కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయం | CWG 2026: Boxer Lovlina Borgohain secures 1st medal for India | Sakshi
Sakshi News home page

CWG 2026: భారత్‌కు తొలి పతకం ఖాయం.. సెమీస్‌కు బాక్సర్‌ ల‌వ్లీనా

Jul 23 2026 3:25 PM | Updated on Jul 23 2026 3:48 PM

CWG 2026: Boxer Lovlina Borgohain secures 1st medal for India

కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026 ఆరంభానికి ముందే భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. బాక్సర్‌ లవ్లీనా బొర్గొహేన్‌ నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్‌ ఫైనల్లో బై లభించడంతో ఆమెకు సెమీస్‌కు అర్హత సాధించింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని లవ్లీనా ఖరారు చేసుకుంది. 

జూలై 31న 75 కిలోల మహిళా విభాగంలో జరిగే సెమీస్‌ పోటీలో లవ్లీనా తువాలుకు చెందిన తఫాకిని ఎదుర్కోనుంది. కాగా డ్రాలో కేవలం ఐదుగురు అథ్లెట్లు మాత్రమే ఉండటంతో.. బోర్గోహైన్‌తో సహా ముగ్గురు బాక్స‌ర్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించగా, మిగిలిన ఇద్దరు క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో తలపడాల్సి ఉంది.  ఈసారి  కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో భార‌త్ త‌ర‌పున‌ 124 మంది అథ్లెట్లు పాల్గోనున్నారు. గురువారం సాయంత్రం కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement