నిజామాబాద్‌అర్బన్: జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌లో ఏర్పాటు చేయనున్న జవహార్ నవోదయ విద్యాలయ కొత్త క్యాంపస్ భవన నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ ఇలా త్రి పాఠి శుక్రవారం సమీక్షించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఇ ప్పటివరకు చేపట్టిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతతో వేగంగా చేపట్టాలని, విద్యార్థులకు అ న్ని వసతులు అందుబాటులో ఉండేలా చూ డాలని అధికారులను ఆదేశించారు. సమా వేశంలో జవహార్ నవోదయ ఇన్‌చారి్‌జ్ ప్రి న్సిపాల్ పి జోజిబాబు, డీఈవో అశోక్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఐటీ చట్టం– 2025పై అవగాహన
నిజామాబాద్‌అర్బన్: ఆదాయపు పన్ను చట్టం – 2025పై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శాఖ సీనియర్ అధికారులు సురేశ్, శుభంసింగ్, ఐశ్వర్య తదితరులు హాజరై వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించారు. సరళీకృత ఆదాయపు పన్ను చట్టం–2025 అమలులోకి వచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చేపట్టిన అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రారంభ్ –2026 పేరుతో ఇక్కడ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. కొత్త చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఐటీఐ, ఏటీసీల్లో అడ్మిషన్‌లకు నోటిఫికేషన్
ఖలీల్‌వాడి: తెలంగాణ ప్రభుత్వ ఉపాధి కల్పన, శిక్షణ పారిశ్రామిక శిక్షణా కేంద్రాల్లో (ఐటీఐ), అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లలో ఉచిత అడ్మిషన్‌ల కోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు జిల్లా కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ (బాలుర) ప్రిన్సిపాల్ జి.యాదగిరి, బాలికల కళాశాల ప్రిన్సిపాల్ విద్యాసాగర్‌రెడ్డి శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. 2026 సంవత్సరానికి ఈనెల 14 నుంచి జూన్ 8వ తేదీ వరకు అడ్మిషన్‌ల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో ఐదు ప్రభుత్వ ఐటీఐలు, ఐదు ఏటీసీలు, మూడు ప్రైవేట్ ఐటీఐలలో విద్యార్థులు అ డ్మిషన్‌లు పొందవచ్చని కన్వీనర్ యాదగిరి తెలిపారు. నోటిఫికేషన్, కోర్సులు, విద్యార్హతల వివరాల కోసం website: https://iti. telangana.gov.in చూడాలని సూచించారు. దరఖాస్తు చేసే సమయంలో ఉపయోగించిన మొబైల్ (సెల్) నంబర్, ఈ మెయిల్‌లను ఐటీఐ కోర్సు పూర్తి అయ్యేవరకు మార్చొద్దని సూచించారు. మరిన్ని వివరాలకు 85004 67091, 85006 09532 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. అలాగే బాలికల ఐటీఐలో అడ్మిషన్‌ల వివరాల కోసం 89192 62418, 94417 07536, 99630 91233 నంబర్లను సంప్రదించాలని విద్యాసాగర్‌రెడ్డి సూచించారు.


