కొన్ని బంధాల్ని, అనుబంధాల్ని వర్ణించడానికి మాటలు చాలవు. వ్యక్తిగత కోరికల్ని ఆశల్ని, ఆశయాల్ని కూడా తృణ ప్రాయంగా త్యజించే వారి త్యాగం, అంతకుమించిన అంతులేని ప్రేమ నిజంగా అందరి హృదయాల్ని కదిలించక మానదు. అలాంటి కథ ఒకటి ఎక్స్‌లో విశేషంగా నిలుస్తోంది.
ఎక్స్‌లో సునీల్ కుమార్ షేర్ చేసిన వివరాల ప్రకారం 51 ఏళ్ల శీతల్, మానసిక వికలాంగుడైన 48 ఏళ్ల సోదరుడు అశ్విన్ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేశారు. అక్కా తమ్ముళ్ల అనుబంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ, ఒక అక్కగా తన సోదరుడిపై తల్లి ప్రేమకు మించి చూపిస్తున్న ఆమె ప్రేమ నెట్టింట పలువురి ప్రశంసలు దక్కించుకుంటోంది.
ఇదీ చదవండి: రూ. 2 లక్షల జీతం, అయినా తిప్పలే : ఎలా ఈ సంసారం!
తల్లిదండ్రులను కోల్పోయిన తరువాత, శీతల్ ఒక్క క్షణం కూడా తన గురించి ఆలోచించలేదు. తన సొంత కలల కంటే తమ్ముడి భవిష్యత్తు గురించి బెంగపడ్డారు. సోదరుడి సంతోషానికి ప్రాధాన్యతనిచ్చి, అనుక్షణం అతనికి చంటి పిల్లాడిలా సపర్యలు చేస్తూ, అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుతున్నారు.ఇందుకోసం తన ఉద్యోగాన్ని వదులుకున్నారు. తాను పెళ్లి చేసుకోని వెళ్లిపోతే తమ్ముడు ఒంటిరి వాడైపోతానే ఆవేదనతో అసలు పెళ్లే చేసుకోకూడదని నిర్ణయించు కున్నారు.
She gave up her job, her marriage,
and her dreams... just to become a mother to her brother ♥️🙏
एक बहन का प्यार... जो माँ से रत्ती भर भी कम नहीं होता। ❤️
51 साल की शीतल... और 48 साल का उनका भाई अश्विन...
एक ऐसा अटूट रिश्ता, जिसे देखकर आँखें भर आएँगी। 🥹
जब सिर से माँ-बाप का… pic.twitter.com/edMH8G3bZ2— Sunil Kumar (@sunilku20403616) June 8, 2026
ఇదీ చదవండి: ప్రియుడితో వధువు పరార్, చెల్లితో పెళ్లి ఫిక్స్, మళ్లీ ప్రియుడి లొల్లి!
శీతల్ ప్రేమ, అంకితభావానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ప్రేమ తల్లి ప్రేమకు ఏమాత్రం తీసిపోనిది.వారిద్దరి విడదీయలేని అనుబంధం. వారి ప్రేమ నిజంగా హృదయాన్ని కదిలిస్తోందంటున్నారు. ఇది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, ఈ ప్రపంచాన్ని అందంగా మార్చే నిస్వార్థమైన ప్రేమ. సోదరి త్యాగానికి, మాతృత్వపు ప్రేమకు జోహార్లు అని కొనియాడుతున్నారు. అందరికీ ఇలాంటి సోదరి ఉండాలని అకాంక్షిస్తున్నారు.
ఇదీ చదవండి: 27 ఏళ్లకే భర్త దూరం : రూ. 500తో మొదలై రూ. 75 లక్షల టర్నోవర్


