Source: Femalecricket.com
వెస్టిండీస్ మహిళల క్రికెట్ దిగ్గజం స్టెఫానీ టేలర్ అరుదైన మైలురాయిని తాకింది. ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో సూపర్ సెంచరీ (105) చేసిన ఆమె.. అంతర్జాతీయ క్రికెట్‌లో 10000 పరుగులు పూర్తి చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి వెస్టిండీస్ మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఐదో ప్లేయర్‌గా నిలిచింది.
ఈ జాబితాలో ఇప్పటికే మిథాలీ రాజ్ (10868), సుజీ బేట్స్ (10740), స్మృతి మంధాన (10737), షార్లెట్ ఎడ్వర్డ్స్ (10273) ఉన్నారు. 35 ఏళ్ల టేలర్ అన్ని ఫార్మాట్లలో కలిపి 307 ఇన్నింగ్స్‌ల్లో 10005 పరుగులు చేసింది. అదనంగా ఆమె మూడు ఫార్మాట్లలో కలిపి 254 వికెట్లు కూడా తీసింది.
2008లో ఐర్లాండ్‌పైనే వన్డే అరంగేట్రం చేసిన టేలర్, ఇప్పటివరకు 179 వన్డేల్లో 6339 పరుగులు సాధించింది. ఇందులో 10 శతకాలు, 42 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20 అంతర్జాతీయాల్లో 139 మ్యాచ్‌ల్లో 3666 పరుగులు చేసి 22 అర్ధశతకాలు నమోదు చేసింది.
ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టేలక్ సెంచరీ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 257 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఐర్లాండ్‌ను 193 పరుగులకే కుప్పకూల్చి 64 పరుగుల తేడో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
అంతకుముందు రెండో వన్డేలోనూ టేలర్ అజేయ శతకం (100*) సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.


