ఎరక్కపోయి.. ఇరుక్కున్నాడు | - | Sakshi
Sakshi News home page

ఎరక్కపోయి.. ఇరుక్కున్నాడు

May 16 2026 3:01 AM | Updated on May 16 2026 3:01 AM

పాత్రలో చిక్కుకుపోయిన బాలుడు

నిజామాబాద్‌ అర్బన్‌: నగరానికి చెందిన ఓ బాలుడు ఇంట్లోని పాత్రలో ఇరుక్కుపోయి ఇబ్బంది పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆటోనగర్‌లోని అబ్దుల్‌ రహీం అనే ఆరు సంవత్సరాల బాలుడు ఓ పాత్రలో కూర్చోగా, తిరిగి బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా రెండు కాళ్లు ఇరుక్కుపోయాయి. తల్లి ఉజ్మా బేగం బాలుడిని పైకి లాగితే రాలేదు. తండ్రి అబ్దుల్‌ రహీం అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు వెంటనే వచ్చి ఇరుక్కున్న పాత్రను యంత్రంతో కట్‌ చేసి బాలుడిని బయటికి తీశారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement