ఎప్‌సెట్‌లో జిల్లా విద్యార్థుల సత్తా | - | Sakshi
Sakshi News home page

ఎప్‌సెట్‌లో జిల్లా విద్యార్థుల సత్తా

May 18 2026 10:01 AM | Updated on May 18 2026 10:01 AM

ఖలీల్‌వాడి: ఎప్‌సెట్‌లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఫలితాలు ఆదివారం విడుదలకాగా, వెయ్యిలోపు ర్యాంకులను ఇద్దరు కై వసం చేసు కున్నారు. ఎస్‌ఆర్‌ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థి జక్క గురుమోహన్‌చరణ్‌ 369వ ర్యాంకు, జెట్టి శ్వేత అగ్రి, ఫార్మ విభాగంలో 351వ ర్యాంకు సాధించారు. అలాగే ఆరుగురు విద్యార్థులు ఐదువేల లోపు ర్యాంకులు సాధించారు. కాకతీయ విద్యార్థులు ఇద్దరు, వెక్టార్‌ కళాశాల విద్యార్థులు ముగ్గురు 5వేల లోపు ర్యాంకులు సాధించారు. ఆల్ఫోర్స్‌ విద్యార్థులు వివిధ కేటగిరిల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు.

ఎలక్ట్రిక్‌ వాహనంలో అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌

సుభాష్‌నగర్‌: ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు పెట్రోల్‌, డీజిల్‌ ఆదా చేయాలనే ఉద్దేశంతో అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ ఆదివారం ఈవీ (ఎలక్ట్రిక్‌ వెహికల్‌)లో ప్రయాణించారు. నగరంలోని పలు కార్యక్రమాలకు ఈవీ కారులోనే హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధ వాతావరణ నేపథ్యంలో క్రూడ్‌ ఆయి ల్‌ ధరలు పెరుగుతున్నాయని, వాటిని ని యంత్రించేందుకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారన్నారు. మనదేశం 85 శాతం పెట్రోల్‌, డీజిల్‌లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రధాని పి లుపును పాటించాలని ధన్‌పాల్‌ కోరారు.

శ్వేత (351వ

ర్యాంకు – అగ్రి, ఫార్మా)

గురుమోహన్‌చరణ్‌ (369వ ర్యాంకు)

Advertisement
 
Advertisement
Advertisement