుదర్శన్‌రెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్, భూపతిరెడ్డి నిరంతరం కలెక్టర్‌తో, ప్రభుత్వ అధికారులతో సమీక్షలు చేస్తూ ఇబ్బందులు లేకుండా చూస్తున్నార న్నారు. డీసీసీ కోశాధికారి భక్తవత్సలం, ఉపాధ్యక్షు లు కౌడపు శరత్ కుమార్, రత్నాకర్‌గౌడ్, జిల్లా ప్రఽ దాన కార్యదర్శి ప్రవీణ్‌గౌడ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు రాజనరేందర్‌గౌడ్, జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ రఘు, రమేష్ పాల్గొన్నారు. సామాన్యులపై పెట్రో భారం నిజామాబాద్ రూరల్: పెట్రోల్, డిజిల్ ధరలను పెంచి సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం భారం మోపిందని నగేశ్‌రెడ్డి విమర్శించారు. ఇంధన ధరల పెరుగుదల కారణంగా నిత్యావసరాల ధరలు పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. సుదర్శన్‌రెడ్డిని విమర్శించే స్థాయి నీకు లేదు ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే మొదటిస్థానంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి -
ఫారెస్ట్ వారియర్స్!
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో భానుడి భగభగలకు 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. సాధారణ జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నూ జిల్లా అటవీ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది యూనిఫామ్ వేసుకుని అడవిబాట పడుతున్నారు. అడవుల రక్షణతోపాటు వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు కాలినడకన పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. తమ ప్రాణాలను, ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఎండలో అడవుల్లో తిరుగుతూ విధులను నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో 86,871.45 హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉంది. అడవులను సంరక్షించేందుకు మొత్తం ఏడు రేంజ్‌లు ఉండగా, కమ్మర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, వర్ని రేంజ్‌లలో ఎక్కువగా అడవులు ఉన్నాయి. ఆర్మూర్, మాక్లూర్, నందిపేట్, నవీపేట్ మండలాల్లో గుట్టలు కూడా ఉన్నాయి. తీవ్రమైన ఎండల కారణంగా సహజసిద్ధమైన వాగులు, వంకలు, చెరువులు ఎండిపోయాయి. దీంతో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అడవుల్లో ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి కుంటలు (సాసర్ పిట్స్), సోలార్ బోర్‌వెల్స్ ద్వారా నిరంతరం నింపుతున్నారు. ఎండలు మండిపోతున్నా లెక్క చేయకుండా సిబ్బంది ట్రాక్టర్ల ద్వారా నీటిని రవాణా చేస్తున్నారు. అటవీ భూములు కబ్జాకు గురి కాకుండా గస్తీకాస్తున్నారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతను లెక్కచేయకుండా పెట్రోలింగ్ జనం ఇళ్లు దాటని వేళ.. అటవీబాట పట్టిన ఫారెస్ట్ ఆఫీసర్లు అడవులకు అంటిన కార్చిచ్చు ఆర్పేందుకు సాహస చర్యలు వన్యప్రాణుల దాహార్తి కోసం భగీరథ ప్రయత్నం -
శని అమావాస్య పూజలు
● భక్తులతో కిటకిటలాడిన జాన్కంపేట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ● అష్టముఖి కోనేరులో పుణ్యస్నానాలు బోధన్: శని అమావాస్యను పురస్కరించుకుని ఎడపల్లి మండలంలోని జాన్కంపేట లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం భక్తులతో శనివారం కిటకిటలాడింది. తెల్లవారుజాము నంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. అష్టముఖి కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ఉద్యోగులు, అర్చకులు, గ్రామపెద్దలు ఎ మ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నీడ కోసం టెంట్లు వేశారు. తాగునీరు, మజ్జిగ, గుట్టకింద ప్రాంతంలో అల్పాహారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ సుంచనకోట అనురాధ రాధాకిషన్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్, మండల పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, నాయకుడు విజయకుమార్‌గౌడ్, ఆలయ ఈవో వేణు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.స్వామివారి దర్శనానికి క్యూలైన్లో వెళ్తున్న ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి అష్టముఖి కోనేరు చుట్టూ భక్తుల సందడి -
కార్చిచ్చు అంటుకోకుండా..
వేసవి కాలంలో అడవులకు అతిపెద్ద ముప్పు గా పరిణమించే కార్చిచ్చును (ఫారెస్ట్ ఫైర్స్) అరికట్టడం అధికారులకు అతిపెద్ద సవాల్. ఇందుకు ఫైర్ వాచర్లు, బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, రేంజ్ అధికారులు అడవులకు నిప్పు అంటుకోకుండా నిఘా పెట్టారు. ముందు జాగ్రత్త చర్యగా ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ గుర్తు తెలియని వ్యక్తుల చర్యల కారణంగా అడవులు, గుట్టలకు నిప్పు అంటుకుంటోంది. శాటిలైట్ అలర్ట్స్ ఆధారంగా నిప్పు అంటుకున్న ప్రాంతాలకు సిబ్బంది వెళ్లి వెంటనే బ్లోయర్ల సహాయంతో మంటలను ఆర్పేస్తున్నారు. ఎర్రటి ఎండలో సైతం మంటలను అదుపు చేస్తున్నారు. జిల్లా అటవీ శాఖ సిబ్బంది, అధికారుల కర్తవ్య దీక్షపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. -
త్వరలో పీఎం రాహత్ స్కీం అమలు
సుభాష్‌నగర్: కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న పీఎం రాహత్ స్కీం త్వరలో జిల్లాలో అమ లు కానుందని డీఎంహెచ్‌వో రాజశ్రీ , ఏసీపీ మస్తాన్ అలీ తెలిపారు. ఈ మేరకు శనివారం నగరంలోని ఐఎంఏ మీటింగ్ హాల్ లో ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల యజమానులు, వైద్యులకు పీఎం రాహత్ స్కీంపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ స్కీంలో ప్రతి యాక్సిడెంట్ బాధితులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.50 లక్షల వరకు లేదా ఏడు రోజుల వరకు ఉచిత చికిత్స ఉంటుందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 38 ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయని, ఈ ఆస్పత్రుల సహకారం ఉండాలన్నారు. ఈ – దార్ మేనేజర్ వర్షా నిహంత్ మాట్లాడుతూ.. పీఎం రాహత్ స్కీంలో పోలీస్, వైద్యారోగ్య విభాగం సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారి మధు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ విశాల్, కార్యదర్శి సృజన్, జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్ శశాంక్‌రెడ్డి, వివిధ ఆస్పత్రుల సిబ్బంది పాల్గొన్నారు. డీ–54 కాలువ ఆక్రమణలను తొలగించాలి సుభాష్‌నగర్: నిజామాబాద్ నగరంలోని డీ–54 కాలువ ఆక్రమణలను వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ ఆదేశించారు. నగరంలోని 18, 33వ డివిజన్లలో శనివారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శానిటేషన్ వర్కర్ల అ టెండెన్స్, శానిటేషన్ పనులు, తాగునీటి సరఫరా, డ్రెయినేజీలు, యూజీడీ పనులను పరిశీలించారు. వర్షాకాలం ప్రారంభం కాను న్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తచర్యల్లో భాగంగా డీ–54 కాలువను పరిశీలించారు. స్థానిక కార్పొరేటర్లు, నాయకులు ఆయనను కలిసి సమస్యలను వివరించారు. భారీ వర్షా లు కురిసిన సమయంలో నీటి ప్రవాహం పెరిగి ఇళ్లల్లోకి నీరు రావొచ్చని, డీ–54 కెనా ల్ ఆక్రమణల తొలగింపులో రాజీ పడొద్దని కమిషన్ సూచించారు. కార్పొరేటర్లు, నాయకులు సహకరించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన శానిటరీ ఇన్స్పెక్టర్లు, కాలనీవాసులు ఉన్నారు. 443 మంది విద్యార్థుల గైర్హాజరు ఖలీల్‌వాడి: జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. నాల్గో రోజైన శనివారం ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ పరీక్షలకు మొత్తం 443 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. ఫస్టియర్ పరీక్షలకు మొత్తం 7,922 మంది విద్యార్థులకు గాను 7,577మంది హాజరుకాగా, 345మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే సెకండియర్ పరీక్షలకు 2,227 మంది విద్యార్థులకు గాను 2,129మంది హాజరుకాగా, 98 మంది గైర్హాజరయ్యారని వివరించారు. -
మూడు దశాబ్దాలుగా
శిక్షణ పొందినవారితో ఎంపీ అర్వింద్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందూరు నగరంలోని మాధవ స్మారక సేవాసమితి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలతో అనేకమంది వ్యక్తిత్వ వికాసం పొందుతుండడంతోపాటు నైపుణ్య అభివృద్ధి శిక్షణ పొందుతున్నారు. తద్వారా ఉపాధికి మార్గాలూ లభిస్తున్నాయి. ‘మానవసేవే మాధవ సేవ‘ అనే లక్ష్యంతో ముందుకెళ్తున్న ‘మాధవ స్మారక సేవాసమితి’ యువత కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా మహిళల స్వయం సమృద్ధి కోసం ఎక్కువగా పాటుపడుతోంది. ఇందులో భాగంగా వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులతోపాటు వివిధ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. టైలరింగ్, జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ, మెహందీ ఆర్ట్స్, ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్ విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జ్యూట్ బ్యాగుల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థులు జ్యూట్ బ్యాగులు వాడేలా ప్రోత్సహిస్తున్నారు. ప్లాస్టిక్ వాడడం వల్ల తలెత్తే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. 1995 నుంచి వేలాదిమందికి వివిధ అంశాలు, విభాగాల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి మార్గాలను చూపిస్తున్నారు. ముఖ్యంగా నిరుపేద, దిగువ మధ్యతరగతి వర్గాల మహిళలకు కుట్టు మిషన్, జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యూటీషియన్, మెహందీ డిజైన్ ఆర్ట్ప్, ఎంబ్రాయిడరీ శిక్షణ సైతం ఇస్తున్నారు. రెండు నుంచి మూడు నెలలపాటు ఒక్కో అంశంలో శిక్షణ నిర్వహిస్తున్నారు. విశేష నైపుణ్యం కలిగిన శిక్షకులతో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా శిక్షణ పొందిన పలువురు వివాహాది శుభకార్యాలకు ఆర్డర్లు తీసుకుని అలంకరణ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఇందులో పలువురు మహిళలు తాము ఉపాధి పొందుతుండడంతో పాటు పలువురికి ఉపాధి కల్పించే స్థాయి వరకు వెళ్లారు. పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ వాడకంతో కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జ్యూట్ బ్యాగులను వినియోగాన్ని పెంచాలని ప్రచారం చేయడమే కాకుండా ఉచితంగా జ్యూట్ బ్యాగుల పంపిణీ సైతం చేస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు జ్యూట్ బ్యాగుల శిక్షణ (ఫైల్) శిక్షణ పొందుతున్న యువతులు, మహిళలుసేవలు విస్తరిస్తాం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా నిలదొక్కుకునే సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని ఉచితంగా అందజేసేందుకే మాధవ స్మారక సేవాసమితి విశేషంగా కృషి చేస్తోంది. స్వయం శక్తితో సాధారణ కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా పూర్తిస్థాయిలో నిలదొక్కుకునేలాగా దోహదం చేస్తోంది. సమాజంలోని అన్ని రంగాల ప్రజలకు, యువతకు, మహిళలకు, పిల్లలకు వేర్వేరుగా సేవా కార్యక్రమాలను యోజన చేస్తూ అన్ని వర్గాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. భవిష్యత్‌లో మరిన్ని విశేష సేవా కార్యక్రమాలతో ముందుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – మర్రి కృష్ణారెడ్డి, అధ్యక్షులు, మాధవస్మారక సేవా సమితి, ఇందూరు ‘మానవ సేవే మాధవ సేవ’ లక్ష్యంగా మాధవ స్మారక సేవాసమితి సేవలు వ్యక్తిత్వ వికాసం, నైపుణ్య అభివృద్ధి శిక్షణ కోసం నిరంతర కార్యక్రమాలు కొవిడ్ విపత్తు వేళ సేవలు.. పర్యావరణ పరిరక్షణకు కృషి -
రైతులు ఆందోళన చెందొద్దు
సాక్షి ప్రతినిధి నిజామాబాద్: రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందొద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి అన్నారు. ధాన్యం నిల్వ చేసేందుకు అవసరమైన గోదాముల పరిశీలనలో భాగంగా శుక్రవారం వేల్పూర్‌లోని సొసైటీ కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న గోదామును సుదర్శన్‌రెడ్డి శుక్రవా రం పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లా డి వారి సమస్యలను తెలుసుకున్నారు. కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఆయనవెంట రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కే నగేశ్‌రెడ్డి, అమీనాపూర్ సర్పంచ్ నవీన్, వెంకటాపూర్ సర్పంచ్ సుజాత, లక్కోరా సర్పంచ్ అపర్ణ రాజు ఉన్నారు. రైతులను రెచ్చగొట్టే రాజకీయాలు.. పెర్కిట్: చివరి గింజ వరకూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆలూర్ మండల కేంద్రంతోపాటు మిర్దాపల్లిలోని కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. కడ్తా, తరుగు అంటూ ఇబ్బందులకు గురిచేస్తే కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించా రు. బీఆర్ఎస్ నాయకులు ఉద్రిక్తతలు సృష్టించి రై తులను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. -
రేషన్ దుకాణాల ద్వారా పసుపు పంపిణీకి కృషి
● సీఎంతో మాట్లాడి సరఫరాకు చర్యలు ● వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు రాయితీపై పసుపు పంపిణీ చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ స భ్యుడు గడుగు గంగాధర్ అన్నారు. జక్రాన్‌పల్లి మండలంలోని మనోహరాబాద్‌లో ఉన్న జేఎంకేపీఎం పసుపు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ (ఎఫ్‌పీవో)ను గడుగు శుక్రవారం సందర్శించి యంత్రాలను పరిశీలించారు. పసుపునకు నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలు దేశంలోనే పేరుగాంచా యని అన్నారు. పసుపు రైతులకు మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ప్రయత్నం చే యడం లేదని, పసుపును కొనుగోలు చేయడం లేద ని విమర్శించారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని కలి సి రేషన్ దుకాణాల ద్వారా రాయితీపై ప్రజలకు పసుపు అందించేందుకు తగినవిధంగా నివేదిక స మర్పిస్తానన్నారు. ఆయన వెంట జేఎంకేపీఎం ఎఫ్‌పీవో చైర్మన్ పాట్కూరి తిరుపతిరెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు గోర్త రాజేందర్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నిజామాబాద్ నగర అధ్యక్షుడు సుభాష్‌జాదవ్, మనోహరాబాద్ ఉప సర్పంచ్ అ ల్లూరి లింబారెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్, ఉద్యాన శాఖ డివిజన్ అధికారులు రోహిత్, రాజుగౌడ్, ఏవో దేవిక, ఏఈవోలు శుభస్య, శివ, భాస్కర్, శ్రీకాంత్, పసుపు రైతులు పుప్పాల నాగేశ్, చిన్నయ్య, శ్రీధర్ తదితరులు ఉన్నారు.పసుపు తయారీ, కొమ్ములను పరిశీలిస్తున్న వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ -
ఫీజులో రాయితీ!
● గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ గాలం ● పది పాసైనోల్లు టార్గెట్ ● నమ్మించి రూ.లక్షలు దండుకుంటున్న వైనం ఆర్మూర్ : కార్పొరేట్ కళాశాలల ఏజెంట్లు గ్రామాల బాటపట్టారు. ఫ్రీ సీటు, హాస్టల్, ఫీజులో రాయితీ పేరిట విద్యార్థుల తల్లిదండ్రులకు గాలం వేస్తున్నా రు. మాయమాటలు చెప్పి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. జిల్లాలోని ప్రయివేటు కళాశాలలతోపాటు హైదరాబాద్‌లోని కార్పొరేట్ కళాశాలల ఏజెంట్లు స్థానికంగా అద్దె గదుల్లో నివాసముంటూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వల విసురుతున్నారు. మరికొన్ని కళాశాలల యాజమాన్యాలు టెలీకాలర్లను నియమించుకొని తల్లిదండ్రులకు రోజుకు పదుల సంఖ్యలో ఫోన్లు చేయిస్తూ మభ్యపెడుతున్నాయి. బాండ్‌పై సంతకాలు.. పదో తరగతి ఫలితాలు రాగానే కార్పొరేట్ కాలేజీల ఏజెంట్లు మార్కుల జాబితాలతో గ్రామాల్లో వాలా రు. 500లకు పైగా మార్కులు సాధించిన విద్యార్థు ల ఇళ్లకు వెళ్లి మీ అబ్బాయి చాలా తెలివైనో డు, మా కాలేజీలో ఫ్రీ సీటు.. ఫీజులో రాయితీ అంటూ నమ్మబలుకుతున్నారు. గిఫ్ట్‌లు ఇచ్చి తల్లిదండ్రుల ను ఆకర్షిస్తున్నారు. కొందరు ఏజెంట్లు అయితే అడ్వాన్స్‌గా రూ.10 వేలు చేతిలో పెట్టి సదరు విద్యార్థి పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని సీటు కన్ఫర్మ్ అని బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకుంటున్నారు. అడ్మిషన్ తీసుకుంటే అంతే.. ఒకసారి అడ్మిషన్ తీసుకున్నాక అసలు కథ మొదలవుతోంది. ట్యూషన్ ఫీజు ఫ్రీ, కానీ బిల్డింగ్ ఫండ్, స్పెషల్ కోచింగ్, మెటీరియల్, యూనిఫాం పేరు తో ఏడాదికి రూ.1.20 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన నారాయణ తన కొడుకును ఫ్రీ అని నమ్మి జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్పిస్తే ఇప్పుడు రూ.1.10 లక్ష కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిబంధనలు గాలికి.. ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం అడ్మిషన్ల సమయంలో అదనపు ఫీజులు వసూలు చేయడం నేరం. కానీ కార్పొరేట్ కాలేజీలు యాజమాన్య కోటా పేరుతో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. గ్రామీణ విద్యార్థులు, తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రూ. లక్షలు దండుకుంటున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఏం చేయాలి.. ఏ కాలేజీ ఏజెంట్‌కూ అడ్వాన్స్‌గా ఫీజు డబ్బులు, పదో తరగతి సర్టిఫికెట్లు ఇవ్వొద్దు. ఫ్రీ అని చెబితే రాతపూర్వకంగా తీసుకోవాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని గుర్తించాలి. అక్రమ వసూళ్లపై టోల్ ఫ్రీ నంబర్ 1800–425–3533కు ఫిర్యాదు చేయాలి. ముందస్తుగా డబ్బులు కట్టొద్దు కార్పొరేట్ కాలేజీలు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. గ్రామాల్లో ఏజెంట్లతో అడ్మిషన్లు చేపట్టడం నిబంధనలకు విరుద్ధం. తల్లిదండ్రులు ముందస్తుగా ఎవరికీ డబ్బులు కట్టొద్దు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – రవికుమార్, డీఐఈవో -
అగ్ని ప్రమాదంలో ధాన్యం బస్తాలు దగ్ధం
మోపాల్ : మండలంలోని కంజర్ శివారులో సొసైటీ ఆధ్వర్యంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు శుక్రవారం దగ్ధమయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. షేక్ దావూద్ అనే రైతు బస్తాలు మూడు రోజుల క్రితం తూకం వేశారు. గుర్తు తెలియని రైతు తన పొలంలో వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో మంటలు రోడ్డు వరకు వ్యాపించాయి. ఈ క్రమంలో ధాన్యం బస్తాలకు అంటుకున్నాయి. గ్రామస్తులు గమనించి వెంటనే బస్తాల్లో నుంచి ధాన్యం కింద పారబోసి మంటలను అదుపులోకి తెచ్చారు. గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా మంటలను పూర్తిగా ఆర్పేశారు. అగ్ని ప్రమాదంలో సుమారు 5 బస్తాల ధాన్యం దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. -
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి
● ఓఆర్ఆర్, బైపాస్ రోడ్డు మంజూరు చేయించడంలో విఫలం ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారిసుభాష్నగర్: నిజామాబాద్‌కు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు, బైపాస్ రోడ్డు హామీని అమలు చేయించడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం హామీ అమలు కాకపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ కార్యాలయం కోసం నగర నడిబొడ్డున స్థలాన్ని కేటాయించుకున్న వారు.. ప్రజలకు ఉపయోగపడే బస్టాండ్ కోసం మాత్రం స్థలాన్ని గుర్తించలేకపోయారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మధ్య కమీషన్ల బేరసారాలు కుదరకనే నిజామాబాద్ ఓఆర్ఆర్ ఫైలును పక్కన పడేశారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇందూరు గడ్డపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ కార్పొరేటర్లు, మేయర్ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్‌కుమార్, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, కార్పొరేటర్లు మహేందర్, ఎర్రం సుధీర్, మల్లేష్ యాదవ్, వేణుగోపాల్, శ్రీనివాస్‌రెడ్డి, చిరంజీవి, బద్దం కిషన్, ఆమంద్ విజయ్‌కృష్ణ, బోడ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కంప్యూటర్‌పై పట్టు
వేసవిలో● శిక్షణ పొందుతున్న విద్యార్థులు ● నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదలకు దోహదంబోధన్లోని ఎస్ఆర్ కంప్యూటర్స్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థులుబోధన్: సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పు నేపథ్యంలో కంప్యూటర్ విద్య పట్ల మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. వేసవి సెలవుల సమయాన్ని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. నేటి డిజిటల్ యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండటం అత్యంత అవసరమైన నైపుణ్యమని నిపుణులంటున్నారు. కంప్యూటర్ విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్యల పరిష్కారానికి నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతాయి. సాలూర మండల కేంద్రానికి చెందిన కంప్యూటర్ మాస్టర్ కృష్ణప్రసాద్ బోధన్ పట్టణ కేంద్రం, సాలూర మండల కేంద్రాల్లో ఎస్ఆర్ కంప్యూటర్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ రెండు కేంద్రాల్లో వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. డీసీఏ, పీజీడీసీఏ, జేవోసీ, డీటీపీ, ఫొటోషాప్, ఇంటర్నెట్, ఇతర కోర్సుల్లో శిక్షణనిస్తున్నారు. 30 నుంచి 45 రోజుల వ్యవధితో కోర్సులను నామమాత్రపు ఫీజుతో అందిస్తున్నారు. -
పని చేసి పరేషాన్
మోర్తాడ్(బాల్కొండ): భీమ్‌గల్ మండలంలోని ముచ్కూర్ గ్రామ పంచాయతీ పరిధిలో వివిధ రకాలైన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు రూ.15 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం చేస్తున్నారని నిరసన తెలుపుతూ కొందరు కాంట్రాక్టర్లు పంచాయతీ కార్యాలయానికి ఇటీవల తాళం వేశారు. మోర్తాడ్ మండలం సుంకెట్‌లో గతంలో సర్పంచ్‌గా పని చేసిన కడారి శ్రీనివాస్‌కు రూ.18లక్షల బిల్లు విడుదల కావాల్సి ఉంది. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలైనా ఆయనకు బిల్లు మంజూరు చేయలేదు. ఇది ఒక్క ముచ్కూర్, సుంకెట్ పంచాయతీలలో నెలకొన్న సమస్య కాదు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో పాత బిల్లుల బకాయిలు పేరుకపోయి సంకటంగా మారింది. పంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యులు లేని సమయంలో నిధులు విడుదల కాలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికై న ప్రజాప్రతినిధులు కొలువదీరిన తరువాత బకాయి పడిన నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇందులో కొంత భాగమైనా పాత బిల్లుల చెల్లింపులకు కేటాయించాలని గతంలో సర్పంచ్‌లుగా పని చేసిన వారు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. పునర్విభజనకు ముందు జిల్లాలో 535 గ్రామ పంచాయతీలు ఉండగా మెజార్టీ పంచాయతీల్లో పాత బిల్లుల చెల్లింపులు అలాగే ఉన్నాయి. దాదాపు రూ.15 కోట్ల చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ కేవలం రూ.3 కోట్లు అక్కడక్కడ చేశారు. ఇంకా రూ.12 కోట్ల బకాయిలు అలాగే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటాగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులు విడుదల చేయకపోవడంతో పంచాయతీల ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైంది. 15వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేసే విధానంలో ఎన్నో మార్పులు జరిగాయి. పన్ను ఆదాయం అంతంత మాత్రంగానే ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆశలు పెట్టుకోగా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఫలితంగా పంచాయతీలకు ఆర్థికభారం తప్పడం లేదు. అధికారుల మౌనం సంకటంగా మారిన పాత బిల్లులు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలైనా చెల్లింపులపై నోరుమెదపని గ్రామ పంచాయతీ పాలకవర్గాలు జిల్లాలో పేరుకుపోయిన బకాయిలు రూ.12 కోట్లకు పైమాటే.. కొన్ని చోట్ల తక్కువ మొత్తంలో చెల్లింపులు పూర్తి పంచాయతీల ద్వారా మాజీ సర్పంచ్‌లకు చెల్లించాల్సిన బిల్లు బకాయిలు వెంటనే చెల్లించాలి. ఏళ్ల తరబడి బిల్లులు చెల్లింపులు సాగక వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి వస్తోంది. అప్పు తీసుకువచ్చి పనులు చేశాం. ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోతే మేము ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం స్పందించి పంచాయతీ బిల్లు బకాయిలు వెంటనే మంజూరు చేయించాలి. – కడారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్, సుంకెట్ బిల్లుల బకాయిలకు చెల్లింపుల విషయంలో జిల్లాలోని పంచాయతీ ఉన్నతాధికారులు మౌన వ్రతం పాటిస్తున్నారు. గతంలో చేసిన పనులకు సంబంధించి ఎంబీల రికార్డింగ్, పనులకు సంబంధించిన తీర్మాణాలు సక్రమంగా చేసి ఉంటే బిల్లుల చెల్లింపులు తక్షణమే పూర్తి చేయాల్సి ఉంది. అధికారులు మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మౌనం పాటిస్తూ గతంలో సర్పంచ్‌లుగా పని చేసినవారిని ఎలాంటి ప్రయోజనం కల్పించే చర్యలు తీసుకోవడం లేదు. ఉన్నతాధికారులకు చెప్పి పనులు చేసినా బిల్లు బకాయిల విషయంలో పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. -
ప్రజా సేవలకులమని మరవొద్దు
నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజాసేవకులమనే విషయాన్ని మరవొద్దని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును సమాచార హక్కు చట్టం ద్వారా వారికి కల్పించడిందని రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ జి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తూ, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే ఆర్టీఐ యాక్ట్ ముఖ్య ఉద్దేశమన్నారు. సమాచార హక్కు చట్టం – 2005పై పీఐవోలకు, ఏపీఐవోలతోపాటు అన్ని శాఖల అధికారులకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా, సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాస్‌రావు, దేశాల భూపాల్ హాజరయ్యారు. సమాచార హక్కు చట్టంలోని 2 షెడ్యూళ్లు, 6 చాప్టర్లు, 31 సెక్షన్ల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రశేఖర్‌రెడ్డి అవగాహన కల్పించారు. దరఖాస్తులకు సంబంధించి పీఐవోలు, ఏపీఐవోల సందేహాలను నివృత్తి చేశారు. పౌరులు కోరినప్పుడే సమాచారం ఇవ్వడం కాకుండా, సమాచార హక్కు చట్టం, సెక్షన్ 4(1)బి ప్ర కా రం స్వచ్ఛందంగా సమాచారం ఇచ్చేలా సమాయ త్తం కావాలని సూచించారు. సమాచారాన్ని కోరే హక్కు ప్రతి పౌరునికి ఉండడంతోపాటు రికార్డుల ను, క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించే అధికారం కూడా ఉందన్నారు. సమాచార హక్కు చట్టం కింద వచ్చే దరఖాస్తులు అనగానే అనేక మంది ఆందోళన కు గురవుతారని, అనుమానాలు, అపోహలకు గురి కాకుండా దరఖాస్తుదారు కోరిన మేరకు రికార్డులలో ఉన్న సమాచారాన్ని అందించాలని సూచించారు. ఈ సందర్భంగా పలు పెండింగ్ కేసులను ఆర్టీఐ కమిషన్ చీఫ్ కమిషనర్, కమిషనర్లు పరిశీలించి పరిష్కరించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య, అదనపు కలెక్టర్లు కిరణ్‌కుమార్, దిలీప్‌కుమార్, డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, అదనపు డీసీపీ ప్రకాశ్, డీఆర్వో బి గీత, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రశ్నించే హక్కును ప్రజలకు సమాచార హక్కు చట్టం కల్పించింది రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి ఆర్టీఐ చట్టంపై పీఐవో, ఏపీఐవోలకు అవగాహన సదస్సు -
వనమహోత్సవానికి సన్నద్ధం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వనమహోత్సవం–2026 కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సన్నద్ధమవుతోంది. జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో మొత్తం 26.11 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకోసం 530 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో 42 లక్షల మొక్కలను పెంచుతున్నారు. గత సంవత్సరం ఒక్కో నర్సరీలో 8 వేల చొప్పున మొక్కలను పెంచగా, గతేడాదికి సంబంధించిన మొక్కలు ఉండడంతో ప్రస్తుతం ఒక్కో నర్సరీలో 2,600 చొప్పున మొక్కలను పెంచుతున్నారు. నాటేందుకు మొక్కలు సిద్ధం కావడంతో జూన్ మొదటి వారం నుంచి ఉపాధి కూలీలతో గుంతలు తవ్వించి జూలైలో వేగవంతంగా మొక్కలను నాటించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ●ప్రధానంగా నీడనిచ్చే కానుగ, చింత, వేప, తెల్లమద్ది, పెల్ట్రోఫాం, డెకోమా చెట్లతో పాటు జామ, సీతాఫలం, అల్లనేరెడు, ఉసిరి, సపోటా, ఈత, ఖర్జూర, బాదం, నిమ్మ, దానిమ్మ తదితర పండ్ల మొక్కలు నాటనున్నారు. గన్నేరు, గులాబీ, మల్లె, మందార, కరివేపాకు తదితర మొక్కలను ఇంటికి ఐదు చొప్పున పంపిణీ చేయనున్నారు. ●రహదారుల వెంబడి, చెరువుగట్లు, కమ్యూనిటీ స్థలాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైతుల భూముల్లో, దేవాలయ, అటవీ భూముల్లో, శ్మశాన వాటి కలు, తదితర ప్రాంతాల్లో అవసరమైన చోట్ల మొక్కలను నాటనున్నారు. లక్ష్యాన్ని పూర్తి చేస్తాం ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వనమ హోత్సవాన్ని నిర్వహించనున్నాం. నిర్ధేశిత లక్ష్యాన్ని ప్రణాళికతో పూర్తి చేస్తాం. మొక్కలు నాటడానికి త్వరలో గ్రామా ల్లో ఉపాధి కూలీలతో గుంతలు తవ్వించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెడతాం. – సాయన్న, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి గ్రామీణాభివృద్ధిశాఖ ప్రణాళికలు జిల్లా వ్యాప్తంగా 26.11 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం 520 నర్సరీల్లో 42 లక్షల మొక్కల పెంపకం -
శుభ ముహూర్తాలకు బ్రేక్
నిజామాబాద్ రూరల్: అధిక జ్యేష్ఠమాసం కారణంగా శుభ ముహూర్తాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. బాజాబజంత్రీలు మోగాలంటే నెలరోజులు ఆగాల్సిందేనని పండితు లు చెబుతున్నారు. ఈనెల 18 నుంచి జూన్ 18వ తేదీ వరకు అధిక జ్యేష్ఠ మాసం (మూఢం) కావడంతో ఎలాంటి ముమూర్తాలు లేవంటున్నారు. జూన్ 19 నుంచి మళ్లీ శుభముహుర్తాలు ప్రారంభవుతాయి. ఈనెల 13వ తేదీ పెళ్లి ముహూర్తాలకు చివరి రోజు కావడంతో జిల్లాలో దాదాపు 500కు పైగా వివాహలు జరిగాయి. జూన్ 18 వరకు గృహ ప్రవేశాలు, నూతన వ్యాపారాల ప్రారంభం వంటి శుభకార్యాలకు బ్రేక్ పడింది. పురోహితులు, కేటరింగ్, ఫొటోగ్రఫీ, ఫంక్షన్ హాళ్లు, బ్యాండ్ వారికి నెలరోజులపాటు ఉపాధి కరువు కానుంది. -
ఎరక్కపోయి.. ఇరుక్కున్నాడు
● పాత్రలో చిక్కుకుపోయిన బాలుడునిజామాబాద్ అర్బన్: నగరానికి చెందిన ఓ బాలుడు ఇంట్లోని పాత్రలో ఇరుక్కుపోయి ఇబ్బంది పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆటోనగర్‌లోని అబ్దుల్ రహీం అనే ఆరు సంవత్సరాల బాలుడు ఓ పాత్రలో కూర్చోగా, తిరిగి బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా రెండు కాళ్లు ఇరుక్కుపోయాయి. తల్లి ఉజ్మా బేగం బాలుడిని పైకి లాగితే రాలేదు. తండ్రి అబ్దుల్ రహీం అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు వెంటనే వచ్చి ఇరుక్కున్న పాత్రను యంత్రంతో కట్ చేసి బాలుడిని బయటికి తీశారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు భేష్
● అన్ని శాఖలు సమర్థవంతంగా పని చేస్తున్నాయి ● రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి నిజామాబాద్ అర్బన్: జిల్లాలో ధాన్యం, మొక్క జొ న్న కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్‌రెడ్డి సంతృప్తి వ్య క్తం చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో ఆ యా శాఖలు ధాన్యం, మొక్కజొన్న సేకరణలో సమర్థవంతంగా పని చేస్తున్నాయన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సమీక్షాసమావేశం నిర్వహించారు. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గం మినహా, జిల్లాలోని మిగతా అ న్ని చోట్ల ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తయ్యా యని తెలిపారు. బాల్కొండ సెగ్మెంట్లో పంట కో తలు కొంత ఆలస్యమయ్యాయన్నారు. మరో మూ డు రోజుల్లో పూర్తిస్థాయిలో ధాన్యం సేకరించేందుకు యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందన్నారు. అకాల వర్షాలు కురిస్తే రైతులు నష్టపోకుండా పెద్ద సంఖ్యలో హమాలీలను, వాహనాలను సమకూరుస్తూ, ప్రతి రోజూ సగటున 15 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరిస్తూ రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. ప్రభుత్వ గోదా ముల్లో స్థలం లేకపోవడంతో ప్రైవేట్ గిడ్డంగులను అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. మొ క్కజొన్న సేకరణ సైతం తుది దశకు చేరిందన్నారు. పంట దిగు బడుల కొనుగోలు విషయంలో విమర్శలు చేస్తున్న వారు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందనేది గమనించి వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు. కలెక్టర్‌తోపాటు అధికారులు పాల్గొన్నారు. -
నిజామాబాద్
శనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026– 8లో uఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం కార్పొరేట్, ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు ఆఫర్లు, రాయితీల పేరిట మభ్యపెడుతున్నాయి. పదో తరగతి పాసైన గ్రామీణ ప్రాంత విద్యార్థులే లక్ష్యంగా చేసుకొని వారి ఏజెంట్లను పంపుతున్నాయి. బహుమతులు, అడ్వాన్స్‌లు అందజేస్తూ అడ్మిషన్లు చేసుకుంటున్నాయి. తీరా అడ్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్లు చెప్పే వివిధ ఫీజుల వివరాలు తల్లిదండ్రులను షాక్‌కు గురి చేస్తున్నాయి. ఫ్రీ సీటు.. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
నిజాంసాగర్(జుక్కల్): మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ట్రాక్టర్లను గురువారం ఉదయం పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. మండలంలోని మాగి, అచ్చంపేట గ్రామ శివారుల్లోని మంజీరా నది నుంచి నిజాంసాగర్‌కు ఇసుకను తరలిస్తుండగా ట్రాక్టర్లను పట్టుకున్నామని చెప్పారు. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు వారిపైన కేసు నమోదు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల అనుమతుల పేరిట అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ● ఇద్దరికి గాయాలు రుద్రూర్: కోటగిరి మండలం ఎత్తొండ గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కోటగిరికి చెందిన సాత్విక్, సాయిలు కారులో ప్రయాణిస్తుండగా ఎత్తొండ క్యాంపు సమీపంలో అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. -
ఆధ్యాత్మిక చింతనలో బాలలు
మోర్తాడ్ మండలం సుంకెట్‌లోని శ్రీకృష్ణ మందిరంలో భగవద్గీత పారాయణం చేస్తున్న భక్తులు, పాల్గొన్న చిన్నారులు మోర్తాడ్(బాల్కొండ): ప్రపంచంలోనే అత్యంత ప్రామాణిక, ధార్మిక గ్రంథంగా కీర్తింపబడుతున్న భగవద్గీతను పారాయణం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారీ చిన్నారులు. వేసవి సెలవులను కాలక్షేపం కోసం కాకుండా ధార్మిక సేవపై దృష్టి సారించిన మోర్తాడ్ మండలం సుంకెట్ చిన్నారులు భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేయడంతోపాటు అవగాహన పెంపొందించుకుంటున్నారు. శ్రీకృష్ణ మందిరంలో రోజూ సాయంత్రం గీతా పారాయణ కార్యక్రమాన్ని భక్తులు రాజేందర్, కత్తి గంగాధర్, గోవర్దన్ నిర్వహిస్తుండగా గ్రామంలోని చిన్నారులు భాగస్వాములు అవుతున్నారు. భగవద్గీత ప్రాముఖ్యత గురించి ఎందరో మహానుభావులు గొప్ప గా వర్ణించారు. అందుకే తాము చదవలేకపో యినా మా చిన్నారులైనా శ్లోకాలను పఠించి అందులోని పరమార్థాన్ని గ్రహిస్తే తాము ఎంతో భా గ్యవంతులమైనట్లే అని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు.చిన్న వయస్సులోనే గీతా శ్లోకా లను కంఠస్థం చేయడం, అవగాహన పెంపొందించుకోవడంపై దృష్టి సారించిన చిన్నారుల ను అభినందించాల్సిందే. రోజుకు కొన్ని శ్లోకాలను చదువుతూ అర్థం తెలుసుకుంటున్నాం. మాకు అర్థం అయ్యేలా శ్లోకాల పూర్తి వి వరాలను చెబుతున్నారు. గీ తా పారాయణం ఎంతో బా గుంది. పోటీ పడి శ్లోకాలను కంఠస్థం చేస్తున్నాం. – శ్రీవాణి రోజూ సాయంత్రం ఎప్పుడెప్పుడవుతుందీ.. గీతా పారాయణానికి వెళ్లాలనే కాంక్ష మాలో బలంగా ఉంది. మాకు గీతా శ్లోకాలను చెప్పేవారు ఆలయం వద్దకు వెళ్లకముందే మేమే వెళుతున్నాం. గీతా గ్రంథాలను చదువుతున్నాం. – మాన్విత వేసవి సెలవులను వృథా కానివ్వకుండా గీతా శ్లోకాలను చదువుకుంటున్నాం. ఇంటివద్ద ఉన్నప్పుడు కూడా శ్లోకాలను చదువుకుంటూ అ ర్థం తెలుసుకుంటున్నాం. మా గ్రామంలో గీతా శ్లో కాలు చదివే కార్యక్రమం ఎంతో బాగుంది. – వర్షిత గీతా శ్లోకాలపై పోటీలను నిర్వహిస్తే మేము తప్పకుండా పాల్గొంటాం. రోజు కొన్ని శ్లోకాలను నేర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మా తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. – శ్రీనిత గీతా పారాయణంతో చదువుపై ఆసక్తి పెరిగింది. గీతలో శ్రీకృష్ణుడు ఎన్నో గొప్ప విషయాలను చెప్పడం అదంతా మన జీవితంతో ముడిపడి ఉందనే విషయాన్ని తెలుసుకున్నాం. చేసే పనిపై పట్టు సంపాదించడానికి గీతా పారాయణం తోడ్పడుతుంది. – హరిగ్న భగవద్గీత శ్లోకాలను పాఠశాలల్లోనూ నేర్పించాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ గ్రంథం ఎంతో కీలకమైంది. గీతా పారాయణంతో మాకు ఎంతో అవగాహన వచ్చింది. మొదట్లో కొంత ఇబ్బంది అనిపించినా ఇప్పుడు సంతోషంగా ఉంది. – ప్రణవి ప్రతి ఒక్కరూ గీతా శ్లోకాలను చదువుకోవాలి. మనిషి జీవితం మొత్తం ఈ గ్రంథంపైనే ఆధారపడింది. మేము ఆటలాడుకోవడం కన్నా గీతా శ్లోకాలను నేర్చుకోవడంపైనే ఆసక్తిని పెంపొందించుకున్నాం. – వరునిత సెలవుల్లో గీతా పారాయణం భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేస్తున్న చిన్నారులు ఆదర్శంగా నిలుస్తున్న సుంకెట్ విద్యార్థులు -
చట్టాన్ని అతిక్రమించొద్దు
ఇందల్వాయి: గన్నారం గ్రామంలోని 853 సర్వే నంబర్ స్థల వివాదంపై ఏసీపీ ప్రకాశ్, ఆర్డీవో రాజేంద్రకుమార్ తహసీల్ కార్యాలయంలో గ్రామస్తులతో గురువారం సమావేశమయ్యా రు. వీడీసీ సభ్యులు, మాదిగ కులస్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాదాస్పద స్థలంపై రెవెన్యు అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ స్థలంలో గ్రామస్తులెవరూ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని సూచించారు. చట్టాన్ని అతిక్రమించి, అధికారుల ఆదేశాలను ధిక్కరిస్తే సహించబోమని తెలిపారు. సమావేశంలో డిచ్పల్లి సీఐ వినోద్, ఎస్సై సందీప్, తహసీల్దార్ బాలయ్య, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: ఆలిండియా యూనివర్సిటీ ఉషూ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి ఫరియాకనమ్ కాంస్య పతకం సాధించింది. జమ్మూ కశ్మీర్లో ఈ నెల 4 నుంచి 9 వరకు పోటీలు జరిగాయి. ఫరియాకనమ్ గతంలో రుమోనియా, రష్యా దేశాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించింది. ఉషూ కోచర్ అబ్దుల్ఉమెర్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటుంది. నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్, కార్యవర్గ పదవులకు జిల్లా పరిశీలకుడు చుక్కా శ్రీనివాస్ నగరంలోని కాంగ్రెస్ భవన్లో గురువారం దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌తోపాటు కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ లింగం, నగర చైర్మన్ వినయ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్, రాజ్ గగన్, రాజేశ్, దేగాం ప్రమో ద్, శాంతి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ● బక్రీద్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు ● ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డి క్రైం: బక్రీద్ పండుగ నేపథ్యంలో శాంతి భ ద్రతలకు ఎలాంటి విఘా తం కలగకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం తెలిపారు. జిల్లాలో 6 ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. వాహనాలు ఆపడం, తనిఖీలు చేయ డం లాంటి అధికారాలు కేవలం ప్రభుత్వ విభాగాలకు మాత్రమే ఉంటాయన్నారు. వ్యక్తులు గానీ, సంస్థలు గానీ తనిఖీలకు దిగడం నిషేధమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా ద్వేషపూరిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, మత సామరస్యానికి భంగం కలిగించే పోస్టు లు పెట్టినా చర్యలు తప్పవన్నారు. అలాంటి వాటిపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందన్నారు. ప్రజలందరూ సోదరభావంతో మెల గాలని కోరారు. ఎక్కడైనా శాంతికి విఘాతం కలిగించే అంశం ఏదైనా ఉంటే వెంటనే పోలీసుల(హెల్ప్‌లైన నంబర్– 87126 86133 )కు సమాచారం ఇవ్వాలన్నారు. అంతేగానీ చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. అత్యవసర సహాయం కోసం డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. మహిళాసంఘాల ద్వారా పసుపు విక్రయించండి నిజామాబాద్‌అర్బన్: పసుపును మహిళా సంఘాల ద్వారా ప్రతి ఇంటికి విక్రయించా లని పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం చై ర్మన్ తిరుపతిరెడ్డి గురువారం డీఆర్డీవో సా యన్నకు విన్నవించారు. సంఘం ఆధ్వర్యంలో తయారు చేసిన పసుపు ప్యాకెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెమికల్స్ లేకుండా తయారు చేసిన పసుపు ప్రతి ఇంటికి అందిదే బాగుంటుందన్నారు. త్వరలోనే పసుపు పరిశ్రమను సందర్శించి మహిళా సంఘాల ద్వారా కల్తీలేని కె మికల్ లేని పసుపును ప్రతి కుటంబానికి చే రడానికి సహకరిస్తామని డీఆర్డీవో అన్నారు. -
సెలవుల్లో సరదాగా..
మాలోత్ ఇందు 5వ తరగతి గ్రామం: తిమ్మారెడ్డి తండా మండలం: ఎల్లారెడ్డి జిల్లా: కామారెడ్డి బి.కళ్యాణ్‌ప్రసాద్ నిజామాబాద్. ఎల్లారెడ్డిరూరల్: వేసవి సెలవులను చిన్నారులు ఆనందంగా గడుపుతున్నారు. మండలంలోని వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో చిన్నారులు చెట్ల కింద గోళీలాడుతూ, టైర్లతో గ్రామంలో తిరుగుతూ కనిపించారు. చెట్టు కింద గోళీలు, ఉదయం, సాయంత్రం టైర్లతో ఆడుతూ సంతోషంగా గడుపుతామని చిన్నారులు చెప్తున్నారు. -
విద్యతోనే సమాజంలో మార్పు
రెంజల్(బోధన్): విద్యతోనే సమాజంలో మార్పు, మనుగడ సాధ్యపడుతుందని వక్తలు పేర్కొన్నారు. మండలంలోని కందకుర్తి గ్రామంలో గురువారం ఎస్బీఐ సహకారంతో కేశవ శిశు విద్యామందిర్, కోల్ ఇండియా సహకారంతో కేశవ నైపుణ్య వికా సం కేంద్రం నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కేశవ శిశు మందిర్‌తోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని యువత, విద్యార్థులు, రైతులకు ఉపయోగపడేలా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. విద్య, వికాసంతో యువ త అన్ని రంగాల్లో రాణించడంతోపాటు ప్రతి ఒక్క రు విద్యావంతులైనప్పుడు అంటరానితనం, కుల వ్యవస్థలు నిర్వీర్యమవుతాయని పేర్కొన్నారు. కేశవ శిశుమందిర్ విద్యాలయాలు నిరుపేద విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తూనే ఇతర రంగాల్లోని వ్యక్తులకు శిక్షణ అందిస్తూ ఆర్థికంగా రాణించేలా చేస్తున్నాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో రాష్ట్రీయ సేవా భారతి అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి రేణుక పాఠక్, కేశవ సేవా సమితి అధ్యక్షుడు చామకూర సుధాకర్‌రెడ్డి, కేదార్నంద మహరాజ్, సీతారాం త్యాగి మహరాజ్, సేవా భారతి తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రెడ్డి, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ పర్వీన్, ప్రాజెక్టు మేనేజర్ ఇప్సిత దత్త, జిల్లా సేవాభారతి అధ్యక్షుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
క్షయ నిర్ధారణ పరీక్షలు పెంచాలి
డీఎంహెచ్‌వో రాజశ్రీ గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ సుభాష్‌నగర్: క్షయ రహిత సమాజమే అందరి లక్ష్యమని, వ్యాధి నిర్ధారణ పరీక్షలను పెంచి సిబ్బంది లక్ష్యాన్ని చేరుకోవాలని డీఎంహెచ్‌వో రాజ శ్రీ సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో క్షయ నియంత్రణ విభాగం పనితీరు, లక్ష్యాల సాధనపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఆర్మూర్, బోధన్ ప్రాంతాల్లో పెండింగ్‌లో చాలా కేసులు ఉన్నాయని, వాటన్నింటిని నెలరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల వారీగా క్షయ నిర్ధారణ శిబిరాలను నిర్వహిస్తూ నూతన కేసులను గుర్తించాలన్నారు. క్షయ రహిత గ్రామాల సంఖ్యను పెంచాలన్నారు. సర్పంచుల సహకారంతో లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. నిజామాబాద్ పట్టణంలో డివిజన్ల వారీగా క్షయ నిర్ధారణ శిబిరాలను నిర్వహించి, నూతన కేసులను గుర్తించడానికి ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. హెచ్ఐవీ, హెచ్‌బీఎస్ ఏజీ, వైడల్, హెచ్‌బీ, బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరీ, డీహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, డీపీసీ లక్ష్మణ్, నరేశ్, రవిగౌడ్, వినోద్ సిబ్బంది పాల్గొన్నారు. సుభాష్‌నగర్: పద్నాలుగేళ్లు పూర్తి చేసుకున్న బాలికల్లో గర్భాశయ క్యాన్సర్ రాకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్ రక్షణగా నిలుస్తుందని డీఎంహెచ్‌వో రాజ శ్రీ తెలిపారు. నగరంలోని మాలపల్లి, అర్సపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని కార్పొరేటర్లు, మత పెద్దలతో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై గురువారం చర్చించారు. ఈ సందర్భంగా వారికి అవగాహన కల్పించారు. మహిళల్లో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తగా బాలికలకు హెచ్‌పీవీ టీకాలు ఇస్తున్నామని తెలిపారు. డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్ మాట్లాడుతూ మైనార్టీ ఏరియాలోని ప్రతి బాలికకు హెచ్‌పీవీ టీకాను ఇప్పించడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి అశోక్, డాక్టర్ అజ్మల్, డాక్టర్ అజ్మతున్నీసా బేగం, డిప్యూటీ డీఎంహెచ్వోలు సికందర్ నాయక్, రాణా ప్రతాప్, నవ్య, కార్పొరేటర్లు షకీల్, ఇంతియాజ్, రియాజ్, అమన్ ఫారూఖీ, ఆదిత్య, ముజీబ్, ఆజాద్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
డేంజర్ డంపర్లు
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ నుంచి నల్లమట్టిని తరలిస్తున్న టిప్పర్లు, డంపర్లు యమదూతల్లా దూసుకొస్తున్నాయి. ఎక్కడి నుంచి ఏ టిప్పర్ తమపైకి వస్తుందోనని మండల ప్రజలు భయపడుతున్నారు. భారీ వాహనాల అతివేగానికి ప్రాణభయంతో రోడ్లు ఎక్కడానికే జంకుతున్నారు. డొంకేశ్వర్ మండలంలోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో అన్నారం, సిర్పూర్ గ్రామాల శివారు ప్రాంతాల్లో నల్లమట్టి తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. పంటల సాగు కోసం ఈ మట్టిని రైతుల పొలాలకు తరలిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా... మట్టిని తరలిస్తున్న టిప్పర్లు, డంపర్లతో పశువులకు, ప్రజలకు, చిన్న పిల్లలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇరుకురోడ్లు కలిగిన గ్రామాల మీదుగా భారీ వాహనాలను నిర్దిష్ట వేగంతో వెళ్లకుండా ఓవర్ స్పీడ్‌తో నడుపుతున్నారు. నిబంధనలకు ఉల్లఘించి రాత్రుల్లో కూడా రవాణా చేస్తున్నారు. దీంతో వాహనాల శబ్దం, దుమ్ముతో కాలుష్యం అవుతుతోంది. ఓవర్ లోడ్‌తో రోడ్లు ధ్వంసం అవుతున్నారు. రోడ్లకు దగ్గరగా ఆడుకునే చిన్నారులకు ఏం జరుగుతుందోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు. నిమ్మకు నీరెత్తిన అధికారులు ఈ నెల 13న సాయంత్రం డొంకేశ్వర్ మీదుగా డంపర్లు అతివేగంగా వెళ్లడంతో ప్రమాదాలు జరిగాయి. సాయంత్రం సమయంలో ఒక డంపర్ వాహనం పశువులపైకి దూసుకెళ్లింది. ఓ గేదే తీవ్రంగా గాయపడింది. పక్కనే ఉన్న రైతు కండెల రాజన్న త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానిక రైతులు, గ్రామస్తులు టిప్పర్‌ను అడ్డుకొని డ్రైవర్‌ను పట్టుకున్నారు. అంతకు ముందురోజు డంపర్ కారణంగా విద్యుత్ వైర్ తెగిపోయి రోడ్డుపై పడిపోయింది. స్థానికంగా ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అనుభవం లేని వారితో నల్లమట్టి టిప్పర్లు నడిపిస్తున్నారని, కొంతమంది మద్యం సేవించి ఇష్టానుసారంగా తోలుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సాయంత్రం గేదెలను తీసుకొని ఇంటికి వస్తుండగా వేగంగా వస్తున్న టిప్పర్ పశువులపైకి దూసుకొచ్చింది. ఒకదానికి తీవ్రంగా దెబ్బ తగిలి రక్తం కారింది. పక్కనే నేను కూడా ఉన్నా, కొంచెం అయ్యి ఉంటే నా ప్రాణం కూడా పోయేది. నల్లమట్టి టిప్పర్ల మూలంగా రోడ్లపైకి రావాలంటేనే అందరికీ భయంగా ఉంది. – కండెల రాజన్న, బాధిత రైతు, డొంకేశ్వర్ పొలాలకు నల్లమట్టిని రవాణా చేసే విషయంలో రైతులందరం సానుకూలంగానే ఉన్నాం. కానీ, భారీ టిప్పర్లు, డంపర్లను అనుభవం లేని డ్రైవర్లు నడుపుతున్నారు. మద్యం సేవించి అతివేగంతో వెళ్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఏ అధికారి పట్టింపు లేకుండా ఉంటున్నారు. – గోక గంగారెడ్డి, రైతు, డొంకేశ్వర్ మితిమీరిన వేగంతో వెళ్తున్న నల్లమట్టి టిప్పర్లు డొంకేశ్వర్‌లో పశువులపైకి దూసుకెళ్లిన వాహనం రైతుకు త్రుటిలో తప్పిన ప్రమాదం మద్యం మత్తులో నడుపుతున్న అనుభవం లేని డ్రైవర్లు! చూసీచూడనట్లుగా ఉంటున్న అధికారులు, పోలీసులు -
మొక్కజొన్నను గోదాములకు తరలించాలి
మోపాల్(నిజామాబాద్‌రూరల్): మొక్కజొన్న రైతులకు ఏ దశలోనూ అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత అధికారులదేనని, సేకరించిన పంట దిగుబడిని గోదాములకు తరలించి భద్రపర్చాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మండలంలోని శ్రీరాంనగర్ తండాలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. మొక్కజొన్న నాణ్యత, తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించిన కలెక్టర్.. ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషన్ ద్వారా తూకం సరిగా చేస్తున్నారా..? లేదా? అని గమనించారు. ఎన్ని క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు పూర్తయ్యింది.. ఇంకా ఎంత మేరకు పంట దిగుబడి సేకరించాల్సి ఉందనే వివరాలు అడిగి తెలుసుకుని అధికారులకు సూచనలు చేశారు. అనంతరం శ్రీనగర్‌లోని గోదామును కలెక్టర్ సందర్శించారు. మొక్కజొన్న అన్ లోడింగ్ తీరు, బస్తాలు భద్రపరుస్తున్న విధానాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నుంచి బస్తాలను త్వరితగతిన తరలించేందుకు తగినన్ని లారీలు, ఇతర రవాణా వాహనాలు వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రేఖానాయక్, ఎంపీడీవో రాములునాయక్, మార్క్‌ఫెడ్ సిబ్బంది భాస్కర్, సొసైటీ సీఈవో నర్సయ్య, స్థానిక సిబ్బంది, రైతులు ఉన్నారు. -
సీఎం గారు..?
హామీ మరిచారాసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే నిజామాబాద్‌కు రింగురోడ్డు నిర్మిస్తామని గత ఎన్నికల సభలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి దాన్ని మరిచిపోయారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పాలకవర్గాలను కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ ఇచ్చిన హామీని పట్టించుకోకపోవడమేమిటని నిట్టూర్పులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి తాజాగా రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్, కరీంగనర్ నగరాల చుట్టూ రింగురోడ్లు నిర్మించేందుకు నిర్ణయించి, నిజామాబాద్ రింగురోడ్డు విషయాన్ని పట్టించుకోకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రతిపాదించిన జక్రాన్‌పల్లి విమానాశ్రయాన్ని అటకెక్కించారని, మరోవైపు డ్రైపోర్టు అంశాన్ని పక్కకు పెట్టారని, హైదరాబాద్–నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడర్ విషయాన్ని మరిచారని జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఽడాక్టర్ భూపతిరెడ్డి నగరం చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్ కోసం రూ.2వేల కోట్లతో ప్రతిపాదనలు, గుండారం వద్ద 500 ఎకరాల్లో ఇండస్ట్రియల్ జోన్ కోసం ప్రతిపాదనలు పంపారు. వరంగల్ తర్వాత పెద్ద నగరంగా ఉన్న నిజామాబాద్‌పై ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తుండడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇందూరుకు రింగ్ రోడ్డు నిర్మిస్తామని సీఎం ఇచ్చిన హామీని నగర ప్రజలు గుర్తుచేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర నగరాలకు రింగ్ రోడ్ ప్రకటించి జిల్లాకు మొండిచేయి చూపడంపై అసహనం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సీఎం ఇచ్చిన హామీలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇందూరుకు రింగ్ రోడ్ ఎప్పుడు? గత మున్సిపల్ ఎన్నికల్లో సీఎం ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్న ప్రజలు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్లు జక్రాన్‌పల్లి విమానాశ్రయం, డ్రైపోర్టు, హైదరాబాద్–నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడర్లు సైతం అటకెక్కించడంపై జనాల్లో అసహనం -
ఆలయాల భూములను పరిరక్షించాలి
నిజామాబాద్ రూరల్: ఆలయాల భూముల ను పరిరక్షించే బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని ఉమ్మడి జిల్లా దేవాదా య శాఖ సహాయ కమిషనర్ విజయరామారావు అన్నారు. నగరంలోని సర్వే నంబర్ 341,342లో నీలకంఠేశ్వర ఆలయ భూము ల సర్వేను గురువారం చేపట్టారు. 3ఎకరా ల 9గుంటల భూమిలో ఆక్రమణలు ఉన్న ట్లు ప్రాథమికంగా గుర్తించామని విజయరామారావు తెలిపారు. కంఠేశ్వర్ దేవస్థాన భూ ములను భవిష్యత్‌లో లీజుకు ఇవ్వడం లేదా ప్రజ్రాయోజనార్థం, ఫంక్షన్ హాల్ తదితర నిర్మిణాలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, దేవాదాయ శాఖ సర్వేర్ అనిల్, ఆలయ ఈవో రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన, ఒత్తిడి లేని విద్య మోపాల్(నిజామాబాద్‌రూరల్): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, ఒత్తిడి లేని విద్య ల భిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ విద్యావారోత్సవాల్లో భాగంగా గురువారం నగరశివారులోని బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్ లో బడిబాటపై ప్రత్యేకంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ర్యాలీ ని ర్వహించారు. ప్రభుత్వం విద్యావ్యవస్థలో చే పట్టిన కార్యక్రమాలు, కల్పించనున్న సౌకర్యాలు డీఈవో వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. కార్పొరేటర్ యాదల నరేశ్, మండల స్పెషల్ ఆఫీసర్ తిరుమల ప్రసాద్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు కల్లెడ అశోక్ ప్రసంగించారు. మూడేళ్లుగా పాఠశాలల్లో వి ద్యార్థుల నమోదు, విద్యాస్థితి, వివిధ అంశా ల్లో పాఠశాల చేపట్టిన కార్యక్రమాలను ఆడి యో, విజువల్ రూపంలో పాఠశాల హెచ్ఎం శంకర్ తల్లిదండ్రులకు వివరించారు. అంతకుముందు విద్యార్థులకు ప్రశంసాప త్రాలు అందించారు. అమ్మ ఆదర్శ పాఠశా ల కమిటీ అధ్యక్షుడు జమున పాల్గొన్నారు. రోడ్డు ఆక్రమణ తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ బోధన్: నిజామాబాద్ – బోధన్ ప్రధాన రో డ్డు వెంబడి ఎడపల్లి మండలంలో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు పోలీస్ శాఖ ఆ ధ్వర్యంలో గురువారం స్పెషల్ డ్రైవ్ చేపట్టా రు. మండలంలోని జానకంపేట, ఎంఎస్సీ ఫారం, సాటాపూర్ గేట్, మండల కేంద్రంలోని మంగళ్పహాడ్ క్రాసింగ్ వద్ద రేకుల షె డ్డులను పొక్లెయిన్లతో తొలగించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ మాట్లాడుతూ.. బోధన్– నిజామాబాద్ మధ్య, జానకంపేట నుంచి బాసర వెళ్లే 163 నంబర్ జాతీయ రహదారి వెంబడి ట్రాఫిక్ రద్దీ ఉంటుందని, రోడ్డు స్థలం ఆక్రమణల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందన్నారు. ఆక్రమణ తొలగింపునకు సహకరించాలన్నారు. బోధన్ రూర ల్ సీఐ విజయబాబు, ఎడపల్లి ఎస్సై ము త్యాల రమ, సిబ్బంది పాల్గొన్నారు. కమిషనర్ ఆకస్మిక తనిఖీలు సుభాష్‌నగర్: నిజామాబాద్ నగరంలోని 12, 41వ డివిజన్లలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్‌కుమార్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. శానిటేషన్ కార్యక్రమాలతోపాటు తాగునీటి సరఫరాను పరిశీలించారు. తాగునీటి సరఫరాపై స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, ప్రజలతో మా ట్లాడిన ఆయన.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. నాణ్యమైన నీటిని సరఫరా చేయాలని, వేసవిలో నీటి ఎద్దడి లేకుండా సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఆయన వెంట కార్పొరేటర్లు, నాయకులు, మున్సిప ల్ ఈఈ పీర్ రాజు, డీఈలు, ఏఈలు, శానిటేషన్ సిబ్బంది, కాలనీవాసులు ఉన్నారు. -
జిల్లాకు చేరుకుంటున్న జీలుగ
● 50 శాతం సబ్సిడీపై సొసైటీల ద్వారా త్వరలో పంపిణీ ● వ్యవసాయశాఖకు అందిన ఉత్తర్వులుడొంకేశ్వర్(ఆర్మూర్) : వానకాలం సాగు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యవసాయశాఖ జిల్లాకు అవసరమైన జీలుగ, జనుము విత్తనాలను తెప్పిస్తోంది. 10 వేల క్వింటాళ్లకుగాను ప్రస్తుతం 1310 క్వింటాళ్లు జిల్లాకు చేరుకున్నాయి. మిగతావి కూడా విడతల వారీగా తెప్పించే పనిలో ఉన్నారు. పంటలకు అధిక దిగుబడులనిచ్చే పచ్చి రొట్ట విత్తనాలను సొసైటీల ద్వారా 50శాతం సబ్సిడీపై రైతులకు త్వరలో పంపిణీ చేయనున్నారు. ఇందుకు రైతు ఆధార్, పట్టా పాస్‌పుస్తకం చూపాల్సి ఉంటుంది. 30 కిలోలు ఉండే ఒక జీలుగ బస్తా ధర రూ.4,904 ఉండగా, సబ్సిడీ పోను రైతులు రూ.2,452 చెల్లిస్తే సరిపోతుంది. అలాగే 44 కిలోల జనుము బస్తా ధర రూ.6,220 కాగా, రైతులు రూ.3,100 చెల్లిస్తే సరిపోతుంది. ఈ మేరకు దీని సంబంధిత ఉత్తర్వులు వ్యవసాయ శాఖకు అందాయి. లాభాలివే.. ● జీలుగను కలియదున్నడం వలన ఎకరానికి సుమారు 8 నుంచి 10 టన్నుల సేంద్రియ పచ్చిరొట్ట లభిస్తుంది. ఇది మట్టిని సారవంతం చేసి మేలు చేస్తుంది. ● చౌడు, లవణ గుణాలు ఎక్కువగా ఉన్న నేలలకు జీలుగ అత్యంత అనుకూలమైంది. ఇది నేల పీహెచ్ స్థాయిని తగ్గించి, చౌడును విరిచేందుకు సహాయపడుతుంది. ● నేల గుల్లబారి గాలి ప్రసరణ పెరుగుతుంది. ఫలితంగా భూమికి నీటిని, పోషకాలను నిల్వ ఉంచుకునే సామర్ధ్యం బాగా పెరుగుతుంది. ● జీలుగ మొక్కలు వేగంగా పెరిగి పొలమంతా దట్టంగా అల్లుకుపోవడం వల్ల కలుపు మొక్కలు పెరగడానికి అవకాశం ఉండదు. వరి పంట దిగుబడి 20శాతం వరకు పెరుగుతుంది.ఎకరానికి 12 నుంచి 15 కిలోల జీలుగ విత్తనా లు అవసరమవుతా యి. విత్తనాలు విత్తిన 40 నుంచి 45 రోజుల వ్యవధిలో పూత దశకు రాగానే నీరు పెట్టి పొలంలోనే కలియదున్నాలి. ఆ తర్వాత పది రోజులు కుళ్లనిచ్చి తదుపరి పంటను వేయాలి. త్వరలోనే సొసైటీల ద్వారా వి త్తనాలను సబ్సిడీపై అందజేస్తాం. – మధుసూదన్, మండల వ్యవసాయాధికారి, డొంకేశ్వర్ -
నిజామాబాద్
వాతావరణం ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరుగుతుంది. మధ్యాహ్నం వడగాలులు వీస్తాయి. ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి నిర్మలంగా ఉంటుంది. డేంజర్ డంపర్లు ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ నుంచి నల్లమట్టిని తరలిస్తున్న టిప్పర్లు, డంపర్లు యమదూతల్లా రోడ్లపైకి దూసుకొస్తున్నాయి. శుక్రవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2026– 8లో uభానుడి ఎఫెక్ట్ -
రైతులను దోపిడీ చేయొద్దు
● బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ● నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాల పరిశీలనమోర్తాడ్(బాల్కొండ): ధాన్యం సేకరణ ప్రక్రియలో తరుగు పేరుతో రైతులను నిలువుదోపిడీ చేయొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తమ హయాంలో తరుగు అనే పదం లేకుండా ధాన్యం సేకరించి రైతులకు ఎంతో న్యాయం చేశామని పేర్కొన్నారు. బా ల్కొండ నియోజకవర్గంలోని దూద్గాం, రెంజర్ల, నాగంపేట్, చౌట్పల్లి, పిప్రి కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన సందర్శించారు. గన్నీ సంచులు లేకపోవడంతో ధాన్యం ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా కనిపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ధాన్యం సేకరణ విషయంలో కలెక్టర్ త నకు స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయి లో మాత్రం ధాన్యం అలాగే ఉందని ఆరోపించారు. అలాగే మక్కల కొనుగోళ్ల విషయంలో నూ నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. జిల్లా సరిహ ద్దు గ్రామమైన దూద్గాంపై నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు. నిర్లక్ష్యాన్ని వీడకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
పనులను వేగవంతం చేయాలి
రుద్రూర్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని బోధన్ ఆర్డీవో విజయకుమారి సిబ్బందిని ఆదేశించారు. పోతంగల్ మండలం పీఎస్ఆర్ నగర్ (రాంగంగా నగర్) శివారులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన పనులను గురువారం ఆమె పరిశీలించారు. పనుల పురోగతిపై కాంట్రాక్టర్లు, గ్రామ పెద్దలు, దేవాలయ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ సమయంలో ఎదురవుతున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కోటగిరి ఏఎంసీ చైర్మన్ గైక్వాడ్ హన్మంతు, తహసీల్దార్లు విష్ణు, గంగాధర్, రెవెన్యూ, హౌసింగ్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
వీడని పింఛన్ ఫికర్
● కొత్త పెన్షన్లకు లభించని మోక్షం ● 2022లో నిలిచిన ప్రక్రియ మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలం సుంకెట్ కు చెందిన రమ్య భర్త గంగాధర్ అనారోగ్యంతో ఐ దేళ్ల క్రితం మరణించాడు. ఇంటి పెద్దదిక్కును కో ల్పోయిన రమ్య.. పిల్లలను బతికించుకోవడానికి వ్యవసాయ పనులకు వెళ్తోంది. రోజూ కష్టపడితేనే తిండిదొరికే పరిస్థితి ఆ కుటుంబానిది. వితంతు పింఛన్ కోసం రమ్య ఐదేళ్లుగా గ్రామ పంచాయతీ, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇలా ఎంతో మంది అర్హులైన వితంతులు, వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ కోసం ఎదురు చూస్తూ నే ఉన్నారు. 2022లో పింఛన్ల మంజూరు ప్రక్రి య నిలిచిపోగా.. గతేడాది బడ్జెట్ ప్రసంగంలో డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నూతన పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. అయినప్పటికీ కొత్త పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాలేదు. పింఛన్లకు సంబంధించిన వెబ్‌సైట్‌ను హోల్డ్‌లో పెట్టారు. కొత్త పింఛన్ల విష యంలో ఏదో ఒక సందర్బంలో మంత్రులు ప్రకటనలు చేస్తున్నా మార్గదర్శకాలు మాత్రం జారీ కావ డం లేదు. కేవలం స్పౌజ్ ఆప్షన్ మాత్రమే పని చే స్తోంది. జిల్లాలో ప్రస్తుతం 2.69 లక్షల వివిధ రకాల పింఛన్లు అందుతుండగా, గతంలో ఆన్లైన్ చేసిన దరఖాస్తులు సుమారు 25వేల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య 40 వేలకుపైగా ఉండొచ్చని అంచనా. కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. దరఖాస్తులు స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేస్తే గ్రామ పంచాయతీల వారీగా దరఖాస్తులను సేకరిస్తాం. వెబ్ ఆప్షన్ ఇస్తే నే ఆన్లైన్లో నమోదు చేయడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకూ వేచి ఉండాలి. – తిరుమల, ఎంపీడీవో మోర్తాడ్ -
కలసికట్టుగా పోరాడాలి..
జిల్లా అభివృద్ధి కోసం ప్రజలంతా కలసికట్టుగా ప్రజాప్రతి నిధులు, నాయకులపై ఒత్తిడి తీసుకురావాలి. సీఎం ప్రకటించిన వాటిలో ఒక్క నిజామాబాద్ అభివృద్ధి ప్రాజెక్టులు తప్ప ఇతర అన్ని జిల్లాలవి ఉన్నాయి. నిజామాబాద్ రింగురోడ్డు హామీ నిలబెట్టుకోకపోగా, ప్రకటించిన టెంపుల్ కారిడర్లు, టూరిజం కారిడర్లలో సైతం జిల్లా ప్రస్తావనే లేదు. ఇది శోచనీయం. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఇచ్చిన రింగురోడ్డు హామీ అలాగే వదిలేశారు. ఇక 2009లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతిపాదించిన జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు విషయాన్నీ తర్వాత ప్రభుత్వాలు వదిలేశాయి. ఇక కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ నగరానికి 50 బస్సులను కేటాయించి, సిటీ బస్సు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో 10 ఎకరాల స్థలం చూపించమంటే దాన్నీ పెండింగ్‌లో పెట్టడం సరికాదు. ఖమ్మం, కరీంనగర్ కంటే పెద్దదైన నిజామాబాద్ నగరానికి రింగురోడ్డు ఇవ్వకపోవడం సరికాదు. జనాభా, ఓటర్లు, విస్తీర్ణం పరంగా పెద్దదైన నిజామాబాద్‌ను వదిలేసి ఆ నగరాలకు మాత్రం రింగురోడ్డులు ఇస్తే జిల్లా నాయకులు మాత్రం స్పందించకపోవడం శోచనీయం. – రేకులపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, జిల్లా అభివృద్ధి సంస్థ -
రైస్ మిల్లుల ఆకస్మిక తనిఖీ
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ ప్రాంతంలో ఉన్న రైస్ మిల్లులను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లక్ష్మీబాలాజీ, శ్రీ సిద్ధి రామేశ్వర రైస్ మిల్లులను సందర్శించిన కలెక్టర్.. కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల ధాన్యం వచ్చింది? దిగుమతి చేసుకున్నారా? ఎక్కువగా ఏ రకం ధాన్యం వస్తోంది? ఎంత పరిమాణంలో మిల్లింగ్ పూర్త య్యింది? మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎలా భద్రపరుస్తున్నారు.. తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిల్లుల వద్ద ఏమైనా తరుగు తీస్తున్నారా అని ఆరా తీశా రు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యాన్ని వెంటవెంటనే దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. అవసరమైతే ఎక్కువ సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ధాన్యం నిల్వ చేసేందుకు సమీపంలోని రైతు వేదికలను వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఎస్వో శ్రీకాంత్‌రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం ప్రవీణ్, రైస్ మిల్లుల నిర్వాహకులు వి మోహన్‌రెడ్డి, శ్రవణ్ కుమార్ తదితరులున్నారు. ప్రశాంతంగా పాలిసెట్ ఖలీల్‌వాడి: జిల్లాలో పాలిసెట్ బుధవారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మొ త్తం 6490 మంది విద్యార్థులకు గాను 5,984 మంది హాజరుకాగా.. 506 మంది గైర్హాజరయ్యారు. ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వారిలో బాలురు 2,808 మంది, బాలికలు 3176 మంది ఉన్నారు. బాలురు 239 మంది, బాలికలు 267 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షాకేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అయితే ముందస్తు సూచనలు చేయకుండానే చాలా సెంటర్ల వద్ద విద్యార్థుల ఆధార్‌కార్డు అడగడంతో వారు ఇబ్బందులు పడ్డారు. దగ్గరలోని ఇంటర్నెట్ సెంటర్లకు, ఇళ్లకు పరుగులు తీశారు. సెంటర్లకు వచ్చిన తరువాత ఆధార్ కార్డు అడుగుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం ఖలీల్‌వాడి: జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మొదటి రోజైన బుధవారం ప్రశాంత వాతావరణంలో కొనసాగాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఒకేషనల్‌లో జనరల్ ఫౌండేషన్ కోర్స్ పరీక్షలు జరిగాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 38 సెంటర్లలో పరీక్షలు కొనసాగగా, ఫస్టియర్ విద్యార్థులు 4,009 మందికిగాను 3,752 మంది, సెకండియర్ విద్యార్థులు 1401 మందికిగాను 1319 మంది హాజరైనట్లు డీఐఈవో వివరించారు. కలెక్టర్‌ను కలిసిన డీఆర్వో నిజామాబాద్‌అర్బన్: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా బి గీత బుధవారం బాధ్యత లు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ను మ ర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. పలు అంశాలపై వారిద్దరు చర్చించారు. -
నిరాశ మిగిల్చిన నువ్వు
● మద్దతు ధరను మించినా లాభం లేదంటున్న రైతులు ● క్వింటాల్ ధర గతంలో రూ.16 వేలు.. ప్రస్తుతం రూ.10 వేలు దాటని వైనంమోర్తాడ్(బాల్కొండ): నువ్వు సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,200 కాగా, ప్రస్తు తం మార్కెట్లో రూ.10వేల వరకు వ్యా పారులు చెల్లిస్తున్నారు. మద్దతు ధరకన్నా రూ.1800 వరకు ఎక్కువ లభిస్తున్నా తమకు నష్టమేనని రైతులు వాపోతున్నారు. గతంలో క్వింటాల్ ధర రూ.16 వేలకు పైగా పలికింది. అయితే అదే ట్రెండ్ కొనసాగుతుందని ఆశించి నువ్వు సా గు చేసిన రైతులకు నిరాశ ఎదురైంది. రెండు మూడేళ్ల క్రితం క్వింటాల్ ధర రూ.16 వేల నుంచి రూ.18 వేల వరకు ఉండడంతో యాసంగి సీజన్లో సజ్జకు పత్యామ్నాయంగా నువ్వునే సాగు చే స్తున్నారు. ఈ సీజన్లో దాదాపు 6 వేల ఎకరాల్లో నువ్వు సాగు చేశారు. క్వింటాల్‌కు రూ.15వేల వరకు ధర లభిస్తేనే ఎంతోకొంత ప్రయోజనం ఉండేదని రైతులు అంటున్నారు. వర్షం కారణంగా పంట దిగుబడి తగ్గిందని వాపోతున్నారు. దిగుబడి ఎక్కువ వచ్చిన చోట్ల ధర ఎలా ఉన్నా ఆదాయం పరవాలేదంటున్నారు. దిగుబడి తగ్గిన చోట మాత్రం నష్టం తప్పలేదంటున్నారు. -
బస్తాకు బైబై!
నానో యూరియా వినియోగానికి రైతుల మొగ్గు● తక్కువ ఖర్చు.. మంచి దిగుబడులు ● ఎరువు కొరతను తాము ఎదుర్కోలేదంటున్న రైతులుడొంకేశ్వర్(ఆర్మూర్): యూరియా బస్తాలకు క్రమంగా రైతులు దూరమవుతున్నారా? అంటే అవుననే చెప్పొచ్చు. రసాయనిక ఎరువుల వాడకంతో భూసారం దెబ్బతింటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం, ఇఫ్కో వంటి సంస్థలు నానో యూరియాను అందుబాటులోకి తెచ్చాయి. మొదట్లో నానో యూరియా వినియోగానికి అంతగా ఆసక్తి చూపని రైతులు క్రమంగా దాని ప్రధాన్యతను తెలుసుకుంటున్నారు. గతంలో 45కిలోల బస్తాలను మోయలేక ఇబ్బంది పడిన వారు ఇప్పుడు కేవలం ఒక బాటిల్‌తోనే పని పూర్తి చేసుకుంటున్నారు. నానో యూరియా అందుబాటులోకి రావడంతో ఎరువుల కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందని అంటున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసినప్పటికీ రానున్న వానకాలం సీజన్లో బస్తాల ఎరువు కొరత ఏర్పడే అవకాశాలున్న నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో అధిక లాభాలను తెచ్చే ‘నానో యూరియా’నే ప్రత్యామ్నాయంగా వినియోగించాలని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 10వేలమంది రైతులు 50వేల ఎకరాలకు పైగా నానో యూరియా, నానో డీఏపీ వినియోగించి పంటలు సాగు చేస్తున్నారు. మంచి ఫలితాలు సాధించిన పలువురు రైతులు వీరే.. -
లారీలను అందుబాటులో ఉంచాలి
● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కమ్మర్పల్లి: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తరలించేందుకు లారీలను అందుబాటులో ఉంచాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కమ్మర్పల్లి మండలంలోని కోనసముందర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. కల్లాల వద్ద ఉన్న రైతులతో మాట్లాడి, ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచే ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పలు సూచనలు చేశారు. ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని, ప్రస్తుతం వస్తున్న రెండు లారీలు సరిపోవని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కలెక్టర్ మాట ఇచ్చిన విధంగా 8 రోజుల్లోగా సేకరణ పూర్తి చేయాలని అన్నారు. బషీరాబాద్ కేంద్రంలో ఇప్పటి వరకు కేవలం 20 శాతం ధాన్యం మాత్రమే లిఫ్ట్ అయిందని, మిగిలిన 80 శాతం ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. లారీల రాకను పెంచాలని జేసీకి సూచించారు. వర్షాల ముప్పు పొంచి ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన ధాన్యం తరలింపు చేపట్టాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకుడు శ్రీనివాస్ గురువారం జిల్లాకు రానున్నారు. కాంగ్రెస్ భవన్లో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్ష పదవితోపాటు ఇతర కార్యవర్గానికి సంబంధించి ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడి నియమాకం నిర్వహించనున్నారు. నిజామాబాద్ రూరల్: ఆర్టీసీ నిజామాబాద్ డి పో–1లో ఈ నెల 16న కార్గో పార్సిల్స్‌కు సంబంధించిన వస్తువుల వేలంనిర్వహించనున్న ట్లు మేనేజర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆస క్తి ఉన్నవారు వేలంలో పాల్గొనాలని కోరారు. ● అధికారులకు అప్పగింత నిజామాబాద్ అర్బన్: నగరంలోని బాలసదనం నుంచి పారిపోయిన బాలికను పోలీసులు పట్టుకొని అధికారులకు అప్పగించారు. మంగళవారం ఉదయం ముగ్గురు బాలికలు బాలసదనంలో ఉండటం ఇష్టం లేక తప్పించుకొని ఇంటికి పారిపోయారు. ఇద్దరు బాలికలు అదే రోజు సాయంత్రం పోలీసులకు పట్టుబడ్డా రు. మూడో బాలిక బుధవారం బాసరలో పట్టుబడింది. మూడో టౌన్ పోలీసులు బాలికను బాలసదనం అధికారులకు అప్పగించారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని వినాయక్‌నగర్ నాగా టవర్స్‌లో బుధవారం దుండగులు చోరీకి పాల్పడ్డారు. 204 ప్లాట్ నంబర్లో నందిపేటలో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తించే కొత్తూరు వనజ నివసిస్తున్నారు. ఉదయం 8 గంటలకు డ్యూటీకి వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. 5 తులాల బంగారం, 15 తులాల వెండి, రెండు ఉంగరాలు అపహరణకు గురైనట్లు 4వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌హెచ్‌వో సతీశ్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు. అపార్ట్మెంట్లో సీసీ ఫుటేజీని పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు ప్లంబర్ పని ఉందని అపార్ట్మెంట్లోకి వచ్చినట్లు గుర్తించారు. -
శాంతి భద్రతలపై దృష్టి సారించాలి
నిజామాబాద్‌అర్బన్: బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. బుధవారం డీజీపీ వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ బక్రీద్ పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా ప్రార్థన స్థలాలు, ఈద్గాలు, మసీదులు, ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాలని సూచించారు. పండుగ రోజు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు వ్యాప్తి చెందకుండా సైబర్ మానిటరింగ్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు. శాంతి కమిటీ సభ్యులతో ముందస్తు సమావేశాలు నిర్వహించాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సున్నిత ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి డ్రోన్, సీసీ కెమెరాలు పర్యవేక్షణలో భద్రత చర్యలను కట్టుదిట్టం చేయాలన్నారు. అన్ని చెక్‌పోస్టులలో 24 గంటలు విధులు నిర్వహించాలన్నారు. రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాటాపూర్ వద్ద జరిగే పశువుల సంతలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీసీలో సీపీ సాయి చైతన్య, అదనపు డీసీపీ శుభం ప్రకాష్, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్‌కుమార్, ఆర్మూర్, నిజామాబాద్, బోధన్ ఏసీపీలు ప్రకాశ్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ తదితరులు పాల్గొన్నారు. వీసీలో పాల్గొన్న సీపీ సాయిచైతన్య, ఇతర పోలీసు అధికారులు -
రాజకీయ లబ్ధి కోసం ప్రశాంత్‌రెడ్డి ప్రయత్నాలు
● రైతులు బీఆర్ఎస్ నాయకుల మాయమాటల్లో పడొద్దు ● రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాజకీయ లబ్ధి కోసం బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే మోర్తాడ్‌లో రైతు ధర్నా పేరుతో కార్యక్రమం నిర్వహించారని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మిల్లర్ల దోపిడీ పెరిగిందంటున్న ప్రశాంత్‌రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో, తాము అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల కాలంలో మిల్లర్ల దోపిడీపై చర్చకు సిద్ధ మా అని సవాల్ చేశారు. ధాన్యం కొనుగోళ్లపై గత రెండు వారాలుగా సుదర్శన్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, భూపతిరెడ్డి నిరంతరం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారన్నారు. అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో, వ్యవసాయ శాఖ సెక్రెటరీతో, పౌరసరఫరాల శాఖ అధికారుల తో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ వస్తున్నారన్నారు. ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా తాము చేస్తున్న ప్రయత్నాలు ప్రశాంత్‌రెడ్డికి తెలియకపోవడం దురదృష్టమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు మాత్రం కొవిడ్ విపత్తు సమ యంలో మిల్లర్లను దోచుకున్నారని ఆరోపించారు. పేరు గొప్ప కోసం మిల్లర్ల వద్ద బియ్యం తీసుకుని మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ నాయకులదేనన్నారు. చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. -
ఢిల్లీలో జిల్లా యువకుడి ఆత్మహత్య
ఇందల్వాయి: మండలంలోని రూప్లనాయక్ తండాకి చెందిన విశాల్ నాయక్ (23) ఢిల్లీలో బుధవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన విశాల్ ఓ ప్రైవేట్ సంస్థలో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నాడు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. గురువారం రూప్లానాయక్ తండాలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు స్థానికులు తెలిపారు. మహిళ ..బోధన్ రూరల్: మండలంలోని కల్దుర్కి గ్రామానికి చెందిన లక్ష్మి(58) అనారోగ్యం, మతిస్థిమితం సరిగాలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. బుధవారం కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు. -
డివైడర్‌ను ఢీకొన్న బైక్
● భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు పిట్లం(జుక్కల్): మండలంలోని గద్దగుండు తండా శివారు జాతీయ రహదారిపై బుధవారం మధ్యా హ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొడప్గల్ మండల కేంద్రానికి చెందిన మారేపల్లి హన్మాండ్లు తన భార్య లక్ష్మి(48)తో ఎల్లారెడ్డి మండలం కళ్యాణిలో నిర్వహిస్తున్న బంధువుల వివాహానికి బైక్‌పై వస్తున్నారు. గద్దగుండు తండా సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో వెనుక కూర్చున్న లక్ష్మి కిందపడటంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. హన్మాండ్లుకి తీవ్రగాయాలయ్యాయి. మృతురాలి తల్లి మేత్రి సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఉచిత వేసవి క్రికెట్ కోచింగ్ క్యాంప్ బుధవారం ప్రారంభమైంది. కౌన్సిలర్ అర్కల ప్రభాకర్ యాదవ్, జిల్లా క్రీడా అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్ ఎంతో ఖర్చుతో కూడుకున్న క్రీడ అని, గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికే హెచ్‌సీఏ ఉచిత శిక్షణను అందిస్తోందని తెలిపారు. అండర్–15, అండర్–19, ఓపెన్ కేటగిరీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు జిల్లా, రాష్ట్రస్థాయి సెలక్షన్లలో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. క్రీడలు యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి, మానసిక ధైర్యా న్ని, ఉజ్వల భవిష్యత్తును అందిస్తాయని తెలిపారు. కామారెడ్డి క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోజాం అలీ ఖాన్, కోచ్‌లు రామకృష్ణ, రియాజ్, క్రీడాకారులు పాల్గొన్నారు. నేను గీసిన చిత్రం● చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే ఆ వంకర టింకరవి ఏమి కాయలని అడిగిందట! (కొద్దిగా సంపద రాగానే తన గతాన్ని, మూలాలను మరిచిపోయి, అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు నటించే వారి అహంకారాన్ని ఈ సామెత ఎత్తి చూపుతుంది.) ● ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు! (ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం ఎంత కష్టమో అనుభవిస్తే తెలుస్తుంది.) మాలోత్ పల్లవి, 6వ తరగతి గ్రామం : తిమ్మారెడ్డి తండా, మం : ఎల్లారెడ్డి, జిల్లా : కామారెడ్డి. -
ప్రతి సోమవారం ధర్మవాణి
● ఎండోమెంట్ ఆస్తులను పరిరక్షించాలి ● ఉమ్మడి జిల్లా ఈవోల సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ విజయరామారావునిజామాబాద్ రూరల్: దేవాలయాల సిబ్బంది సమస్యలను పరిష్కరించడంతోపాటు భక్తుల నుంచి దేవాదాయశాఖకు సంబంధించిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించేందుకు ప్రతి సోమవారం ‘ధర్మవాణి’ నిర్వహిస్తామని దేవాదాయ ధర్మాదాయశాఖ ఉప సంచాలకులు విజయరామారావు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలోని ఎండోమెంట్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహణ అధికారులతో బుధవారం ప్రత్యేక స మావేశం నిర్వహించారు. దేవాలయాల భూము లు, ఆస్తుల పరిరక్షణ, ఆదాయ వృద్ధి, ఆలయాల నిర్వాహణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా విజయరామారావు మాట్లాడుతూ.. ఈనెల 18వ తేదీ నుంచి ధర్మవాణి ప్రారంభమవుతుందన్నారు. ఆలయాల భూముల సర్వే పూర్తికాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కమిషనర్ ఉత్తర్వుల మేరకు సర్వే, ల్యాండ్ రికార్డుల వారికి లేఖ పంపించామన్నారు. భూముల సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఆలయాల్లో బంగారం, వెండి ఆభరణాల వెరిఫికేష న్ చేపట్టాలని, సంబంధిత అధికారులతో సమన్వ యం చేసుకొని ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాల ఆవరణలో తడకలు, పందిళ్లు వేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆలయాల ఈవోలు, సిబ్బంది పాల్గొన్నారు. -
పదిలో ముందస్తు రైడ్స్
రుద్రూర్: పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు ముందు పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు ని ర్వహిస్తుంటారు. కానీ, ఈ స్వచ్ఛంద సంస్థ మా త్రం తొమ్మిదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల ను పదో తరగతి కోసం సన్నద్ధం చేస్తోంది. వేసవి సెలవులను పిల్లలు వృథా చేయకుండా ప్రతి రోజు ఉదయం మూడు గంటలపాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోందీ రుద్రూర్‌లోని రైడ్స్ స్వచ్ఛంద సంస్థ. మండల కేంద్రానికి చెందిన పూర్వ విద్యార్థులు రుద్రూర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ (రైడ్స్) ఆధ్వర్యంలో రెండేళ్లుగా నిష్ణాతులైన ఉపాధ్యాయుల సహకారంతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. గత నెల 27న ప్రారంభమైన తరగతులు ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. ప్రతి ఉదయం 8 నుంచి 11 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 108 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా, ప్రతిరోజూ సుమారు 80 మంది హాజరవుతున్నారు. గత ఏడాది శిక్షణ పొందిన విద్యార్థులు మంచి మార్కులు సాధించడంతో వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఏడాది సమీప గ్రామాల నుంచి విద్యార్థులు హాజరవుతున్నారు. వీరికి వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన 17 మంది ప్రభుత్వ, ప్రయివేటు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బోధిస్తున్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యాబోధనతోపాటు యోగా, ఆరోగ్యంపై కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ దాతల సహకారంతో విద్యార్థులకు అల్పాహారం అందజేస్తున్నారు. 1995–96 ఎస్సెస్సీ బ్యాచ్‌కు చెందిన రైడ్స్ సభ్యులు విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. -
రైతన్నా.. నన్ను కాల్చకు..
నేలతల్లి రోదన: డొంకేశ్వర్(ఆర్మూర్): ఓ రైతన్నా! ఆరుగాలం కష్టపడి నన్ను నమ్ముకున్న నిన్ను... కన్న బిడ్డలా సాకి అన్నం పెట్టాను. పంట కోసిన తర్వాత నా ఒడిలో మిగిలిన వ్యర్థాలకు నిప్పు పెట్టి ఎందుకు కాల్చుతున్నావు? ఆ మంటలు నా శరీరానికి తగిలి నేను తల్లడిల్లిపోతున్నాను. అగ్గి గాయాలతో మండిపోతున్నాను. నాలోని సారాన్ని, నాకు మేలు చేసే సూక్ష్మజీవులను అగ్నికి ఆహుతి చేయకు. నేను బలహీన పడితే రేపు నీకు నాణ్యమైన పంటను ఎలా ఇవ్వగలను? ఇకనైనా మార్పు తెచ్చుకో... దయచేసి నన్ను రక్షించు. పచ్చని చెట్ల ఆవేదన: నాడు మీకు ప్రాణవాయువునిచ్చి నిలిపాను. నేడు ప్రాణమున్న శవమై మిగిలా ను.పచ్చని ఆకులతో బాటసారికి నీడనిచ్చా.. కానీ, నీ స్వార్థపు సెగలో నేను కాలిపోతున్నా. అన్నదాతా నీ పంట కోసం వేసిన మంట నా పచ్చని బతుకును బుగ్గిపాలు చేసింది. రెమ్మలన్నీ కాలిపో యాయి.. కొమ్మలన్నీ మాడిపోయాయి.. నీవు పెట్టిన ఈ చిచ్చు ప్రకృతి మాత గుండెకు తగిలిన మంట కాదా? నా నీడలో సేద తీరిన పక్షులు ఇళ్లు కోల్పోయాయి. నా నుంచి వచ్చే గాలి కలుషితమైపోయింది. రేపు నేను లేకపోతే నీ పిల్లలకు నీడ ఎక్కడిది? ఊపిరి ఎక్కడిది? -
క్రైం కార్నర్
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్ర సమీపంలోని పెద్దవాగులో ప్రమాదవశాత్తు వాగులో పడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన మంద అనిల్‌కుమార్(28) ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. ఈ నెల 11న ఉదయం ఇంటి నుంచి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. బుధవారం ఉదయం పెద్దవాగులోని గుర్రం మడుగులో అనిల్‌కుమార్ మృతదేహం నీటిపై తేలడాన్ని స్థానికులు గమనించి సమాచారం అందించారు. భార్య భవానీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. గల్ఫ్‌లో రాజంపేట యువకుడు.. భిక్కనూరు: రాజంపేట మండల కేంద్రానికి చెందిన యువకుడు గల్ఫ్‌లో మృతి చెందినట్లు గ్రామస్తులు బుధవారం తెలిపారు. గ్రామానికి చెందిన జొన్నల బాలకృష్ణ (24) కొన్నేళ్లుగా గల్ఫ్ దేశానికి వలస వెళ్తున్నాడు. ఆరు నెలల క్రితం రాజంపేటకు వచ్చి తిరిగి బహ్రెయిన్ దేశానికి వెళ్లి పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం తోటి మిత్రులు బాలకృష్ణ్ణను నిద్రలేపడానికి ప్రయత్నించగా లేవలేదు. నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని కుటుంబీకులకు సమాచారం అందించారు. -
పడి లేచిన సోయా ధర
● క్వింటాల్‌కు రూ.4,500 నుంచి రూ.7,200కు.. ● అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ● అన్ సీజన్లో పెరిగిన రేటుమోర్తాడ్(బాల్కొండ): సోయా గింజలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఏర్పడటంతో ధర గణనీయంగా పెరిగింది. క్వింటాల్ ధర ఏకంగా రూ.7,200 పలుకుతోంది. సీజన్లో వ్యాపారులు రూ.4,500 లోపు ధర చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేశారు. గతంలో జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల వరకు విస్తీర్ణంలో రైతులు సోయా సాగు చేశారు. అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతిని దిగుబడి తగ్గడం, మార్కెట్లో ఆశించిన ధర లేకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. రైతులు మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపడంతో సోయా సాగు విస్తీర్ణం 30వేల ఎకరాలకే పరిమితమైంది. సీజన్లో రూ.5వేలు దాటని ధర ఇప్పుడు భారీగా పెరగడంతో స్టాక్ ఉంచిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో సోయా ధర అనూహ్యంగా పెరిగింది. వచ్చే వర్షాకాలం సీజన్లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. -
చెట్టు కొమ్మ విరిగి వాహనదారుడికి గాయాలు
మోపాల్: మండలంలోని బోర్గాం(పి) శివారులో చెట్టు కొమ్మ విరిగి పడి మంచిప్ప గ్రామానికి చెందిన వాహనదారుడు భూమన్నకు బుధవారం గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. బోర్గాం శివారులో వరి కొయ్యలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. రాత్రంతా కాలిన మంటలు కాస్త రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు అంటుకున్నాయి. నిజామాబాద్ నుంచి బైక్‌పై భూమన్న వెళ్తుండగా అదే సమయంలో చెట్ల కొమ్మలు ఆయనపై పడ్డాయి. ప్రమాదంలో భూమన్నకు గాయాలు కాగా 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. -
కొనుగోళ్లు వేగవంతం చేస్తాం
● బోధన్ ఆర్డీవో విజయకుమారి ● హున్సాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం పరిశీలన బోధన్: రైతులు పండించిన మొక్కజొన్న కొనుగో లు ప్రక్రియను మరింత వేగవంతంగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటామని బోధన్ ఆర్డీవో విజయకుమారి భరోసా ఇచ్చారు. సాలూర మండలంలోని హున్సా ప్రాథమిక వ్యవసాయ సహకారం అ ధ్వర్యంలో మార్క్‌ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన మొ క్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్క్‌ఫెడ్ డీఎం క్రాంతి, మండల అధికారులతో కలిసి బుధవారం ఆమె పరిశీలించారు. రైతువేదిక భవనం ఆవరణలో ని కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిల్వ చేసిన మొ క్కజొన్న దిగుబడులను పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రవాణా, పాత గోనె సంచుల సమస్యతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజుల క్రితం హున్సా సహకార సంఘం చైర్మన్ రవి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిసి మొక్కజొన్న రైతుల ఇబ్బందులను తెలిపారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని కలెక్టర్‌తో మాట్లా డారని చైర్మన్ తెలిపారు. సహకార సంఘం చైర్మన్ మందర్నా రవి, తహసీల్దార్ నవాజ్, ఏవో శ్వేత, సొసైటీ సీఈవో హన్మంత్‌రావు, రైతులు ఉన్నారు. -
110 గ్రాముల గంజాయి పట్టివేత
బోధన్‌టౌన్/బోధన్: పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని పట్టుకొని 110 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన మిర్జా జుబేర్ బేగ్ బోధన్‌కు వస్తున్నట్లు ఈగల్ టీం సమాచారం మేరకు కొత్త బస్టాండ్‌లో పట్టుకున్నామన్నారు. నిందితుడిని విచారించగా మిర్జా జుబేగ్ బేగ్ గంజాయి సరఫరా చేస్తాడని, ఈ నెల 11న అరెస్టయి జైలులో ఉన్న ధనుష్‌కు నాందేడ్‌లో 1 కేజీ 660 గ్రాముల గంజాయి విక్రయించినట్లు తెలిపారు. మిర్జా జుబేగ్ బేగ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు వెల్లడించారు. గంజాయి పట్టుకున్న ఎస్సై హబీబ్ ఖాన్, సిబ్బంది మహేశ్, గంగారాం, వరుణ్, ఈగల్ ఆర్ఎస్సీసీ టీం నిజామాబాద్ ఇన్స్పెక్టర్ పూర్ణేశ్వర్, సిబ్బందిని సీపీ అభినందించినట్లు సీఐ తెలిపారు. -
రీజియన్ పరిధిలో 82 ఓపీఆర్ఎస్ సర్వీసులు
నిజామాబాద్ రూరల్: రీజియన్ పరిధిలోని ఆయా డిపోల నుంచి 82 ఓపీఆరీఎస్(ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం) ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్ఎసం జ్యోత్స్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్ రీజియన్ పరిధిలోని ఆయా డిపోల నుంచి రాష్ట్రంలోని జేబీఎస్, ఎంజీబీఎస్, ఎయిర్‌పోర్టు(హైదరాబాద్), తిరుపతి, విజయవాడ, భద్రాచ లం తదితర ప్రాంతాలకు రాజధాని, సూ పర్లగ్జరీ, ఈ – సూపర్ లగ్జరీ, లహరి ఏసీ, లహరి నాన్ ఏసీ వంటి సేవలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ప్ర యాణికులు ముందస్తుగా టికెట్ బుకింగ్ కోసం ఆర్టీసీ వెబ్సైట్ www.tgsrtcbus. in, మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. డిప్యూటీ సీఎంను కలిసిన డీఎఫ్‌వో డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా అటవీశాఖ అధి కారి (డీఎఫ్‌వో) సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్కను మంగళవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ జిల్లాలో అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఎకో టూరిజం అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ప్రభుత్వ విత్తనాలనే వినియోగించాలి సిరికొండ: తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాణ్యమైన రాయితీ విత్తనాలనే వినియోగించాలని తెలంగాణ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్‌రెడ్డి రైతులకు సూచించారు. సీడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందించే విత్తనాలపై మండలంలోని కొండూర్‌లో రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. సంస్థ ద్వారా బీపీటీ 5204, కేఎన్ఎం 1638, ఆర్ఎన్ఆర్ 15048 రకం వరి విత్తనాలు అందుబాటులో ఉన్నా యని అన్వేష్‌రెడ్డి తెలిపారు. ప్రైవేట్ సంస్థల విత్తనాల వాడకాన్ని తగ్గించాలని రైతులకు సూచించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్ మాట్లాడుతూ.. రైతులు ఒకే రకమైన పంటలను సాగు చేయకుండా పంట మార్పి విధానాన్ని పాటిస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఆయిల్ పామ్, పప్పు దినుసుల సాగు చేపడితే లాభాలు ఉంటాయన్నారు. పీఏసీఎస్ చైర్మన్ చెల్లెం గంగాధర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బా కారం రవి, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎర్ర న్న, టీఎస్ సీడ్స్ డీఎం రఘు, సర్పంచ్ నర్మల లతాభాస్కర్రెడ్డి, మండల వ్యవసాయాధికారి నర్సయ్య, రైతులు పాల్గొన్నారు. పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఇందల్వాయి: పశువులు అక్రమ రవాణా కాకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన అంతర్జిల్లా చెక్‌పోస్టును ఆయన మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. పశువులను తరలించే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అనుమానాస్పద వాహనాలను తప్పకుండా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. తనీఖీల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పశువుల అక్రమ రవాణా సమాచారం తెలిసే పోలీసులకు అందించాలని ప్రజలకు సూచించారు. ఆయనవెంట డిచ్పల్లి సీఐ వినోద్, ఇందల్వాయి ఎస్సై సందీప్ ఉన్నారు. -
ధాన్యం తరలింపును వేగవంతం చేయాలి
పెర్కిట్(ఆర్మూర్): కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్‌లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అకాల వర్షం కురిస్తే ధాన్యం తడిసి పోయే అవకాశం ఉంటుందని, తరలింపును వేగవంతం చేయాలని సూచించారు. టార్పాలిన్లను అందుబాటులో ఉంచాల న్నారు. అలాగే రైస్ మిల్లుల్లో వెంటవెంటనే ధాన్యం అన్లోడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పౌరసర ఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. సకాలంలో బిల్లుల చెల్లింపు పూర్తయ్యేలా ట్యాబ్‌లో ఎంట్రీని వేగవంతం చేయాలన్నారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, డీఆర్డీవో సాయన్న, డీఎస్వో శ్రీకాంత్‌రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం ప్రవీణ్, డీసీవో ఎన్ శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
ధాన్యం కొనుగోలుకు ఆటంకాలు కలిగిస్తే చర్యలు
● ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ పై కేసు నమోదు ● మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సమావేశంనిజామాబాద్ అర్బన్: వరి ధాన్యం కొనుగోలు ప్ర క్రియకు ఆటంకాలు కలిగేలా వ్యవహరిస్తున్న వారి ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ధాన్యం రవాణాకు లారీలు సమ కూర్చని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం రైస్ మిల్ల ర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో ప్రభుత్వ సలహాదారు, కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పలు చోట్ల రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. బాల్కొండ సెక్టార్ లో కొనుగోలు కేంద్రాలకు వాహనాలను సమకూర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ తీరును తీవ్రంగా పరిగణిస్తూ, సదరు కాంట్రాక్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ కు లిఖిత పూర్వకంగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశా రు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా రైస్ మిల్లర్లు పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. కడ్తా, తరుగు పేరుతో ఎవరైనా రైతులను నష్టపరిచే చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. అవసరమైతే నిజామాబాద్ మా ర్కెట్ యార్డులో పని చేస్తున్న హమాలీ కార్మికుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రైతులు శుభ్రపరచిన ధాన్యాన్ని తేవాలి కొనుగోలు కేంద్రాలకు రైతులు శుభ్రపరచిన ధా న్యాన్ని తరలించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కోరారు. ఈసారి రబీలో ఆశించిన దానికంటే ఎక్కువగా మొక్కజొన్న, వరి ధాన్యం దిగుబడులు వచ్చాయన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేస్తున్నామన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యవ హరిస్తున్నారని సుదర్శన్ రెడ్డి దుయ్యబట్టారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మ న్ ముప్ప గంగారెడ్డి, డీఎస్వో శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, డీసీవో శ్రీనివాస్, వ్యవసా య అధికారి వీరస్వామి, అధికారులు పాల్గొన్నారు. -
ఖరీఫ్ ప్రణాళిక ఖరారు
● పంట సాగు అంచనా నివేదిక విడుదల చేసిన వ్యవసాయ శాఖ ● జిల్లా వ్యాప్తంగా 5.30 లక్షల ఎకరాల్లో సాగవనున్న పంటలు డొంకేశ్వర్(ఆర్మూర్): 2026–వానకాలం (ఖరీ ఫ్) సీజన్‌కు సంబంధించిన పంట ప్రణాళిక ఖా రైంది. జిల్లా వ్యాప్తంగా 5.30లక్షల ఎకరాలకు పైగా వివిధ పంటలు సాగవుతాయని వ్యవసా య శాఖ అంచనా వేసింది. అత్యధికంగా 4.38 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వరి సాగయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అయితే, గతేడాది ఖరీఫ్‌తో పోలిస్తే ఈసారి కొంతమేర సాగు విస్తీర్ణం పెరగనుంది. తొల కరి చినుకులు కురవగానే రైతులు జూన్ మొదటి, రెండో వారం నుంచి సాగు పనుల ను ప్రారంభించనున్నారు. వరి తర్వాత మొక్కజొన్న, సోయాబీన్, పసుపు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపే అవకాశముంది. ఎరువులు, విత్తనాలు! ఖరీఫ్ పంటలకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులకు కూడా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. వరికి 1.10 లక్షల క్వింటాళ్లు, మొక్కజొన్నకు 4,400 క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని అంచనా వేసింది. అలాగే సోయాబీన్‌కు 10,268 క్వింటాళ్లు, కందికి 40 క్వింటాళ్లు, పత్తికి 8 క్వింటాళ్లు అవసరం అవుతాయని ప్రతిపాదనలు తయారు చేసింది. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి డిమాండ్‌ను బట్టి ఖరీఫ్ పంటల అంచనా ప్రతిపాదనలు రూపొందించాం. విత్తనాలు, ఎరువులలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. పంటలు సాగు చేసేముందు రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని. సలహాలు, సూచనల కోసం స్థానికంగా ఏఈవోలను సంప్రదించాలి. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి ఎరువుల అంచనా (మెట్రిక్ టన్నులు) -
ధాన్యం సేకరణలో రాష్ట్రంలో మొదటి స్థానం
● మొక్కజొన్న కొనుగోళ్లు 88 శాతం పూర్తి ● వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డికి కలెక్టర్ ఇలా త్రిపాఠి నివేదికనిజామాబాద్ అర్బన్: ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందని, మొక్కజొన్న కొనుగోళ్లు 88 శాతం పూర్తయ్యిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకొతెచ్చా రు. కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, క్షేత్రస్థాయిలో ఎక్కడైనా చిన్నచిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరిస్తున్నామన్నా రు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లు, వరి ధాన్యంపై ముఖ్యమంత్రి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మ ణ్ కుమార్, జూపల్లి కష్ణారావు, వాకిటి శ్రీహరి, సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు తదితర ఉన్నతాధికా రు లు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని ప్ర భుత్వం ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన ధా న్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాల ని ఆదేశించారు. ధాన్యం రవాణాకు అవసరమైన లారీలను ఒప్పందం మేరకు అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. గోదాముల కొరత ఉన్న ప్రాంతాల్లో రైతు బజార్లు, ఫంక్షన్ హాళ్లను తాత్కాలిక నిల్వ కేంద్రాలుగా వినియోగించాలన్నారు. అకాల వర్షాలకు ధా న్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా రైతులను ముందస్తుగానే అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియ మించాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక అధికారిని నియమించాలని, ప్రతి రైస్ మిల్లు వద్ద ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, పౌర సరఫరాల శాఖ అధికారులు శ్రీకాంత్ రెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం క్రాంతి, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగుబాయి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, రవాణా శాఖ డీటీసీ దుర్గా ప్రమీల, ఎంవీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఇబ్బంది పడుతున్నాం..
నీట్ పరీక్ష రద్దుతో ఇబ్బందులు పడుతున్నాం. నీట్ కోసం ప్రిపేర్ అయి మంచిగా పరీక్ష రాశాం. ఈ పరీక్షలో మంచి ర్యాంకు వస్తుందని భావిస్తున్నాం. మళ్లీ నీట్ పరీక్ష కోసం చదవాల్సి వస్తుంది. పరీక్షల పూర్తి తర్వాత రిలాక్స్ ఆవుతామని భావిస్తే, మళ్లీ పరీక్ష కోసం సిద్ధం కావాల్సి వస్తుంది. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనతో విద్యార్థుల ఆశలు నిరాశ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల లీక్ చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. – హిమాన్షి, నిజామాబాద్ -
బండి సంజయ్ కొడుకును అరెస్టు చేయాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేయ డం శోచనీయమని ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేము ల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ మధ్య ఫెవికాల్ బంధం ఉందన్నారు. సిట్ విచారణ పేరిట సంజయ్ కొడుకు భగీరథ్‌ను కాపాడేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారన్నా రు. కేంద్ర మంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడని చెప్పడం హాస్యాస్పదమన్నారు. మైనర్ బాలికకు డ్రగ్స్, మద్యం ఇచ్చి అఘాయిత్యం చేసినట్లు ఆరోపణలు ఉంటే పోలీసులు మూడు నెలల పాటు ఫిర్యాదు తీసుకోకుండా తాత్సారం చేయడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందన్నారు. మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత గత్యంతరం లేక పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. పోక్సో చట్టం ప్రకారం మైనర్ బాలిక చెప్పేదే కీలకమన్నారు. ఇలాంటి కేసులో బాధితురాలికి రక్షణ కల్పించాల్సింది పోయి, నిందితుడు ఆమైపెనే తిరిగి ’హనీ ట్రాప్’ పేరిట కేసు పెట్టడం దారుణమన్నారు. మైనర్ బాలిక హనీ ట్రాప్ చేస్తుందా అన్నారు. బాధితురాలిపైనే రివర్స్ కేసులు పెట్టడం చూస్తుంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒకటేనని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఇద్దరూ కలిసి వ్యాపారాలు, భూమి కుంభకోణాలు చేస్తున్నా రు. ఒక్క కాంగ్రెస్ నాయకుడు సైతం దీనిపై స్పందించకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటన్నారు. ప్రతిరోజూ కేసీఆర్ కుటుంబం మీద, కేటీఆర్ మీద, హరీశ్‌రావు మీద విషం చిమ్మే బండి సంజయ్ తన కొడుకు చేసిన నేరంపై ఏం సమాధానం చెబుతారన్నారు. సంజయ్ తన కొడుకుపై వచ్చిన ఈ పోక్సో కేసుపై నైతిక బాధ్యత వహించాలన్నారు. భగీరథ్‌ను అరెస్ట్ చేసి నిష్పక్షపాతంగా విచారణ చేయాలన్నారు. బాధిత మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు తాము పోరాడతామని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ మధ్య ఫెవికాల్ బంధం సిట్ విచారణ పేరిట నిందితుడిని కాపాడే ప్రయత్నం బాలికపై అఘాయిత్యం జరిగితే మూడు నెలలపాటు ఫిర్యాదు తీసుకోలేదెందుకు? బాధితురాలిపైనే ఎదురు కేసులు పెట్టడం దుర్మార్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి -
ప్రైవేట్ ఆస్పత్రిలో బాలుడి మృతి
నిజామాబాద్ రూరల్: నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం బాలుడు మృతి చెందాడు. జక్రాన్‌పల్లి మండలం పడకల్ తండాకు చెందిన బదావత్ లత, నరేశ్ దంపతులు తమ కుమారుడు నిక్షిత్(16 నెలలు) ఆరోగ్యం బాగా లేకపోవడంతో సోమవారం ఉదయం ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యుడు మందులు రాసిచ్చి ఇంటికి పంపించారు. పరిస్థితి మెరుగుకాకపోవడంతో రాత్రి వేళ మళ్లీ బాబును ఆస్పత్రికి తీసుకురాగా, ఆస్పత్రి సిబ్బంది అడ్మిట్ చేసుకున్నారు. చికిత్స ప్రారంభించి సైలెన్లు పెట్టారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మంగళవారం ఉదయం స్కానింగ్‌కు రిఫర్ చేశారు. స్కానింగ్ చేయించి బాబును ఆస్పత్రికి తీసుకు వచ్చిన కొద్దిసేపటికి మృతి చెందాడు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు మృతి చెందాడని తల్లిదండ్రులతోపాటు వారి బంధువులు ఆందోళనకు దిగారు. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి సిబ్బందితో కలిసి ఆస్పత్రికి చేరుకుని వారిని సముదాయించారు. ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ ● ఆస్పత్రి ఎదుట ఆందోళన -
సంస్కృతికి పెద్దపీట
తెలంగాణ సామెతలు మోర్తాడ్(బాల్కొండ): వేసవి సెలవులంటే కాలక్షేపం కోసం కాదు.. ఏదో ఒక కళలో ప్రావీణ్యం పొందేందుకు సద్వినియోగం చేసుకోవాలని నిరూపిస్తున్నారు ఈ చిన్నారులు. ఆ చిన్నారులను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు మోర్తాడ్‌కు చెందిన సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ శ్రీహర్షిణి. చిన్నారులకు మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజెప్పేందుకు కూచిపూడి నృత్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని స్థానిక చిన్నారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎంసీఏ చదివిన శ్రీహర్షిణి నాంది ఫౌండేషన్, మహేంద్ర ప్రైడ్ సంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్‌లో ట్రైనర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మరోవైపు నృత్యశిక్షకురాలిగా రాణిస్తున్నారు. తాను నేర్చుకున్న విద్యను పదిమందికి నేర్పాలనే ఉద్దేశంతో మోర్తాడ్‌లో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన 12 మంది విద్యార్థులు ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారు. ఈనెలాఖరు వరకూ శిక్షణ తరగతులను కొనసాగిస్తానని శ్రీహర్షిణి తెలిపారు. ఒక అబ్బాయికి క్లాసికల్ డ్యాన్స్‌లో ఒక గంట పాటు ప్రత్యేక శిక్షణ కొనసాగిస్తుండటం గమనార్హం. సెలవులను కాలక్షేపం కోసం కాకుండా నృత్య శిక్షణతో సద్వినియోగం చేసుకుంటున్న ఈ చిన్నారులు ఎంతో మందికి స్పూర్తి అని చెప్పొచ్చు. ● మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అయినట్లు (ఎక్కువ మంది జోక్యం చేసుకుంటే పని సరైన దారిలో సాగకుండా గందరగోళంగా మారుతుంది.) ● సిగ్గులేదా జీడి గింజా అంటే.. నల్లగున్నా నాకేమి సిగ్గు అనిందట. (తన తప్పును లేదా లోపాన్ని సమర్థించుకుంటూ, ఏమాత్రం సిగ్గు పడకుండా ఎదురు సమాధానం చెప్పడం) వేసవి సెలవులను వృథా కానివ్వడం లేదు. నృత్యంలో శిక్షణ పొందడానికి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా తల్లితండ్రులు, మా శిక్షకురాలు ఇచ్చే ప్రోత్సాహంతో ముందుకు సాగుతాం. – హన్విక, దొన్కల్ మోర్తాడ్‌లో మేము పొందుతున్న నృత్య శిక్షణ ఎంతో బాగుంది. వేసవి సెలవులను ఎలా గడపా లని ఆలోచించాం. మోర్తాడ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు తెలియగానే మా తల్లిదండ్రులు శిక్షణ తరగతులకు పంపిస్తున్నారు. – విహాన్షి, రామన్నపేట్ కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందుతున్న చిన్నారులు కళలో ప్రావీణ్యానికి సెలవులు సద్వినియోగం సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్‌గా రాణిస్తూనే నృత్య శిక్షణ ఇస్తున్న శ్రీహర్షిణి మోర్తాడ్‌లో ప్రతిరోజూ వేసవి శిక్షణ తరగతులు -
సమ్మర్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని శంకర్ భవన్ పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. చిన్నారులతో ముచ్చటించిన కలెక్టర్.. వారి అభిరుచులను అడిగి తెలుసుకున్నారు. సమ్మర్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని, డాన్స్, సింగింగ్, ఇండోర్ గేమ్స్ వంటి వాటిలో మెలకువలను నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థులకు పలు అంశాలపై ప్రశ్నలు వేశారు. సమాధానాలు ఇచ్చిన చిన్నారులకు కలెక్టర్ బహుమతులు, చాక్లెట్లు అందజేశారు. కలెక్టర్ వెంట డీఈవో పి అశోక్, ఎంఈవోలు సాయిరెడ్డి, అరవింద్‌గౌడ్, హెచ్ఎం సాయన్న తదితరులు ఉన్నారు. రుద్రూర్: తమకు అవసరం లేకున్నా నానో యూరియాను ఎరువులతోపాటు బలవంతంగా అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పొతంగల్ విశాల సహకార సంఘం పరిధిలోని హెగ్డొలిలో ఎరువుల విక్రయ కేంద్రానికి రైతులు మంగళవారం తాళం వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గతంలో తీసుకున్న నానో యూరియా లిక్విడ్ ఇంకా మిగిలి ఉండగానే మళ్లీ కొనాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మూడు సంచుల ఎరువులు తీసుకుంటే ఒక లిక్విడ్ బాటిల్ తప్పనిసరిగా తీసుకోవాలని నిబంధన విధించడంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎరువులు, పురుగుమందుల ధరలు పెరిగిపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో అదనపు భారం మోపడం తగదన్నారు. వ్యవసాయాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నందిపేట్(ఆర్మూర్): మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలోకి హిజ్రాల రాకను నిషేధిస్తూ గ్రామాభివృద్ధి కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. గ్రామంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాల సమయంలో హిజ్రాలు వచ్చి వేలాది రూపాయలు డిమాండ్ చేస్తున్నారని, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వారి అంగీకారం మేరకు హిజ్రాల ఆగడాలను శాశ్వతంగా అరికట్టేందుకు గ్రామాభివృద్ధి కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై హిజ్రాలను గ్రామంలోకి రానివ్వొద్దని తీర్మానించారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని సుభా ష్నగర్లో ఉన్న బాలసదనం నుంచి ముగ్గురు బాలికలు మంగళవారం అదృశ్యమయ్యారు. వార్డెన్‌కు చెప్పకుండా బాలికలు బయటికి వెళ్లిపోయారు. సదనం ఇన్చార్జి సౌందర్య మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఇద్దరు బాలికలను గుర్తించి బాలసదనంలో అప్పగించారు. మరో తొమ్మిదేళ్ల బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
క్రైం కార్నర్
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి జక్రాన్‌పల్లి/నిజామాబాద్ రూరల్: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌కు గ్రామానికి చెందిన జైడి పెద్దోళ్ల నర్సయ్య (70) మంగళవారం 44వ నంబర్ జాతీయ రహదారి దాటుతుండగా.. కామారెడ్డి వైపు నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. గాయాలపాలైన నర్సయ్యను చికిత్స నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో తాపిమేస్త్రి.. నిజామబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గూపన్పల్లి క్రాసింగ్ వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో తాపిమేస్త్రి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. నగరంలోని హస్మీ కాలనీకి చెందిన షేక్ షాకీర్(28) మాక్లూర్ మండల బోర్గాం(కే)లో మేస్త్రి పని చేస్తుంటాడు. మంగళవారం మధ్యాహ్నం పని పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఎప్పటిలాగే మంగళవారం ఉదయం బోర్గాం(కే) గ్రామంలో మేస్త్రి పని పూర్తయిన అనంతరం మధ్యాహ్నం తిరిగి వస్తుండగా గూపన్పల్లి క్రాసింగ్ బైక్‌ను లారీ ఢీకొట్టగా షాకీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి షబ్బీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపారు. కామారెడ్డి క్రైం: భార్యతో గొడవల కారణంగా మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. మహ్మద్ హుస్సేన్ (35) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ప్రతి రోజూ భార్యతో గొడవలు జరిగేవి. కొద్ది రోజుల క్రితం అతడి భార్య గౌసియా బేగం పిల్లలతో కలిసి హైదారాబాద్‌లోని తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. కామారెడ్డికి రావాలని హుస్సేన్ పలుమార్లు అడిగినా ఆమె రాకపోవడంతో మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌హెచ్‌వో నరహరి తెలిపారు. ఆర్మూర్‌టౌన్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను ఆర్మూర్, మోర్తాడ్‌లో చీత ఫోర్స్ మెరుపుదాడులు నిర్వహించి మంగళవారం పట్టుకుంది. సీపీ సాయిచైతన్య అదేశాల మేరకు సీసీఎస్ ఇన్చార్జి ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీత ఫోర్స్ సిబ్బంది ప్రత్యేక నిఘా సారించి ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు భారీ లారీలను సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. -
పశువుల అక్రమ రవాణా నిరోధానికి చర్యలు
● కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య ● జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై సమన్వయ కమిటీ సమావేశం నిజామాబాద్ అర్బన్: పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య అధికారులను ఆదేశించారు. బక్రీద్ నేపథ్యంలో కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. పశువు ల అక్రమ రవాణా నిరోధం, జంతు సంక్షేమ నియమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్, సీపీ సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అధికారులు సమన్వయంతో పని చే యాలని, జంతు సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాలను ఉల్లంఘించకుండా చూడాలని అన్నారు. గోవ ధపై నిషేధం ఉందని, అలాగే మన రాష్ట్రంలో ఒంటెలను సైతం వధించకుండా నిషేధం అమలులో ఉందని తెలిపారు. పశువులను తరలించడానికి, వాటిని వధించడానికి ముందు తప్పనిసరిగా పశు వైద్యాధికారి నుంచి ధ్రువీకరణ పొందాలని స్పష్టం చేశారు. పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లాలోని కందకుర్తి, సాలూర, పొతంగల్, ఖండ్గావ్ వద్ద అంతర్ర్రాష్ట్ర చెక్ పోస్టులతోపాటు సాటాపూర్, యంచ, ఇందల్వాయి, ఉమ్మెడ, జన్నేపల్లి, మామిడిపల్లి తదితర ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా అంతర్ జిల్లా చెక్ పోస్టులను ఏ ర్పాటు చేస్తున్నామని సీపీ తెలిపారు. సమావేశంలో అదనపు డీసీపీ శుభం ప్రకాశ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, బోధన్ ఆర్డీవో విజయలక్ష్మి, నిజామాబాద్, ఆర్మూర్ ఏసీపీలు ప్రకాశ్‌యాదవ్, వెంకటేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల, ఎంవీఐ లు శ్రీనివాస్, కిరణ్, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గంగాధరయ్య, పోలీస్, రెవెన్యూ, పశు సంవర్ధక, పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రూ.1.56 కోట్లతో భవిత కేంద్రాల అభివృద్ధి
● నేడు మాక్లూర్, నిజామాబాద్ నార్త్‌లో నూతన భవనాల ప్రారంభోత్సవం ఆర్మూర్: ప్రత్యేక అవసరాలు గల పిల్లల (దివ్యాంగుల)కు నాణ్యమైన విద్య, థెరపీ, పునరావాస సేవలు అందించేందుకు సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం జిల్లాలోని భవిత కేంద్రాలను బలోపేతం చేస్తోంది. కొత్త భవనాల నిర్మాణం, మరమ్మతులు, రెనొవేషన్ పనుల కోసం జిల్లాలో మొత్తం రూ.1,55,64,000 ఖర్చు చేస్తున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే, ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సోమవారం మాక్లూర్, నిజామాబాద్ నార్త్ మండలాల్లో నిర్మించిన భవిత కేంద్రాలను ప్రారంభించనున్నారు. కొత్త భవనాలకు రూ.64.74 లక్షలు జిల్లాలో ఆరు కొత్త్త భవనాల నిర్మాణాలకు రూ. 64.74 లక్షలు కేటాయించారు. ఒక్కో కేంద్రానికి రూ.10.79 లక్షల చొప్పున మాక్లూర్ (మాదాపూర్), నిజామాబాద్ నార్త్, మోపాల్, రుద్రూర్, భీమ్‌గల్, నవీపేట్ మండలాల్లో నూతన భవిత కేంద్రాలను నిర్మిస్తున్నారు. మాక్లూర్, నిజామాబాద్ నార్త్ భవనాల నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. రూ.41.55 లక్షలతో మరమ్మతు పనులు జిల్లాలో ఇప్పటికే పక్కా భవనాలు ఉన్న ఏడు మండల కేంద్రాల్లో మరమ్మతుల కోసం రూ.41.55 లక్షలు మంజూరు చేశారు. ఆర్మూర్, బోధన్, మోర్తాడ్, నందిపేట్, నిజామాబాద్ సౌత్, సిరికొండ, ఎడపల్లి మండలాల్లో పనులు పూర్తయ్యాయి. 15 కేంద్రాల్లో రెనోవేషన్ పనులు పక్కా భవనాలు లేని మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఒక గదిని కేటాయించారు. 15 కేంద్రాల్లో ఒక్కోదానికి రూ.3.29 లక్షల చొప్పున మొత్తం రూ.49.35 లక్షలు మంజూరు చేశారు. బాల్కొండ, చందూర్, ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్ పల్లి, కమ్మర్పల్లి, కోటగిరి, మెండోరా, మోస్రా, ముప్కాల్, రెంజల్, వేల్పూర్, వర్ని, ఏర్గట్ల మండలాల్లో రెనోవేషన్ పనులు పూర్తయ్యాయి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు 4,857 పాఠశాలల్లో చేరిన పిల్లలు 4,707 స్పెసిఫిక్ లర్నింగ్ డిజేబిలిటీ 1,782 లో విజన్ 1,333 ఎర్లీ ఇంటర్వెన్షన్ 150 ఫిజియోథెరపీ 426 ఐఈఆర్పీలు 29 ఫిజియోథెరపిస్టులు 19 -
ఖాళీ స్థలంలో చెలరేగిన మంటలు
డిచ్పల్లి : డిచ్పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని సుద్దపల్లి రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం సాయంత్రం నిప్పు పెట్టారు. దీంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఎండిపోయిన గడ్డి, పిచ్చి మొక్క లు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించా యి. సమీపంలో ఇళ్లు ఉండటం, మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు ఫైర్ స్టే షన్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థ లానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అరగంటపా టు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చా రు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. -
దివ్యాంగ విద్యార్థులకు చేయూత
ఆర్మూర్: జిల్లాలో ఉన్న దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు అవసరమైన ఉపకరణాల పంపిణీ శిబిరాన్ని తెలంగాణ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 11న నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది ఆగస్టులో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి దివ్యాంగ విద్యార్థులను పరీక్షించారు. గుర్తించిన వారిలో 393 మంది చిన్నారులకు 565 సహాయ పరికరాలు మంజూరయ్యాయి. ఒక్కో చి న్నారికి అవసరాన్ని బట్టి ఒకటి లేదా అంతకంటే ఎ క్కువ ఉపకరణాలు అందిస్తున్నారు. ఈ పరికరాల కొనుగోలు ఖర్చు రూ.34 లక్షల 70 వేల 247 కాగా 60 శాతం ఏడీఐపీ పథకం ద్వారా, 40 శాతం స మగ్ర శిక్ష ద్వారా భరించనున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు డీఈవో అశోక్, సహిత విద్యా విభాగం జిల్లా కోఆర్డినేటర్ పడకంటి శ్రీని వాస్‌రావు పర్యవేక్షణలో ఆర్టిఫీషియల్ లింబ్స్ మా న్యూఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (అలిమ్కో) సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. శారీరక వైకల్యం, మానసిక వైకల్యం, వినికిడి లోపం, అంధత్వంతో బాధపడుతున్న పిల్లలకు అవసరమైన వీల్ చైర్స్, చంక కర్రలు, ట్రై సైకిళ్లు, రొలేటర్స్, హియరింగ్ ఎయిడ్స్, బ్రెయిలీ కిట్, బ్రెయిలీ ప్లేట్స్, బ్రెయిలీ కిట్, ఎమ్మార్ కిట్లతో పాటు కృత్రిమ అవయవాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్‌బోర్డు కాలనీలో గల ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పంపిణీ శిబిరాన్ని నిర్వహించనున్నారు. శిబిరానికి వచ్చే దివ్యాంగ విద్యార్థులకు ట్రావెలింగ్ అలవెన్స్, భోజన సదుపాయాన్ని అధికారులు కల్పించనున్నారు. ఎంపికై న లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, యూఐడీ నంబర్, వైట్ రేషన్ కార్డు లేదా ఇన్‌కం సర్టిఫికెట్ జిరాక్స్‌లతో పాటు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకొని శిబిరానికి హాజరు కావాల్సి ఉంటుంది. శిబిరం వేదిక : ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్, బైపాస్ రోడ్డు, న్యూ హౌజింగ్‌బోర్డు కాలనీ, నిజామాబాద్ సమయం : ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లబ్ధిదారులైన దివ్యాంగ విద్యార్థులు : 393 మంది మంజూరైన మొత్తం ఉపకరణాలు : 565 మొత్తం వ్యయం : రూ.34.70 లక్షలు లబ్ధిదారులకు ఉచితంగా ఉపకరణాలు ప్రత్యేక క్యాంపుల్లో గుర్తించిన ప్రతి చిన్నారికి అవసరమైన పరికరం అందేలా చర్యలు తీసుకున్నాం. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వైకల్యాలతో బాధపడుతున్న పిల్లలకు ఈ పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. – పడకంటి శ్రీనివాస్ రావు, సహిత విద్యావిభాగం జిల్లా కోఆర్డినేటర్, నిజామాబాద్ విద్యతోపాటు జీవన నైపుణ్యాలు అందిస్తాం దివ్యాంగులైన పిల్లలకు విద్యతో పాటు జీవన నైపుణ్యాలు అందించడమే మా లక్ష్యం. ఈ ఉపకరణాలు వారి రోజువారీ జీవితాన్ని, చదువును సులభతరం చేస్తాయి. ఎంపిక చేసిన దివ్యాంగులు ఈ పరికరాలను తీసుకొని సద్వినియోగం చేసుకోవాలి. – అశోక్, జిల్లా విద్యాధికారి, నిజామాబాద్ నేడు జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో శిబిరం నిర్వహణ పరికరాలు ఉచితంగా అందించనున్న సమగ్ర శిక్ష, అలిమ్కో ప్రతినిధులు -
చిత్రకళతో సృజనాత్మకత
● బోధన్‌లో మూడేళ్లుగా వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరం బోధన్: చిత్రలేఖనమంటే బొమ్మలు గీయడ మే మాత్రమే కాదు.. మనస్సుతో మాట్లాడే భా ష అని చిత్రకారులంటున్నారు. తమ ఊహాశక్తితో పౌరాణిక, జానపద, ప్రకృతి దృశ్యాలను అద్భుతంగా చిత్రీకరిస్తారు. చిత్రలేఖనం పిల్ల ల్లో ఏకాగ్రతను పెంపొందించడంతోపాటు సృజనాత్మకతకు పదును పెడుతుంది. సాలూర మండల కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు లింబూరు లక్ష్మణ్ తేజ క్రియేటివ్ కిడ్స్ డ్రాయింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మూడేళ్లుగా బోధన్ పట్టణంలో వేసవి చిత్రలేఖన ప్ర త్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసే ఉద్దేశంతో ఈ ఏడాదీ శిబిరం ప్రారంభమైంది. ప్రస్తుతం శిబిరంలో 15 మందికి పైగా విద్యార్థులు చిత్రలేఖనంలో మెలకువలు నేర్చుకుంటూ అద్భుత ప్రతిభ చాటుతున్నారు. పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారిణి ఎర్రొల్ల అవంతి విద్యార్థులకు బోధిస్తున్నారు. పెన్సిల్ డ్రాయింగ్, షేడింగ్స్, కలర్ పెయింటింగ్, హ్యాండ్ రైటింగ్ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. కామారెడ్డి అర్బన్: హరేరామ హరేకృష్ణ ఇస్కాన్ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 24 వరకు సంస్కృతి వేసవి శిబిరం నిర్వహిస్తున్నట్టు ఇస్కాన్ కామారెడ్డి కేంద్రం ప్రతినిధి వెంకటదాసు ప్రభు ఒక ప్రకటనలో తెలిపారు. భగవద్గీత శ్లోకాలు, తబలా, చిత్రలేఖనం, నైతిక, పౌరాణిక, నీతి కథలు, ధ్యానం, కీర్తనలు, నృత్యం, రుచికర సహజ వంటల తయారీ అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తిగల 5 నుంచి 15 ఏళ్లలోపు విద్యార్థులు రామారెడ్డి రోడ్డు లోని మెడికల్ అసోసియేషన్ భవనంలోని ఇస్కాన్ కేంద్రంలో లేదా 99129 16108, 99596 02551 నంబర్లకు సంప్రదించవచ్చన్నారు. మేము గీసిన చిత్రాలు ఇంటి కోడికి ఒకటే కాలు.. పొరుగు కోడికి మూడు కాళ్లు ( మన దగ్గర ఉన్నదాని కన్నా పక్కవాడికి ఉన్నదే గొప్పగా భ్రమపడటం) గాడిద సోపతి తన్నులకే.. ( చెడ్డవాళ్లతో, మూర్ఖులతో స్నేహం చేస్తే మంచి కాకుండా నష్టం, అవమానం, ఇబ్బందులు వస్తాయి.) నాకు బొమ్మలు గీయడమంటే ఎంతో ఇష్టం. మూ డో తరగతి నుంచి బొమ్మ లు గీయడంపై ఆసక్తి పెంచుకున్నాను. ఇంటి వద్దనే బొమ్మలు గీసేదానిని. బోధన్‌లో వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటైనట్లు తెలుసుకొని నేను, తమ్ముడు చేరాం. ప్రతి రోజు వచ్చి డ్రాయింగ్ నేర్చుకుంటున్నాం. – భవ్య, 7వ తరగతి విద్యార్థిని, బోధన్ డ్రాయింగ్ నేర్చుకునేందుకు పిల్లలు ఉత్సాహం చూపుతున్నారు. బొమ్మలు గీయడం ఎంతో సులభమో విద్యార్థులకు మెలకువలు నేర్పుతున్నాం. రంగులపై అవగాహన కల్పిస్తూ, విద్యార్థులు సొంతంగా బొమ్మలు గీసేలా ప్రొత్సహిస్తున్నాం. – ఎర్రొల్ల అవంతి, ప్రముఖ చిత్రకారిణి -
పేలిన ట్రాక్టర్ టైర్
● ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు ఆర్మూర్‌టౌన్: ట్రాక్టర్ టైర్ పేలి డ్రైవర్ మృతి చెందిన ఘటన ఆర్మూర్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై రజినికాంత్ తెలిపిన వివరాల ప్రకారం..కత్తి బాలకృష్ణ(40) అనే వ్యక్తి ఆర్మూర్ మండలం మగ్గిడిలోని ఇటుక బట్టిలో పనిచేస్తు జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం అంకాపూర్ గ్రామంలో ట్రాక్టర్ ఇటుకలోడ్ను దించి తిరిగి మగ్గిడికి వెళ్తుండగా ఆర్మూర్ బృందావన్ టాకీస్ వద్ద టైర్ పేలిపోవడంతో ముందున్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ బాలకృష్ణ టైర్ కిందపడగా, మరో ఇద్దరు రోడ్డుపై పడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఆర్మూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలకృష్ణ ఆస్పత్రిలో మృతిచెందగా, మరో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య పెంచులమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
క్రైం కార్నర్
పాముకాటుతో మహిళ మృతి నవీపేట : మండలంలోని ధర్మారం(ఎ) గ్రామానికి చెందిన పల్లపు నర్సమ్మ(57) పాముకాటుతో మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి కుటుంబసభ్యులతో భోజనం చేశాక ఆరుబయట పడుకుందని పేర్కొన్నారు. రాత్రి సమయంలో కట్లపాము కాటువేయగా 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారని తెలిపారు. మృతురాలి సోదరి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాన్సువాడ రూరల్: మండలంలోని కొల్లూర్ గ్రామానికి చెందిన బండారి సాయిలు(48) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట మొరందుబ్బ ప్రాంతంలో సాయిలు ఉరేసుకొని మృతి చెందాడనే సమాచారం మేరకు పోలీసులు పరిశీలించారు. రెండు రోజుల క్రితమే చనిపోయినట్లు గుర్తించారు. మృతుడి భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెట్టును ఢీకొన్న బైక్ ● ఒకరి మృతి ఆర్మూర్‌టౌన్: చెట్టును ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై యాసిర్ ఆర్ఫాత్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట్ గ్రామానికి చెందిన సీతానగర్ దాకయ్య(50) గోవింద్‌పేట్ గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పనుల నిమిత్తం గోవింద్‌పేట్ గ్రామం నుంచి ఆర్మూర్‌కు వస్తుండగా గ్రామ శివారులో ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో దాకయ్య అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
శ్రీనగర్‌లో దొంగల బీభత్సం
● మూడు ఇళ్లలో చోరీ వర్ని: మండలంలోని శ్రీనగర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన వజ్రమ్మ, రమణ, శ్రీనివాసరావు ఇళ్లలో చొరబడిన దుండగులు నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మూడు ఇళ్లలో కలిపి నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రూ. 20 వేల నగదు అపహరణకు గురైనట్లు ఎస్సై తెలిపారు. మరో నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా తీసుకొని దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని బోధన్ ఏసీపీ శ్రీనివాసరావు, సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ పరిశీలించారు. వేసవికాలంలో డాబాల మీద పడుకున్న, ఇతర ప్రాంతాలకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. -
నీటి ఎద్దడి లేకుండా చర్యలు
● పెద్ద పోచమ్మ గుడి వద్ద వాటర్ లీకేజీ అవుతోంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. – ప్రభాకర్‌రెడ్డి – 44వ డివిజన్, రమేశ్–25వ డివిజన్, రాజశేఖర్ – ఐదో డివిజన్మేయర్ : నగరంలో లీకేజీలను అరిట్టేందుకు ఇంజినీరింగ్ విభాగం ప్రత్యేక దృష్టిసారించింది. పెద్ద పోచమ్మ గుడి వద్ద లీకేజీ సమస్య నా దృష్టిలో కూ డా ఉంది. లీకేజీ ఏర్పడిన ఏరియాలో నీరు తక్కువగా వస్తున్నట్లు తెలిసింది. నగరంలో ఎక్కడైనా పైప్‌లైన్ లీకేజీలు ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించా. ● నాగారం ప్రాంతంలో పైపులైన్ వేసి కనెక్షన్ ఇవ్వలేదు – షేక్ అలీముద్దీన్, 10వ డివిజన్● నీటి సరఫరా లేని ఏరియాల్లో నల్లా కనెక్షన్ ఇచ్చి సరఫరా చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించాం. సమస్యను ఇంజినీరింగ్ విభాగం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. నీటి కనెక్షన్, సరఫరా చేయకపోవడానికి కారణాలు అడిగి తెలుసుకుంటా. ● మా కాలనీలకు ఒక్కోసారి కలుషిత నీరు సరఫరా అవుతోంది. అధికారులకు తెలిపినప్పుడు మంచిగా వస్తున్నాయి. – ప్రశాంత్ – పోచమ్మగల్లి, నవీన్ – దుబ్బ, రవీందర్ – పెద్దబజార్● కొన్ని డివిజన్లలో కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాం. మురుగుకాల్వలకు దగ్గరగా ఉన్న పైప్లైన్లను మార్చాలని ఆదేశించాం. నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని అధికారులకు సూచించాను. ● తాగునీటి ఎద్దడి, పైప్లైన్ల లీకేజీలతోపాటు 24వ డివిజన్ పద్మానగర్‌లో చెత్తను ఎప్పటికప్పుడు తీసేయడం లేదని, 17వ డివిజన్లో విద్యుత్‌దీపాలు లేవని, నాగారంలో రాజీవ్ స్వగృహ, ఇతర కాలనీల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని, స్తంభాలు లేక తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని ఆయా కాలనీల నుంచి స్థానికులు సాక్షి ‘ఫోన్ ఇన్’ ద్వారా మేయర్ దృష్టికి సమస్యలను తెచ్చారు. చెత్తను తొలగించేలా సంబంధిత అధికారులను ఆదేశిస్తామని ఫిర్యాదుదారుడితో మేయర్ అన్నారు. అలాగే అన్ని డివిజన్ల విద్యుత్ దీపాలకు సంబంధించి పాత టెండర్ ముగిసిందని, కొత్త టెండర్లను ఆహ్వానించామని, టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత విద్యుత్ బల్బులు బిగిస్తారని సమాధానమిచ్చారు. రాజీవ్ స్వగృహ, కాలనీల్లో విద్యుత్ సరఫరా గురించి ఎన్పీడీసీఎల్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని మేయర్ తెలిపారు. నగరవాసుల సమస్యలు తెలుసుకుంటున్న మేయర్ ఉమారాణివేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. సుమారు రెండు నెలలకు అవసరమైన నీటి నిల్వలు అలీసాగర్, మాసాని, మంచిప్ప చెరువులో ఉన్నాయి. అప్పుడప్పుడు ఏర్పడుతున్న పైప్‌లైన్ లీకేజీల కారణంగా కొంతవరకు సమస్య ఉన్నట్లు నా దృష్టిలో ఉంది. లీకేజీలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టిసారించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించాం. అమృత్ 2.0 పనులు పూర్తయితే నగరానికి 365 రోజులు ఎలాంటి కొ రత లేకుండా నీటిని పుష్కలంగా సరఫరా చేయొచ్చు. నాణ్యత పా టిస్తూ వేగవంతంగా పనులు చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించా’ అని నగర మేయర్ కూరగాయల ఉమారాణి తెలిపారు. నగర మేయ ర్తో ‘సాక్షి’ ఆదివారం ఫోన్ ఇన్ నిర్వహించింది. – సుభాష్‌నగర్ నగరవాసుల అవసరానికి సరిపడా నీటి నిల్వలు లీకేజీలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి అమృత్ 2.0 పూర్తయితే పుష్కలంగా నీటి సరఫరా ‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో నగర మేయర్ కూరగాయల ఉమారాణి -
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
మోర్తాడ్(బాల్కొండ): ఉచితంగా వీసాలు, విమాన టికెట్లు అందిస్తూ యూఏఈలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఏడీఎన్‌హెచ్, జీటీఎం సంస్థలు మరోసారి వలస కార్మికులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించాయి. ఈనెల 14న సిరిసిల్ల, జగిత్యాల, సికింద్రాబాద్, 15న సికింద్రాబాద్, నిజామాబాద్, ఆర్మూర్‌లలో ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. క్లీనింగ్ విభాగంలో ఉపాధి విస్తరణతోపాటు హెవీ, లైట్ వెహికిల్ డ్రైవర్లకు అవకాశం కల్పిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఉపాధి కల్పించేందుకు అనేకమార్లు ఉచితంగా వీసాలు జారీ చేసి విమాన చార్జీలను సైతం ఏడీఎన్‌హెచ్ సంస్థనే భరించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులకు సికింద్రాబాద్ కార్యాలయంలో ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయా విభాగాల పరిధిలో.. క్లీనింగ్ విభాగంలో పని చేసేవారికి నెలకు రూ. 24 వేల వేతనం(ఇండియన్ కరెన్సీ), ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించనున్నారు. హెవీ డ్రైవర్లకు రూ. 62 వేలు, లైట్ డ్రైవర్లకు రూ. 45 వేల వేతనం అందించనున్నారు. డ్రైవింగ్ విభాగంలో పని చేయాలనుకునేవారు యూఏఈ లైసెన్స్‌ను కలిగి ఉండాలి. క్లీనింగ్ సెక్షన్లో పని చేయాలనుకునేవారు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చు. బేసిక్ ఇంగ్లిష్ వచ్చి ఉండడంతోపాటు ఈసీఎన్ఆర్ పాస్‌పోర్టు కలిగి ఉండాలి. ఇతర వివరాలకు సికింద్రాబాద్ – 83320 52299, నిజామాబాద్ – 86868 60999, ఆర్మూర్ – 83320 62299, జగిత్యాల – 83320 42299, సిరిసిల్ల – 93916 61522 నంబర్లలో సంప్రదించాలని జీటీఎం సంస్థ చైర్మన్ సతీశ్‌రావు ‘సాక్షి’తో తెలిపారు. ఉచిత వీసాలు ఇచ్చే సంస్థ ఏడీఎన్‌హెచ్ ఒక్కటేనని, ఈ అవకాశాన్ని వలస వెళ్లాలనుకునే వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వీసా, విమాన టికెట్లు ఉచితం ఏడీఎన్‌హెచ్, జీటీఎంల ఆధ్వర్యంలో మరోసారి ఇంటర్వ్యూ మేళా ఉచిత వీసాల జారీకి ముందుకు వచ్చిన సంస్థలు -
నేటి నుంచి జనగణన
● జూన్ 9 వరకు కొనసాగనున్న ప్రక్రియ నిజామాబాద్‌అర్బన్: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి జనగణన ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులకు శిక్షణ పూర్తయ్యింది. జూన్ 9 తేదీ వరకు జనగణన ప్రక్రియ కొనసాగనుంది. మొదటి మూడు రోజులు ఎన్యుమరేటర్లు గృహాలను గుర్తిస్తారు. జనాభా లెక్కింపునకు ముందు అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలు, పట్టణాల్లో ఎన్ని ఇళ్లు ఉన్నాయని గుర్తించి మార్కింగ్ చేసి మ్యాపింగ్ తయారు చేస్తారు. అనంతరం జనాభాను లెక్కిస్తారు. ఒక్కో ఎన్యుమరేటర్ 300 ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా జనగణన కోసం 33 మండలాల్లో 2,588 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. అలాగే మూడు మున్సిపాలిటీల్లో 680 మంది ఎన్యుమరేటర్లు, 110 మంది సూపర్వైజర్లు జనగణన విధులను నిర్వర్తించనున్నారు. 13 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం కామారెడ్డి అర్బన్:/కామారెడ్డి టౌన్ : కామారెడ్డి క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) ఆధ్వర్యంలో ఈనెల 13న ఉచిత వేసవి క్రికెట్ శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మోజామ్ అలీఖాన్, కార్యదర్శి ముప్పారపు ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో హైదరాబాద్, నిజామాబాద్ క్రికేట్ అసోసియేషన్ సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించనున్నామని పేర్కొన్నారు. రోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. 12 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు బాల, బాలికలు, యువతీయువకులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, 13న నేరుగా స్టేడియానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో పతకాల పంట కామారెడ్డి అర్బన్: హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లె టిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. మహిళల విభాగంలో కే.మేఘన జా వెలిన్ త్రోలో బంగారు పతకం, షాట్‌పుట్ లో కాంస్య పతకం సాధించగా, వై.శిరీష జా వెలిన్ త్రోలో కాంస్య పతకం పొందారు. అండర్–20 బాలుర విభాగంలో లాంగ్ జంప్ లో నందు, రాకేష్ వెండి పతకాలు, పవన్ క ళ్యాణ్ కాంస్య పతకం సాధించారు. అండర్–18 బాలికల విభాగం 400 మీటర్ల ప రుగులో కె.నందిని వెండి పతకం పొందారు. విజేతలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్ అభినందించారు. -
బైపాస్‌లో హనీట్రాప్
● భార్యాభర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు ● రిమాండ్‌కు తరలింపునిజామాబాద్ రూరల్: ద్విచక్ర వాహనదారులను హనీట్రాప్ చేసి డబ్బులు గుంజుతున్న భార్యాభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లాకు చెందిన భార్యాభర్తలు మాధవనగర్ ప్రాంతంలో ఉంటున్నారు. ఈజీగా డబ్బుల సంపాదించాలనే ఆలోచనతో హనీట్రాప్ పతకాన్ని అమలు చేశారు. మాధవనగర్ బైపాస్ రోడ్డులో భార్య నిల్చుని ద్విచక్ర వాహనదారులను ఆకర్షిస్తూ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్తే వెనకాలే భర్త వచ్చి బెదిరిస్తాడు. వాహనదారుల వద్ద ఉన్న డబ్బులను లాక్కుని ఎవరికై నా చెబితే రేప్ కేసు పెడతామని బెదిరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి సైతం ఓ వాహనదారుడిని ట్రాప్ చేయగా గూపన్పల్లి శివారులో భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆర్మూర్ బైపాస్ రోడ్డులో సైతం పలువురిని భార్యాభర్తలు బెదిరించినట్లు తెలిసింది. జానపద కళోత్సవ్‌ను విజయవంతం చేయాలి నిజామాబాద్ రూరల్: జిల్లాకేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో ఈనెల 24 నిర్వహించనున్న జానపద కళోత్సవ్ – 2026ను విజయవంతం చేయాలని ప్రజానాట్య మండలి జిల్లా కన్వీనర్ సిర్ప లింగం కోరారు. నగరంలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ కార్యాలయంలో సాహితీ సాంస్కృతిక సంస్థల నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కళాకారుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జానపద కళోత్సవ్పై, కళారూపాల ప్రదర్శనలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రచ్చ నరేశ్, రాధ కిషన్, రాజు, క్రాంతి, శ్రీనివాస్, విజయమల, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది
● రైస్‌మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు ● ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు నిరసన ● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వేల్పూర్: నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను గత మూడు రోజులుగా తాను స్వయంగా సందర్శించానని, సేకరణలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలోని క్యాంపుకార్యాలయంలో ఆదివారం సా యంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ధా న్యం కొనుగోలు చేస్తామని ప్రకటించి సెంటర్లు తెరి చే సరికి 15 రోజులు, గన్నీ బ్యాగులు వచ్చేసరికి వా రం, కాంటా పెట్టేసరికి మరో వారం అన్నట్టుగా 20 రోజులపాటు కావాలనే ప్రభుత్వం జాప్యం చేసిందని విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు ప్రైవే ట్ వ్యాపారులకు తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయిస్తూ క్వింటాల్‌కు రూ.500 నష్టపోతున్నారన్నా రు. రైస్‌మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, తరు గు పేరుతో 40 కిలోలకు 5 కిలోల అదనపు వడ్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. రెతు సమస్యలపై మాట్లాడేందుకు కలెక్టర్‌కు ఫోన్ చేస్తే ఎత్తడం లేదని, కనీసం స్పందించే తీరిక కూడా వారికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మోర్తాడ్‌లో సోమవారం నిరసన తెలుపనున్నామని, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. -
ఆ ఐదుగురు ఎవరో..
సుభాష్‌నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కో ఆప్షన్ పదవులు దక్కే ఆ ఐదుగురు ఎవరనే అంశంపై జోరుగా చర్చసాగుతోంది. నగరంలోని 60 డివిజన్ల నుంచి 59 మంది దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. కాగా ఐదు పదవులను అధికార పార్టీ కాంగ్రెస్, ఎంఐఎం కలిసి దక్కించుకుంటాయని రాజకీయ వర్గాల్లో టాక్. కౌన్సిల్లో బలాబలాలు కౌన్సిల్లో 60 మంది కార్పొరేటర్లు, ఐదుగురు ఎక్స్ అఫిషియో మెంబర్లు ఓటుహక్కును కలిగి ఉన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, ఒక బీఆర్ఎస్ కార్పొరేటర్‌తో పాటు ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిపి 34 సంఖ్యాబలం ఉంది. అదేవిధంగా బీజేపీకి 28 మంది కార్పొరేటర్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు కలిపి 31 బలం ఉంది. కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం? కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కార్పొరేటర్లతో ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు, ఎ మ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అవసరమైతే ఈ సమావేశంలోనే కా ర్పొరేటర్లకు అవగాహన నిమిత్తం మాక్‌పోల్ జరపనున్నట్లు తెలిసింది. 59 మంది దరఖాస్తులు చేసుకోవడంతో.. ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై అధికార కాంగ్రెస్, ఎంఐఎంకు తలనొప్పిగా మారింది. అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి. ఎన్నిక ప్రక్రియ సాగనుందిలా.. మొత్తం ఐదు కో ఆప్షన్ పదవులకు గాను, రెండు మైనార్టీ (మెన్, ఉమెన్ ఒక్కోటి), మూడు జనరల్ కేటగిరిలో (రెండు మెన్, ఒకటి ఉమెన్) ఎన్నుకోవాల్సి ఉంటుంది. గతంలో కౌన్సిల్ మెంబర్, ఎన్జీవో, రిటైర్డ్ ఎంప్లాయీ అయి ఉండాలి. మెజార్టీ సభ్యుల ఓట్లు వచ్చిన వారు కో ఆప్షన్ సభ్యుడు/సభ్యురాలిగా ఎన్నికవుతారు. అయితే ఐదు పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్, ఎంఐఎం మధ్య స్పష్టమైన ఒప్పందం కుదిరినట్లు చర్చ జరుగుతోంది. ఎంఐఎం 2, కాంగ్రెస్ 3 పదవులు పంచుకున్నట్లు సమాచారం. నేడు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ‘కో ఆప్షన్’ ఎన్నిక దరఖాస్తులు 59.. అదృష్టం ఎవరిని వరించేనో.. అధికార పార్టీకి తలనొప్పిగా మారిన ఎంపిక కార్పొరేటర్లతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశం? -
బడి బాగుకు కసరత్తు
‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విద్యా వారోత్సవాలకు ఎంతో ప్రాధాన్యత చేకూరింది. త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో బడి బాగుకు కృషి చేయనున్నారు. ప్రతిరోజూ వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఖలీల్‌వాడి: విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు లక్ష్యంగా నేటి (సోమవారం) నుంచి ఈనెల 17వ తేదీ వరకు విద్యాశాఖ విద్యా వారోత్సవాలను నిర్వహించనుంది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించేలా కార్యాచరణ రూపొందించింది. సర్పంచ్‌లతో చర్చలు 13వ తేదీన నియోజకవర్గ స్థాయిలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, బడిబాట తదితర అంశాలపై చర్చించనున్నారు. బడిబాటలో భాగంగా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. కార్యక్రమంలో పాల్గొనే వారికి నోట్‌ప్యాడ్, పెన్, బ్యాగ్‌లతో కూడిన కిట్, భోజన వసతి ఏర్పాటు చేయనున్నారు. ప్రతిభావంతులకు బహుమతులు 17వ తేదీన విద్యా విజయోత్సవం నిర్వహించనున్నారు. ఎస్సెస్సీ, ఇంటర్, క్రీడల్లో జిల్లా స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ.10వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. ‘విద్యలో అత్యుత్తమ ప్రతిభను వేడుకగా జరుపుకోవడం’ అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. శిథిలావస్థ భవనాలపై ప్రత్యేక చర్యలు జిల్లాలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను గుర్తించనున్నారు. వాటిని తక్షణమే సీజ్ చేసి విద్యా కార్యకలాపాలకు ఉపయోగించకుండా చర్యలు తీసుకోనున్నారు. నిబంధనల ప్రకారం వాటిని కూల్చివేసేందుకు చర్యలు తీసుకుంటారు. బడిబాటతో చైతన్యం 14వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గ్రామాలు, వార్డుల్లో ర్యాలీలు చేపట్టి విద్యపై అవగాహన కల్పించనున్నారు. తల్లిదండ్రులతో సమావేశాలు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నారు. మధ్యాహ్న భోజన వంట కార్మికులకు వంట పోటీలు నిర్వహిస్తారు. ఉత్తమ హాజరు ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు కృషి చేయనున్నారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతపై.. 15వ తేదీన గ్రంథాలయ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ‘గ్రంథాలయాలు–జ్ఞాన హదయం’ అనే నినాదంతో పుస్తక ప్రదర్శనలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా డిజిటల్ కేటలాగ్ ప్రారంభం, ఉత్తమ పాఠకులకు గుర్తింపు కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రాథమిక 769 ప్రాథమికోన్నత 132 ఉన్నత 255 మొత్తం విద్యార్థులు సుమారు లక్షా 50వేలు నేటి నుంచి విద్యా వారోత్సవాలుజిల్లాలో పాఠశాలలు 17వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణ విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి విద్యార్థుల ప్రతిభావికాసం, పాఠశాలల అభివృద్ధే లక్ష్యం -
అలుపెరగని ప్రేమ అమ్మ
‘ఉదయం 5 గంటలకు లేచి వంట, ఇంటిపని ముగించుకొని స్కూల్‌కు వెళ్తాను. సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ పిల్లల హోంవర్క్, వంట. అలసట ఉన్నా పిల్లల నవ్వు చూస్తే అదంతా మాయమవుతుంది’ అంటున్నారు ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న లక్ష్మి. ఇది ఒక్క లక్ష్మి కథే కాదు.. లక్షలాది మంది తల్లుల త్యాగానికి ప్రతిరూపం. ఆర్మూర్/మోర్తాడ్: అలుపెరగని ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మ. తన కడుపు మాడ్చుకొని బిడ్డల కడుపు నింపే త్యాగమూర్తి ఆమె. నడక నేర్పి, నాగరికత నేర్పి, జీవితాన్ని నడిపించే దారి దీపం. ఆధునిక యుగంలో ఉద్యోగం, వ్యాపారం అంటూ తల్లి కూడా బయటికి వచ్చింది. ఇంటిని చక్కదిద్దుతూనే, ఆఫీసులో రాణిస్తూ, పిల్లల భవితకు బంగారు బాటలు వేస్తోంది. తెల్లవారి లేచింది మొదలు అర్ధరాత్రి వరకు కుటుంబం కోసం యంత్రంలా పనిచేసే అమ్మ విశ్రాంతి అనే పదాన్ని మరిచింది! కష్టాలను ఓర్చుకుంటూ కన్నీళ్లను దిగమింగుకుంటూ తల్లిగా తన పిల్లలను లాలిస్తుంది. ఉద్యోగ, వ్యాపార బాధ్యతలలో తలమునకలైనా తన పిల్లలకు ఎలాంటి లోటు రానీయకుండా కాపాడుకుంటుంది. అమ్మ రుణం తీర్చుకోవడానికి ఒక్క రోజు సరిపోదు. ప్రతి రోజూ మదర్స్ డేనే. ఆమెను ప్రేమగా చూసుకోవడం, ఆమె మాట వినడం, వృద్ధాప్యంలో తోడు గా నిలవడమే మనం ఆమెకు ఇచ్చే నిజమైన బ హుమతి. అమ్మ చూపే అనురాగాన్ని, ఆమె త్యా గాన్ని స్మరించుకుంటూ నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ‘మదర్స్ డే’ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.. -
కాగితాల్లోనే ‘ఎకో టూరిజం’!
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఎకో టూరిజం పనులు గమ్యం చేరని చందంగా తయారయ్యాయి. ముఖ్యంగా డొంకేశ్వర్ మండలం గాదేపల్లి (చిన్నయానం) వద్ద ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటక కేంద్రం ఏర్పాటుకు అన్ని అడ్డంకులు తొలగినా, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. ప్రాజెక్టును ప్రకటించి మూడేళ్లవుతున్నా ఇంకా కాగితాల్లోనే ఉంది. డిజైన్ల ఆమోదంలో అధికారుల వద్ద జరుగుతున్న జాప్యం కారణంగా పర్యాటక ప్రేమికులను నిరాశకు గురి చేస్తోంది. 2023 జూలైలో ప్రభుత్వం టూరిజం ప్రకటన చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర అటవీ ఉన్నతాధికారులు ఎన్నోసార్లు వచ్చి స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. చివరి సారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పీసీసీఎఫ్ సువర్ణ, ఎఫ్డీసీ డైరెక్టర్ రంజిత్నాయక్లు వచ్చి సైట్ విజిట్ చేశారు. మార్చి లేదా ఏప్రిల్‌లో పనులు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతాయని వెల్లడించారు. అయితే మే నెల కూడా పూర్తి కావొస్తున్నా ఇప్పటికీ ఈ ప్రాజెక్టు వర్క్ పేపర్ స్థాయిలోనే ఉండిపోయింది. కేవలం డిజైన్ అప్రూవల్స్ కోసమే నెలల తరబడి సమయం వృథా కావడంతో ఈ ఏడాది కూడా పనులు మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త డీఎఫ్వోపైనే ఆశలు! జిల్లా అటవీ శాఖ అధికారిగా ఇటీవల సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈయన 2018 ఐఎఫ్ఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి కాగా, మొన్నటి వరకు ఖమ్మం జిల్లా డీఎఫ్‌వోగా పని చేశారు. ఈయన పర్యాటకం, అడవుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారని అటవీ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. గాదేపల్లి ఎకో టూరిజం పనులపై దృష్టి పెట్టి గట్టెక్కిస్తారనే ఆశాభావం వ్యక్తం అవుతోంది.అన్ని అడ్డంకులు తొలగినా..ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వద్ద అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉంది. వేసవిలో పచ్చని నేలలు బయటకు తేలడంతో విదేశీ పక్షులు, కృష్ణ జింకలు సందడి చేస్తాయి. ఇక్కడ బోటింగ్, కాటేజీలు, వ్యూ పాయింట్లు ఏర్పాటు చేస్తే జిల్లాకు మంచి గుర్తింపు వస్తుంది. దీనికి సంబంధించి 18 ఎకరాల స్థలం సేకరణ పూర్తి కావడం, సఫారీ వాహనాలు కొనుగోలు చేయడం, నిధుల పరంగా లైన్ క్లియర్ అవ్వడంతో పనులు వేగవంతం అవుతాయని అంతా భావించారు. అయితే, ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడం, డిజైన్ల ఖరారులో జరుగుతున్న ఆలస్యం ప్రాజెక్టును నీరుగారుస్తోంది. అలాగే టూరిస్టు గైడ్లుగా స్థానిక గాదేపల్లి, చిన్నయానం, జీజీ నడ్కుడ గ్రామాలకు చెందిన యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఎలాంటి కదలిక లేదు. డిజైన్ల ఆమోదంలో తీవ్ర జాప్యం ఈ ఏడాది ఏప్రిల్‌లోనే మొదలు కావాల్సిన పనులు ఇప్పటి వరకు కదలిక లేని వైనం అధికారుల్లో కరువైన ఉత్సాహం -
ఆందోళనకు సిద్ధం
● 24గంటల్లో ధాన్యం సేకరణ సమస్యలను పరిష్కరించండి ● అధికారులను హెచ్చరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మోర్తాడ్: రైతుల సమస్యలను 24 గంటల్లో పరిష్కరించకపోతే తాను ఆందోళనకు సిద్ధమవుతానని, రోడ్డెక్కుతానని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. తరుగు పేరుతో రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని ఆ రోపించారు. బాల్కొండ మండలం కిసాన్‌నగర్, మోర్తాడ్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయ న శనివారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. అక్కడి నుంచి జిల్లా అడిషనల్ కలెక్టర్, పౌర సరఫ రాల శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడారు. అరగంట నుంచి ప్రయత్నిస్తున్నా కలెక్టర్ తన కాల్స్‌కు స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ధా న్యం సేకరణలో లోపాలు చోటు చేసుకుంటున్నా యని ఆరోపించారు. తరుగు పేరుతో సతాయించే మిల్లుల జాబితాను సిద్ధం చేసి వాటిని సీజ్ చేస్తే రైస్‌మిల్లర్లు ఎందుకు ధాన్యాన్ని అన్లోడింగ్ చేసుకోరని ఆయన ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ధాన్యం సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూశామన్నారు. క్వింటాల్‌కు 10 కిలోల తరుగు తీస్తామని చెబుతున్న మిల్లర్ల భరతం పట్టాలని అధికారులకు సూచించారు. -
నిజామాబాద్
వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా వివిధ నైపుణ్యాలను పెంపొందించే దిశగా జిల్లాలోని బాలభవన్ వేసవి ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తోంది. చిన్నారుల్లో సృజనకు పదును పెట్టేందుకు అద్భుత వేదికగా మారుతోంది. చిత్రలేఖనం, యోగా, కర్రసాము, భరతనాట్యం, లలిత సంగీతం, శ్లోకాలు, కథలు, మ్యాజిక్, స్కేటింగ్ తదితర వాటిల్లో చిన్నారులు సాధన చేస్తూ ప్రతిభకు పదును పెడుతున్నారు. వాతావరణం ఉదయం ఆహ్లాదకరమైన గాలులు వీస్తాయి. పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి నిర్మలంగా ఉంటుంది. ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026కంటికి రెప్పలా..మోర్తాడ్(బాల్కొండ): ఒకరి సాయం అవసరమైన 88 ఏళ్ల వయస్సులో సాయమ్మ తన ఇద్దరు పిల్లలకు తానే సాయమవుతోంది. పేదరికం వెక్కిరిస్తున్నా.. మధ్య వయస్సుకు చేరిన పిల్లలు చంటి పిల్లల్లా తనపైనే ఆధారపడినా ఆ తల్లి ఎక్కడా ధైర్యాన్ని కోల్పోలేదు. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన కమటం సాయమ్మ, రాములు దంపతులకు ఇద్దరు సంతానం రూప, భరత్. మానసిక ఎదుగుదల లేకపోవడంతో ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. సాయమ్మ వయస్సు ప్రస్తుతం 88 ఏళ్లు. భర్త 34 ఏళ్ల కిందటే మరణించాడు. భర్తను కోల్పోయిన సాయమ్మ పేదరికాన్ని ఎదిరిస్తూనే తన పిల్లలను సాకుతోంది. ప్రస్తుతం కూతురు రూపకు 56 ఏళ్లు, కొడుకు భరత్‌కు 54 ఏళ్లు. విధి ఆడిన వింత నాటకంలో పావుగా మారిన సాయమ్మ ఏ రోజూ తనకు జరిగిన నష్టం, అన్యాయంపై బాధపడలేదు. ఉపాధి కోసం బీడీలు చుడుతున్న సాయమ్మ వేకువ జామున లేచి కూతురు, కొడుకులను తయారు చేయడం, వారికి వంట చేసి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడకుండా తన రెక్కల కష్టాన్ని నమ్ముకున్న సాయమ్మ రోజుకు వెయ్యి బీడీల వరకు చుడుతుంది. సాయమ్మ జీవితాన్ని దగ్గర నుంచి చూసిన వారేవరైనా ఆమెకు రోజు శిరస్సు వంచి నమస్కరించాల్సిందే! ముప్పై ఏళ్లుగా.. కామారెడ్డి పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన సూరం సంతోష, వెంకటేశ్‌లది రెక్కాడితేకానీ డొక్కాడని కుటుంబం. వారికి 33 ఏళ్ల కూతురు అశ్విని, 31 ఏళ్ల కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. ఇద్దరూ మాట్లాడలేరు.. నడవలేరు. కనీసం నిలబడలేరు. 2010లో భర్త వెంకటేశ్ చనిపోవడంతో పిల్లల పూర్తి బాధ్యత సంతోషపైనే పడింది. పిల్లలే లోకంగా బతుకుతున్న సంతోష.. వారికి సేవలు చేస్తూ, ఇంట్లోనే బట్టలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. రోజూ పొద్దున్నే పిల్లలు బ్రష్, స్నానం చేయించి, ఏదైనా తినిపించి కూర్చోబెట్టాల్సిందే. కాలకృత్యాలకు తీసుకెళ్లి శుభ్రం చేయాలి. పిల్లలను వదిలి ఎటూ వెళ్లలేని పరిస్థితి. పిల్లలను కూర్చోబెట్టి బయట డోర్ లాక్ చేసి మార్కెట్‌కు వెళ్లొస్తుంటానని చెబుతోంది. పిల్లలకు సేవ చేస్తూ, వారిని చూసుకుంటూ బతుకుతున్నానని తెలిపింది. కూతురికి అన్నీ తానై.. ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామాని కి చెందిన బోరంచ లక్ష్మి, దుర్గయ్య దంపతుల కు కూతురు రేణుక ఉంది. ఆమెకు పుట్టుకతోనే మతిస్థిమితం లేదు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబమైనా.. కన్న కూతురును 19 ఏళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంటోంది అమ్మ. కూలినాలి చేసుకుంటూ బిడ్డకు అన్ని సపర్యలు చేస్తూ కాపాడుకుంటోంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిఇప్పటికీ పసి పాపే.. కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్‌లో నివసించే బూక్య రజిత, రాజునాయక్లకు కూతురు, కొడుకు ఉన్నారు. బిడ్డ బూక్య లక్కీకి పుట్టుకతోనే ఆరోగ్య సమస్య ఉంది. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. కదిలే స్థితిలోలేని బిడ్డను కంటిపాపలా చూసుకుంటున్నారు. రజితకు భర్త రాజునాయక్ ఆసరా అవుతారు. 16 ఏళ్లుగా సేవలు చేస్తున్నా ఏనాడూ భారంగా అనిపించలేదని చెబుతోంది రజిత. లక్కీని అందరూ ఎంతో ప్రేమగా చూస్తారని తెలిపింది. బిడ్డను చూసుకుంటూనే రజిత లా చదువుతోంది. – 8లో.. -
ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి
● సమష్టిగా విద్యా వారోత్సవాలను నిర్వహించాలి ● జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ అర్బన్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధా న్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ధాన్యం కొనుగో లు, ఫార్మర్ రిజిస్ట్రీ, జనాభా గణన, విద్యా వారోత్సవాలపై శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్‌న్స్ ద్వారా సమీక్షించారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ అన్ని జిల్లాలలో వంద శాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ కు ఒక్క రోజే మిగిలి ఉండడంతో ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో పది లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, వీరంతా స్వీ య గణన చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 11 నుంచి నిర్వహించే విద్యా వా రోత్సవాలను విజయవంతం చేయాలని సీఎస్ దిశా నిర్దేశం చేశారు. వీసీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు కీలక సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. కేంద్రాలకు రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటే వెంటనే తూ కం జరిపించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం లోడింగ్ అన్లోడింగ్ లో జాప్యం జరగకుండా సరిపడా సంఖ్యలో హమాలీలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, వారికి భోజన సౌకర్యం కల్పించాలని కలెక్టర్ సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ పరిస్థితుల గురించి రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. జనాభా గణన ప్రక్రియలో భాగంగా కొనసాగుతున్న స్వీయ నమోదును అన్ని వర్గాల వారు స్వీయ గణన చేసుకునేలా కషి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ, ఆశా వర్కర్లను కూడా భాగస్వాములు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న విద్యా వారోత్సవాలను షె డ్యూల్ ప్రకారం నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, వి ద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులపై ఆసక్తిని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ జిల్లాలో వంద శాతం పూర్తయ్యేలా చొరవ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ప్రవీణ్, డీఆర్డీవో సాయన్న, డీఏవో వీరస్వామి, డీఈవో అశోక్, డీసీవో శ్రీనివాస్, ఏఎస్వో అరవింద్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
పసుపు విత్తనోత్పత్తికి ప్రోత్సాహమేదీ..!
● ప్రత్యామ్నాయ మార్గం లేక రైతులపైనే సేకరణ భారం ● పండించిన పంటలో కొంత విత్తనానికి దాచుకుంటున్న రైతులు మోర్తాడ్(బాల్కొండ): వాణిజ్య పంటల సాగులో ముందంజలో ఉన్న ఈ ప్రాంత రైతులకు పసుపు విత్తనం కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆహార ధాన్యాలు, పసుపు మినహా ఇతర వాణిజ్య పంటల సాగుకు అవసరమైన విత్తనాలు మార్కెట్లో లభిస్తున్నా పసుపు విత్తనం మాత్రం రైతులే సొంతంగా సమకూర్చుకోవాల్సి వస్తోంది. తాము పండించిన పంటలోనే కొంత భాగాన్ని విత్తనంగా వినియోగిస్తున్నారు. ఫలితంగా ఆదాయం తగ్గిపోయి పసుపు విత్తనం ధర భారంగా మారిందని రైతులు వాపోతున్నారు. ఒక ఎకరానికి నాలుగు క్వింటాళ్ల పసుపు విత్తనం వినియోగించాల్సి వస్తుంది. మార్కెట్లో ఉన్న ధర ప్రకారం పసుపు విత్తనం ఒక ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. జాతీయ పసుపు బోర్డు మన జిల్లాలోనే ఏర్పాటు కాగా పసుపు పరిశోధన కేంద్రం సైతం కమ్మర్‌పల్లిలో కొనసాగుతోంది. ఈ రెండు సంస్థలు ఉన్నా పసుపు విత్తనోత్పత్తికి మార్గం చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పసుపు పరిశోధన కేంద్రంలో విత్తనం పసుపు కోసం సాగు చేస్తున్నా ఏటా తక్కువ మొత్తంలోనే రైతులకు విత్తనం అందిస్తున్నారు. వచ్చే వర్షాకాలం సీజనుకు ఈసారి కేవలం 35 క్వింటాళ్ల పసుపు విత్తనం పంపిణీ చేశారు. ఒక క్వింటాలు విత్తనానికి ధరను రూ.3 వేలుగా నిర్ణయించారు. ఇక్కడ పంపిణీ చేసిన పసుపు విత్తనం కేవలం 8 నుంచి 9 ఎకరాలకు మాత్రమే సరిపోతుంది. అంటే పసుపు విత్తనోత్పత్తి నామమాత్రంగానే సాగవుతోందని స్పష్టమైతుంది. పసుపు బోర్డు ఏర్పడి ఏడాది కావస్తున్నా విధివిధానాలు ఖరారు కాకపోవడంతో రైతులకు ప్రోత్సాహం అందడం లేదనే వాదన వినిపిస్తోంది. పసుపు విత్తనం తక్కువ ధరకు మార్కెట్లో లభించే ఏర్పాట్లు చేస్తే రైతులకు భారం తప్పడంతో పాటు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందని పలువురు వెల్లడిస్తున్నారు. వచ్చే వర్షాకాలం సీజనులో పసుపు సాగు చేయడానికి సన్నద్ధం అవుతున్న రైతులు పసుపు విత్తనాన్ని శుద్ధి చేసుకునే పనిలో ఉన్నారు. మునుముందు సీజనుల కోసమైనా పసుపు విత్తనోత్పత్తిపై దృష్టిసారించాలని పలువురు సూచిస్తున్నారు. -
ఇక టీజీఎస్ఈబీ ?
ఖలీల్‌వాడి: పదో తరగతి విద్య తరువాత చాలా మంది బాలికలతోపాటు బాలురు ఇంటర్ విద్యకు వెళ్లడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు బీడీ లు చుట్టడం, టైలరింగ్ వంటి పనుల వైపు వెళ్తుండగా, వ్యవసాయ నేపథ్యం ఉన్న బాలురు అటువైపు వెళ్తుండగా.. ఆర్థిక పరిస్థితులు సరిగా లేనివారు ఇదో ఒక పనికి వెళ్తూ పైచదువులకు దూరవుతున్నారు. అలాగే ఇంటర్ కళాశాలలు దూర ప్రాంతాల్లో ఉండడంతో వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల విద్య తర్వాత విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు పాఠశాల విద్య(8 నుంచి 10వ తరగతి), ఇంటర్మీడియెట్‌ను విలీనం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలు ఉండవనే చర్చ విద్యాశాఖలో జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతం చేసింది. ఈ రెండు ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించింది. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) ప్రకారం 10+2 విద్యను బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి వచ్చేవి. ఇంటర్మీడియట్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల కోర్సులు ఇంటర్మీడియెట్ బోర్డు పరిధిలో ఉండేవి. పరీక్షల విధానంలో మార్పులు 8 నుంచి 10వ తరగతి, ఇంటర్ విలీనమైతే వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షలు ఉండే అవకాశాలు లేవు. ఒకటి నుంచి 7వ తరగతి వరకు స్కూల్ బోర్డు పరిధిలో, అలాగే 8 నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులు నూతన బోర్డు పరిధిలో వార్షిక పరీక్షలు రాసే అవకాశం ఉంది. ఇంటర్నల్స్, ఎక్స్‌టర్నల్స్ తదితర అంశాలపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. వాయిదా పడిన ఇంటర్ అడ్మిషన్లు ఇంటర్ అడ్మిషన్లకు నాలుగు రోజుల క్రితం నోటి ఫికేషన్ రాగా.. మరుసటి రోజే ఆ నిర్ణయాన్ని రద్దు చేశారు. విద్యార్థులు జూనియర్ కళాశాలల్లో చేరేందుకు వెళ్తే ఎంపిక చేసిన పాఠశాల్లో ప్లస్ టు అమలు చేయడం కష్టంగా మారుతుందనే అడ్మిషన్లను వాయిదా వేసినట్లు ఓ అధికారి ఒకరు తెలిపారు. నూతన బోర్డు.. ఇంటర్మీడియెట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డులు కాకుండా తెలంగా ణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (టీజీఎస్ఈబీ) ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. విలీ న ప్రతిపాదనల నేపథ్యంలో జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపించారు. జిల్లాలో పాఠశాలలు, కళాశాలలుప్రతిపాదనలు పంపాం జిల్లాలోని జూనియర్ కాలేజీల వివరాలను ఇంటర్మీ డియెట్ బోర్డుకు అందించాం. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు విలీనం అవుతుంది. మాకు ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. – రవికుమార్, డీఐఈవో, నిజామాబాద్ పాఠశాల విద్యాశాఖలో ఇంటర్‌బోర్డు విలీనానికి రంగం సిద్ధం రెండు శాఖల నుంచి ప్రతిపాదనలు వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలులోకి! -
మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యత
● పింఛన్ అందించేందుకు కృషి ● మత్స్య ప్రగతి, ప్రణాళిక సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి డొంకేశ్వర్(ఆర్మూర్): గంగపుత్రుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి అన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి మత్స్య ప్రగతి, ప్రణాళిక సమావేశం నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, కాంగ్రెస్ పార్టీ ఫిషరీష్ జిల్లా అధ్యక్షుడు బోర్గాం శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. మత్స్యకారులకు అనువుగా జిల్లాలో పుష్కలంగా జల వనరులు, చెరువులు ఉన్నాయని ఇక్కడి నుండే చేప పిల్లల పెంపకం చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కృషి చేస్తానన్నారు. మత్స్యకారులకే కాకుండా ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కింద రూ.5 లక్షలు ప్రమాదవశాత్తు చనిపోతే ఇస్తున్నామని, అందుకు సంబంధించి ఈ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్లోనే నిధులు కూడా కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. మత్స్యకారులకు పింఛన్ అందించేలా ప్రభుత్వాన్ని కోరతానన్నారు. అర్సపల్లిలో మత్స్యకారుల కోసం కేటాయించిన భూమి గతంలో కబ్జాకు గురైందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని కాపాడామని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. అర్సపల్లిలో మత్స్య శాఖ స్థలం కబ్జాకు గురి కాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయించి, సీసీ కెమెరాలు పెట్టిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తక్షణమే ప్రతిపాదనలు రూపొందించాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. ఉత్తమ పనితీరు కనబర్చిన మత్స్య కార్మిక సంఘాల సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. మత్స్య శాఖ ఏడీ ఆంజనేయస్వామి, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయారెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి, నాయకులు ఉమ్మాజీ నరేశ్, కిరణ్, అగ్గు భోజన్న తదితరులు పాల్గొన్నారు. -
నవోదయ క్యాంపస్ పనుల పురోగతిపై సమీక్ష
నిజామాబాద్‌అర్బన్: జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌లో ఏర్పాటు చేయనున్న జవహార్ నవోదయ విద్యాలయ కొత్త క్యాంపస్ భవన నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ ఇలా త్రి పాఠి శుక్రవారం సమీక్షించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఇ ప్పటివరకు చేపట్టిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతతో వేగంగా చేపట్టాలని, విద్యార్థులకు అ న్ని వసతులు అందుబాటులో ఉండేలా చూ డాలని అధికారులను ఆదేశించారు. సమా వేశంలో జవహార్ నవోదయ ఇన్‌చారి్‌జ్ ప్రి న్సిపాల్ పి జోజిబాబు, డీఈవో అశోక్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఐటీ చట్టం– 2025పై అవగాహన నిజామాబాద్‌అర్బన్: ఆదాయపు పన్ను చట్టం – 2025పై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శాఖ సీనియర్ అధికారులు సురేశ్, శుభంసింగ్, ఐశ్వర్య తదితరులు హాజరై వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించారు. సరళీకృత ఆదాయపు పన్ను చట్టం–2025 అమలులోకి వచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చేపట్టిన అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రారంభ్ –2026 పేరుతో ఇక్కడ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. కొత్త చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఐటీఐ, ఏటీసీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఖలీల్‌వాడి: తెలంగాణ ప్రభుత్వ ఉపాధి కల్పన, శిక్షణ పారిశ్రామిక శిక్షణా కేంద్రాల్లో (ఐటీఐ), అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లలో ఉచిత అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు జిల్లా కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ (బాలుర) ప్రిన్సిపాల్ జి.యాదగిరి, బాలికల కళాశాల ప్రిన్సిపాల్ విద్యాసాగర్‌రెడ్డి శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. 2026 సంవత్సరానికి ఈనెల 14 నుంచి జూన్ 8వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో ఐదు ప్రభుత్వ ఐటీఐలు, ఐదు ఏటీసీలు, మూడు ప్రైవేట్ ఐటీఐలలో విద్యార్థులు అ డ్మిషన్లు పొందవచ్చని కన్వీనర్ యాదగిరి తెలిపారు. నోటిఫికేషన్, కోర్సులు, విద్యార్హతల వివరాల కోసం website: https://iti. telangana.gov.in చూడాలని సూచించారు. దరఖాస్తు చేసే సమయంలో ఉపయోగించిన మొబైల్ (సెల్) నంబర్, ఈ మెయిల్లను ఐటీఐ కోర్సు పూర్తి అయ్యేవరకు మార్చొద్దని సూచించారు. మరిన్ని వివరాలకు 85004 67091, 85006 09532 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. అలాగే బాలికల ఐటీఐలో అడ్మిషన్ల వివరాల కోసం 89192 62418, 94417 07536, 99630 91233 నంబర్లను సంప్రదించాలని విద్యాసాగర్‌రెడ్డి సూచించారు. -
మీ సేవలో మాయ
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాల్సిన ‘మీ సేవ’ సెంటర్లు అవినీతి అక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. డబ్బులకు అలవాటు పడి సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను పూర్తిగా అవినీతి మయం చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొన్ని సెంటర్లలో వెలుగు చూసిన ఘటనలో అధికారులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఏసీబీ అధికారులు సైతం ఇటీవల జిల్లా కేంద్రంలోని శివాజీనగర్‌లో ఉన్న మీ సేవ కేంద్రంపై దాడి చేసి తనిఖీలు చేయగా అనేక అక్రమాలకు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. సెంటర్లను పర్యవేక్షించాల్సిన అధికారులు నెలవారీ మామూళ్ల మత్తులో ఉన్నారనే విమర్శలున్నాయి. అధికారులకు, మీ సేవ సెంటర్ల మధ్య మీ సేవ సెంటర్ల సంఘం నాయకుడు ఒకరు మధ్యవర్తిత్వం వహిస్తూ డబ్బులు చేతులు మారుస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జిల్లాలో వెలుగు చూసిన ఘటనలు కొన్ని.. ● జిల్లా కేంద్రంలోని ఆరోటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్ ప్రాంతంలోని మీసేవ సెంటర్ నిర్వాహకులు మైనర్ అమ్మాయిని మేజర్‌గా చూపుతూ ఆధార్ కార్డులో మార్పులు చేయగా కేసు నమోదైంది. తప్పుడు సర్టిఫికెట్‌ను చూపి సదరు అమ్మాయిని ఓ ఖాజీకి ఇచ్చి వివాహం చేసినట్లు తెలిసింది. ఇదే మీ సేవ కేంద్రంలో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, భూముల వ్యవహారాలకు సంబంధించి సర్టిఫికెట్ల జారీలో రూ.10వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం కాకుండా రెండింతల డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ● నిజామాబాద్ రూరల్ మండలంలోని పాల్దా గ్రామంలో ఓ మీసేవ సెంటర్ నిర్వాకుడు బీహార్ రాష్ట్రానికి చెందిన కొందరి ఆధార్ కార్డుల్లో మార్పులు చేస్తూ స్థానికంగా ఉంటున్నట్లు తప్పుడు అడ్రస్‌ను సృష్టించాడు. ఒకరు ఆర్మీ ఉద్యోగం కోసం దరఖాస్తు చేయగా అధికారులు విచారణ చేపట్టారు. దీంతో వ్యవహారం వెలుగలోకి రాగా, ప్రస్తుతం విచారణ సాగుతోంది. ● నిజామాబాద్ నగరంలోని రైల్వే గేట్ సమీపంలోని మీ సెంటర్ నిర్వాకుడు మున్సిపల్ అధికారులకు దగ్గరగా ఉంటూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. కులం, ఆదాయ, జనన ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయించడంలో ఇతగాడు ఆరితేరాడు. ఎటువంటి లోపాలున్నా సరిచేస్తామంటూ వేలా రూపాయలు వసూలు చేస్తున్నాడు. దరఖాస్తుదారులు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే లలితా మహాల్ థియేటర్ సమీపంలోని మీ సేవ సెంటర్‌కు వెళ్లాలని సూచిస్తుండడం గమనార్హం. ● శివాజీనగర్‌లోని ఓ మీ సేవ సెంటర్‌పై ఏసీబీ అధికారులు దాడులు చేసి సర్టిఫికెట్ల జారీకి డబ్బులు వసూలు చేయడంతోపాటు అధికారులకూ పంపుతున్నట్లు గుర్తించారు. ఈ సెంటర్లో అనేక అక్రమాలు ఉన్నట్లు తెలిసింది.డబ్బుందా..? సర్టిఫికెట్ ఏదైనా ఇట్టే తెచ్చేస్తామంటున్నారు కొన్ని మీసేవ కేంద్రాల నిర్వాహకులు. దరఖాస్తుదారుల అవసరం, అమాయకత్వమే ఆసరగా దందా సాగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఆన్లైన్లోనే ఒక్క ‘క్లిక్’తో పూడ్చిపెడుతున్నారు. అవినీతి నిరోధకశాఖ మీ సేవ కేంద్రాలపై నిఘా సారించి తనిఖీలు నిర్వహించిన ఘటనలే ‘మీ సేవలో మాయ’ ఏ స్థాయిలో ఉందో చెబుతున్నాయి. సర్టిఫికెట్ ఏదైనా డబ్బులు ఇస్తే చాలు.. అధికారులతో సెంటర్ల నిర్వాహకుల కుమ్మక్కు ఏసీబీ నిఘా సారించినా కనిపించని మార్పు ఇప్పటికే పలు సెంటర్లపై చర్యలు -
నగరంలో లీకేజీ తిప్పలు
నిజామాబాద్వేర్వేరు చోట్ల చోరీలు ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డి, దోమకొండ, నిజామాబాద్‌లో దుండగులు చోరీలకు పాల్పడి నగదు, వెండి ఎత్తుకెళ్లారు.శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026– 8లో uసుభాష్‌నగర్: నిజామాబాద్ నగరంలో వేసవి నీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. అయి నప్పటికీ పలు ప్రాంతాల ప్రజలకు తిప్పలు తప్ప డం లేదు. నగరం వేగంగా విస్తరిస్తున్నా నల్లా కనెక్ష న్ల సంఖ్య మాత్రం అంతంగానే ఉంది. శివా రు కాలనీల్లో ప్రజలు బోర్లు తవ్వించి ము న్సిపాలిటీ నల్లాలపై ఆధారపడటం లేదు. అ యితే ఉన్న కనెక్షన్లకూ పలు ప్రాంతాల కు నీటి సరఫరాలో ఇబ్బందు లు తప్ప డం లేదు. రోజూ ఏదో ఒక ప్రాంతంలో పైన్లైన్లకు లీకేజీలు ఏర్పడు తూనే ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల కు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజూ ఎడపల్లి మండలం అలీసాగర్, మంచిప్ప ఫిల్టర్‌బెడ్ ద్వారా సుమారు 80 ఎంఎల్డీ (80 లక్షల లీటర్లు) నీరు సరఫరా అవుతోంది. పెద్దబజార్, తిలక్‌గార్డెన్, నామ్‌దేవ్‌వాడ, గంగస్థాన్, వినాయక్‌నగర్, కంఠేశ్వర్, సుభాష్‌నగర్, గోల్ హను మాన్, రేడియోస్టేషన్, 33 క్వార్టర్స్, కోటగల్లి తదితర ప్రాంతాల్లో పెద్ద నీటి ట్యాంకులు ఉన్నాయి. లీకేజీ ఏరియాలు.. ముఖ్యంగా గాయత్రినగర్, హైమద్‌పురా కాలనీ, ఎల్లమ్మగుట్ట, పెద్దబజార్, గోల్హనుమాన్, గాజుల్పేట్, అర్సపల్లి తదితర ప్రాంతాల్లో తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. మున్సిపల్ అధికారు లు పైప్‌లైన్ లీకేజీలకు మరమ్మతులు చేయిస్తూనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరాచేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో తాత్కాలికంగా నివాస గృహాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేదలకు సైతం ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ నగరంలో నీటి ఎద్దడి నివారణకు వేసవిలో ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ రూపొందించాం. లీకేజీలు ఏర్పడకుండా, నీరు వృథా పోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాం. లీకేజీలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయిస్తున్నాం. లీకేజీలు ఏర్పడిన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. – దిలీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్, నిజామాబాద్ వేసవి యాక్షన్ ప్లాన్ ఉన్నా.. తప్పని పాట్లు లీకేజీలు ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సప్లయ్ నిజామాబాద్ నగరంలో ప్రతిరోజూ 80లక్షల లీటర్లు సరఫరా -
ఇంటర్ సప్లిమెంటరీకి పకడ్బందీ ఏర్పాట్లు
● 17,789 మంది విద్యార్థులు.. 39 సెంటర్లు ● ప్రైవేట్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి ● కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్‌అర్బన్: ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించా రు. ఈ మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో మొత్తం 17,789 మంది విద్యార్థులు హాజరుకానుండగా.. ఫస్టియర్ విద్యార్థులు 11,425, సెకండియర్ విద్యార్థులు 6364 మంది ఉన్నారన్నారు. మొత్తం 39 సెంటర్లను ఏర్పాటు చేశామని, ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యా హ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ము ఖ్యంగా ప్రైవేట్ సెంటర్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఎక్కడ కూడా కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. పోలీస్, ఆర్టీసీ, రెవెన్యూ, పోస్టల్, మెడికల్ అండ్ హెల్త్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. విద్యార్థులు ఆందోనళకు గురి కాకుండా ప్ర శాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ అధికా రి రవికుమార్, నిజామాబాద్ ఏసీపీ బి ప్రకాశ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రేపు సీఎస్, డీవోల సమావేశంఖలీల్వాడి: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఖిల్లా బా లుర జూనియర్ కళాశాలలో ఆదివారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల సమావేశం నిర్వహించనున్నట్లు డీఐఈవో రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, 39 సెంటర్ల సీఎస్‌లు, డీవోలు హాజరుకావాలని సూచించారు. అలా గే అన్ని పోలీస్ స్టేషన్ల కస్టోడియన్లు సైతం సమావేశానికి హాజరు కావాలని కోరారు. -
వేర్వేరు చోట్ల చోరీలు
మద్యం దుకాణంలో రూ.లక్ష కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా రోడ్లో ఉన్న ఓ లిక్కర్ మార్ట్‌లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. నిర్వాహకులు గురువారం రాత్రి దుకాణం మూసేసి ఇళ్లకు వెళ్లగా, అర్ధరాత్రి తర్వాత అద్దాలు, కిటికీలు పగులగొట్టి దుకాణంలోకి చొరబడిన ఇద్దరు దుండగులు చోరీ చేశారు. కౌంటర్లో దాచి ఉంచిన నగదు ఎత్తుకెళ్లినుట్ల సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తుంది. రూ.లక్ష చోరీకి గురైనట్లు బాధితులు చెబుతున్నారు. క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరించారు. పట్ణణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాళం వేసిన ఇంట్లో.. దోమకొండ: దోమకొండ గ్రామానికి చెందిన సామల నరేశ్ ఇంటికి తాళం వేసి కామారెడ్డిలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. వృత్తి రీత్యా నరేశ్ రెండు నెలలుగా కామారెడ్డిలో ఉంటున్నారు. శుక్రవారం పని నిమిత్తం దోమకొండకు రాగా ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బీరువాలోని రూ. 7,000 అపహరణకు గురైనట్లు బాధితుడు పేర్కొన్నారు. సుభాష్‌నగర్ అపార్ట్మెంట్లో.. నిజామాబాద్‌అర్బన్: నగరంలోని సుభాష్‌నగర్ అపార్ట్మెంట్లో చోరీ జరిగినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజినీర్ వేణుగోపాలరావు సుభాష్‌నగర్‌లోని అక్షయ రెసిడెన్సీలో నివాసముంటున్నారు. ఆయన ఊరికి వెళ్లగా గురువారం రాత్రి దొంగలు చొరబడి కిలో వెండి ఆభరణాలు దొంగిలించినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఘటనా స్థలాన్ని ఏసీపీ ప్రకాశ్ పరిశీలించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు చేతివాటం ప్రదర్శించారు. కామారెడ్డి, దోమకొండ, నిజామాబాద్‌లోని సుభాష్‌నగర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. -
హామీల అమలుపై ఎప్పుడైనా చర్చకు సిద్ధం
● రాష్ట్ర కో ఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి వేల్పూర్: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ఎప్పుడైనా, ఎలాంటి చర్చకై నా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వే ల్పూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యా లయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కాంగ్రెస్ హామీల అమలుపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు విసిరిన సవాళ్లను తాము స్వీకరిస్తున్నామని, చర్చించడానికి టైమ్ ఫిక్స్ చే యాలని సూచించారు. ప్రశాంత్‌రెడ్డి విసిరిన సవాళ్లకు బదులివ్వడానికి పీసీసీ అధ్యక్షుడి వరకు ఎందుకని, తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచి త కరెంటు, రైతులకు రూ.21 కోట్ల రుణమాఫీ, ఖరీఫ్‌లో గత రెండు సీజన్ల వారీగా బోనస్ ఇస్తున్న మా ట అవాస్తవమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు నిబ ద్ధత ఉంటే కేసీఆర్ ఇచ్చిన హామీలలో పదేళ్లలో డ బుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని, అప్పుడే రాజకీయ సన్యాసం తీసుకోవాలని పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇవ్వలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హామీలు అమలు చేయకపోవడంతోనే ప్రజలు పక్కన పెట్టారని అన్నారు. సమావేశంలో వేల్పూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, నాయకులు పన్నాల రాజేశ్వర్, రాజేందర్, గౌరాయి నరేందర్, దామోదర్‌గౌడ్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభకు పదును.. భవితకు దన్ను
మోపాల్(నిజామాబాద్‌రూరల్): చిన్నారులను సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలనే ఉద్ధేశంతోపా టు వారు ఆయా అంశాల్లో నైపుణ్యం సాధించేలా మహాత్మాజ్యోతీ బాపూలే బీసీ బాలుర గురుకుల సొసైటీ వేసవిలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. సొసైటీ కార్యదర్శి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సౌకర్యాలు కలిగిన పాఠశాలల్లో వేసవి శిబిరాలు నిర్వహించింది. నిజామాబాద్ జిల్లాలో ని మోపాల్ మండలం కంజర శివారులో ఉన్న మహాత్మాజ్యోతీ బాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఉమ్మడి నిజామాబాద్‌లోని 11, ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 13 పాఠశాలల నుంచి సుమారు 400 మంది విద్యార్థులకు 15 రోజులపాటు వేసవికాల శిబిరాన్ని ఏర్పాటుచేసింది. శిక్షణా శిబిరం శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని పాఠశాలలో ని ర్వహించగా, నిజామాబాద్ ఆర్సీవో సత్యనాథ్రె డ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేసవి సెల వుల్లో గ్రామాల్లో, ఇళ్లల్లో విద్యార్థులు చేయాల్సిన, చేయకూడని పనులను క్షుణ్ణంగా వివరించడంతోపాటు కీలక సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మురళీ, వైస్ ప్రిన్సిపాల్ సుదం, సిబ్బంది కత్తుల శంకర్, రాజేందర్, పీఈటీలు, పీడీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిక్షణనిచ్చిన అంశాలు విద్యార్థులకు 15 రోజులపాటు వేదిక్ మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లిష్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, కంప్యూటర్, కరాటే, డ్యాన్స్, హ్యాండ్ రైటింగ్, పేపర్ కటింగ్స్తోపాటు టేబుల్ టెన్నిస్, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, వివిధ క్రీడల్లో తర్ఫీదు ఇచ్చారు. ఇందుకోసం సుమారు 25 మంది వరకు నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించారు. ముగింపు సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. వేసవి శిక్షణాశిబిరంలో అనేక విషయాలు నేర్చుకున్నాను. స్పోకెన్ ఇంగ్లి ష్, వేదిక్ మ్యాథ్స్, కంప్యూటర్ వంటి వాటిపై చాలా అవగాహన వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని అంశాలపై శిక్షణనిచ్చారు. క్రీడల్లోనూ పాల్గొనడంతో శారీరకంగా ఉల్లాసంగా అనిపించింది. – దత్తాద్రి, ఏడోతరగతి, బీర్కూర్, కామారెడ్డి వేదిక్ మ్యాథ్స్ ద్వారా చాలా విషయాలు తె లిశాయి. గణితమంటే భయపడకుండా సులభపద్ధతిలో వేదిక్ మ్యా థ్స్లో మెలకువలు నేర్చుకున్నాను. దీంతోపాటు డ్యాన్స్, సంప్రదాయ నృత్యాలు నేర్చుకున్నాం. వివిధ జిల్లాల విద్యార్థులందరం ఒక దగ్గర శిక్షణ పొంది స్నేహితులుగా మా రడమే కాకుండా ఎన్నో అంశాలు నేర్చుకున్నాం. – సాయి భానుతేజ, ఏడోతరగతి, తాండూరు, ఆదిలాబాద్ విద్యార్థులకు చదువుతోపా టు క్రీడలు, ఇతర అన్నిరంగా ల్లో రాణించాలి. సెల్ఫోన్లు, టీవీలకు ఆకర్షితులై చదువు ను మర్చిపోతున్నారు. బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో యేటా వేసవిలో శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తోంది. శిబిరం విజయవంతంగా ముగిసేందుకు సహకరించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, పీఈటీలు, పీడీలకు ప్రత్యేక కృతజ్ఞతలు. – సత్యనాథ్‌రెడ్డి, ఆర్సీవో, ఉమ్మడి నిజామాబాద్ విద్యార్థులకు వివిధ అంశాలపై శిక్షణ మోపాల్ బీసీ బాలుర గురుకులంలో ముగిసిన వేసవి శిబిరం పాల్గొన్న ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల విద్యార్థులు -
రోడ్డు ప్రమాదంలో శిశువు మృతి
వర్ని: మోస్రా గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు నెలల శిశువు మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం రాత్రి మల్లారం గ్రామానికి చెందిన జర్పుల దశరథ్ భార్య నిరోషా, మూడు నెలల శిశువుతో నిజామాబాద్ నుంచి స్వగ్రామమైన మల్లారానికి కారులో వస్తోంది. మోస్రా శివారులో అడవి పందులు అడ్డం రావడంతో వాటిని తప్పించే ప్రయత్నంలో కారు పొలాల్లో దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ప్రమాదంలో మూడు నెలల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందగా, నిరోష తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భర్తను చంపిన భార్య ● హత్యకు సహకరించిన కొడుకు నందిపేట్(ఆర్మూర్): కట్టుకున్న భర్తను కొడుకు సహాయంతో హత్య చేసిన ఘటన నందిపేట మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆర్మూర్ రూరల్ సీఐ జానారెడ్డి, నందిపేట ఎస్సై శ్యామ్‌రాజ్ శుక్ర వారం తెలిపారు. నందిపేట మండలం మాయాపూర్ గ్రామానికి చెందిన పుంటికూర ముత్యం(44) ఈ నెల 6న మృతి చెందాడు. మద్యం మత్తులో మంచంపై నుంచి కిందపడి చనిపోయాడని మృతుడి భార్య లలిత చెప్పడంతో కుటుంబసభ్యులకు అనుమానం కలిగింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుని భార్య, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా తామే హత్య చేసినట్లు ఒప్పకున్నారు. ఆర్థిక ఇబ్బందులతోపాటు ముత్యంకు ఉన్న వివా హేతర సంబంధం కారణంగా ఇంట్లో తరుచూ గొ డవలు జగుతుండేవని మృతుడి భార్య లలిత తెలిపింది.ఎంత చెప్పినా అతనిలో మార్పు రాకపోవడంతో ఈ నెల 5న రాత్రి మద్యం తాగి ఇంట్లో ని ద్రిస్తున్న సమయంలో ముత్యం మెడకు చీర అంచుతో బిగించగా కొడుకు కాళ్లు కదలకుండా పట్టుకొని సహకరించాడని, దీంతో తన భర్త మృతి చెందాడని పోలీసుల విచారణలో నేరం ఒప్పుకుంది. శుక్రవారం నిందితులు లలిత, ఆమె కుమారుడిని కోర్టులో హాజరుపరచినట్లు సీఐ జానారెడ్డి వెల్లడించారు. -
ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాల పరిశీలన
తెయూ(డిచ్పల్లి): దోస్త్ ద్వారా డిగ్రీ కళాశాలల మొదటి విడత ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించారు. ఎన్సీసీ, స్పోర్ట్స్ విభాగాలలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ధ్రువపత్రాలను తెయూ అకడమిక్ ఆడిట్ సెల్ కార్యాలయంలో అడ్మిషన్స్ డైరెక్టర్, దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ నేతృత్వంలో సంబంధిత అధికారులు పరిశీలించారు. వర్సిటీ పరిధిలో ఎన్సీసీ కేటగిరీలో 20 మంది, స్పోర్ట్స్ కేటగిరీలో 14 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ రామస్వామి, తెయూ ఫిజికల్ డైరెక్టర్ బీఆర్ నేతతోపాటు సిబ్బంది నరేశ్, రవీందర్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ టు నిజామాబాద్
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్‌లలో ఢిల్లీ ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కొంతమంది పాత నేరస్తులతో కలిసి వరుస గొలుసు చోరీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ ముఠాలో ముంబైకి చెందిన పలువురు యువకులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైళ్ల ద్వారా జిల్లాకు వస్తున్న ముఠా సభ్యులు మొదట పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి బైక్ చోరీకి పాల్పడతారు. ఆ బైక్‌ల ద్వారానే గొలుసు చోరీలు చేస్తున్నారు. గతేడాది ఆగస్టు వరకు చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువగా నమోదు కాగా, పోలీసుల విస్తృత తనిఖీలతో తగ్గుముఖం పట్టాయి. బంగారం ధర విపరీతంగా పెరగడంతో ఢిల్లీ, మహారాష్ట్రకు చెందిన దొంగలు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మాటల్లో పెట్టి.. నగరంలోని గాయత్రీనగర్‌లో ఇటీవల ఉదయం 5 గంటలకు బైక్‌పై వచ్చిన దుండగులు మహిళ మెడలో నుంచి గొలుసు లాగేందుకు ప్రయత్నించారు. మహిళ ప్రతిఘటించడం, సమీపంలో ఉన్న కుక్క దుండగులపై దాడికి యత్నించడంతో సగం చైన్ మాత్రమే లాక్కెళ్లారు. అనంతరం మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బ ఏరియాలో మరో మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. అయితే, ఈ ఘటనలకు పాల్పడింది ఢిల్లీకి చెందిన దొంగలుగా పోలీసులు భావిస్తున్నారు. ఇందులో ఇద్దరు ముంబైకి చెందిన యువకులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీరు చోరీ చేసిన బైక్‌లపై వచ్చి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడతారు. అనంతరం బైక్‌లను వదిలేసి రైళ్లలో ముంబై, ఢిల్లీకి పారిపోతున్నారు. వీరు నిజామాబాద్‌తోపాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. గత డిసెంబర్ నెలలో కూడా మహారాష్ట్రకు చెందిన ముఠా వినాయకనగర్‌లోని ఓ మహిళను అడ్రస్ అడిగి రెండున్నర తులాల బంగారాన్ని లాక్కెళ్లరు. కసాబ్‌గల్లీలో మరో మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ చేశారు. ఆ తర్వాత నాలుగు రోజులకే సుభాష్‌నగర్‌లోని పూలు తెంపుతున్న వృద్ధురాలి మెడలోని రెండు తులాల బంగారు చైన్ లాక్కెళ్లారు. చైన్‌స్నాచింగ్‌ల వివరాలు సంవత్సరం చోరీలు ఛేదించినవి 2022 26 13 2023 40 18 2024 37 7 2025 17 13 2026 9 01మాక్లూర్: జిల్లా కేంద్రంలోని గూపన్‌పల్లికి చెందిన భోజమ్మ తన భర్తతో కలిసి శుక్రవారం బైక్‌పై తొర్లికొండలో జరిగిన శుభకార్యానికి వె ళ్లారు. సాయంత్రం 6 గంటల సమయంలో తిరి గి వస్తుండగా ఆలూర్ మండలం రాంచంద్రపల్లి కమాన్ వద్ద వెనకాలే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు భోజమ్మ మెడలోని తులంన్నర పుస్తెలతాడును అపహరించారు. బాధితురాలి ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. నగరంలో వరుస చైన్ స్నాచింగ్‌లు ఢిల్లీ ముఠా పనిగా పోలీసుల అనుమానం పాత నేరస్తులతో కలిసి చోరీలు ప్రత్యేక బృందాలతో గాలింపు చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఢిల్లీ ముఠాగా అనుమానం ఉంది. హైదరాబాద్‌లోని మేడ్చల్, పేట్ బషీర్‌బాగ్ ప్రాంతాల్లోనూ వీరు చోరికి పాల్పడ్డారు. అక్కడి పోలీసులతో కలిసి విచారణ చేస్తున్నం. అతి త్వరలోనే పట్టుకుంటాం. మహిళలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – ప్రకాశ్, ఏసీపీ నిజామాబాద్ డివిజన్ -
రైతులతో కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ● వడ్ల కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం ● కమ్మర్పల్లి, భీమ్‌గల్‌లో కొనుగోలు కేంద్రాల పరిశీలన కమ్మర్పల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కల్లాల్లోనే కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిందని, దీంతో రైతులు కన్నీరు పెడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కమ్మర్పల్లి మండలం బషీరాబాద్, భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్, చేంగల్ గ్రామా ల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. 125 లారీలకు సరిపడా ధాన్యం నిల్వ, కొనుగోళ్లు మాత్రం నత్తనడకన జరుగుతున్నాయన్నారు. వర్షాలు పడుతున్నప్పటికీ ప్రభుత్వం లారీలు, హమాలీలు, టార్పాలిన్ల వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మిల్లర్ల ‘తరుగు’ దోపిడీపై ఆగ్రహం ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కిలోల బస్తా తీ సుకోవాల్సి ఉండగా, రైస్‌మిల్లర్లు 43 నుంచి 44 కి లోల వరకు అడుగుతున్నారని రైతులు తన దృష్టికి తీసుకువచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. క్వింటాల్‌కు సుమారు 10 కిలోల వరకు ‘తరుగు’ పేరుతో ధా న్యం దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నేరుగా కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఫోన్ ద్వారా వివరించారు. వెంటనే డీఎం, డీసీవో, డీఎస్వో అధికారులు, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. క్షేత్రస్థాయి పరిస్థితులు వేరు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని, ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉందని, సీఎం వెంటనే ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ‘తమ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజూ కొనుగోళ్లపై సమీక్ష ఉండేది. ఇప్పుడు మాత్రం రైతులను పూర్తిగా గాలికొదిలేశారు’ అని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ‘తాలు తీస్తే తోలు తీస్తా’ అన్న సీఎం.. ఇప్పుడు రైతుల వద్ద నుంచి 10 కిలోల తరుగు తీస్తున్నా మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు తన వంతు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రేగుంట దేవేందర్, నాయకులు బద్దం చిన్నారెడ్డి, బైకానీ మహేశ్, భూమేశ్వర్ తదితరులు ఉన్నారు. -
స్నేహితుడి వివాహానికి వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిఎల్లారెడ్డిరూరల్: స్నేహితుడి వివాహానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి శివారులో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్ గ్రామానికి చెందిన దండు నాగరాజు (25) హైదరాబాద్‌లో క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నస్రుల్లాబాద్‌లో స్నేహితుడి వివాహం ఉండడంతో గురువారం హైదరాబాద్ నుంచి కారులో బయల్దేరాడు. తిమ్మారెడ్డి గ్రామశివారులో ఎల్లారెడ్డి–బాన్సువాడ ప్రధాన రహదారిపై ఉన్న చెట్టును కారు బలంగా ఢీకొనడంతో ఘటన స్థలంలోనే నాగరాజు మృతి చెందాడు. మృతుడికి ఆరు నెలల క్రితం వివాహమైంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం కృషి
నిజామాబాద్ అర్బన్: యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. టాస్క్ సౌజన్యంతో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్స్‌లో జాబ్‌మేళా నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జాబ్‌మేళాను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని అన్నారు. అందులో భాగంగా స్కిల్ యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. నిజామాబాద్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉద్యోగాలు సాధించిన యువత భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కాగా, జాబ్‌మేళాకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 71 కంపెనీల ద్వారా సుమారు 2000 మందికి ఉద్యోగాలు వచ్చినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అంతకు ముందు ఉద్యోగాలకు ఎంపికై న వారికి కలెక్టర్, ఎమ్మెల్యే నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీవైఎస్వో పవన్ కుమార్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సురేశ్ కుమార్, ఎన్ఐసీ అధికారి మధు, ఈ–డీఎం కార్తిక్, వంశీధర్ రెడ్డి, టాస్క్ అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. యువతికి జాబ్ ఆఫర్ లెటర్ అందజేస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి జాబ్‌మేళాను ప్రారంభిస్తున్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి,తాహెర్ తదితరులు అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి పిలుపు మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన -
అనాథలకు పెద్ద దిక్కు.. ఇందూరు యువత
● నగరంలో నిత్యాన్నదానం ● గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ ● మతిస్థిమితం లేనివారికి సపర్యలునిజామాబాద్ రూరల్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు, అన్నదమ్ములనే కొందరు పట్టించుకోవడం లేదు. అలాంటి సమాజంలో విధి వంచితులను అక్కున చేర్చుకుంటూ ఆకలిదప్పికలను తీరుస్తోందీ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సమితి. గతం మరిచి, పెరిగిన జుట్టు, గడ్డం, మసిబరిన బట్టలతో మండుటెండల్లో రోడ్లపై నిస్సహాయ స్థితిలో ఉన్న అనామకులను చేరదీస్తోంది. సపర్యలు చేస్తూ మానవత్వానికి ప్రతిరూపంగా నిలుస్తోంది. నలుగురితో మొదలై.. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థను 2011లో జిల్లాలోని ధర్మారం(బీ) గ్రామానికి చెందిన మద్దుకూరి సాయిబాబు ప్రారంభించారు. మొదటగా నలుగురితో ప్రారంభమైన సంస్థలో ప్రస్తుతం 100 మంది వరకు సేవలందిస్తున్నారు. జిల్లాలోని 10 మండలాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు జిల్లా కేంద్రంలో 100 మందికి అన్నదాన కార్యక్రమం చేపడుతోంది. మతిస్థితిమితం లేని వారిని అక్కున చేర్చుకొని శుభ్రపరిచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల సహకారంతో సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుంది. ఇదే కాకుండా హిందూ సంప్రదాయం ప్రకారం అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి, వారి అస్తికలను కాశీలోని గంగలో కలుపుతున్నారు. శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేస్తున్నారు. మానవ సేవే.. మాధవ సేవా అనుకుంటూ ఇందూరు యువ త స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వ ర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. విధివంచితుల వివరాలు తెలిసిన వెంటనే స్పందిస్తాను. సమాజ సేవ కోసమే జీవితాన్ని అంకితం చేస్తూ పెళ్లి కూడా చేసుకోదలుచుకోనలేదు. – ఎం సాయిబాబు, ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు -
పెళ్లి సంబంధాలు కుదరడం లేదని..
● ఉరేసుకొని యువతి ఆత్మహత్య మాక్లూర్: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలూర్ మండలం కల్లెడి గ్రామంలో చోటు చేసుకుంది. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్, గ్రామస్తుల కథనం ప్రకారం.. కల్లెడికి చెందిన కునాల హన్మాండ్లుకు ఇద్దరు కుమార్తె, ఒక కుమారుడు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, రెండో కుమార్తె శివాని(31) టీటీసీ పూర్తి చేసింది. గతంలో శివానీకి పెళ్లి సంబంధం కుదిరి ఏర్పాట్లు జరుగుతుండగానే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. అప్పటి నుంచి శివానికి పెళ్లి సంబంధాలు రావటం లేదు. వచ్చినా విషయం తెలిసి పెళ్లి చేసుకునేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో శివాని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి భోజన అనంతరం గదిలోకి వెళ్లిన శివాని గురువారం ఉదయం 10 గంటలు దాటినా బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి తలుపుతట్టాడు. ఉలుకుపలుకు లేకపోవటంతో గోడ దూకి చూడగా శివాని ఉరేసుకొని మృతి చెందింది. తండ్రి హన్మాండ్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. -
బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు
ఇందల్వాయి: మండలంలోని మేఘ్యనాయక్ తండాలో గురువారం రెండు బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు తహసీల్దార్ బాలయ్య తెలిపారు. పెళ్లి నిలిపివేసి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లలోపు అమ్మా యిలకు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఎంపీడీవో అనంత్ రావు, సర్పంచ్ బంతిలాల్ నాయక్, ఎస్సై సందీప్, ఐసీడీఎస్ సూపర్వైజర్ శోభ తదితర సిబ్బంది ఉన్నారు. నిజామాబాద్ రూరల్: మండలంలోని మల్లారం మేఘన డెంటల్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక చెక్‌పోస్టును ఏసీపీ ప్రకాశ్ యాదవ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల ధృవపత్రాలను పరిశీలించాలని రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్, పోలీస్ సిబ్బందికి సూచించారు. ఫ్లెక్సీల తొలగింపు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సీపీ ఆదేశాల మేరకు రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది తొలగించారు. వాహనదారులకు, రోడ్డుకు అడ్డంగా ఉండి ఇబ్బందికరంగా ఉన్న ఫ్లెక్సీలను తీసివేశారు. నిజామాబాద్ రూరల్: బీడీ పరిశ్రమలోని వివిధ కేటగిరీలకు చెందిన కార్మికుల నూతన వేతన ఒప్పందంపై నిర్వహించిన చర్చలు సఫలమైనట్లు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ తెలిపారు.హైదరాబాద్‌లోని స్వాగత్ గ్రాండ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో బీడీ పరిశ్రమ యా జమాన్యాలకు, బీడీ కార్మిక సంఘాలకు మధ్య గురువారం చర్చలు జరిగాయి. బీడీ ప్యాకర్లకు రూ.4,500, ఇతర నెలసరి వేతన ఉద్యోగులకు రూ.2,200, బీడీ కార్మికులకు వెయ్యి బీడీలకు రూ.6 పెంపుదలకు యాజమాన్యాలు ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చర్చల్లో బీడీ యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు హితేంద్రకుమార్, ధర్మేంద్రగాంధీ, కార్మిక సంఘాల ప్రతినిధులు మామిడ్యాల వెంకటి, రాజేశ్వర్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నిజామాబాద్ రూరల్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని వివిధ రంగాల్లో ప్రతిభచాటిన, సేవలందించిన వారిని సత్కరించనున్నట్లు హైదరాబాద్‌కు చెందిన ‘ఆల్ దిబెస్ట్ ఆర్ట్స్ అకాడమీ’ అధ్యక్షుడు ఈఎస్ఎస్ నారాయణ మాస్టారు ఒక ప్రకటనలో తెలిపారు. కవులు, రచయిత లు, సంగీత, నృత్య, కళాకారుల, ఉపాధ్యాయు ల, విద్యావంతులు, వైద్యుల, సమాజ సేవకులు తదితర రంగాల్లోని ప్రతిభావంతులు ఫొటోలు, పత్రికల క్లిప్పింగ్స్ జిరాక్స్ కాపీలతో ఈనెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 9652347207 నెంబర్లో సంప్రదించాలని కోరారు. -
నగరంలో న్యాయవాదుల నిరసన
నిజామాబాద్ లీగల్: నగరంలోని జిల్లా కోర్టు ఎదుట గురువారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టు జస్టిస్ రాజశేఖర్ రావు ఒక యువ న్యాయవాదిని జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వడం న్యాయవాదులకు అవమానకరమని అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నీలకంఠరావు, సుభాష్‌రెడ్డి, సీనియర్ న్యా యవాదులు గణపతి, రాజేందర్ రెడ్డి, భాస్కర్, విఘ్నేష్, రాజు, నరేందర్ రెడ్డి, భాగీచరణ్, రవీందర్, అన్సారీ, జగన్మోహన్ గౌడ్ పాల్గొన్నారు. -
‘ఎస్ఐఆర్ మ్యాపింగ్’ పక్కగా నిర్వహించాలి
● నిర్లక్ష్యం వహిస్తే సిబ్బంది వేతనాలు నిలిపేస్తాం ● కలెక్టర్ ఇలా త్రిపాఠిసుభాష్నగర్ : ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) సన్నాహక ప్రక్రియ ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఈ ప్ర క్రియ పట్ల నిర్లక్ష్యం వహిస్తే వేతనాలు నిలిపేస్తా మని హెచ్చరించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ అమలు తీరుపై కలెక్టర్ గురువారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో ఏఈఆర్వోలు, బీఎల్వో సూపర్వైజర్లతో సమీక్షించారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీ గా ఎస్ఐఆర్ మ్యాపింగ్ అమలును పరిశీలిస్తూ, పనితీరులో వెనుకంజలో ఉన్న ఏఈఆర్వోలు, బీఎల్వో సూపర్వైజర్లను కారణాలు అడిగి తెలుసుకున్నారు. అర్బన్‌లో మ్యాపింగ్ ప్రక్రియ మందకొడిగా సాగడం వల్ల జిల్లా సగటుపై ప్రభావం చూపుతోందని కలెక్టర్ అన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా బీఎల్వోలతో మ్యాపింగ్‌ను పక్కాగా జరిపించాలని, రోజువారీగా నిశితంగా పర్యవేక్షించా లని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనితీరు సక్రమంగా లేని ఇద్దరు ఆర్పీలకు షోకాజ్ నోటీసులు అందించి విధుల నుంచి తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తన అనుమతి లేకుండా బీఎల్వోల మార్పులు, చేర్పులు చేయకూడదని సూచించారు. ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక సమగ్ర సవరణను ఎన్నికల సంఘం చేపట్టిందన్నారు. రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకునేలా చూడాలని, మ్యాపింగ్ ప్రక్రియ పురోగతి కోసం వారి సహకారం తీసుకోవాలని సూచించారు. డూప్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిపోయిన, రెండు ఓట్లు ఉన్నవాళ్ల ఓట్లు మాత్రమే తొలగిస్తారని పేర్కొన్నారు. ఎవరూ అపోహలకు గురి కావద్దని కలెక్టర్ సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ తరువాత ఎవరైనా ఓటుహక్కు రాని వారు ఉంటే ఆక్షేపణ చేయవచ్చని అన్నారు. సమీక్షలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్, నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ శ్రీధర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
పాఠశాలలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ అర్బన్ : వచ్చే విద్య సంవత్సరం నుంచి వీలైనంత ఎక్కువ పాఠశాలలను తనిఖీ చేసే విధంగా ప్రణాళిక చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. గురువారం తన చాంబర్లో ఈ విద్యా సంవత్సరానికి గాను ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల తనిఖీ బృందాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను 10 బృందాల సభ్యులు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలన్నారు. ఈ తనిఖీలు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుండే చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల పనితీరుపై తనిఖీ బృంద సభ్యులతో వివిధ అంశాలపై సమీక్షించారు. సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, తనిఖీ బృందాల నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. బ్యాంకు లింకేజీలోనూ రాష్ట్రంలో మొదటి స్థానం డొంకేశ్వర్(ఆర్మూర్) : ఇటీవల సీ్త్ర నిధి రుణా ల పంపిణీలో స్టేట్ ఫస్ట్ అవార్డు అందుకున్న నిజామాబాద్ జిల్లా, తాజాగా బ్యాంకు లింకే జీ రుణాల్లో కూడా ముందు వరుసలో నిలిచింది. 2025–26 సంవత్సరంలో రూ. 1,228 కోట్లకు గాను లక్ష్యానికి మించి రూ. 1,260 కోట్ల రుణాలను 16 వేల మహిళ సంఘాలకు అందజేశారు. ఇది స్టేట్‌లోనే హై యెస్ట్ కాగా, గురువారం హైదరాబాద్‌లో మంత్రి సీతక్క , సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ల చేతుల మీదుగా డీఆర్డీవో సాయన్న అ వార్డు అందుకున్నారు. ఏపీడీ మధుసూదన్, డీపీఏం సంధ్యారాణి పాల్గొన్నారు. ఫాగింగ్ మిస్ట్ యంత్రాలు ప్రారంభించిన సీపీ నిజామాబాద్ అర్బన్ : వేసవికాలంలో తీవ్ర ఎండల ప్రభావంతో ట్రాఫిక్ సిబ్బంది ఇ బ్బందులు పడకుండా ఉండేందుకు ట్రాఫిక్ ఐలాండ్ వద్ద ఫాగింగ్ మిస్ట్ యంత్రాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం ప్రారంభించారు. నగరంలోని ప్రధాన కూ డళ్ల వద్ద ఈ యంత్రాలను ఏర్పాటు చేశారు. కోర్టు సర్కిల్ వద్ద సీపీ యంత్రాలను ప్రారంభించారు. సీపీ మాట్లాడుతూ ఈ యంత్రా లను ఏర్పాటు చేస్తే మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు అని తెలిపారు. వేసవి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందన్నారు. ఈ యంత్రాలను ఏర్పాటు చేయడానికి సహకరించిన వాసవి క్లబ్ వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సీఐ , సిబ్బంది పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
కరెంట్ షాక్‌తో ఒకరి మృతి వర్ని: మండలంలోని చలకతండాలో గురువారం విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. కేతావత్ కిశోర్ (29) సౌండ్ బాక్స్ మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడన్నారు. మృతుడి అన్న గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. డివైడర్‌ను ఢీకొన్న బైక్ ● ముగ్గురికి గాయాలుమద్నూర్(జుక్కల్): బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ముగ్గురికి గాయాలైన ఘటన మండల కేంద్రానికి సమీపంలోని 161 జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. స్థానికుల, అంబులెన్స్ టెక్నిషియన్ సంజయ్ కథనం ప్రకారం.. డోంగ్లీకి చెందిన తుకారాం, అతడి అక్క పూజ, ఇద్దరు పిల్లలు ఆరాధ్య, సువాన్షు గురువారం మధ్యాహ్నం మద్నూర్ నుంచి మేనూర్ వైపు బైక్‌పై వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొన్నారు. ప్రమాదంలో తుకారాం, పూజలకు స్వల్పగాయాలు కాగా ఆరాధ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, ఆరాధ్యను దేగ్లూర్ ఆస్పత్రికి తరలించారు. ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. గురువారం ఆరుగురిని ఆర్మూర్ కోర్టులో పోలీసులు హాజరుపర్చగా, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. -
నియామకపత్రాల అందజేత
నిజామాబాద్ రూరల్: రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్‌గా బాడ్సి శేఖర్‌గౌడ్, గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ సభ్యుడిగా వేణుగోపాల్ యాదవ్ నియామకపత్రాలు అందుకున్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఇద్దరికీ గురువారం నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్‌గౌడ్, వేణుగోపాల్ యాదవ్ కృతజ్ఞతలు తెలుపుతూ మహేశ్‌కుమార్ గౌడ్‌ను సన్మానించారు. శేఖర్‌గౌడ్, వేణుగోపాల్‌యాదవ్‌కు నియామకపత్రం అందజేస్తున్న పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ -
ప్రకృతి విపత్తులపై అవగాహనకు మాక్‌డ్రిల్
నిజామాబాద్ అర్బన్: ప్రకృతి విపత్తులు, వరదలు సంభవించిన సమయాలలో చేపట్టాల్సిన తక్షణ చర్యలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 18న జిల్లాస్థాయిలో మాక్ ఎక్సర్సైజ్ను పకడ్బందీగా నిర్వహించాలని ఉన్నతాధికారులు సూచించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మాక్‌డ్రిల్ నిర్వహణకు నిర్ణీత ప్రణాళిక, ఆయా శాఖల బాధ్యతలు, అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే చేపట్టాల్సిన తక్షణ చర్యలు, సమన్వయం, సమాచార వ్యవస్థ, అత్యవసర సేవల నిర్వహణ వంటి అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మాక్ డ్రిల్‌ను ఈ నెల 18న నిర్వహించాలని సూ చించారు. కాగా, మాక్ఎక్సర్ౖ సెజ్‌ను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తామని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. వీసీలో ఆర్డీవో రాజేంద్రకుమా ర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పేదలకు మేలు.. రైతులకు దన్ను
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : వ్యవసాయ జిల్లాగా పేరున్న నిజామాబాద్‌లో పంటల మార్పిడికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం దక్కే అవకాశాలు నెలకొంటున్నాయి. జూన్ 2 నుంచి రాష్ట్రంలోని రేషన్ దుకాణాల ద్వారా జొన్న, మొక్కజొన్నలను తక్కువ ధరకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తద్వారా పేదలకు తక్కువ ధరకే పౌష్టికాహారం, రైతులకు దళారుల సమస్య లేకుండా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో జిల్లాలోని జొన్న, మొక్కజొన్న రైతులకు ఉపయోగం కానుంది. ఽఇప్పటివరకు ధాన్యం మాదిరిగా పూర్తిస్థాయిలో మొక్కజొన్న, జొన్నలను కొనుగోలు చేయకపోతుండడంతో దళారులు, మధ్యవర్తులే ఎక్కువగా లాభపడుతున్నారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మేలు కలుగుతుండడంతో పాటు పంటల మార్పిడికి మార్గం సుగమమవుతుంది. ఈ పంటలను ప్రభుత్వమే పూర్తిగా సేకరించడంతో రైతులకు మద్దతు దక్కడంతో పాటు, మరోవైపు రేషన్ డీలర్లకు సైతం ఉపయోగం కలుగనుంది. కేవలం బియ్యం నుంచి వచ్చే కమీషన్‌తో మాత్రమే డీలర్లు సరిపెట్టుకుంటున్నారు. నిత్యావసరాల సంఖ్య పెంచితే డీలర్లకు సైతం కమీషన్ పెరగనుంది. మంత్రివర్గ ఉప సంఘం ఇటీవల తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ● జిల్లాలో రైతులు వానాకాలం, యాసంగి సీజన్లలో వరి తర్వాత జొన్నలు, మక్క పంటలనే అధికంగా సాగు చేస్తున్నారు. ప్రతి సీజన్లో 40 వేల ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగవుతుండగా, ఎకరానికి 35 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. అలాగే జొన్నల సాగు కూడా క్రమంగా పెరుగుతుండగా ఎకరానికి 15 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఈ పంటలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో సేకరించడం లేదు. దీంతో కొందరు రైతులు మాత్రమే మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. మిగిలిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దళారుల ప్రమేయానికి చెక్ పెట్టి మొత్తం పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు తక్కువ ధరకు అందించాలని నిర్ణయించింది. విద్యార్థులకు సైతం బలవర్ధకమైన ఆహారం అదించేందుకు జొన్న, మక్కలను ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు, గురుకులాలకు సరఫరా చేయాలని ఆలోచన చేస్తోంది. పౌల్ట్రీ రైతులకు కూడా మార్కెట్ ధర కంటే తక్కువకు సరఫరా చేసేందుకు ఆలోచన చేస్తోంది. ఈ ప్రక్రియ అమలైతే జిల్లాలోని జొన్న, మొక్కజొన్న రైతులకు మరింత మేలు జరుగుతుంది. పంటలను అమ్ముకునేందుకు ఇబ్బందులు తప్పుతాయి. నేరుగా రైతులకే మద్ధతు ధర లభిస్తుంది. తద్వారా జిల్లాలో ఈ రెండు పంటలను సాగు చేయడానికి మరింత మంది రైతులు ముందుకు వచ్చేందుకు అవకాశముంది. రేషన్ దుకాణాల ద్వారా జొన్నలు, మొక్కజొన్నలు సరఫరా చేస్తే రైతులకు, పేదలకు, విద్యార్థులకు, రేషన్ డీలర్లకు సైతం మే లు కలుగుతుంది. మధ్య దళారులు లేకుండా చేయవచ్చు. ఇదే రీతిలో రా నున్న రోజుల్లో మరిన్ని నిత్యావసర వస్తువులను రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందించేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నాం. – గడుగు గంగాధర్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు జూన్ 2 నుంచి రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకు జొన్న, మొక్కజొన్న సరఫరా! వ్యవసాయ జిల్లా కావడంతో పంటల మార్పిడికి మరింత ప్రోత్సాహం -
జిల్లాలో గాలివానకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆరబోసిన పంటలను కాపాడుకోడానికి పరుగులు తీశారు. గాలి తీవ్రతకు ధాన్యంపై కప్పిన టార్పలిన్లు ఎగిరిపోయాయి. వర్షం నీరు చేరి కల్లాలు చెరువులను తలపించాయి. కొనుగోళ్లు వేగవంతంగా జరగకపోవడంతో కల్లాల్లోనే పంట నిల్వ ఉంద
● ఎగిరిపోయిన టర్పాలిన్లు, కల్లాల్లోకి చేరిన నీరు ● తడిసి ముద్దయిన ఆరబోసిన ధాన్యం, తూకం వేసిన బస్తాలు ● దిక్కుతోచని స్థితిలో రైతాంగంమోర్తాడ్ మండలం గాండ్లపేట్‌లో తడిసిన ధాన్యాన్ని దిగాలుగా చూస్తున్న రైతుతడిసిన ధాన్యం, పసుపు కొమ్ములుధాన్యం కుప్పల వద్ద నీటిని తొలగిస్తున్న రైతుగాలివాన బీభత్సండొంకేశ్వర్(ఆర్మూర్) : అకాల వర్షంతో జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం సాయంత్రం మేఘావృతమై గాలివాన బీభత్సం సృష్టించింది. కల్లాల్లో పంట కుప్పలపై కప్పి ఉంచిన టర్పాలిన్లు సైతం బల మైన గాలులకు ఎగిరిపోయాయి. ఆరబోసిన పంటలను కాపాడుకోడానికి రైతులు పరుగులు తీశారు. ఇటు భారీ వర్షానికి కల్లాల్లోకి నీరు చేరి చెరువులను తలపించాయి. టర్పాలిన్లు లేని రైతులు కళ్ల ముందే ధాన్యం తడిసి కొట్టుకుపోతుంటే ఏమి చేయలేక నిస్సాహాయ స్థితిలో ఉండిపోయారు. తూకం వేసి రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన వడ్ల బస్తాలు సైతం తడవడంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. డొంకేశ్వర్ మండలంలో 2 సెంటీ మీర్లకు పైగా వర్షం కుసింది. అత్యధికంగా భీమ్‌గల్‌లో నాలుగు సెంటీ మీటర్లు, కమ్మర్‌పల్లిలో మూడు, డిచ్‌పల్లిలో రెండు సెంటీ మీటర్లు నమోదైంది. ఆలూరు, బాల్కొండ, మెండోరా, ముప్కాల్, ఏర్గట్ల, మోర్తాడ్, సిరికొండ, చందూర్, వర్ని, ఎడపల్లి, నవీపేట్ మండలాల్లో కూడా ఈదురు గాలివానకు పంటలు తడిశాయి. కోతకు వచ్చిన మామిడి కూడా నేలరాలింది. కల్లాల నుంచి ధాన్యం కదలకపోవడంతో.. కోసిన పంటంతా ప్రస్తుతం కల్లాల్లోనే ఉంది. కొనుగోళ్లు వేగవంతంగా జరగకపోవడంతో కల్లాలు ఖాళీ కావడం లేదు. లారీల కొరత కూడా ప్రధాన కారణం. దీంతో కురిసిన అకాల వర్షానికి పెద్ద మొత్తంలో పంట తడిసిపోయింది. దీంతో రైతులు మళ్లీ ధాన్యం ఆరబోసేందుకు శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ధాన్యం రంగు మారుతుందని ఆందోళన చెందుతున్నారు. మక్క కొనుగోళ్లు కూడా నెమ్మదిగా జరగడంతో పంటను కాపాడుకోవడానికి రైతులు తంటాలు పడుతున్నారు. వడ్లు తడిసి కొట్టుకుపోవడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని, ఎలాంటి మెలిక లేకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.వర్షానికి తడిసిన వడ్ల బస్తాలు -
మోదీ సభను విజయవంతం చేయాలి
● తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే అభివృద్ధి సాధ్యం ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి సుభాష్‌నగర్: ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్నారని, ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే మోదీ బహిరంగ సభకు జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి కోరారు. ఈమేరకు గురువారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి తరహాలోనే తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నప్పుడే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటికి రూ.2.20 లక్షలు అందిస్తోందని తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నేరుగా సర్పంచుల ఖాతాల్లో జమ చేస్తున్నా.. రాష్ట్రం తన ఖజానా ఖాళీ కావడంతో అక్రమంగా ఫ్రీజ్ చేసి నిధులు మళ్లిస్తోందని ఆరోపించారు. చారిత్రాత్మక మోదీ బహిరంగ సభకు జిల్లా నుంచి ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆధ్వర్యంలో సుమారు 15 వేల మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివెళ్లనున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, ప్రమోద్‌కుమార్, నాయిడి రాజన్న, బద్దం కిషన్, పుట్ట వీరేందర్, బిలోజీ నాయక్, అనంత్‌రెడ్డి, పడాల భూపతి, ఇప్పకాయల కిశోర్, యాదాల నరేశ్, ఆమంద్ విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రైతాంగానికి ఎన్పీడీసీఎల్ పెద్దపీట
● అన్నదాతలకు సబ్సిడీపై సౌర విద్యుత్ ● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావుమోపాల్ : జిల్లాలోని రైతాంగానికి ఎన్పీడీసీఎల్ పె ద్దపీట వేస్తోందని, వివిధ కార్యక్రమాలతో మరింత చేరువ కావడంతోపాటు రైతు వారోత్సవాల్లో సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నామని నిజామాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) పీవీ రాజేశ్వర్‌రావు పేర్కొన్నా రు. విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన – ప్రగ తి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ రైతు వారోత్సవాల్లో భాగంగా గురువారం వ్యవసాయ క్షేత్రాలు – సౌర విద్యుత్ కేంద్రాలు (పీఎం కుసుమ్) అనే అంశంపై మోపాల్ రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎన్పీడీసీఎల్ అందిస్తున్న గృహజ్యోతి, పొలంబాట/ప్రజాబాట, విద్యు త్ భద్రతల గురించి దృశ్య రూపకంగా రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. పీవీ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నామని, రైతులకు ఆర్థికభారం తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్నామని తెలిపారు. 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక శ క్తి జోడించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, సౌర, ప వన, జల, భూఉష్ణ, బయోమాస్, గ్రీన్ హైడ్రోజన్ ప్ర గతిలో తెలంగాణ సత్తా చాటాలని లక్ష్యమన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్ టాప్‌ను ప్రోత్సహిస్తున్నామని ఎస్ఈ తెలిపారు. పీ ఎం కుసుమ్–ఏ పథకం కింద రైతులు తమ వ్యవసాయ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా మిగిలిన విద్యుత్‌ను డిస్కంకు వి క్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. పీఎం కుసుమ్–సీ పథకం కింద 7.5 కి లోవాట్ల సోలార్ ద్వారా నడిచే పంపు సెట్‌ను లైవ్ డెమో ద్వారా రైతులకు వివరించారు. ఈ పంపుసె ట్ వల్ల వాడనప్పుడు అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. రైతులు రాయితీలతో కూడి న సోలార్ పథకాలను సద్వినియోగం చేసుకోవాల ని సూచించారు. విద్యుత్ భద్రత వారోత్సవాలు విజయవంతం.. జిల్లాలో మే 1 నుంచి 7 వరకు వారం రోజులపాటు సర్కిల్ పరిధిలో నిర్వహించిన విద్యుత్ భద్రత వా రోత్సవాలు విజయవంతమైనట్లు ఎస్ఈ పీవీ రాజేశ్వర్‌రావు తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు జీరోస్థా యికి తీసుకురావడమే ప్రధాన లక్ష్యమన్నారు. వి ద్యుత్ వినియోగంలో నిర్లక్ష్యం, అజాగ్రత్త, అలస త్వం కారణంగా అనేక ప్రమాదాలు సంభవిస్తున్నా యని, స్వీయ నియంత్రణ ముఖ్యమని పేర్కొన్నా రు. నిర్లక్ష్యంగా విద్యుత్ పరికరాల వినియోగం, పాడైన నాసిరకం, అతుకుల వైర్ల వినియోగం, ఎ ర్తింగ్ లేకపోవడం, తడిసిన చేతులతో విద్యుత్ పరికరాలు ముట్టుకోవడంతో ప్రమాదాలు జరుగుతాయ ని చెప్పారు. కార్యక్రమంలో డీఈ హరిచంద్ నాయ క్, ఏడీఈ బాలేష్కుమార్, ఇన్చార్జి ఏవో హీరా జా దవ్, సర్పంచ్ ద్యాప రవికుమార్, ఏఈవోలు శరత్, రంజిత్, భావన, ఎన్పీడీసీఎల్ ఏఈలు, లైన్ ఇన్ స్పెక్టర్లు, లైన్మెన్లు, రైతులు పాల్గొన్నారు. -
రైతు డిక్లరేషన్ హామీలన్నీ అమలు చేస్తున్నాం
నందిపేట్ (ఆర్మూర్): ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేష్ రెడ్డి అన్నారు. నందిపేట మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియను తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా జరుగుతోందని రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం నగేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం పరితపిస్తుందన్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ, రైతు భరోసాతోపాటు మరెన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు డిక్లరేషన్ హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, గత ప్రభుత్వ పాలనలో హామీలు తప్ప పేదలకు ఇళ్ల నిర్మాణాలు జరగలేదన్నారు. ఆయన వెంట ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి, సర్పంచ్ సిలిండర్ లింగం, సొసైటీ చైర్మన్ మీసాల సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంద మహిపాల్ తదితరులు ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి -
ఆలూర్‌లో లారీ బీభత్సం
● విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను ఢీకొన్న లారీ ఆర్మూర్‌టౌన్: ఆలూర్ మండల కేంద్ర సమీపంలో లారీ విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను ఢీకొని బీభత్సం సృష్టించింది. నల్లమట్టిని తీసుకువచ్చేందుకు ఆలూర్ నుంచి వెల్మల్ మీదుగా నందిపేట్ వైపు వెళ్తున్న లారీ అతివేగంతో నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. అడ్డం వచ్చిన చెట్లు, ఆరు విద్యుత్ స్తంభాలు, రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఢీకొట్టింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. లారీ డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఘటన సమయంలో పొలాల్లో రైతులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. కాగా, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు పూర్తిగా ధ్వంసం కావడంతో సమీపంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏడీఈ కృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించి మరమ్మతులు చేస్తామని తెలిపారు. -
42 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
రుద్రూర్: మండల కేంద్రంలోని జవహర్‌నగర్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సి విల్ సప్లయ్ అధికారులు గురువారం స్వాధీనం చే సుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో అధికారులు శర్ఫుద్దీన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.42 క్వింటాళ్ల రేషన్‌బి య్యాన్ని స్వాధీనం చేసుకొని,కేసు నమోదు చేశారు. లింగంపేట(ఎల్లారెడ్డి):మండలంలోని సజ్జన్పల్లి చౌ రస్తా వద్ద గురువారం ధాన్యం బస్తాల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడినట్లు రైతులు తెలిపారు. శెట్పల్లిసంగారెడ్డి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధా న్యం బస్తాలు లోడ్ చేసుకొని కామారెడ్డికి వెళ్తుండగా మార్గమధ్యంలో సజ్జన్పల్లి చౌరస్తా వద్ద లారీ బో ల్తాపడింది. ఘటనలో డ్రైవర్‌తోపాటు ఎవరికి గా యాలు కాలేదని తెలిపారు. ధాన్యం బస్తాలను మ రో లారీలో లోడ్ చేసి పంపినట్లు రైతులు తెలిపారు. ● ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు దోమకొండ: ఆస్తి వివాదాల నేపథ్యంలో అత్తను ఇద్దరు కోడళ్లు హత్య చేసేందుకు యత్నించిన ఘటన దోమకొండ మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కట్ట లక్ష్మిపై ఆమె కోడళ్లు కట్ట లహరిక, కట్ట పవిత్ర బుధవారం రాత్రి దాడి చేశారు. చీర పల్లుతో మెడబిగించి హత్యకు యత్నించగా, లక్ష్మి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కాపాడారు. బాధితురాలు గురువారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్సై తెలిపారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, వారు నేరాన్ని ఒప్పుకున్నారని పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై వివరించారు. -
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల బీట్ బజార్ వద్ద గంటపాటు కురిసిన భారీ వర్షంతో మక్కలు పూర్తిగా తడిసిముద్దయ్యాయి. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. 20 రోజుల క్రితం తీసుకొచ్చిన మొక్కలు ఇప్పటికీ కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై రైతులు మండిపడ్డారు. జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. ఆందోళనతో భారీగా స్తంభించింది ట్రాఫిక్. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు, జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది.నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. బాల్కొండ, మోర్తాడ్, ఏర్గట్ల, వేల్పూరు, ఆర్మూర్,ధర్పల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోరుట్ల నియోజకవర్గంతో పాటు కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. మెట్ పల్లి మార్కెట్ యార్డులో భారీ వర్షంతో మొక్కజొన్న, ధాన్యం తడిచింది. పలు గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం, మొక్కజొన్నలోకి నీరు చేరింది. పలు ప్రాంతాల్లో మామిడి నేలరాలింది.కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి శివారులో భారీ ఈదురు గాలులతో వెంకటేశ్వర రైసు మిల్ యంత్ర భాగాలు కూలడంతో భారీ నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాలలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. భైంసా మండలం మాటేగాం గ్రామం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. మొక్కజొన్న కొనుగోలులో జాప్యంతో అకాల వర్షం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని నిరసన తెలిపారు.కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని కంచుమహల్, కొండాపూర్, ముంబాజీపేట్, భవానీపేట్, జల్దిపల్లి, రాంపూర్ భారీ వర్షం కురిసింది. గ్రామాలలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో.. ఆరబోసిన ధాన్యం నీటిలో తడిసి ముద్దయింది.ఏపీకి వర్ష సూచనఆంధ్రప్రదేశ్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విదర్భ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర కోస్తా, రాయలసీమలో తేలికపాటి వానలు పడుతున్నాయి. దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రత పెరుగుతోంది. వచ్చే వారం బంగాలాఖతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అంచనా వేసింది. -
నిబంధనలు ఉల్లంఘిస్తే స్కానింగ్ సెంటర్లపై చర్యలు
● డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ రాజశ్రీ సుభాష్‌నగర్: స్కానింగ్ సెంటర్లు నిబంధనలు ఉ ల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ బి రాజశ్రీ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లాస్థాయి సలహా సంఘం సమావేశం ఆమె అధ్యక్షతన నిర్వహించారు. డీఎంఅండ్‌హెచ్‌వో మాట్లాడుతూ ప్రతి స్కానింగ్ కేంద్రం రిజి స్ట్రేషన్ చేయించాలని, రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులు, కార్డియాలజిస్ట్, ఆప్తమాలజిస్ట్ స్కానింగ్ చేసేందుకు అర్హులన్నారు. పీసీపీఎన్డీటీ చట్టం ద్వా రా నమోదైన వైద్యులు మాత్రమే స్కానింగ్ మిషన్లను వాడాలన్నారు. స్కానింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలనుకునే వైద్యులు వైద్యాధికారి కార్యాల యం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. స్కానింగ్ కేంద్రాల్లో వైద్యుల సమయపాలనను చార్ట్ ద్వారా ప్రదర్శించాలన్నారు. జిల్లాలోని 131 స్కానింగ్ కేంద్రాలకుగాను మూడు నెలల్లో 96 కేంద్రాలను తనిఖీ చేశామని పేర్కొన్నారు. స్కానింగ్ కేంద్రాలను కేంద్ర తనిఖీ బృందాలు ముందస్తు సమాచారం లేకుండా తనిఖీ చేసే అధికారాన్ని కలి గి ఉంటాయన్నారు. ప్రతి స్కానింగ్‌కు డాక్టర్ సిఫారసు ధ్రువపత్రం తప్పకుండా అవసరమన్నారు. నాలుగు ఆస్పత్రులను స్కానింగ్ కేంద్రాలకు అను మతి కోసం కలెక్టర్ నివేదించామని తెలిపారు. కా ర్యక్రమంలో జీజీహెచ్ రేడి యాలజిస్ట్ డాక్టర్ నిశిత, గైనకాలజిస్ట్ డాక్టర్ నిషాత్, వైద్యులు శరత్చంద్ర, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుప్రియ, డాక్టర్ శిఖర, డాక్టర్ శ్వేత, డాక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు. సలహా సంఘ సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్ బి రాజశ్రీ -
జిల్లాలో మరో రెండు ఆర్వోబీలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి వద్ద, జానకంపేట గూడ్స్ షెడ్ వద్ద ఆర్వో బీలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 5న భారత ప్రభుత్వం ఆర్వోబీల కోసం భూసేకరణ చేసేందుకు ప్రత్యేకంగా గెజిట్ విడుదల చేసింది. వీటిని స్పెషల్ ప్రాజెక్టులుగా గుర్తించి కేంద్రం గెజిట్ విడుదల చేయడం గమనార్హం. ‘స్పెషల్ రైల్వే ప్రాజెక్టు’ కింద సికింద్రాబాద్–ముథ్కేడ్ సెక్షన్ పరిధిలోని ఈ రెండు చోట్ల ఆర్వోబీల నిర్మాణాలు చేయనున్నారు. ఇందుకోసం రైల్వే చట్టం–1989లోని సెక్షన్ 2, క్లాజ్ (37ఏ) ప్రకారం ఉన్న అధికారాలను వినియోగిస్తూ, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టులను జాతీయ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో పేర్కొనడం విశేషం. ఈ ఆర్వోబీల నిర్మాణాల కోసం ఎంపీ ధర్మపురి అర్వింద్ పలుసార్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను, రైల్వే ఉన్నతాధికారులను కలిసి అనేక విజ్ఞప్తులు చేశారు. కాగా ఆర్వోబీలతో ఈ ప్రాంతాల్లో ప్రయాణికుల సమస్యలు తీరనున్నాయి. ఏళ్లతరబడి ఎదుర్కొంటున్న ఈ సమస్యకు ఫుల్స్టాప్ పడడంపై ఈ ప్రాంతాల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. పార్లమెంట్ పరిధిలో 10 ఆర్వోబీలు లక్ష్యం : ఎంపీ అర్వింద్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 10 ఆర్వోబీలను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం నిరంతరం కృషి చేస్తున్నాం. వీటితో ప్రాంతాల మధ్య మరింత కనెక్టివిటీ పెరుగుతుంది. తద్వారా మరింత అభివృద్ధికి ఊతం ఇస్తుంది. ప్రజల ప్రాణానికి రక్షణ, ట్రాఫిక్ సమస్యలు తొలగుతాయి. ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మరిన్ని లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ఆర్వోబీలు నిర్మాణం చేయించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్నాం. ఇక అమృత్ భారత్ కింద రూ.53 కోట్లతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, ఆధునిక మౌలిక వసతులు అందించే లక్ష్యంతో ముందుకెళుతున్నాం. కాగా నిజామాబాద్ మీదుగా నడిచే పలు రైళ్లను స్పెషల్ రైళ్ల నుంచి రెగ్యులర్ రైళ్లుగా మార్చడంతో ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగింది. జిల్లాకు రవాణా పరంగా మరింత బలం చేకూరింది. ప్రజల అవసరాలను గుర్తించి ఈ ప్రాజెక్టులను ‘స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్’ కింద చేర్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు ధన్యవాదాలు. తాజా గెజిట్‌తో తక్షణమే భూసేకరణ చేపట్టే అవకాశం కలిగింది. పరిపాలన అనుమతులు వేగంగా లభిస్తాయి. టెండర్ల ప్రక్రియ, కేంద్ర నిధుల సమీకరణ సులభమవుతుంది. ముఖ్యంగా ప్రజల భద్రత పెరిగి రైలు–వాహన ప్రమాదాలు తగ్గుతాయి. ఇందల్వాయి, జానకంపేట గూడ్స్ షెడ్ వద్ద నిర్మించనున్న రైల్వే శాఖ భూసేకరణ కోసం గెజిట్ విడుదల చేసిన భారత ప్రభుత్వం ఇప్పటికే రూ.53 కోట్లతో నిజామాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులు -
ఇంటర్ అడ్మిషన్లు ఇప్పుడే వద్దు
ఖలీల్‌వాడి: ఇంటర్మీ డియట్ బోర్డు ఇటీవ ల ప్రకటించిన అడ్మిషన్ షెడ్యూలు రద్దు చేసినందున ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, రెసిడెన్షియల్, ఇతర గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేయాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవికుమార్ ప్రకటించారు. కొత్త షెడ్యూలు వచ్చిన తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించా లన్నారు. ఇంటర్ కళాశాలల్లో ఇప్పుడే చేరరాదని, ప్రైవేట్ కళాశాలల్లో ఎవరూ ఫీజులు చెల్లించవద్దని స్పష్టం చేశారు. అడ్మిషన్లను ని ర్వహించినట్టు తమ దృష్టికి వస్తే కళాశాల లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు నిర్వహించటానికి వీలులేదన్నారు. రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలిక మృతి ● రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు నిజామాబాద్ రూరల్: రోడ్డు దాటుతున్న ఆరేళ్ల బాలికను అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్రధర్నగర్ తండా సమీపంలో బు ధవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో బా లిక మృతి చెందినట్లు ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపారు. బాట్లోత్ పరమేశ్వర్ కుమార్తె కీర్తన(6) కిరాణా షాప్‌కి వెళ్లి రోడు దాటుతుండగా మేఘన డెంటల్ కళాశాల విద్యార్థి డ్రైవ్ చేస్తున్న కారు అతివేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన బాలికను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్ప త్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. నేడు, రేపు దోస్త్ ప్రత్యేక కేటగిరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ తెయూ(డిచ్పల్లి): దోస్త్ – యూజీ కోర్సులలో స్పెషల్ కేటగిరి కింద అడ్మిషన్ పొందిన విద్యార్థులు పీహెచ్సీ/ సీఏపీ ఈ నెల 7న, ఎన్సీసీ/స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ విద్యార్థులు ఈ నెల 8న సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని తెయూ అడ్మిషన్స్ డైరెక్టర్ వాసం చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. తెయూ పరిపాలనా భవనంలోని అకడమిక్ ఆడిట్ సెల్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సర్టిఫికెషన్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని 38 వార్డుతో పాటు 36, 40 వార్డుల బ్యాలెట్ బాక్స్‌లు, వోటర్ లిస్టులు, వోట్ కౌంటర్ ఫైల్స్ ఇతర సామగ్రిని మున్సిపల్ అధికారులు కోర్టుకు చేర్చారు. మున్సిపల్ ఎ న్నికలలో అవకతవకలు జరిగాయంటూ 38వ వార్డులో ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గ్రామీణ ఓటర్లు, ఇతర వార్డుల ఓట ర్లు 38వ వార్డులో ఓటేయడంతో తాను ఓడి పోవాల్సి వచ్చిందని ఆ అభ్యర్థి ఆవేదన వ్య క్తం చేశారు. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేర కు మున్సిపల్ సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌లు, వోటర్ లిస్టులు, వోట్ కౌంటర్ ఫైల్స్ ఇతర సామగ్రిని కోర్టుకు అందించారు. -
నిధులు లేక నిలిచిన సాయం
మోర్తాడ్(బాల్కొండ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన ఈర్గల్ల గంగాధర్ మార్చి 2025లో యూఏఈలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఎక్స్‌గ్రేషియా కోసం అతని భార్య లక్ష్మి అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఏడాది గడచినా ఇప్పటి వరకూ రూ.5 లక్షల సాయం అందలేదు. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాను విడుదల చేస్తే ఆ సొమ్ముతో తమ బాధలు తీరుతాయని లక్ష్మి భావించింది. ఏడాది కాలంగా సాయం కోసం ఆమె నిరీక్షిస్తూనే ఉంది. ఇది ఒక్క లక్ష్మికి ఎదురైన సమస్యే కాదు. ఎంతో మంది వలస కార్మికులు గల్ఫ్ దేశాల్లో మరణించగా వారి కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయం కోసం నిరీక్షిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలను స్వీకరించిన తరువాత గల్ఫ్ వలస కార్మికుల అంశంపై స్వయంగా పరిశీలన చేశారు. కారణం ఏదైనప్పటికీ గల్ఫ్ దేశాల్లో మరణించిన తెలంగాణ వలస కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. 2023 డిసెంబర్ తరువాత మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 225 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందించారు. ఏడాది కాలంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 130 మంది మరణించగా వారికి ఇప్పటి వరకూ సాయం అందలేదు. బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని గల్ఫ్ కార్మికుల సంఘాలు ప్రభుత్వాన్ని వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది. వలస కార్మికులు గల్ఫ్ దేశాల్లో మరణిస్తే కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తును అందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ నిజామాబాద్ జిల్లాలో 17 కుటుంబాలకు, జగిత్యాల్ జిల్లాకు చెందిన 50 కుటుంబాలకు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు చెందిన మరో 63 కుటుంబాలకు సాయం అందించాల్సి ఉంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తే గల్ఫ్ మృతుల కుటుంబాలకు సాయం అందేది. ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో బాధిత కుటుంబాలకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రభుత్వానికి విన్నవించాం.. గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన వలస కుటుంబాలకు సా యం కోసం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి విన్నవించాం. బడ్జెట్లో ప్ర త్యేకంగా నిధులను కేటా యించాలని కోరాం. ఎన్నో బాధిత కుటుంబాలు సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతేనే సాయం సొమ్ము ఖాతాల్లో జమ చేస్తారు. – స్వదేశ్ పరికిపండ్ల, ఎన్నారై అడ్వయిజరీ బోర్డు సభ్యుడు గల్ఫ్ దేశాల్లో మరణించిన వారికి రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన ప్రభుత్వం గతంలో 225 మందికి పంపిణీ నిధులు లేక ఏడాది కాలంగా సాయం కోసం 130 కుటుంబాల నిరీక్షణ బడ్జెట్లో గల్ఫ్ సంక్షేమానికి నిధులు కోరినా పెడచెవిన పెట్టిన ప్రభుత్వం -
రెవెన్యూ ఉద్యోగుల స్వీయగణన నమోదు
● అభినందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠినిజామాబాద్ అర్బన్: జనాభా గణన–2027లో భాగంగా బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగులు స్వీయ నమోదు చేసుకున్నారు. ఉద్యోగులు ఎవరికి వారు తమ కుటుంబ సభ్యుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి వారిని అభినందించారు. మిగతా శాఖల ఉద్యోగులు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకుని స్వీయ గణన చేసుకోవాలని సూచించారు. ఈసారి జనాభా గణన–2027 డిజిటల్ విధానంలో నిర్వహించబడుతోందన్నారు. ఈ నెల 10 వరకు పోర్టల్ ద్వారా స్వీయ నమోదు చేసుకోవచ్చని సూచించారు. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ ద్వారా https://se.census.gov.in వెబ్సైట్లోకి వెళ్లి స్వీయ గణన చేసుకోవచ్చన్నారు. నమోదు అనంతరం ప్రతి వ్యక్తికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐఈ) వస్తుందని, దానిని భద్రపరచి ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు అందజేయాలని సూచించారు. అన్ని శాఖల ఉద్యోగులు, జిల్లా ప్రజలందరూ మే 10లోపు స్వీయ గణన పూర్తి చేసి జిల్లా అభివద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలు పునిచ్చారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, శ్రీనివాస్ రావు, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
తీరనున్న గేట్ కష్టాలు
ఇందల్వాయి: ఇందల్వాయి, సిర్నాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఇందల్వాయి మండల కేంద్రంలోని రైల్వే గేటుపై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం నిర్ణయించడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భీంగల్, సిరికొండ, ధర్పల్లి, ఇండల్వాయి మండలాలకు చెందిన వేలాది మంది నిత్యం నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్ వెళుతుంటారు. 44 నెంబర్ జాతీయ రహదారి మీదుగా వెళ్లే ఈ ప్రాంతాలను చేరుకోవాలంటే ఇందల్వాయి రైల్వే గేటు దాటాల్సిందే. ఈ రైల్వే మార్గం గుండా నిత్యం 50 పైగా ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు వెళుతుంటాయి. ఈ క్రమంలో రోజుకు కనీసం 50 సార్లు గేటుని మూసేస్తారు. గేటు పడ్డ ప్రతిసారి కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్ అవుతుంది. రెండు పక్కల వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. అత్యవసరంగా వెళ్లాల్సిన వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జాప్యం లేకుండా నిర్మించాలి రైల్వే ఓవర్ బ్రిడ్జి కో సం త్వరగా భూ సేకరణ పూర్తి చేసి, పను లు వేగంగా పూర్తి చే యాలి. మాధవ నగర్ ఆర్వోబీ లాగా పనులు ఆలస్యంగా జరిగితే ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అలా జరగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. – ఎం శ్రీనివాస్, ఇందల్వాయి ఆదేశాలు రాగానే భూసేకరణ ఆర్వోబీ నిర్మాణం కోసం పైఅధికారుల నుంచి ఆదేశాలు రాగానే సంబంధిత అధికారులతో కలిసి భూమి సర్వే భూసేకరణ పనులు ప్రారంభిస్తాం. – బాలయ్య, తహసీల్దార్ ఇందల్వాయి -
ఆదాయవనరుల పెంపుపై దృష్టి సారించాలి
● స్థానికంగా ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలి ● ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్యనిజామాబాద్ అర్బన్: స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ, ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్హాల్లో మంగళవారం ఉత్తర తెలంగాణ స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని, సభ్యుడు ఎస్.సుధీర్‌రెడ్డితో కలిసి చైర్మన్ రాజయ్య సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఉత్తర తెలంగాణా జిల్లాల నుంచి వచ్చిన అదనపు కలెక్టర్లు తమ జిల్లాల్లో స్థానిక సంస్థల పనితీరును వివరించారు. ప్రజాప్రతినిధులు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, స్థానిక సంస్థల బలోపేతంపై దృష్టి సారించాలని రాజయ్య సూచించారు. స్థానిక సంస్థల్లో ఆదాయ వనరులను పెంపొందించుకునే అవకాశాలపై ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి సలహాలు స్వీకరించారు. ప్రభుత్వానికి నివేదిస్తామని అందిస్తామని తెలిపారు. నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సౌర విద్యుత్ ఉత్పత్తి
జక్రాన్‌పల్లిలో సోలార్ పవర్ ప్లాంట్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి దిశగా ఎన్పీడీసీఎల్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జక్రాన్‌పల్లిలో సోలార్ పవర్ ప్లాంట్‌ను సంస్థ సీఎండీ వరుణ్‌రెడ్డి మంగళవారం ప్రారంభించగా, కోస్లిలో ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భవిష్యత్తులో విద్యుత్ సమస్యను పూర్తిస్థాయిలో అధిగమించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్లాంట్ల నిర్మాణానికి అన్ని జిల్లాల్లో రంగం సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే ఆయా విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొదటిసారి జక్రాన్‌పల్లి విద్యుత్ ఉప కేంద్రం వద్ద సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. 3.5 ఎకరాల స్థలంలో 0.8 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్ధ్యంతో దీని నిర్మాణం చేపట్టారు. పైలట్ ప్రాజెక్టు కింద మొదటగా ఇక్కడ ప్లాంట్‌ను నిర్మాణం చేశారు. అయితే జిల్లాలోని నవీపేట మండలం కోస్లి విద్యుత్ ఉపకేంద్రం వద్ద సైతం మరో సోలార్ ప్లాంట్‌ను నిర్మాణం చేసేందుకు గాను అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. కోస్లి వద్ద రెడ్కో ఆధ్వర్యంలో నిర్మాణం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు ఎకరాల స్థలంలో ఒక మెగావాట్ విద్యుదుత్పత్తి సామర్ధ్యంతో నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్‌లో జిల్లాలోని మరిన్ని సబ్ స్టేషన్ల వద్ద సోలార్ ప్లాంట్లను నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. 1మెగావాట్ సామర్ధ్యంతో సోలార్ ప్లాంట్ నిర్మించేందుకు 4 నుంచి 5 ఎకరాల మేర స్థలం అవసరం ఉంది. అయితే స్థలం సరిపడా లేని సబ్ స్టేషన్ల వద్ద ప్రభుత్వం స్థలం కేటాయించేందుకు ఆలోచన చేస్తోంది. జిల్లాలో మొత్తం 273 విద్యుత్ సబ్స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఎక్కడెక్కడ సోలార్ ప్లాంట్లకు సరిపడా స్థలం ఉంది, ఇంకా ఎంత కావాలి అనే విషయమై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సబ్ స్టేషన్లకు దూరంగా ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వం స్థలం కేటాయిస్తే అందుకు తగినవిధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అయితే రెడ్కో ఆధ్వర్యంలో ఎక్కువ సోలార్ ప్లాంట్లు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఆర్మూర్ మండలంలోని పెర్కిట్‌లో 200 గజాల స్థలంలో రెడ్కో ఆధ్వర్యంలో ఈవీ చార్జింగ్ స్టేషన్‌ను నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు.రాష్ట్రంలోనే తొలి ప్లాంట్ పర్యావరణ పరిరక్షణకు ఇది ముందడుగు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో జిల్లాలోని సబ్స్టేషన్లలో సోలార్ ప్లాంట్లు జక్రాన్‌పల్లిలో ప్రారంభం.. కోస్లిలో ఏర్పాటుకు ప్రతిపాదనలు పెర్కిట్‌లో ఈవీ స్టేషన్ నిర్మాణానికి సైతం -
ఉద్యాన పంటలతో ఆర్థిక పరిపుష్టి
పెర్కిట్(ఆర్మూర్): సాంప్రదాయ పంటలకు భిన్నంగా ఉద్యాన పంటలను సాగు చేయ డం ద్వారా లాభాలు ఆర్జించవచ్చని పసుపు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో మంగళవారం ఉ ద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహ న సదస్సు నిర్వహించారు. గంగారెడ్డి ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రైతులు తమకున్న సాగు భూమిలో అర ఎకరాలో కూరగాయలు చేయడం ద్వారా అదనపు ఆ దాయం పొందవచ్చన్నారు. అనంతరం రైతు వారోత్సవాల పరిశీలకురాలు గీతారెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీ అందజేస్తుందన్నారు. ప్రస్తుతం ఆర్మూర్ నియోజకవర్గంలో 620 మంది రైతులు 1,343 ఎకరాల్లో ఆ యిల్‌పామ్ పంటను సాగు చేస్తున్నట్లు తెలి పారు. దీంతో పాటు రైతులు కూరగాయలు, పండ్లు, పూలను సాగు చేసి అదనపు ఆదాయం పొందాలన్నారు. ఆర్మూర్ ఉద్యానవన శాఖ అధికారిణి సంధ్యారాణి, రైతులు పాల్గొన్నారు. డీఆర్వోగా గీత నిజామాబాద్ అర్బన్: జిల్లా రెవెన్యూ అధికారిణిగా బి గీతను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్న గీత నిజామాబాద్ డీఆర్వోగా రానున్నారు. బోధన్ ఆర్డీవోగా విజయకుమారి బోధన్: అడిషనల్ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హై దరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సేవరేజ్ బోర్డులో విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్ ఎం విజయకుమారి బోధన్ ఆర్డీవోగా నియమితులయ్యారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతో బదిలీపై వెళ్లగా, ఆయన స్థానంలో కొత్తగా డిప్యూటీకలెక్టర్ను ఆర్డీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంట మార్పిడిపై సీఎంకు నివేదిక నిజామాబాద్ రూరల్: పంట మార్పిడి విధానాలపై సీఎం రేవంత్‌రెడ్డికి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మంగళవారం నివేదికను అందజేసినట్లు రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తెలిపారు. చైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలో సీఎంతో తాము సమావేశమై వివిధ అంశాలపై చర్చించామన్నారు. పంట మార్పిడిపైన ప్రభుత్వం సమగ్ర చర్చ జరపాలని భావిస్తోందని సీఎం పేర్కొన్నట్లు గడుగు తెలిపారు. మరింత అధ్యయనం చేసి నిర్మాణాత్మక సూచనలతో ఖరీఫ్ పంటపై తాము ముందుకు వస్తామన్నారు. -
టిఫిన్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి మృతి
నిజాంపేట(మెదక్): టిఫిన్ చేస్తూ కుప్పకూలిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మెదక్ జిల్లా నిజాంపేటలో ఘటన చోటు చేసుకోగా, మృతుడు కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి. వివరాలు ఇలా.. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాలాపూర్కి చెందిన చాకలి రాజు(42) మంగళవారం ఉదయం నందిగామకు బయలుదేరాడు. మార్గమధ్యలో నిజాంపేటలోని ఒక హోటల్‌కు టిఫిన్ చేసేందుకు వచ్చాడు. టిఫిన్ చేస్తున్న క్రమంలో అతడికి ఫిట్స్ వచ్చి ఆహారం ఊపిరితిత్తులోకి వెళ్లడంతో కింద పడిపోయాడు. వెంటనే హోటల్ యాజమాన్యం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చి పరిశీలించగా అతడు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బావిలో పడి వృద్ధురాలు.. ఇందల్వాయి: మండలంలోని డొన్కల్ గ్రామంలో ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందింది. వివరాలు ఇలా.. డొన్కల్ గ్రామా నికి చెందిన గొల్ల మల్లవ్వ (60) అనే వృద్ధురాలు సమీపంలోని అడవిలో నిత్యం తునికాకు సేకరణకు వెళ్తుండేది. ఈక్రమంలో మంగళవారం ఉదయం తునికాకు సేకరణకు వెళ్లి ప్రమాదవశాత్తు తమ వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. మృతురాలి కొడుకు రమేష్ ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడు.. నవీపేట: ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని ఫకీరాబాద్ గ్రామానికి చెందిన వంకదారిగోపి(25) కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం ఈనెల 1న ఆస్పత్రికి వెళ్లి మందులు తీసుకున్నాడు. అయినా వ్యాధి నయం కాకపోవడంతో అతడు జీవితంపై విరక్తి చెందాడు. ఈక్రమంలో ఈ నెల 2న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి సుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
16 ఏళ్లుగా 100 శాతం ఉత్తీర్ణత
● ఎస్సెస్సీ ఫలితాల్లో హాసాకొత్తూర్ జెడ్పీహెచ్ఎస్ ఘనత ● ప్రత్యేక తరగతులు, వెనుకబడిన విద్యార్థులపై టీచర్ల ప్రత్యేక శ్రద్ధ మోర్తాడ్: కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులు 16 ఏళ్లుగా వందశాతం ఉత్తీర్ణత సాధిస్తూ రికార్డును సృష్టించారు. 2010–2011 విద్యా సంవత్సరంలో మొ దలైన వంద శాతం ఉత్తీర్ణత నమోదు నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. 2025–26 విద్యా సంత వ్సరానికి గాను వంద శాతం ఉత్తీర్ణతను విద్యార్థు లు సాధించడంతో అందరి దృష్టి ఈ పాఠశాలపై ని లిచింది. ఈసారి 19 మంది విద్యార్థులు పరీక్షలు రా యగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ఎక్కు వ మంది విద్యార్థులు 500లకు పైగా మార్కులు సాధించడం విశేషం. సకాలంలో సిలబస్‌ను పూర్తి చేయడంతో పాటు ప్రత్యేక తరగతుల నిర్వహణ, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టిసారించడంతో వంద శాతం ఫలితాలు సాధ్యమయ్యాని ఉపాధ్యాయులువెల్లడించారు. ఇదే స్ఫూ ర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగుతామన్నారు. మరిన్ని పాఠశాలల్లో... కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్, బషీరాబాద్, చౌట్పల్లి, అమీర్‌నగర్ పాఠశాలల్లోను వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. మిగిలిన పాఠశాలల్లో ఒకరిద్ద రు విద్యార్థులు ఒక్కో సబ్జెక్టులలో తప్పడంతో వంద శాతం ఫలితాలు సాధ్యం కాలేదు. ప్రభుత్వ బడు ల్లోని విద్యార్థులు ప్రైవేటు బడుల విద్యార్థుల కంటే మెరుగైన ఫలితాలు సాధించడంతో ఈసారి అడ్మిష న్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పదో తరగతి పరీక్షల్లో మా విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. ఉ పాధ్యాయుల కృషి, గ్రామ స్తు లు, విద్యార్థుల తల్లిదండ్రులు సహకారం అందించడంతో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాం. –తిరునగిరి అరుణశ్రీ, హెచ్ఎం, హాసాకొత్తూర్ -
త్వరలోనే సమస్యలు పరిష్కారం
మోపాల్: రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పొద్దుటూరు మోహన్‌రెడ్డి అన్నారు. జన గణన శిక్షణ కేంద్రంలో ఉద్యోగులకు అన్ని సదుపాయాలు కల్పించినందుకు కలెక్టర్ ఇలా త్రిపాఠికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మోపాల్ మండల కేంద్రంలో మూడు రోజులుగా కొనసాగుతున్న జనగణన శిక్షణా కేంద్రాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి త్వరలోనే పీఆర్సీ ప్రకటిస్తారని, ఉద్యోగులకు హెల్త్‌కార్డులు అందజేస్తారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. అనంతరం అధికారి సాయికృష్ణ, మాస్టర్ ట్రైనర్స్ దయానంద్, శేఖర్‌ను మోహన్‌రెడ్డి సన్మానించారు. తహసీల్దార్ రేఖ, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ గోపిడి రవీందర్‌రెడ్డి, ఎంఈవో అమ్దాపూర్ సాయిలు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు కొట్టూరు దేవీదాస్, రాష్ట్ర బాధ్యులు శ్రీనివాస్, ఎండల మహేందర్, మండల అసోసియేట్ అధ్యక్షులు కడావత్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
బంగారు దుకాణాదారులు అప్రమత్తంగా ఉండాలి
● ఏసీపీ శ్రీనివాస్బోధన్టౌన్(బోధన్): పట్టణ పరిఽధిలోని బంగా రు దుకాణాల యజమానులు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. పట్ట ణ పోలీస్ స్టేషన్లో జ్యువెలరీ దుకాణాల యజమానులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కరీంనగర్‌లోని జ్యువెలరీ దుకాణంలో జరిగిన చోరీ తీరును వివరించారు. ఎవరైన కొత్త వ్యక్తులు వచ్చినా, అనుమానితులుగా అ నిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇ వ్వాలన్నారు. దుకాణాల లోపల, బయట సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, అలారం సిస్టమ్తోపాటు రాత్రివేళలో వాచ్‌మన్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో పట్టణ సీఐ వెంకటనారాయణ, ఎస్సై భాస్కర్ చారీ పాల్గొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడ మిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జి ల్లా పరిధిలో ఏర్పాటు చేసిన 29 పరీక్షా కేంద్రా ల్లో 2,286 మంది విద్యార్థులకుగాను 2,154 మంది విద్యార్థులు హాజరు కాగా 132 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఉదయం నిర్వహించి న ఆరో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షకు 2,143 మంది విద్యార్థులకు గాను 2,031 మంది హా జరు కాగా 112 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే మ ధ్యాహ్నం నిర్వహించిన మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షకు 143 మంది విద్యార్థులకుగాను 123 మంది హాజరు కాగా 20 మంది గైర్హాజరైనట్లు చంద్రశేఖర్ వివరించారు. దోమకొండ: ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు లింగుపల్లి గ్రామాల్లో కొనుగొలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.నిర్వాహకులకు సూచనలు ఇచ్చా రు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదు పాయాలు కల్పించాలని, సేకరించిన వడ్లను వెంటవెంటనే రైస్‌మిల్లులకు తరలించి ట్యాబ్ ఎంట్రీ పూర్తిచేయలని సూచించారు. ఆయన వెంట ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, ఆర్ఐ కిష్టయ్య, సొసైటీ కార్యదర్శి బాల్‌రెడ్డి తదితరులున్నారు. -
కూరగాయలతో కాలభైరవుడికి అలంకారం
రామారెడ్డి (ఎల్లారెడ్డి): ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి(రామారెడ్డి) శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో వై శాఖ మాసం మూడో మంగళవారం పురస్కరించుకు ని పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని 108 రకాల కూరగాయలతో అత్యంత రమణీయంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారికి జలాభిషేకాలు, సింధూర పూజలు నిర్వహించారు. మధ్యా హ్నం భజన కార్యక్రమాల అనంతరం, కూరగాయలతో అలంకరించిన స్వామివారికి ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. -
తెయూ భూములను రక్షించుకుంటాం
● సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల స్ఫూర్తితో ఐక్యంగా ఉద్యమిద్దాం ● జిల్లాకేంద్రంలో వామపక్ష సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం ఖలీల్‌వాడి: తెలంగాణ యూనివర్సిటీ భూములను రక్షించుకుంటామని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నా యకులు అన్నారు. సెలవు రోజుల్లో విద్యార్థులు లే ని సమయంలో యూనివర్సిటీ భూములను బదిలీ చేయడం కుట్రగా కనిపిస్తుందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్ముకోవాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులు, ప్రజలు ఉద్య మాలతో బుద్ధి చెప్పారన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. నగరంలోని ఆ ర్ఆండ్బీ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం పీడీఎస్‌యూ, టీయూసీఐ, పీఓడబ్ల్యూ, పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ అధ్యక్షత వహించారు. సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాలకు పైగా భూ మిని మరో యూనివర్సిటీకి చెందిన కాలేజీకి ఇవ్వ డం సరైన నిర్ణయం కాదన్నారు. ఇప్పటికే తెలంగాణ యూనివర్సిటీ భూములు తరచూ కబ్జాలకు గురవుతున్నాయన్నారు. యూనివర్సిటీ భూముల పై సర్వే నిర్వహించి, రక్షణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ కాలేజీ కోసం అన్ని రకాల సౌకర్యాలతో జక్రాన్‌పల్లి మండలంలో భూములు ఉన్నాయన్నారు. అక్కడ ఏర్పాటు చేస్తే జిల్లా రైతాంగానికి, విద్యార్థులకు ఉపయోగకరమన్నారు. ఎన్నో పోరాటాలతో తెలంగాణ యూనివర్సిటీని సాధించుకున్నామని, యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం మరోసారి ఐక్య పోరాటాలకు సిద్ధమవుదామని పిలుపునిచ్చారు. ఆయా సంఘాల ప్ర తినిధులు గణేష్, అనిల్ కుమార్, విగ్నేష్, శ్రీశైలం, గోపాల్, శ్రీధర్, సుజాత, శివరాజ్ పాల్గొన్నారు.


