ఏడుకొండలు మృతి.. సంచలన విషయాలు చెప్పిన సాక్షులు | Riyaz And Prasad Key Statement On Yedukondalu Death | Sakshi
Sakshi News home page

ఏడుకొండలు మృతి.. సంచలన విషయాలు చెప్పిన సాక్షులు

Jul 16 2026 12:20 PM | Updated on Jul 16 2026 12:29 PM

Riyaz And Prasad Key Statement On Yedukondalu Death

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఏడుకొండలు మృతి కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మృతికి సంబంధించి చోరీ కేసులో ఏడుకొండలుతో నిందితులుగా ఉన్న రియాజ్‌, ప్రసాద్‌ కీలక విషయాలను వెల్లడించారు. ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు నిజాలను బయటపెట్టారు. చోరీ కేసులో తమను పోలీసులు హింసించారని రియాజ్‌, ప్రసాద్‌ చెప్పుకొచ్చారు. పోలీసుల దెబ్బలకే ఏడుకొండలు చనిపోయాడని వారిద్దరూ తెలిపారు.

దొంగతనం కేసులో ఏడుకొండలతో నిందితులుగా ఉన్న రియాజ్, ప్రసాద్ తాజాగా పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్బంగా. ‘ఏడుకొండలను పోలీసులు.. 10వ తేదీ అదుపులోకి తీసుకొని 12వ తేదీన వదలిపెట్టారు. తిరిగి 13వ తేదీ ఉదయం రావాలని పోలీసులు చెప్పారు. 14వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఓ కారులో ఏడుకొండలను స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు. అప్పటికి ఏడుకొండలుకు ఉలుకు పలుకు లేకపోవడంతో అటు నుండి అటే.. రెండు గంటల తరువాత గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఏడుకొండలు మృతి చెందినట్టు పోలీసులు తేల్చారు’ అని తెలిపారు. పోలీస్ దెబ్బలకే ఏడుకొండలు చనిపోయాడు అనడానికి సాక్షులు తెలిపిన వివరాలు కీలకం కానున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement