నిజామాబాద్ రూరల్: ఆలయాల భూముల ను పరిరక్షించే బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని ఉమ్మడి జిల్లా దేవాదా య శాఖ సహాయ కమిషనర్ విజయరామారావు అన్నారు. నగరంలోని సర్వే నంబర్ 341,342లో నీలకంఠేశ్వర ఆలయ భూము ల సర్వేను గురువారం చేపట్టారు. 3ఎకరా ల 9గుంటల భూమిలో ఆక్రమణలు ఉన్న ట్లు ప్రాథమికంగా గుర్తించామని విజయరామారావు తెలిపారు. కంఠేశ్వర్ దేవస్థాన భూ ములను భవిష్యత్‌లో లీజుకు ఇవ్వడం లేదా ప్రజ్రాయోజనార్థం, ఫంక్షన్ హాల్ తదితర నిర్మిణాలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, దేవాదాయ శాఖ సర్వేర్ అనిల్, ఆలయ ఈవో రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన,
ఒత్తిడి లేని విద్య
మోపాల్(నిజామాబాద్‌రూరల్): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, ఒత్తిడి లేని విద్య ల భిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ విద్యావారోత్సవాల్లో భాగంగా గురువారం నగరశివారులోని బోర్గాం(పి) జెడ్పీహెచ్‌ఎస్ లో బడిబాటపై ప్రత్యేకంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ర్యాలీ ని ర్వహించారు. ప్రభుత్వం విద్యావ్యవస్థలో చే పట్టిన కార్యక్రమాలు, కల్పించనున్న సౌకర్యాలు డీఈవో వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. కార్పొరేటర్ యాదల నరేశ్, మండల స్పెషల్ ఆఫీసర్ తిరుమల ప్రసాద్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు కల్లెడ అశోక్ ప్రసంగించారు. మూడేళ్లుగా పాఠశాలల్లో వి ద్యార్థుల నమోదు, విద్యాస్థితి, వివిధ అంశా ల్లో పాఠశాల చేపట్టిన కార్యక్రమాలను ఆడి యో, విజువల్ రూపంలో పాఠశాల హెచ్‌ఎం శంకర్ తల్లిదండ్రులకు వివరించారు. అంతకుముందు విద్యార్థులకు ప్రశంసాప త్రాలు అందించారు. అమ్మ ఆదర్శ పాఠశా ల కమిటీ అధ్యక్షుడు జమున పాల్గొన్నారు.
రోడ్డు ఆక్రమణ తొలగింపునకు స్పెషల్ డ్రైవ్
బోధన్: నిజామాబాద్ – బోధన్ ప్రధాన రో డ్డు వెంబడి ఎడపల్లి మండలంలో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు పోలీస్ శాఖ ఆ ధ్వర్యంలో గురువారం స్పెషల్ డ్రైవ్ చేపట్టా రు. మండలంలోని జానకంపేట, ఎంఎస్‌సీ ఫారం, సాటాపూర్ గేట్, మండల కేంద్రంలోని మంగళ్‌పహాడ్ క్రాసింగ్ వద్ద రేకుల షె డ్డులను పొక్లెయిన్‌లతో తొలగించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ మాట్లాడుతూ.. బోధన్– నిజామాబాద్ మధ్య, జానకంపేట నుంచి బాసర వెళ్లే 163 నంబర్ జాతీయ రహదారి వెంబడి ట్రాఫిక్ రద్దీ ఉంటుందని, రోడ్డు స్థలం ఆక్రమణల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందన్నారు. ఆక్రమణ తొలగింపునకు సహకరించాలన్నారు. బోధన్ రూర ల్ సీఐ విజయబాబు, ఎడపల్లి ఎస్సై ము త్యాల రమ, సిబ్బంది పాల్గొన్నారు.
కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
సుభాష్‌నగర్: నిజామాబాద్ నగరంలోని 12, 41వ డివిజన్‌లలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్‌కుమార్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. శానిటేషన్ కార్యక్రమాలతోపాటు తాగునీటి సరఫరాను పరిశీలించారు. తాగునీటి సరఫరాపై స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, ప్రజలతో మా ట్లాడిన ఆయన.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. నాణ్యమైన నీటిని సరఫరా చేయాలని, వేసవిలో నీటి ఎద్దడి లేకుండా సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఆయన వెంట కార్పొరేటర్లు, నాయకులు, మున్సిప ల్ ఈఈ పీర్ రాజు, డీఈలు, ఏఈలు, శానిటేషన్ సిబ్బంది, కాలనీవాసులు ఉన్నారు.


