వరల్డ్‌ నంబర్‌వన్‌ జైస్మీన్‌ | Jaismine Lamboria top in world boxing rankings | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ నంబర్‌వన్‌ జైస్మీన్‌

Jun 5 2026 4:08 AM | Updated on Jun 5 2026 4:08 AM

 Jaismine Lamboria top in world boxing rankings

ప్రపంచ బాక్సింగ్‌ ర్యాంకింగ్స్‌  

న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత మహిళా బాక్సర్‌ జైస్మీన్‌ లంబోరియా అగ్రస్థానానికి చేరుకుంది. తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో 57 కేజీల విభాగంలో ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని జైస్మీన్‌ నంబర్‌వన్‌గా నిలిచింది. ప్రస్తుత వరల్డ్‌ చాంపియన్‌ కూడా అయిన ఆమె ఇటీవల ఆసియా చాంపియన్‌షి ప్‌లో రజతం గెలుచుకుంది. మహిళల విభాగంలో 9 వేర్వేరు వెయిట్‌ కేటగిరీల్లో టాప్‌–10లో భారత బాక్సర్లు ఉండటం విశేషం. 

48 కేజీల విభాగంలో మీనాక్షి తన నంబర్‌వన్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్‌ ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో ర్యాంక్‌కు చేరింది. ఆసియా చాంపియన్‌షి ప్‌ స్వర్ణం సాధించిన ప్రియ ఘంఘాస్‌ (60 కేజీలు) మూడో స్థానంలో నిలిచింది. వరల్డ్‌ కప్‌లో పతకాలు గెలిచిన అరుంధతి (70 కేజీలు), పూజ రాణి (80 కేజీలు), నుపుర్‌ (80+ కేజీలు) తమ కేటగిరీల్లో రెండో ర్యాంకుల్లో నిలిచారు.  

నాలుగో స్థానంలో నిఖత్‌ 
రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ (51 కేజీలు) నాలుగో స్థానానికి పడిపోగా, ఒలింపిక్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్‌ (75 కేజీలు) తన 7వ స్థానాన్ని నిలబెట్టుకుంది. పురుషుల విభాగంలో ఆసియా చాంపియన్‌షి ప్‌ స్వర్ణపతక విజేత విశ్వనాథ్‌ సురేశ్‌ (50 కేజీలు) మూడో స్థానానికి చేరుకున్నాడు. 

సచిన్‌ సివాచ్‌ (60 కేజీలు), నరేందర్‌ బెర్వాల్‌ (90+ కేజీలు) టాప్‌–5లోకి చేరుకున్నారు. హితేశ్‌ గులియా (70 కేజీలు) 6వ ర్యాంక్‌లో, అభినాశ్‌ జమ్వాల్‌ (65 కేజీలు) 8వ ర్యాంక్‌లో ఉన్నారు. ఆకాశ్‌ (75 కేజీలు), లోకేశ్‌ (85 కేజీలు) కూడా తొలిసారి టాప్‌–10లోకి అడుగు పెట్టి 8వ స్థానంలో నిలిచారు. ఓవరాల్‌గా టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత మహిళలల జట్టు 2వ ర్యాంక్‌లో, పురుషుల జట్టు 4వ ర్యాంక్‌లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement