1000 సిక్సర్లు పూర్తి చేసుకున్న విండీస్‌ యోధుడు | KIERON POLLARD completed 1000 sixes in T20 History, 2nd batter after Chris Gayle | Sakshi
Sakshi News home page

1000 సిక్సర్లు పూర్తి చేసుకున్న విండీస్‌ యోధుడు

Jul 16 2026 3:41 PM | Updated on Jul 16 2026 3:49 PM

KIERON POLLARD completed 1000 sixes in T20 History, 2nd batter after Chris Gayle

credit : x

వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పోలార్డ్ టీ20 క్రికెట్‌లో అత్యంత అరుదైన మైలురాయిని తాకాడు. మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) 2026లో భాగంగా వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 8 సిక్సర్లు బాదిన అతడు.. పొట్టి ఫార్మాట్‌లో 1000 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. 

తద్వారా ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఇప్పటికే ఈ ఘనత సాధించిన మరో క్రికెటర్‌ కూడా విండీస్‌ యోధుడే (క్రిస్‌ గేల్‌-1056) కావడం విశేషం.కెరీర్‌లో ఇప్పటివరకు 746 టీ20 మ్యాచ్‌లు ఆడిన పోలార్డ్‌ 1001 సిక్సర్లతో పాటు 923 ఫోర్లు కూడా బాదాడు.

టీ20 క్రికెట్‌లో టాప్‌-5 అత్యధిక సిక్సర్ల వీరులు
గేల్‌- 1056
పోలార్డ్‌- 1001
రసెల్‌- 792
పూరన్‌- 764
బట్లర్‌- 630

మ్యాచ్‌ విషయానికొస్తే.. పోలార్డ్‌ (25 బంతుల్లో 64; ఫోర్‌, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పాటు పూరన్‌ మెరుపు శతకం చేయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ న్యూయార్క్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.

ఇంత భారీ స్కోర్‌ చేసిన ఎంఐ బౌలర్లు దీన్ని కాపాడుకోలేకపోయారు. ఫ్రీడం బ్యాటర్లు స్టీవ్‌ స్మిత్‌ (110 నాటౌట్‌), ఆండ్రియస్‌ గౌస్‌ (132) సుడిగాలి శతకాలు బాది, మరో 8 బంతులు మిగిలుండగానే రికార్డు లక్ష్యాన్ని ఊదేశారు. పొట్టి క్రికెట్‌ ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement