పవన్‌కు బిగ్‌ షాకిచ్చిన బొలిశెట్టి సత్యనారాయణ | bolisetty satyanarayana Sensational Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌కు బిగ్‌ షాకిచ్చిన బొలిశెట్టి సత్యనారాయణ

Jul 16 2026 1:41 PM | Updated on Jul 16 2026 1:47 PM

bolisetty satyanarayana Sensational Comments On Pawan Kalyan

సాక్షి, విశాఖ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ. గతంలో అమరావతిలో బలవంతపు భూసేకరణను పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారని సత్యనారాయణ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే మాటకి పవన్ కల్యాణ్ కట్టుబడి ఉండాలన్నారు. కూటమిలో ఉన్నాము కదా రైతులను ఉరితీసిన పరవాలేదు అనుకుంటే కుదరదు అంటూ హితవు పలికారు.

జనసేన బహిష్కృత నేత, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా వీడియోలో మాట్లాడుతూ.. అమరావతిలో బలవంతపు భూసేకరణపై ప్రజలకు పవన్ కల్యాణ్ వైఖరి చెప్పాలి. గతంలో చంద్రబాబు చేసింది తప్పు అయితే.. నేడు చేసేది కూడా తప్పే అవుతుంది కదా?. గతంలో కంటే నేడు దారుణంగా బలవంతపు భూసేకరణ జరుపుతున్నారు. అమరావతికి 33 వేల ఎకరాలు భూమి సరిపోతుందన్నారు. నేడు లక్ష 75 వేల ఎకరాలు భూమి సేకరిస్తున్నారు. ఈ భూమి అంతా ఎవరి ప్రయోజనాల కోసం? అని ప్రశ్నించారు.

ఇదే సమయంలో త్వరలోనే బలవంతపు భూసేకరణ పై సమావేశం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే, ఈ సమావేశానికి పవన్ కల్యాణ్‌ను కూడా ఆహ్వానిస్తానని చెప్పుకొచ్చారు. ప్రజా ప్రతినిధులు ఉన్నది చట్టాలను గౌరవించడానికి... అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా చేస్తే కుదరదు. మొదటి విడత భూసేకరణలో 13వేల ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్ట రాదని ఎన్జీటీ తీర్పునిచ్చింది. రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ జరుపుతున్నారు. రాత్రికి రాత్రి జీవోలు విడుదల చేస్తున్నారు’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement