సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేయ డం శోచనీయమని ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేము ల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ మధ్య ఫెవికాల్ బంధం ఉందన్నారు. సిట్ విచారణ పేరిట సంజయ్ కొడుకు భగీరథ్‌ను కాపాడేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారన్నా రు. కేంద్ర మంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడని చెప్పడం హాస్యాస్పదమన్నారు. మైనర్ బాలికకు డ్రగ్స్, మద్యం ఇచ్చి అఘాయిత్యం చేసినట్లు ఆరోపణలు ఉంటే పోలీసులు మూడు నెలల పాటు ఫిర్యాదు తీసుకోకుండా తాత్సారం చేయడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందన్నారు. మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత గత్యంతరం లేక పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. పోక్సో చట్టం ప్రకారం మైనర్ బాలిక చెప్పేదే కీలకమన్నారు. ఇలాంటి కేసులో బాధితురాలికి రక్షణ కల్పించాల్సింది పోయి, నిందితుడు ఆమైపెనే తిరిగి ’హనీ ట్రాప్’ పేరిట కేసు పెట్టడం దారుణమన్నారు. మైనర్ బాలిక హనీ ట్రాప్ చేస్తుందా అన్నారు. బాధితురాలిపైనే రివర్స్ కేసులు పెట్టడం చూస్తుంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒకటేనని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఇద్దరూ కలిసి వ్యాపారాలు, భూమి కుంభకోణాలు చేస్తున్నా రు. ఒక్క కాంగ్రెస్ నాయకుడు సైతం దీనిపై స్పందించకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటన్నారు. ప్రతిరోజూ కేసీఆర్ కుటుంబం మీద, కేటీఆర్ మీద, హరీశ్‌రావు మీద విషం చిమ్మే బండి సంజయ్ తన కొడుకు చేసిన నేరంపై ఏం సమాధానం చెబుతారన్నారు. సంజయ్ తన కొడుకుపై వచ్చిన ఈ పోక్సో కేసుపై నైతిక బాధ్యత వహించాలన్నారు. భగీరథ్‌ను అరెస్ట్ చేసి నిష్పక్షపాతంగా విచారణ చేయాలన్నారు. బాధిత మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు తాము పోరాడతామని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి, బండి సంజయ్
మధ్య ఫెవికాల్ బంధం
సిట్ విచారణ పేరిట నిందితుడిని
కాపాడే ప్రయత్నం
బాలికపై అఘాయిత్యం జరిగితే
మూడు నెలలపాటు ఫిర్యాదు
తీసుకోలేదెందుకు?
బాధితురాలిపైనే ఎదురు
కేసులు పెట్టడం దుర్మార్గం
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి


