ఇబ్బంది పడుతున్నాం.. | - | Sakshi
Sakshi News home page

ఇబ్బంది పడుతున్నాం..

May 13 2026 1:44 AM | Updated on May 13 2026 1:44 AM

నీట్‌ పరీక్ష రద్దుతో ఇబ్బందులు పడుతున్నాం. నీట్‌ కోసం ప్రిపేర్‌ అయి మంచిగా పరీక్ష రాశాం. ఈ పరీక్షలో మంచి ర్యాంకు వస్తుందని భావిస్తున్నాం. మళ్లీ నీట్‌ పరీక్ష కోసం చదవాల్సి వస్తుంది. పరీక్షల పూర్తి తర్వాత రిలాక్స్‌ ఆవుతామని భావిస్తే, మళ్లీ పరీక్ష కోసం సిద్ధం కావాల్సి వస్తుంది. నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ ఘటనతో విద్యార్థుల ఆశలు నిరాశ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల లీక్‌ చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. – హిమాన్షి, నిజామాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement