–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్ : వచ్చే విద్య సంవత్సరం నుంచి వీలైనంత ఎక్కువ పాఠశాలలను తనిఖీ చేసే విధంగా ప్రణాళిక చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. గురువారం తన చాంబర్‌లో ఈ విద్యా సంవత్సరానికి గాను ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల తనిఖీ బృందాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను 10 బృందాల సభ్యులు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలన్నారు. ఈ తనిఖీలు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుండే చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల పనితీరుపై తనిఖీ బృంద సభ్యులతో వివిధ అంశాలపై సమీక్షించారు. సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, తనిఖీ బృందాల నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
బ్యాంకు లింకేజీలోనూ రాష్ట్రంలో మొదటి స్థానం
డొంకేశ్వర్(ఆర్మూర్) : ఇటీవల సీ్త్ర నిధి రుణా ల పంపిణీలో స్టేట్ ఫస్ట్ అవార్డు అందుకున్న నిజామాబాద్ జిల్లా, తాజాగా బ్యాంకు లింకే జీ రుణాల్లో కూడా ముందు వరుసలో నిలిచింది. 2025–26 సంవత్సరంలో రూ. 1,228 కోట్లకు గాను లక్ష్యానికి మించి రూ. 1,260 కోట్ల రుణాలను 16 వేల మహిళ సంఘాలకు అందజేశారు. ఇది స్టేట్‌లోనే హై యెస్ట్ కాగా, గురువారం హైదరాబాద్‌లో మంత్రి సీతక్క , సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్‌ల చేతుల మీదుగా డీఆర్డీవో సాయన్న అ వార్డు అందుకున్నారు. ఏపీడీ మధుసూదన్, డీపీఏం సంధ్యారాణి పాల్గొన్నారు.
ఫాగింగ్ మిస్ట్ యంత్రాలు
ప్రారంభించిన సీపీ
నిజామాబాద్ అర్బన్ : వేసవికాలంలో తీవ్ర ఎండల ప్రభావంతో ట్రాఫిక్ సిబ్బంది ఇ బ్బందులు పడకుండా ఉండేందుకు ట్రాఫిక్ ఐలాండ్ వద్ద ఫాగింగ్ మిస్ట్ యంత్రాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం ప్రారంభించారు. నగరంలోని ప్రధాన కూ డళ్ల వద్ద ఈ యంత్రాలను ఏర్పాటు చేశారు. కోర్టు సర్కిల్ వద్ద సీపీ యంత్రాలను ప్రారంభించారు. సీపీ మాట్లాడుతూ ఈ యంత్రా లను ఏర్పాటు చేస్తే మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు అని తెలిపారు. వేసవి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందన్నారు. ఈ యంత్రాలను ఏర్పాటు చేయడానికి సహకరించిన వాసవి క్లబ్ వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సీఐ , సిబ్బంది పాల్గొన్నారు.


