సాక్షి, ఢిల్లీ: ప్రధాని మోదీ మరో వీడియో విడుదల చేశారు. నిన్న అర్థరాత్రి (గురువారం) తను పోస్ట్ చేసిన వీడియోపై అభిప్రాయాలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. విలువైన సూచనలు చేసిన యువతకు ప్రత్యేక కృతజ్ఞతలని పేర్కొన్నారు. యువతరం ఇచ్చే విలువైన సలహాలు దేశ భవిష్యత్తుకు మరింతగా సహకరిస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. కేంద్ర కేబినేట్ భేటీ అనంతరం మోదీ ఈ వీడియోని విడుదల చేశారు.
మోదీ మాట్లాడుతూ "ధన్యవాదాలు మిత్రులారా. నిన్న రాత్రి ఆలస్యంగా మిమ్మల్ని కలిసే అవకాశం నాకు లభించింది. నా వీడియోకు మీరు స్పందించిన తీరును, మీ సానుకూల సూచనలను నేను అభినందిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు..." అని అన్నారు.
కాగా నిన్న (గురువారం) నీట్ లీకేజ్‌పై జరుగుతున్న నిరసనలపై మోదీ కీలక ప్రకటన చేశారు" నీట్ లీకేజ్‌పై కేంద్ర కేబినేట్‌లో పేపర్‌లీక్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. పేపర్ లీకెజ్‌లపై కఠిన చర్యలు తీసుకునేలా నిర్ణయాలుంటాయని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ వివరాలను ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు.
#WATCH | Prime Minister Narendra Modi shared a video on his Instagram handle;, "Thanks to the youngsters who watched my video yesterday and sent insightful suggestions."
He says, "Thank you friends. I had the opportunity to meet you late last night. I appreciate the way you… https://t.co/B4hrqwPwic pic.twitter.com/t6hfaVcvET— ANI (@ANI) July 24, 2026


