కార్చిచ్చు అంటుకోకుండా.. | - | Sakshi
Sakshi News home page

కార్చిచ్చు అంటుకోకుండా..

May 17 2026 7:20 AM | Updated on May 17 2026 7:20 AM

వేసవి కాలంలో అడవులకు అతిపెద్ద ముప్పు గా పరిణమించే కార్చిచ్చును (ఫారెస్ట్‌ ఫైర్స్‌) అరికట్టడం అధికారులకు అతిపెద్ద సవాల్‌. ఇందుకు ఫైర్‌ వాచర్లు, బీట్‌ ఆఫీసర్లు, సెక్షన్‌ ఆఫీసర్లు, రేంజ్‌ అధికారులు అడవులకు నిప్పు అంటుకోకుండా నిఘా పెట్టారు. ముందు జాగ్రత్త చర్యగా ఫైర్‌లైన్స్‌ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ గుర్తు తెలియని వ్యక్తుల చర్యల కారణంగా అడవులు, గుట్టలకు నిప్పు అంటుకుంటోంది. శాటిలైట్‌ అలర్ట్స్‌ ఆధారంగా నిప్పు అంటుకున్న ప్రాంతాలకు సిబ్బంది వెళ్లి వెంటనే బ్లోయర్ల సహాయంతో మంటలను ఆర్పేస్తున్నారు. ఎర్రటి ఎండలో సైతం మంటలను అదుపు చేస్తున్నారు. జిల్లా అటవీ శాఖ సిబ్బంది, అధికారుల కర్తవ్య దీక్షపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement