కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభం.. లాన్‌ బౌల్స్‌లో భార‌త్ శుభారంభం | Commonwealth Games 2026, India Begins Medal Hunt With Early Lawn Bowls Success, While Doping Cases Cast A Shadow | Sakshi
Sakshi News home page

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభం.. లాన్‌ బౌల్స్‌లో భార‌త్ శుభారంభం

Jul 24 2026 7:41 AM | Updated on Jul 24 2026 10:00 AM

Commonwealth Games 2026: Indian Players Secure Key-Wins-Lawn Bowls

భారత జాతీయ జెండాతో మీరాబాయి, లవ్లీనా (PC: IOA Twitter)

గ్లాస్కో వేదిక‌గా కామన్వెల్త్‌ గేమ్స్‌ గురువారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భార‌త్ త‌ర‌ఫున వెయిట్‌లిఫ్ట‌ర్ మీరాబాయి చాను, లవ్లీనా బొర్గొహైన్ ఫ్లాగ్ బేరర్స్‌గా వ్య‌వ‌హ‌రించారు. మువ్వ‌న్నెల జెండాను చేత‌ప‌ట్టి వీరిద్ద‌రు ముందు న‌డ‌వ‌గా, వారిని భార‌త జ‌ట్టు అనుస‌రించింది. ఇక గేమ్స్ ప్రారంభానికి ముందే బాక్స‌ర్ లవ్లీనా భార‌త్‌కు ప‌తకం ఖాయం చేయ‌గా, లాన్ బౌల్స్ గేమ్‌లో భార‌త్ శుభారంభం చేసింది.

లాన్‌ బౌల్స్‌ మహిళల పెయిర్స్‌ ఈవెంట్‌లో భారత్‌ తొలి రౌండ్‌లో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో భారత జోడీ రూపా రాణి–పింకీ ‘టైబ్రేక్‌’లో మాల్టాను ఓడించింది. తొలి సెట్‌ను భారత్‌ 7–1, రెండో సెట్‌ను మాల్టా 4–3తో గెలుచుకోవడంతో టైబ్రేక్‌ అనివార్యమైంది. చివరి బౌల్‌లో రాణించి పింకీ జట్టును గెలిపించింది. పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్‌ పుతుల్‌ సోనోవాల్‌ 5–4, 3–7, 1–0తో ‘టైబ్రేక్‌’లో 2023 ప్రపంచ చాంపియన్‌ రియాన్‌ బెస్టెర్‌ (కెనడా)పై సంచలన విజయం సాధించాడు.  

డోపింగ్‌లో పట్టుబడిన భారత ప్లేయర్లు 
డోపింగ్‌లో పట్టుబడటంతో భారత జూడో క్రీడాకారుడు అరుణ్‌ కుమార్‌ కామన్వెల్త్‌ క్రీడలకు దూరమయ్యాడు. 73 కేజీల విభాగంలో అతను బరిలోకి దిగాల్సి ఉంది. అయితే ఇటీవల నిర్వహించిన డోపింగ్‌ పరీక్షలో అతను నిషేధిత ఉత్రే్పరకం వాడాడని తేలడంతో జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) అరుణ్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. దాంతో గ్లాస్గోకు వెళ్లాల్సిన భారత టీమ్‌ నుంచి అతడిని తప్పించారు.  

ఇక వెయిట్‌లిఫ్టింగ్‌లో ప‌లువురు ఆట‌గాళ్లు డోపింగ్ నిబంధ‌న‌లు ఉల్ల‌ఘించ‌డంతో భార‌త్‌కు కేటాయించిన కోటాను 16 నుంచి 11కు త‌గ్గిస్తూ కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల నిర్వాహక మండలి నిర్ణ‌యం తీసుకుంది. అజిత్ (71 కేజీలు), సాయిరాజ్ ప‌ర‌దేశి (88 కేజీలు), హ‌ర్‌చ‌ర‌ణ్ సింగ్ (110 కేజీలు), వంశితా వ‌ర్మ (86 కేజీలు) డోపింగ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన‌ట్లు తేలింది. 

 


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement