● 24గంటల్లో ధాన్యం సేకరణ
సమస్యలను పరిష్కరించండి
● అధికారులను హెచ్చరించిన
మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
మోర్తాడ్: రైతుల సమస్యలను 24 గంటల్లో పరిష్కరించకపోతే తాను ఆందోళనకు సిద్ధమవుతానని, రోడ్డెక్కుతానని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. తరుగు పేరుతో రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని ఆ రోపించారు. బాల్కొండ మండలం కిసాన్‌నగర్, మోర్తాడ్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయ న శనివారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. అక్కడి నుంచి జిల్లా అడిషనల్ కలెక్టర్, పౌర సరఫ రాల శాఖ అధికారితో ఫోన్‌లో మాట్లాడారు. అరగంట నుంచి ప్రయత్నిస్తున్నా కలెక్టర్ తన కాల్స్‌కు స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ధా న్యం సేకరణలో లోపాలు చోటు చేసుకుంటున్నా యని ఆరోపించారు. తరుగు పేరుతో సతాయించే మిల్లుల జాబితాను సిద్ధం చేసి వాటిని సీజ్ చేస్తే రైస్‌మిల్లర్లు ఎందుకు ధాన్యాన్ని అన్‌లోడింగ్ చేసుకోరని ఆయన ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ధాన్యం సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూశామన్నారు. క్వింటాల్‌కు 10 కిలోల తరుగు తీస్తామని చెబుతున్న మిల్లర్ల భరతం పట్టాలని అధికారులకు సూచించారు.


