పూరీ: ఒడిశాలోని పూరీ తీరంలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుదర్శన్ పట్నాయక్ అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ఇది భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుదర్శన్ పట్నాయక్ మహాప్రభు జగన్నాథుని ప్రతిరూపాన్ని ఇసుకతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ప్రధాన శిల్పం చుట్టూ 100 చిన్ని ఇసుక రథాలను రూపొందించడం విశేషం.
#WATCH | Puri | On the auspicious occasion of Rath Yatra, sand artist and Padma Shri awardee Sudarsan Pattnaik created a special sand sculpture at Puri Beach, Odisha featuring Mahaprabhu Jagannath and 100 miniature sand chariots.
(15.07) pic.twitter.com/jcYbMGRgXr— ANI (@ANI) July 16, 2026
రథయాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి ఆలయం నుంచి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చే పవిత్ర ఘట్టాన్ని ఈ శిల్పం కళ్లకు కడుతున్నది. కులమతాలకు అతీతంగా అందరినీ ఆశీర్వదించే దైవత్వానికి, సమానత్వానికి రథయాత్ర ప్రతీకగా నిలుస్తుంది. ఏటా రథయాత్ర సమయంలో పూరీ తీరంలో సుదర్శన్ పట్నాయక్ రూపొందించే ఇసుక శిల్పాలు పర్యాటకులను, భక్తులను ఎంతగానో అలరిస్తుంటాయి. ఈ ఏడాది కూడా ఆయన రూపొందించిన ఈ కళాఖండం ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రథయాత్రను పురస్కరించుకుని యంత్రాంగం ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. లక్షలాది మంది భక్తులు పురీ నగరానికి తరలిరావడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఇది కూడా చదవండి: పూరీ రథయాత్ర: రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు


