ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్( అంతర్జాతీయ క్రికెట్ + లీగ్ క్రికెట్)లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా బట్లర్ నిలిచాడు.
'ది హండ్రెడ్ 2026' టోర్నీలో భాగంగా లార్డ్స్ వేదికగా లండన్ స్పిరిట్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఇప్పటివరకు బట్లర్ టీ20ల్లో 14,572 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(14,562) పేరిట ఉండేది.
తాజా మ్యాచ్‌తో గిల్‌ను బట్లర్ వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్(14,803 పరుగులు) అగ్రస్ధానంలో ఉన్నాడు. పొలార్డ్ కంటే బట్లర్ కేవలం 231 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో ఇదే జోరు కొనసాగిస్తే పొలార్డ్‌ను దాటేసి నంబర్-1 స్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. లండన్ స్పిరిట్‌పై 7 పరుగుల తేడాతో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ సంచలన విజయం సాధించింది. లుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లండన్ స్పిరిట్‌ను మాంచెస్టర్ 131 పరుగులకే కట్టడి చేసింది.
చదవండి: ఇంగ్లండ్ తదుపరి టెస్ట్ కెప్టెన్ అతడే?


