● కలెక్టర్ ఇలా త్రిపాఠి,
సీపీ సాయిచైతన్య
● జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై సమన్వయ కమిటీ సమావేశం
నిజామాబాద్ అర్బన్: పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య అధికారులను ఆదేశించారు. బక్రీద్ నేపథ్యంలో కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. పశువు ల అక్రమ రవాణా నిరోధం, జంతు సంక్షేమ నియమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్, సీపీ సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అధికారులు సమన్వయంతో పని చే యాలని, జంతు సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాలను ఉల్లంఘించకుండా చూడాలని అన్నారు. గోవ ధపై నిషేధం ఉందని, అలాగే మన రాష్ట్రంలో ఒంటెలను సైతం వధించకుండా నిషేధం అమలులో ఉందని తెలిపారు. పశువులను తరలించడానికి, వాటిని వధించడానికి ముందు తప్పనిసరిగా పశు వైద్యాధికారి నుంచి ధ్రువీకరణ పొందాలని స్పష్టం చేశారు. పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లాలోని కందకుర్తి, సాలూర, పొతంగల్, ఖండ్‌గావ్ వద్ద అంతర్‌ర్రాష్ట్ర చెక్ పోస్టులతోపాటు సాటాపూర్, యంచ, ఇందల్వాయి, ఉమ్మెడ, జన్నేపల్లి, మామిడిపల్లి తదితర ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా అంతర్ జిల్లా చెక్ పోస్టులను ఏ ర్పాటు చేస్తున్నామని సీపీ తెలిపారు. సమావేశంలో అదనపు డీసీపీ శుభం ప్రకాశ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, బోధన్ ఆర్డీవో విజయలక్ష్మి, నిజామాబాద్, ఆర్మూర్ ఏసీపీలు ప్రకాశ్‌యాదవ్, వెంకటేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల, ఎంవీఐ లు శ్రీనివాస్, కిరణ్, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గంగాధరయ్య, పోలీస్, రెవెన్యూ, పశు సంవర్ధక, పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


