ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
డేటింగ్‌యాప్‌లో పరిచయమైన మహారాష్ట్ర క్రికెట్ జట్టు యువక్రికెటర్‌ను ప్రేరేపించి అర్ధనగ్నంగా మార్చి వీడియో రికార్డు చేసిన యువతి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేసింది. యువక్రికెటర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈశాన్య విభాగ సెన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈనెల 17వ తేదీన కణ్ణూరు వద్ద పంచతార హోటల్‌లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
బెంగళూరులో క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో యువక్రికెటర్ మహారాష్ట్ర నుంచి నగరానికి చేరుకుని హోటల్‌లో ఉన్నాడు. డేటింగ్ యాప్‌లో పేరు నమోదు చేసుకున్న క్రికెటర్‌కు 17వ తేదీ రాత్రి గుర్తు తెలియని యువతి నుంచి మెసేజ్ వచ్చింది. వాట్సాప్‌కాల్‌లో మాట్లాడాలని తెలిపి నెంబర్ షేర్ చేసింది. అనంతరం ఇద్దరు వాట్సాప్ వీడియో కాల్‌లో మాట్లాడుకున్నారు.
ఆ సమయంలో యువతి ఒంటిపై దుస్తులు తీసేసింది. క్రికెటర్ కూడా దుస్తులు తీసి అర్ధనగ్నంగా ఉండగా వీడియో రికార్డ్ చేసింది. కొద్దిసేపటి తరువాత క్రికెటర్‌కు ఫోన్ చేసి నగ్న వీడియో స్క్రీన్‌షాట్‌లు పంపించి డబ్బు ఇవ్వాలని బెదిరించింది. కంగారు పడిన క్రికెటర్ రూ.1,500 ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. ఇంకా ఎక్కువ డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.


