● రైస్‌మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు
● ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు నిరసన
● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
వేల్పూర్: నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను గత మూడు రోజులుగా తాను స్వయంగా సందర్శించానని, సేకరణలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలోని క్యాంపుకార్యాలయంలో ఆదివారం సా యంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ధా న్యం కొనుగోలు చేస్తామని ప్రకటించి సెంటర్లు తెరి చే సరికి 15 రోజులు, గన్నీ బ్యాగులు వచ్చేసరికి వా రం, కాంటా పెట్టేసరికి మరో వారం అన్నట్టుగా 20 రోజులపాటు కావాలనే ప్రభుత్వం జాప్యం చేసిందని విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు ప్రైవే ట్ వ్యాపారులకు తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయిస్తూ క్వింటాల్‌కు రూ.500 నష్టపోతున్నారన్నా రు. రైస్‌మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, తరు గు పేరుతో 40 కిలోలకు 5 కిలోల అదనపు వడ్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. రెతు సమస్యలపై మాట్లాడేందుకు కలెక్టర్‌కు ఫోన్ చేస్తే ఎత్తడం లేదని, కనీసం స్పందించే తీరిక కూడా వారికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మోర్తాడ్‌లో సోమవారం నిరసన తెలుపనున్నామని, బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.


