రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు
ఖలీల్‌వాడి: ఎప్‌సెట్ ఫలితాలలో కాకతీయ కాలేజీ విద్యార్థులు తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన స్టేట్ ర్యాంకులు సాధించినట్లు విద్యాసంస్థల చైర్‌పర్సన్ విజయలక్ష్మి, డైరెక్టర్ రజినీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తరగతులు, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, వీక్లీ, మంత్లీ పరీక్షలు నిర్వహించడంతోపాటు లెక్చరర్లతో ప్రత్యేకంగా సిలబస్ చెప్పడం ద్వారా ఉత్తమ ఫలితాలు వచ్చాయని అన్నారు. కాకతీయ రెసిడెన్షియల్ కాలేజ్ విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం అభినందించారు. ఎప్‌సెట్‌లో అబ్దుల్ షాహిద్ (3406), ఆత్రిజ్ (3862), ఎ. వచన్ (4974), భవకీర్తన్ (5963), లోక సమీక్ష (6085), ఈ. శరత్‌చంద్ర (7003), సిద్ధి వినాయక్ (7350), మైరతైతెల్ (7390), సదియా ఫిర్దౌస్ (7830), సుజానా(8450), తుబా ఫాతిమా (9666), ఐషా ఆలం(10990) ర్యాంకులు సాధించినట్లు చెప్పారు.


