సిరి సంపదలు ఉన్ననాడే... | On The Nature Of Wealth And Prosperity Inspirational Story | Sakshi
Sakshi News home page

సిరి సంపదలు ఉన్ననాడే...

Jul 16 2026 9:02 AM | Updated on Jul 16 2026 9:02 AM

On The Nature Of Wealth And Prosperity Inspirational Story

శతకనీతి

సిరి సంపదలు, భోగ భాగ్యాలు ఎల్లకాలం ఉండవు. కలకాలం ఒకే స్థాయిలోనూ ఉండవు, హెచ్చు తగ్గులు సహజం... సుమతీ శతకంలో సిరి సంపదలు ఎలా వస్తాయో, ఎలా పోతాయో చక్కగా చెప్పారు.

‘సిరి దా వచ్చిన వచ్చును
సరసంబుగ నారికేళ సలిలం భంగిన్‌
సిరిదా బోయిన బోవును
కరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతి’

కొబ్బరికాయలో నీరు ఎంత సహజంగా ఉంటుందో, వస్తుందో అంత సహజంగా సిరి వస్తుంది.. పోయేటప్పుడు మాయం అయిపోతుంది.. ఏనుగు తిన్న వెలగ పండులో గుజ్జు కూడా కంటికి కనపడదు.... అలాగే ఎంత ప్రయత్నం చేసినా సిరి రాదు. సిరి రాకపోకలు మన చేతిలో లేవు.
సంపదలు రాగానే చుట్టాలు వస్తారు..
‘ఎప్పుడు సంపద గలిగిన
నప్పుడు బంధువులు వత్తురది’ అంటూ మంచి ఉపమానం చెప్తాడు, సుమతి...‘దెప్పలుగ జెరువు నిండిన గప్పలు పదివేలు చేరు గదరా’.. 
చెరువులో నీరు ఉన్నప్పుడు కప్పలు చేరుతాయ్‌.. మానవ నైజాన్ని మనసుకు హత్తుకునేలా చెప్పాడు.

‘పరసతి కూటమి గోరకు
పరధనముల కాశపడకు, 
పరునెంచకుమీ
సరిగాని గోష్టి సేయకు
సిరి చెడి చుట్టంబుకడకు జేరకు సుమతీ’
మనం చేయకూడని ఐదు పనులు చెప్పాడు.. పర స్త్రీ ని, పరధనాన్నీ వద్దని.. ఇతరుల దోషాలని ఎంచవద్దని.. సిరి చెడితే చుట్టాలు దగ్గరికి వెళ్ళ వద్దని సలహా..

సిరి వచ్చినప్పుడు సిరి యైన గర్వింపకు 
సిరి లేనప్పుడు చింతింపకుము 
సిరియు విరియు నీరు సిరి కుప్ప వంటిది 
విశ్వదాభిరామ వినురవేమ! అంటాడు వేమన
అర్థం: డబ్బు వచ్చినా గర్వపడకు, లేకపోయినా బాధపడకు. సంపద నీటి బుడగ లాంటిది. మరో పద్యంలో సంపద వలన వచ్చే అనర్ధాలు చెప్తాడు

సిరికి మదము మదమునకు కీడు 
కీడునకు మృత్యువు కీడునకు చేటు 
చేటునకు నరకము చేరుట తథ్యము 
విశ్వదాభిరామ వినురవేమ!
సంపదతో మదం, మదంతో కీడు, కీడుతో నాశనం వస్తుందని

సిరి గలంత కాలము చుట్టములెల్లరు 
సిరి లేకున్న చుట్టములు చీకాకు 
సిరి లేని వాని జేరరు బంధులు 
భాస్కరా! వినుము కుజనుల వర్తన
అర్థం: డబ్బు ఉన్నంత కాలమే అందరూ చుట్టాలు. లేకపోతే దరిదాపుల్లోకి కూడా రారు.. ఇది వేమన చెప్పిన దానికి దగ్గరగా ఉంది.

సిరి సంపదలు నిల్చునా శాశ్వతముగా 
క్షణములోపల నశించు క్షీరతరంగ 
కావున దానధర్మముల కడకు వినియోగ 
భాస్కరా! వినుము సుజనుల మర్యాద
సంపద శాశ్వతం కాదు, క్షణంలో పోతుంది. అందుకే దానధర్మాలకు వాడాలని సలహా, సుమతీ శతకం నుండి.

లక్ష్మీ స్తనోపరి లుఠతి క్వచిదపి క్వచిత్‌ 
నేత్రాంతరాళముపయాతి క్వచిత్‌ క్వచిత్‌ చ 
ఏవం క్రమేణ సకలా జగదీశ్వరీ సా 
చంచలా పునరుపైతి చ నైవ యాతి... 
ఇది భర్తృహరి చెప్పింది
లక్ష్మి ఎప్పుడూ ఒకచోట ఉండదు. ఎవరి రొమ్ముపై, ఎవరి కంటి ముందు ఆడుతుందో తెలియదు. అందుకే చంచలమైనది.. మరో చోట సంపద శాశ్వతం కాదు అంటాడు

యేషా దానపరో న భోగరతః 
యో నైవ విద్యార్జనే 
తస్యార్థస్య ఫలం త్రిధైవ భవతి 
దానం భోగో నాశః
డబ్బును దానం చేయని వాడు, అనుభవించని వాడు, చదువుకు వాడని వాడు ఉంటే ఆ డబ్బు మూడు విధాలుగా పోతుంది – దానం, భోగం, లేదా నాశనం. సిరి సంపదలు సక్రమ మార్గంలో సం΄ాదించాలి.. నీతిగా నిర్వహించాలి..అలాగే సక్రమమైన పద్ధతిలో ఖర్చు పెట్టాలి.. సిరి సంపదలు శాశ్వతం కాదు.. మన మధ్య ప్రేమలు, అనురాగాలు, ఆ΄్యాయత, బంధం, బంధుత్వం శాశ్వతం.
– డా. కందాళ సత్యనారాయణ మూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement