వెయిట్‌లాస్ ఒక్కోక్కరూ ఒక్కో విధానం అనుసరిస్తూ బరువు తగ్గుతారు. బరువు తగ్గించుకోవడమే కాదు దాన్ని అదుపులో ఉంచుకునేలా మెయింటైన్ చేయడమే అత్యంత ముఖ్యం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరానికి అనుగుణంగా, నిలకడైన జీవనశైలితో నిధానంగా బరువు తగ్గడం అన్ని విధాల మేలు అని అందరికీ తెలిసిందే. ఆ విధంగానే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ మామ్ అనుసరించి ఏకంగా 32 కిలోలు తగ్గింది. అంతేగాదు అందుకోసం తాను ఏమి అనుసరించిందో కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చసుకుంది. మరి అవేంటో చూద్దామా.!.
శాన్ డియాగోకు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్, తానియా అనే పిల్లల తల్లి వెయిట్‌లాస్ జర్నీ ఇది. ఆమె 103 కిలోల నుంచి 71 కిలోలకు తగ్గిన జర్నీని షేర్ చేసుకుంది. అంతలా 32 కిలోలు తగ్గడానికి సులభమైన నిలకడైన అలవాట్లే కారణమని అంటోంది.
తాను ప్రధానంగా ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వ్యాయామం చేయడంపై దృష్టిసారించానని అంటోంది. మూడేళ్లలో దీన్ని సాధించానని పేర్కొంది. తాను వెయిట్‌ట్రైనింగ్, యోగ ద్వారా బరువు తగ్గినట్లు పోస్ట్‌లో తెలిపింది. ఇంట్లోనే సులభంగా బరువు తగ్గాలంటే ఐదు పనులు చేయాలని వెల్లడించింది. అవేంటంటే..
ప్రోటీన్
రోజుకు 3 సార్లు కనీసం 30 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది. ప్రాసెస్ చేసిన ప్రోటీన్ల కంటే..సహజసిద్ధమైన వాటికే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపింది. బరువు తగ్గాలనుకుంటే రోజుకి శరీరానికి తగినంత ప్రోటీన్ మస్ట్ అని అంటోందామె.
వ్యాయామంలో సౌలభ్యం..
ఒక తల్లిగా, ఖచ్చితమైన' వ్యాయామ సమయం కోసం వెతకడం మానేశాను. కొన్ని రోజులు ఉదయం 5 గంటలకు, కొన్ని రోజులు నా బిడ్డ నిద్రపోతున్నప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు, మరికొన్ని రోజులు అందరూ నిద్రపోయిన తర్వాత రాత్రి 9 గంటలకు కూడా వ్యాయామం చేశానని ఆమె చెప్పుకొచ్చింది. తన ఉద్దేశ్యంలో క్రమంతప్పకుండా చేయగలిగే సమయమే ఉత్తమమైన వ్యాయామ సమయం అని చెబుతోందామె. కచ్చితమైన షెడ్యూల్ అంటూ టై వేస్ట చేయొద్దని హెచ్చరించింది. జీవితానుగుణంగా కదలికలు ఉండేలా చూసుకోవడమే ముఖ్యం అని అంటోందామె.
బరువులు ఎత్తడం
తమకు సాధ్యమైనంత బరువును ఎత్తాలి. వారానికి 3 సార్లు బరువులు ఎత్తాలి. తక్కువ బరువుతో ప్రారంభించండి, క్రమబద్ధతను పెంచుకోమని చెబుతోంది. అలాగే పూర్తి శరీర వ్యాయామాలపై దృష్టి పెట్టండి, నెమ్మదిగా బరువులను పెంచుతూ పోవాలని సూచించింది.
శరీరానికి తగినంత నీరు..
హైడ్రేటెడ్‌గా ఉన్నారని నిర్ధారించుకోండి. రీర బరువులో సగం ఔన్సుల నీటిని తాగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.ఉదాహరణకు:బరువు 120 పౌండ్లు అయితే, రోజుకు 60 ఔన్సులు తాగాలని లక్ష్యంగా పెట్టుకోండి. హైడ్రేటెడ్‌గా ఉండటం శక్తికి, కోలుకోవడానికి మద్దతు ఇస్తుంది, అలాగు అత్యుత్తమ పనితీరును కనబరచడానికి సహాయపడుతుంది.
నిద్ర
వీలైనంత నాణ్యమైన నిద్రను లక్ష్యంగా పెట్టుకోండి. ప్రసవానంతర దశలో ఉంటే, కొన్ని రాత్రులు పరిపూర్ణంగా ఉండకపోవచ్చని అయినప్పటికీ ఫర్వాలేదని అంటోందామె. అలాంటి తల్లులు వీలైనప్పుడల్లా విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి, ఎందుకంటే కోలుకోవడం, కొవ్వు తగ్గడం, కండరాల నిర్మాణం, మొత్తం ఆరోగ్యం అన్నీ దానిపైనే ఆధారపడి ఉంటాయి.
ఇలా కనీసం ఆరు నుంచి 12 వారాల పాటు ప్రయత్నించి చూస్తే..కచ్చితంగా మనలోని మార్పు మనమే స్వయంగా చూస్తామని నమ్మకంగా చెబుతోంది. అంతేగాదు ఇలా క్రమంతప్పకుండా చేస్తే..ఆలోచనా విధానంలో మార్పు తోపాటు శరీరం కూడా బలంగా మారడాన్ని చూస్తామని అంటోంది.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: అత్యంత క్లిష్టమైన అరుదైన కణితిని విజయవంతంగా తొలగించిన వైద్యులు)


