breaking news
jagannath
-
Jagannath Rath Yatra సర్వం జగన్నాథం
పర్లాకిమిడి: గజపతి జిల్లా పర్లాకిమిడిలో రథయాత్ర సందర్భంగా ఘోష యాత్ర మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రారంభమైంది. ఉదయం జిల్లా కలెక్టర్ బిజయ కుమార్దాస్, ఎస్పీ జ్యోతింద్ర నాథ్ పండా, సబ్ కలెక్టర్ అనుప్ పండాలు విచ్చేసి జగన్నాథ, బలభద్ర, సుభద్ర రథయాత్రకు పహాండిని ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటలకు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేసి జగన్నాథ, బలభద్ర, సుభద్రలను రథాలపైకి తీసుకెళ్లారు. అనంతరం గజపతి వంశీయురాలు కల్యాణీ దేవి గజపతి మేళతాళాలతో రాజ మందిరం నుంచి విచ్చేసి జగన్నాథుని రథంపై శా్రస్తోత్తరంగా పూజలు చేసి బంగారు చీపురుతో ఊడ్చి శుభ్రం చేశారు. దీనిని చెరాపహారా అంటారు. స్థానిక కళాకారులు రథాల ముందు ఒడిస్సీ నృత్యాలతో ప్రజలను అలరించారు. మూడు రథాలను గుండిచా మందిరం వైపు సాయంత్రం 5.00 గంటలకు తీసుకెళ్లడం మొదలుపెట్టారు. పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేయడం వలన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. మల్కన్‌గిరిలో... జిల్లా కేంద్రంలో జగన్నాథ స్వామివారి రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ముందుగా కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్‌తో ఆలయ అర్చకులు పూజ నిర్వహించి రథం లాగడం ప్రారంభించారు. యాత్రలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రథం కదిలే సమయంలో కళాకారులు నృత్య ప్రదర్శనలు చేశారు. స్వామివారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. రాయగడలో... రాయగడలో రథయాత్ర వైభవంగా జరిగింది. జగన్నాథ మందిరం నుంచి దేవతామూర్తులకు సాంప్రదాయబద్ధంగా పొహండి నిర్వహించి ప్రత్యేకంగా రూపొందించిన రథంలో నిలిపారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు రథంలాగే కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ ఫరూల్ పటా్వరీ, తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక తదితరులు రథంలాగే కార్యక్రమంలో పాల్గొన్నారు. అడుగడుగునా భక్తుల సౌకర్యార్థం స్వచ్ఛంద సేవా సంస్థలు మజ్జిగ, చల్లని పానీయాలు వితరణ చేశారు. ఇదిలా ఉండగా స్థానిక రైతుల కాలనీలోని జిమ్స్ పాఠశాల విద్యార్థులు రూపొందించిన రథం అందరినీ ఆకట్టుకుంది. రథయాత్రను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు స్థానిక మజ్జిగౌరి మందిరం ట్రస్టు తరుపున మందిరం ప్రాంగణంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జయపురంలో... పట్టణంలో అంగరంగ వైభవంగా రథయాత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని మిగిలిన ప్రాంతాల్లో శుక్రవారం యాత్ర జరగగా, ఒక్కరోజు తర్వాత అనగా శనివారం నుంచి జయపురంలో రథయాత్ర జరుగుతుంది. దీనిలో భాగంగా శుక్రవారం జగన్నాథ స్వామి ఆలయం నుంచి దేవతామూర్తులను మంగళ వాయిద్యాలతో తోడ్కొని వచ్చి రథాలపై ఆశీనులు చేశారు. అనంతరం శనివారం మధ్యాహ్నం వరకు దేవతామూర్తులకు భక్తులు పూజలు చేస్తారు. శనివారం మధ్యాహ్నం 4 గంటలకు రథాన్ని గుండిచా మందిరానికి తీసుకొని వెళ్తారు. కొరాపుట్‌లో... కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో రథయత్ర తొలి ఘట్టంలో భాగంగా రథాలు గుండిచా మందిరాలకు చేరుకున్నాయి. కొరాపుట్ జిల్లా కేంద్రంలో జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి దంపతులు, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చోలు పాల్గొన్నారు. నబరంగ్‌పూర్‌లో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి రథం లాగారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో సీఆర్పీఎఫ్ 12వ బెటాలియన్‌లో నేతృత్వంలో కమాండెంట్ ఎన్కేకే ప్రసాద్ నేతృత్వంలో రథయాత్ర జరిగింది. మరోవైపు విశ్వవ్యాప్త రథయాత్రకు విభిన్నంగా జయపూర్, ఆంధ్రా–ఒడిశా వివాదస్పద ప్రాంతం కొఠియాలో ఒక రోజు ఆలస్యంగా శనివారం రథయాత్ర జరగనుంది. శుక్రవారం మాత్రం పొహండి నిర్వహించి విగ్రహాలను రథం మీదకి చేర్చారు. ఆకట్టుకునే పుష్ప మకుటంస్వామివారి అలంకరణలో ఆకట్టుకునే అపురూప పుష్ప మకుటం. దీనిని యాత్ర వ్యవహారిక భాషలో ఠయ్యా అంటారు. సుగంధిత పుష్పాలతో దేవతా త్రయం బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీజగన్నాథుని కోసం వేర్వేరుగా 3 ఠయ్యాలు తయారు చేస్తారు. స్థానిక రాఘవ దాసు మఠం క్రమం తప్పకుండా వీటిని పంపిణీ చేస్తుంది. వీటి తయారీలో వెదురు బద్దలు, జీలుగు, జరీ కాగితాలు వంటి ఆకర్షణీయమైన వస్తువులతో పాటు సుగంధిత పుష్పాలను వినియోగిస్తారు. కదంబ పుష్పాలు ప్రముఖ స్థానం ఆక్రమించి ఆబాలగోపాల భక్త జనాన్ని ఆకట్టుకుంటాయి. -
ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్ర (చిత్రాలు)
-
Jagannath Rath Yatra శ్రీ జగన్నాథునికి ఖొల్లి లగ్గి సేవ
భువనేశ్వర్: జగన్నాథుడిని యాత్రకు సిద్ధం చేసేందుకు గోప్య సేవకుల వర్గం తలమునకలై ఉంది. గత 13 రోజులుగా స్వామి సోదరీ సోదరులతో కలిసి తెర చాటున గోప్య సేవలు పొందుతున్నాడు. ఆషాఢ కృష్ణ పక్ష త్రయోదశి తిథి పురస్కరించుకుని స్వామి వారికి ఖొల్లి లగ్గి సేవ నిర్వహించారు. రాత్రి పూట ఈ సేవని చేపట్టారు. జ్వరం నుంచి ఉపశమనం పొందడంతో శారీరక దారుఢ్యం కోసం పలు లేపన సామగ్రి గోప్య మండపానికి తరలించడం ఖొల్లి లగ్గి సేవలో భాగం. శుద్ధ సువార్ సేవకుల ఇంటి నుంచి ఈ సామగ్రిని తీసుకుని వెళ్లడం ఆచారం. ముందు రోజు ద్వాదశి నాడు చీకటి పడిన తర్వాత శ్రీ మందిర సముదాయం విమలా దేవి పీఠం ఆవరణలో ఉన్న బావి నుంచి నీరు తోడుకుని పోయి స్వామి చికిత్స కోసం అవసరమైన లేపనాలు తయారు చేశారు. బాజా, తురాయి, ఘంటానాదంతో శుద్ధ సువార్ ఇంటి నుంచి శ్రీ మందిరానికి ఊరేగింపుగా ఔషధ సామగ్రిని సోమవారం తరలించారు. ఈ లేపన సామగ్రిని బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుని శ్రీ అంగాలకు పూర్తిగా అద్దుతారు. దీనితో శరీరం వజ్ర దారుఢ్యంతో మెరుస్తుంది. రూపుదిద్దుకుంటున్న జగన్నాథుని రథం ఈ నెల 27 నుంచి తొమ్మిది రోజుల పాటు జరగనున్న రథాయాత్ర కోసం రథం నిర్మాణం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రథం తయారీలో భాగంగా రంగులు అద్దే పనుల్లొ కళాకారులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది సుమారు 15 లక్షల రుపాయలను వెచ్చించి రథాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నహాలు చేస్తుంది. స్థానిక పాతబస్టాండు సమీపంలోని గుండిచా మందిరంలో పరిశుభ్రత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటుగా జగన్నాథ, బలభద్ర, శుభద్ర దేవతా మూర్తులు గుండిచా మందిరంలో ఉండి భక్తులకు దర్శంన ఇస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి తెలిపారు. ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. తొమ్మిది రోజుల యాత్రలో భాగంగా గుండిచా మందిరానికి ఆనుకుని ఏర్పాటైన స్టాల్స్ వద్ద భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు పూర్తిగా ఉంటుందని వివరించారు. -
సేంద్రియ బియ్యంతో జగన్నాథునికి అమృతాన్న భోగం
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని దైనందిన భోగాల నివేదనలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది రథ యాత్ర మొదలుకొని స్వామి వారికి అమృత అన్న భోగం నివేదన ప్రారంభించనున్నారు. ఈ కార్యాచరణలో భాగంగా రథ యాత్ర నుంచి గుండిచా మందిరం అడపా మండపంలో కొఠొ భోగ సమయంలో మహా ప్రభువుకు అమృత అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. సోమవారం మందిరం ప్రధాన నిర్వాహకుడు (సీఏఓ) డాక్టర్ అరవింద కుమార్ పాడీ అధ్యక్షతన జరిగిన అధికారిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బొడు సువార్, సువార్ మహాసువార్ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. సువార్ మహాసువార్ భోగ మండపంలో అమృత అన్నం ఉపయోగించాలని ప్రతిపాదించారు. మహా ప్రభువు భోగం తయారీలో అమత అన్నాన్ని ఉపయోగించడం గురించి గతంలో చర్చించి ప్రయోగాత్మకంగా ఈ చర్యని అమలు చేశారు. కొరాపుట్ ప్రగతి ఇనిస్టిట్యూట్ అమృత అన్నం బియ్యం సరఫరాకు మద్దతు ప్రకటించిందని సీఏఓ తెలిపారు. ఈ సంస్థ ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సేంద్రియ బియ్యంతో ప్రసాదం తయారీ.. మందిరంలో జగన్నాథుని అన్న ప్రసాదాలు మహా ప్రసాదంగా ప్రతీతి. ఈ ప్రసాదం సేంద్రియ బియ్యాన్ని ఉపయోగించి తయారు చేయాలని పాలక వర్గం నిర్ణయించడం ప్రత్యేకత సంతరించుకుంది. స్వామి నిత్య అన్న ప్రసాదాల తయారీలో సేంద్రియ బియ్యం వినియోగిస్తారు. ఈ బియ్యంతో వండిన ప్రసాదాల్ని అమృత్ అన్నం అనే ప్రత్యేక పేరుతో వ్యవహరిస్తారు. ఎటువంటి రసాయన ఎరువులు ఉపయోగించకుండా సహజమైన ఎరువులను ఉపయోగించి సాగు చేసిన బియ్యం మాత్రమే వినియోగిస్తారు. తొలి దశలో స్వామికి నివేదించే కొఠొ భోగ సేవలో మాత్రమే వినియోగిస్తారు. తదుపరి దశలో ఇతర అన్ని వంటకాల్లో ఈ బియ్యం వినియోగం బలపరుస్తారు. రాష్ట్రంలో రైతులు పండిస్తున్న కొళాజీర, పింపుడిబాసొ, యువరాజ్ మొదలైన సేంద్రియ బియ్యాన్ని అమృత అన్న మహా ప్రసాదంలో ఉపయోగిస్తారు. మందిరంలో రోజుకు 50 నుండి 55 క్వింటాళ్ల బియ్యంతో స్వామి మహా ప్రసాదం వంటకం అవుతుంది. ప్రత్యేక ఉత్సవాలు, పండగపబ్బాల సందర్భంగా రోజుకు 100 నుండి 200 క్వింటాళ్ల బియ్యాన్ని ఉపయోగిస్తారు. అదనంగా కొఠొ భోగం కోసం ప్రతి రోజూ 100 కిలోల బియ్యాన్ని ఉపయోగిస్తారు. అన్న మహా ప్రసాదానికి అధిక నాణ్యత గల బియ్యం వినియోగానికి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. పిండి వంటల ప్రసాదాల తయారీలో మసూరి బియ్యం కొనసాగుతుంది. క్రమంగా వీటి స్థానంలో అమృత్ అన్నం బియ్యం వినియోగించే యోచన ఉన్నట్లు పేర్కొన్నారు. పథకం ప్రకారం మందిరం అన్న ప్రసాదాల తయారీలో కొరత లేకుండా అమృత అన్నం బియ్యం సరఫరా చేసేందుకు కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాల భూమిలో సేంద్రియ వరి సాగు అవసరం అని అనుభవజ్ఞుల వర్గం పేర్కొంది. మందిరం పాలక వర్గం ఈ మేరకు సన్నాహాలు చురుగ్గా కొనసాగిస్తుంది.ఇదీ చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత -
మూలికా వైద్యం, కోలుకుంటున్న జగన్నాథుడు
భువనేశ్వర్: జ్యేష్ట పూర్ఠణిమ నుంచి అస్వస్థతకు గురైన శ్రీ జగన్నాథుడు తెర చాటున గోప్యంగా వైద్య సేవలు పొందుతున్నాడు. స్వామి ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. మరో వైపు యాత్ర దగ్గర పడుతుంది. స్వామి ఆగమనం కోసం భక్త జనం నిరీక్షిస్తోంది. రాజ వైద్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో రాత్రింబవళ్లు ఉపచారాలు చేస్తున్నారు. శుక్రవారం పవిత్ర అనవసర దశమి సందర్భంగా శ్రీ మందిరంలో చక్కా విజే సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాటుల్ని రాతి పీఠంపైకి తరలించారు. ఇది స్వామి ఆరోగ్యం కోలుకుంటున్నట్లు సంకేతం. భోగ మండప సేవ పూర్తి అయిన తరువాత జయ, విజయ ద్వారం మూసివేసి బెహరణ్ ద్వారం తెరిచారు. ధుకుడి ద్వారం సమీపంలో ఉన్న మూడు స్తంభాకార పీఠాలను గోప్య సేవల ప్రాంగణానికి తరలించి వాటిపై మూల విరాట్లను పూజించడం చక్కా విజే సేవగా పేర్కొంటారు. దశ మూల మోదకాల వైద్యం ఆయుర్వేద పద్ధతులు, గ్రంథాల ప్రకారం జగతి నాథునికి వైద్యం కొనసాగుతుంది. ఆరోగ్య స్థితిగతులకు అనుగుణంగా వైద్య శైలిని సమయోచితంగా సవరించుకుని ఔషదీయ పదార్థాల్ని నివేదిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం స్వామి కోసం దశ మూలికల మోదకం తయారు చేశారు. శ్రీ మందిరం రాజ వైద్య సేవకులు తరతరాలుగా మహా ప్రభువుని సేవిస్తున్నారు. ఈ మహా ఔషధిని సిద్ధం చేయడంలో పది రకాల ఔషధీయ మూలికల్ని వినియోగించడం విశేషం. ఈ మిశ్రమంతో తయారు చేసిన ఔషధాన్ని వేర్వేరుగా 3 మట్టి పాత్రల్లో పేర్చి వాటిపై కర్పూరం చల్లి మూతబెట్టి శ్రీ మందిరంలో గోప్య సేవలు అందజేస్తున్న వర్గాలకు అందజేశారు. (Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత)ఆషాఢ కృష్ణ పక్ష దశమి రోజున మూడు రాతి పీఠాలపైకి చేర్చిన మర్నాడు సంప్రదాయం ప్రకారం దేవ దేవుళ్ల కోసం రాజ వైద్యుల కుటుంబీకులు తయారు చేసిన దశ మూలికల ఔషధాన్ని వైద్యంలో భాగంగా నివేదిస్తారు. ఆషాఢ కృష్ణ పక్ష ఏకాదశి నాడు మూల విరాటులకు పతి మహాపాత్రొ వర్గం సేవకులు వీటిని సమర్పిస్తారు. పవిత్ర ఏకాదశి తిథి నాడు రాత్రి పూట ఆలయ వైద్యుడి సలహా మేరకు పతి మహాపాత్రో సేవకులు వీటిని సమర్పిస్తారు.కోలుకుంటున్న జగన్నాథుడు -
అంగరంగ వైభవంగా పూరీ జగన్నాథ స్నానోత్సవం.. పులకించిన భక్తజనం (ఫొటోలు)
-
సినిమా తీయడం సులభం కాదు: మంచు మనోజ్
‘‘ఈ రోజుల్లో సినిమా తీయడం అంత సులభం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ఫ్యాషన్‌తో ‘జగన్నాథ్’(Jagannath) చిత్రం తీశారు. కోటి రూ పాయలతో తీసిన సినిమా చిన్నది, వెయ్యి కోట్లతో తీసినది పెద్ద చిత్రం అనడానికి లేదు. ఏదైనా సినిమానే. కాకపోతే ఆ సినిమా బాగుందా? బాగాలేదా అనేదే ఉంటుంది’’ అని నటుడు మంచు మనోజ్ అన్నారు.రాయలసీమ భరత్, ప్రీతి జంటగా నటించిన చిత్రం ‘జగన్నాథ్’. భరత్, సంతోష్ దర్శకత్వంలో పీలం పురుషోత్తం నిర్మించారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన మంచు మనోజ్(Manchu Manoj) మాట్లాడుతూ– ‘‘భరత్‌కి ‘జగన్నాథ్’ తొలి సినిమా అయినప్పటికీ ఎంతో ప్రొఫెషనల్‌గా నటించాడు. ఈ మూవీ హిట్ కావాలి’’ అన్నారు. రాయలసీమ భరత్ మాట్లాడుతూ– ‘‘సినిమాల మీద ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చాను. ఐదేళ్లు కష్టపడి ‘జగన్నాథ్’ చిత్రం పూర్తి చేశాం. మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం–నేపథ్య సంగీతం: శేఖర్ మోపూరి. -
పూరి జగన్నాథుడిని గణనాథుడిగా ఆరాధిస్తారని తెలుసా..!
భారతదేశంలో అత్యం ప్రసిద్ధి గాంచిన పూరీ క్షేత్రంలో జగన్నాథుడిని, బలభద్రుడిని ఏకదంతుడి రూపంలో ముస్తాబు చేసి మరీ పూజలు చేస్తారు. ఈ వేడుకనే ‘హాథీబేష’ (ఏనుగు వేషం) అని పిలుస్తారు. ఇలా ఆషాడ మాసంలో గణపతి రూపంలో ముస్తాబు చేసి మరీ జగన్నాథుడిని పూజిస్తారు. ఈ వేడు జేష్ట పౌర్ణమి రోజున జరగుతుంది. ఇలా పూరీ జగన్నాథుడుని పూజించడానికి కారణం ఉందంటూ.. మంచి ఆసక్తికర గాథ ఒకటి చెబుతుంటారు పండితలు. అదేంటంటే..పూర్వం రోజులలో పూరి రాజు దగ్గరికి గణపతి భక్తుడు అయిన గణపతి బప్ప అనే పండితుడు వచ్చాడు. ఆ సమయంలో పూరిలో జగన్నాథుడిని స్నాన యాత్ర వేడుకకు సిద్ధం చేస్తున్నారు. ఆ వేడుకలో పాల్గొనవల్సిందిగా గణపతి బట్టను రాజు ఆహ్వానిస్తాడు.దానికి ఆయన తాను గణపతిని మాత్రమే పూజిస్తానని, ఆయన తనకు అన్నీ అని చెబుతాడు. అయితే రాజు ఒత్తిడి చేయడంతో అయిష్టపూర్వకంగానే జగన్నాధుడి స్నాన యాత్రకు గణపతి బప్ప రావడం జరగుతుంది. అయితే అక్కడికి వెళ్లేసరికి ఊహకే అందని లీలా వినోదం సృష్టిస్తాడు ఆ దేవాదిదేవుడు జగన్నాథుడు. ఆ పూరీ క్షేతంలోని జగన్నాథుడు, పండితుడి గణపతి బప్ప కంటికి ఏకదంతుడి రూపంలో రూపంలో కనిపిస్తాడు. ఇదేంటి జగన్నాథుడు గణనాథుని రూపంలో కనిపించడం ఏంటని ఆశ్చర్యపోతాడు. ఇది కల మాయా అని గందరగోళానకి లోనవ్వుతాడు. విచిత్రంగా బలభద్రుడు కూడా ఏకందంతుడి రూపంల కనిపించడంతో మరంత విస్తుపోతాడు. అప్పుడు గణపతి బప్పకి తన అజ్ఞానానికి కన్నీరుమున్నీరుగా విలపిస్తాడు. తనకు బుద్ధి చెప్పాలనే ఆ చిలిపి కృష్ణుడు ఇలాంటి మాయ చేశాడని గ్రహిస్తాడు. భగవంతుడు ఏ రూపంలో ఉన్న పరమాత్మ అనేది ఒక్కటే అనే విషయం తెలుసుకుంటాడు. ఆనాటి నుంచే పూరి జనన్నాథుని రథయాత్రకు ముందు అనగా జేష్ట పౌర్ణమి రోజు జరిపే స్నాన యాత్ర సమయంలో ఆలయ పూజరులు జగన్నాథ, బలభద్రుల ముఖాలకు ఏనుగు తొడుగులు ధరింపజేస్తారు.బలరాముడు తెల్ల ఏనుగు రూపంలో, జగన్నాథుడు నల్ల ఏనుగు రూపంలో భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిస్తాడు. దీన్ని పూరి దేవాలయా సంప్రదాయంలో హాథిబేష అని పిలుస్థారు. ఇలా పూరీ జగన్నాథుని ఏకదంతుడి రూపంలో ధరిస్తే తమకు మంచి జరగుతుందని భక్తలు ప్రగాఢ నమ్మకం.(చదవండి: సకలకార్యాల సిద్ధికై.. తొలిపూజ మహాగణపతికే!) -
మరోమారు తెరుచుకున్న రత్న భాండాగారం
12వ శతాబ్దానికి చెందిన పూరీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం నేడు (గురువారం) మరోమారు తెరిచారు. ఈ ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. రత్న భాండాగారంలోని విలువైన ఆభరణాలను లోపలి ఛాంబర్ నుండి తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌నకు తరలించనున్న నేపధ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (ఎస్జేటీఏ) చీఫ్ అరబింద పాధి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఉదయం 8 గంటల తర్వాత ఎవరినీ లోనికి అనుమతించడం లేదన్నారు. ఆలయ సింహద్వారం మాత్రమే తెరిచివుంచి, మిగతా తలుపులన్నీ మూసి వేశామని తెలిపారు. గత కొన్నేళ్లుగా భక్తులు స్వామివారికి సమర్పించిన విలువైన వస్తువులను ఆలయ సముదాయంలోని తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌లోనికి తరలించనున్నట్లు అరబింద పాధి తెలిపారు.ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్టోర్‌హౌస్‌కు ఆభరణాలను తరలించేందుకుగాను రత్న భండాగారం లోపలి గదిని ఆలయ పరిపాలనా యంత్రాంగం (ఎస్జేటీఏ) తిరిగి తెరిచింది. ఎస్జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధి, జస్టిస్ విశ్వనాథ్ రథ్ (రత్నాల భాండాగారాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పర్యవేక్షక కమిటీ చైర్మన్), పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్, ఇతర అధికారుల సమక్షంలో రత్న భాండాగారం లోపలి గదిని తెరిచారు. ఉదయం 9:51 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు అధికారులు రత్న భాండాగారంలో ఉండనున్నారు. ఇక్కడి విలువైన వస్తువులను తాత్కాలిక స్టోర్‌హౌస్‌కి తరలించనున్నారు.ఈ తతంగాన్నంతా వీడియో తీస్తున్నారు. -
‘ట్రంప్‌ను జగన్నాథుడే కాపాడాడు’
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను దాడి నుంచి ఆ జగన్నాథుడే కాపాడాడని కోల్‌కతా ఇస్కాన్ టెంపుల్ వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్ వ్యాఖ్యానించారు. దీనికి రుజువుగా ఆయన 1976 నాటి రథయాత్రను ప్రస్తావించారు. ప్రమాదం నుంచి ట్రంప్ తృటిలో తప్పించుకోవడం దైవికమని ఆయన అభివర్ణించారు.దీనిగురించి రాధారమణ్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఇలా రాశారు..‘సరిగ్గా 48 ఏళ్ల క్రితం డొనాల్డ్ ట్రంప్ జగన్నాథ రథయాత్ర ఉత్సవానికి సహాయం అందించారు. ప్రపంచమంతా జగన్నాథ రథయాత్ర ఉత్సవాలను జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో ట్రంప్‌పై దాడి జరగడం ఊహించనిది. ట్రంప్‌ను జగన్నాథుడే కాపాడాడు. 1976, జూలైలో డొనాల్డ్ ట్రంప్.. జగన్నాథ రథాల నిర్మాణానికి తన రైలు యార్డ్‌ను ఉచితంగా అందించి, రథయాత్రను నిర్వహించేందుకు సహకరించారు.రియల్ ఎస్టేట్ దిగ్గజం డొనాల్డ్ ట్రంప్ సహకారంతో 1976లో యునైటెడ్ స్టేట్స్‌లోని ఎన్వైసీ వీధుల్లో జగన్నాథుని మొదటి రథయాత్ర జరిగింది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) న్యూయార్క్ నగరంలో రథయాత్రను నిర్వహించాలనుకున్నప్పుడు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. నాడు రథాలను తయారు చేసేందుకు పెద్ద ఖాళీ స్థలం అవసరమైంది. ఈ నేపధ్యంలో నాడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇస్కాన్ సంస్థ సంప్రదించగా, ఆయన తన ఫిష్డ్ అవెన్యూను రథాల తయారీ కోసం ఉపయోగించుకునేందుకు అనుమతించారు. ఈ విధంగా ట్రంప్ అమెరికాలో జగన్నాథ రథయాత్ర సాగేందుకు సహకారం అందించారని’ రాధారమణ్ దాస్ పేర్కొన్నారు. Yes, for sure it's a divine intervention.Exactly 48 years ago, Donald Trump saved the Jagannath Rathayatra festival. Today, as the world celebrates the Jagannath Rathayatra festival again, Trump was attacked, and Jagannath returned the favor by saving him.In July 1976, Donald… https://t.co/RuTX3tHQnj— Radharamn Das राधारमण दास (@RadharamnDas) July 14, 2024 -
జగన్నాథ రూపాలు... చిత్రకారుడి కుంచెలో! (ఫొటోలు)
-
అత్త ఇంటికి జగన్నాథుడు.. రథయాత్రలో అద్భుత ఘట్టం
ఒడిశాలోని పూరీలో జరిగే రథయాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. నిన్న (సోమవారం) ఉదయం మంగళ హారతితో రథయాత్ర ప్రారంభమైంది. జై జగన్నాథ్ అంటూ భక్తులు నినాదాలు చేస్తుండగా రథయాత్ర మొదలయ్యింది.భక్తులు రెట్టించిన ఉత్సాహంతో రథాల తాళ్లను ముందుకు లాగారు. డప్పుల దరువులుల మధ్య బలభద్రుడి రథంతో జగన్నాథుడు తన అత్త అయిన గుండిచా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కొద్దిసేపటికి జగన్నాథుని సోదరి దేవి సుభద్ర ఆశీనురాలైన రథం కూడా గుండిచా ఆలయానికి చేరుకుంది. నేటి (మంగళవారం) తెల్లవారుజాము వరకు రథాలపైనే ఆశీనులై పూజలు అందుకున్న జగన్నాథుడు, సుభద్రలు గుండిచా ఆలయంలోకి ప్రవేశించనున్నారు.53 ఏళ్ల తర్వాత ఈసారి పూరీలో రథయాత్ర రెండు రోజుల పాటు జరుగుతోంది. కాగా ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో రథయాత్ర సందర్భంగా శ్యామ్ సుందర్ కిషన్ (45) అనే భక్తుడు రథం చక్రాల కింద పడి మృతి చెందాడు. ఆదివారం కుకుజుంఘా గ్రామంలో జగన్నాథ రథాన్ని లాగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు ఆదివారం పూరీలో జరిగిన రథయాత్రలో కొంతమంది పోలీసులతో సహా 130 మంది గాయపడ్డారు, వారిలో సగం మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ కాగా, 40 మందికి చికిత్స కొనసాగుతోంది. -
అన్ని మతవిశ్వాసాలను గౌరవిస్తాం
కవాడిగూడ: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందరిదీ అని.. తమ సర్కారు మతసామరస్యాన్ని కాపాడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. సర్వ మతాలకు స్వేచ్ఛ, భావజాలం వ్యాప్తికి అవకాశం ఇవ్వడంతోపాటు భక్తులకు సౌకర్యాలు కలి్పంచడాన్ని బాధ్యతగా తీసుకుంటోందన్నారు. అన్ని మతాల ఆచార, సంప్రదాయాలను గౌరవిస్తామన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అందరికీ చేరే విధంగా తమ ప్రభుత్వం ప్రయతి్నస్తుందని చెప్పారు. ఆదివారం అబిడ్స్ ఇస్కాన్ (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం) ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన పూరీ జగన్నాథ రథయాత్రకు సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.గుమ్మడికాయతో దిష్టి తీసి హారతి ఇచ్చి రథం ముందు చీపురుతో రోడ్డు ఊడ్చి రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాజుల కాలం నుంచి వస్తున్న పూరీ సంప్రదాయాన్ని తాను సీఎం హోదాలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పాడిపంటలు బాగా పండి తెలంగాణ సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని వేడుకుంటున్నానని తెలిపారు. అనంతరం భాగవతం కాపీలను అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇస్కాన్ నిర్వాహకులు ప్రసాదం అందజేసి జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీ మందడి అనిల్ కుమార్‌యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితోపాటు భక్తులు పాల్గొన్నారు. -
నేడు ‘జగన్నాథ్’ కారిడార్ ప్రారంభం.. ప్రత్యేకతలివే!
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ సన్నాహాల నడుమ ఒడిశాలో జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. దీనిని శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప్ (ఎస్ఎస్పీ) లేదా జగన్నాథ టెంపుల్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ప్రాజెక్టును బుధవారం (జనవరి 17) ప్రారంభించనున్నారు. కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభం సందర్భంగా ఒడిశాలోని పూరీ ప్రాంతాన్ని వివిధ రకాలపూలు, రంగురంగుల లైట్లతో అందంగా అలంకరించారు. మకర సంక్రాంతి రోజున ప్రారంభమైన ‘మహాయాగం’ మంగళవారం రెండో రోజు కూడా కొనసాగగా, బుధవారం మధ్యాహ్నం గజపతి మహారాజు దిబ్యాసింగ్ దేబ్ నిర్వహించే ‘పూర్ణాహుతి’తో ముగుస్తుంది. అనంతరం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయనున్నారు. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు, జగన్నాథుని దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుని దర్శనం కోసం భక్తులు నేటి ఉదయం నుంచే బారులు తీరారు. హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి 80 ప్లటూన్ల పోలీసు బలగాలను (ఒక ప్లాటూన్‌లో 30 మంది పోలీసులు) మొహరించినట్లు శ్రీ జగన్నాథ ఆలయ హెరిటేజ్ కారిడార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) తెలిపారు. దాదాపు 100 మంది సూపర్వైజరీ అధికారులు, 250 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారులు కూడా బందోబస్తు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కింద రూ. 800 కోట్ల వ్యయంతో జగన్నాథ ఆలయంలోని మేఘనాద్ పచేరి (బయటి గోడ) చుట్టూ భారీ కారిడార్లు నిర్మించారు. ఇది 12వ శతాబ్దపు ఆలయాన్ని ఒక క్రమ పద్ధతిలో సందర్శించడానికి భక్తులకు సహాయపడుతుంది. పూరీని ప్రపంచ వారసత్వ నగరంగా మార్చేందుకు ప్రభుత్వం వేల కోట్ల రూపాలయ వ్యయంతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. పూరీలో శ్రీ జగన్నాథ్ పరిక్రమ ప్రాజెక్ట్ ప్రారంభం రోజున అంటే జనవరి 17న ప్రభుత్వ సెలవు దినంగా ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. కారిడార్ ప్రాజెక్ట్‌లో పార్కింగ్ స్థలం, శ్రీ సేతు, పుణ్యక్షేత్రం, జగన్నాథ ఆలయ యాత్రికుల రాకపోకలకు కొత్త రహదారి, టాయిలెట్లు, క్లాక్ రూమ్‌లు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా దేశవ్యాప్తంగా గల 90 ప్రముఖ ఆలయాల ప్రతినిధులను శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలనా విభాగం ఆహ్వానించింది. -
వాడిని అసలు నమ్మొద్దు చాలామంది మోసపోయారు..!
-
త్రిపురలో విషాదం.. రథానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో
త్రిపురలో విషాదం చోటు చేసుకుంది. ఉనకోటి జిల్లాలోని కుమార్‌ఘాట్ వద్ద ఇనుముతో చేసిన జగాన్నథ రథం ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలను తాకింది. దీంతో కరెంట్ షాక్‌కు గురై రథంపైనున్న ఏడుగురు మరణించారు. 15 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను ఉనకోటి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్న సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రథానికి విద్యుత్ తీగ ఎలా తగిలిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా రథయాత్ర పండగ జూన్ 20న ప్రారంభమవ్వగా.. ఉత్సవాల ముగింపులో భాగమైన ‘ఉల్టా రథ్’ ఊరేగింపులో జగన్నాథ బారి ఆలయానికి వస్తుండగా బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా స్పందించారు. మృతులకు సంతాపం ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించడానికి అగర్తల నుంచి కుమార్‌ఘాట్‌కు వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. -
ఉద్యోగమే నా చావుకు కారణం
జోగిపేట(అందోల్): సంగారెడ్డి జిల్లాలో ఓ గ్రామపంచాయతీ కార్యదర్శి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పుల్కల్ మండలం ఇసోజిపేటకు చెందిన ఎం.జగన్నాథ్ మిన్పూర్ గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో అనేక ఒత్తిడులు, అవమానాలు భరించలేక ‘నా చావుకు నా ఉద్యోగమే కారణం’అంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ‘నేను పనిచేస్తున్న గ్రామానికి చెందిన నాయకులు పలువురికి మద్యం తాగించి నాతో గొడవకు ఉసిగొల్పుతున్నారు. వాళ్ల చిల్లర రాజకీయాలు భరించలేకపోయాను. గ్రామ ఇన్చార్జి సర్పంచ్, 7వ వార్డు సభ్యుడు తమకు సహకరించలేదని, చాలా వేధింపులకు గురి చేశారు. మార్చి 3న ఉద్యోగానికి రాజీనామా చేస్తూ అధికారులకు లేఖ ఇచ్చాను. తోటి ఉద్యోగులు, అధికారులు నచ్చచెప్పడం.. అలాగే ఉద్యోగం చేయకుండా ఇంటి దగ్గరే ఉంటే అమ్మానాన్నలకు బాధ కలుగుతుందని భావించి మళ్లీ విధుల్లో చేరాను. అమ్మా, నాన్నా.. నన్ను క్షమించండి’అని సూసైడ్ నోట్లో పేర్కొన్నా డు. ‘ఏపీవో నన్ను కుక్కలా తిప్పుకున్నారే కానీ, ఫిబ్రవరి 22 నుంచి 27వ తేదీ వరకు చేయించిన పనులకు పేమెంట్స్ ఇవ్వలేదు. నర్సరీ పనులకు, బ్యాగ్ ఫిల్లింగ్, పోల్స్ ఫిట్టింగ్, నర్సరీలోని లేబర్‌కు, ఆడిటింగ్‌లకు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను. నా చావుతోనైనా సమస్యలు పరిష్కరించాలి. నాకు బతకాలని ఉన్నా, ఇలా బతకడం నావల్ల కావడం లేదు’అంటూ సూసైడ్ నోట్ ముగించాడు. అధైర్యపడొద్దు... పంచాయతీ కార్యదర్శులు అధైర్యపడవద్దు. సమస్యలుంటే ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందాం. గ్రామా ల్లో రాజకీయంగా ఇబ్బందులుంటే అధి కారుల దృష్టికి తీసుకెళ్లాలి. జగన్నాథ్ ఆత్మహత్య చాలా బాధాకరం. –ఎస్.రమేశ్, జిల్లా కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు -
దిమాక్ ఉన్నోడు
గోవాలో అదిరిపోయే స్టెప్పులేస్తున్నారు హీరో రామ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ‘డబుల్ దిమాక్ హైదరాబాదీ’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టాకీపార్ట్ పూర్తయింది. ప్రస్తుతం హీరో రామ్, నభా నటేశ్‌లపై గోవాలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను బుధవారం విడుదల చేయనున్నారు. మరి... డబుల్ దిమాక్ హైదరాబాదీ పవర్ ఏంటో శాంపిల్‌గా చూడొచ్చన్నమాట. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సు«ధాంశు పాండే తదితరులు నటిస్తున్నారు. -
ఆకట్టుకుంటున్న ఇస్కాన్ ఎగ్జిబిషన్
-
జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు ప్రారంభం
- ప్రారంభించిన టీజీ వెంకటేశ్ కర్నూలు (న్యూసిటీ) : అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) రెండేళ్లకోసారి నిర్వహిస్తున్న జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు ఈ ఏడాదికి సంబంధించి ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ ప్రారంభించారు. శ్రీకృష్ణ భగవానుని విశ్వరూప ప్రదర్శన ఆకట్టుకునేలా ఉందని తెలిపారు. ఇస్కాన్ కర్నూలు ప్రాజెక్టు డైరెక్టర్ రూపేశ్వర్ చైతన్యదాస్ మాట్లాడుతూ నేటి నుంచి 8వ తేదీ వరకు మహోత్సవాలు జరుపుతామన్నారు. 7వ తేదీన రథయాత్ర, 8వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం శ్రీదామోదర దీపోత్సవాన్ని నిర్వహించారు. ఇస్కాన్ నరసరావుపేట ఇన్చార్జి వైష్ణవ కృపదాస్, కర్నూలు ఇన్చార్జి చైతన్య చంద్రపతి దాస్, మణికంఠ అయ్యప్పస్వామి దేవాలయం అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి ఈ. మల్లికార్జునరెడ్డి, భరతమాతృ మండలి అధ్యక్షురాలు ఇ.పద్మవతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఓపీ సేవల సమయం పెంపు
అనంతపురం సిటీ : రోగుల సౌకర్యార్థం సర్వజనాస్పత్రిలో ఔట్‌పేషెంట్ (ఓపీ) సేవలను అదనంగా గంట సమయం పెంచినట్లు సూపరింటెండెంట్ జగన్నాథ్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక వైద్యుల సమావేశ భవనంలో అన్ని విభాగాల వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సూపరింటెండెంట్ తో పాటు ఆర్ఎంఓ వెంకటేశ్వరరావు, ఇన్చార్జ్ సూపరింటెండెంట్ రామస్వామినాయక్లు పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఇకపై ఓపీ సేవలు ఉదయం 8.30 కే మెదలై మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయన్నారు. రోగులకు ఎక్స్‌రే, రక్త, కంటి, స్కానింగ్ లాంటి పరీక్షలను వేగవంతం చేసి ఒకే రోజులోనే రిపోర్టులు ఇచ్చే విధంగా కృషి చేయాలన్నారు. వైద్యులతో పాటు నర్సులు, ఆస్పత్రి సిబ్బంది రోగుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. అత్యవసర వైద్య సేవల్లో కూడా ఆయా విభాగాల వైద్యులు కచ్చితంగా అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. ఈ-ఔషధి విధానం అమలులో అనంత ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వైద్యులు తమ విధులను కచ్చితంగా నిర్వర్తించాలన్నారు. విధులకు డుమ్మా కొడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోగుల పేరు, వారికున్న జబ్బులు, ఆస్పత్రిలో చికిత్స పొందిన కాలం తదితర వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి ఉన్నతాధికారి కార్యాలయానికి పంపాలని ఆదేశాలు చేశారు. -
జై జగన్నాథ్...
-
జై జగన్నాథ..
నెల్లూరు(బృందావనం) : హరేరామ..హరేకృష్ణ..కృష్ణకృష్ణ హరేహరే..రామరామ హరేహరే..జై జగన్నాథ నామస్మరణతో సింహపురి వీధులు మార్మోగారుు. ఆనందపారవశ్యులైన భక్తుల నృత్యాలు, కీర్తనలు, భక్తగీతాలు, కోలాటాలు, విద్యుత్ దీపాలంకరణలు, మంగళవారుుద్యాల నడుమ సోమవారం నెల్లూరులో జగన్నాథ రథయూత్ర కనులపండువగా సాగింది. మహిళలు రంగురంగుల రంగవళ్లులు తీర్చిదిద్ది రథోత్సానికి స్వాగతం పలికారు. జగ న్నాథుడి దర్శనంతో పాటు నైవేద్యాలు సమర్పించేందుకు దారిపొడవునా భక్తులు బారులుదీరారు. బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి రథంపై కొలువుదీరిన జగన్నాథుడు భక్తులను అనుగ్రహిస్తూ ముందుకు సాగారు. స్వామి వారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. అంతర్జాతీయ శ్రీ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) నెల్లూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 4వ జగన్నాథ రథయూత్ర నవాబుపేటలోని శివాలయం ప్రాంగణం నుంచి ఆత్మకూరు బస్టాండ్, గాంధీబొమ్మ, ఆర్టీసీ మీదుగా కేవీఆర్ పెట్రోలు బంకు సెంటర్ సమీపంలోని కస్తూరిదేవి విద్యాలయం ప్రాంగణం వరకు సాగింది. రథయూత్రను ఇస్కాన్ కేంద్ర గవర్నింగ్‌బాడి కమిషనర్ భానుస్వామి మహరాజ్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోరుున అనిల్‌కుమార్‌యూదవ్, మేయర్ అబ్దుల్ అజీజ్, పారిశ్రామికవేత్త, వితరణశీలి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి తదితరులు ప్రారంభించారు. నవాబుపేట శివాలయం వద్ద నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో రథయూత్ర విశిష్టత, జగన్నాథతత్వాన్ని వక్తలు వివరించారు. జగన్నాథుని దర్శనం మంగళదాయకం జగన్నాథుడి దర్శనం మంగళదాయకమని ఇస్కాన్ కేంద్ర గవర్నింగ్ బాడి కమిషనర్ భానుస్వామి మహరాజ్ అన్నారు. కృష్ణభగవానుడి ఆరాధనతో జీవితం సుసంపన్నమౌతుందన్నారు. ప్రస్తుత ఆధునిక,ఒడిదుడుకుల జీవితంలో భగవంతుడిని నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమన్నారు. భగవంతుని సేవతో జీవితం పునీతమౌతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. కురుక్షేత్ర ఇస్కాన్ మందిర నిర్వాహకుడు సాక్షి గోపాల్ మాట్లాడుతూ జగన్నాథతత్వాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న కాంక్షతో 1966లో ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు భక్తివేదాంత ప్రభుపాద అమెరికాలో జగన్నాథ యూత్ర ప్రారంభించారన్నారు. నేడు అది ఎంతో విశిష్టతగా సాగుతోందన్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ భగవంతుని ప్రార్థించడమంటే నీతివంతముగా జీవించడమేనన్నారు. ప్రతి ఒక్కరు తోటి వ్యక్తిలో దైవత్వాన్నిచూడాలన్నారు. మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవగా భావించి ఇస్కాన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. నెల్లూరు ఇస్కాన్ మందిర అధ్యక్షుడు సుఖదేవస్వామీజీ మాట్లాడుతూ జగన్నాథ రథయూత్రకు తోడ్పాటు అందిస్తున్న వదాన్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కసూర్తిదేవి విద్యాలయం ఆవరణలో జరిగిన ముగింపు కార్యక్రమంలో స్వామీజీల సందేశాల తర్వాత జగన్నాథ, బలభద్ర, సుభద్రలకు 56 వంటకాల నైవేద్యం సమర్పించారు. మొదట జగన్నాథ రథయూత్ర టీషర్టులను మేయర్ అజీజ్, ఇస్కాన్ మందిర బ్యాగులను వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జగన్నాథుడి లీల వైభవం పుస్తకాన్ని ఎమ్మెల్యే అనిల్, సుఖదేవస్వామి ఆలపించిన శ్రీకృష్ణభక్తి గీతాల సీడీని మాజీ ఎమ్మెల్యే ముంగమూరు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యూలమూరి రంగయ్యనాయుడు, ఆనం జయకుమార్‌రెడ్డి, ఇస్కాన్ ప్రతినిధులు వేదాంత చైతన్యదాస్, సత్యగోపినాథ్ దాస్, సహదేవ్‌దాస్, శ్రీవత్సదాస్ తదితరులు పాల్గొన్నారు. జగన్నాథుని సేవలో ఎంపీ మేకపాటి రథయూత్ర గాంధీబొమ్మ సెంటర్లో సాగుతున్న సమయంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అక్కడకు చేరుకున్నారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలను దర్శించుకుని స్వామీజీల ఆశీస్సులు పొందారు. -
ముగిసిన జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు
పరిమళించిన క ృష్ణతత్వం కర్నూలు(కల్చరల్) : స్థానిక మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇస్కాన్ నామహట్ట ప్రచార కేంద్రం ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు సోమవారం విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా నగరంలోని వివిధ పాఠశాలలు, న ృత్య సంస్థల విద్యార్థులు ప్రదర్శించిన న ృత్యాలు ఆకట్టుకున్నాయి. రామకృష్ణ స్కూల్ చిన్నారులు ప్రదర్శించిన అంబాడి కన్నయ్య... భజగోవిందం న ృత్యం, సిద్ధి వినాయక సంగీత న ృత్యనిలయం ప్రదర్శించిన దశావతారం, భాష్యం స్కూల్ విద్యార్థుల క ృష్ణ లీలలు, సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన అదిగో.. అల్లదిగో... ముద్దుగారే యశోద... చక్కని తల్లికి ఛాంగుభళా అనే న ృత్యాలుఅలరించినాయి. నారాయణ స్వామి బృందం ప్రదర్శించిన భామా కలాపం, సాగర మధనం నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కృష్ణతత్వ ప్రచారంలో సహకరించిన వారందరికీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన రామగోవింద మహరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. ఇస్కాన్ చేపట్టిన ఈ మహత్తర యజ్ఞంలో స్థానికులు తమ చక్కని సహకారాన్ని అందించారన్నారు. జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, కె.వి.సుబ్బారెడ్డి కళాశాల విద్యార్థులు వలంటీర్లుగా పాల్గొని సేవలందించారన్నారు. భారతమాత మాత ృమండలి సభ్యులు, వివేకానంద స్టడీ సర్కిల్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారన్నారు. ఇస్కాన్ సంస్థ సభ్యులు, నిర్వాహకులు రూపేష్ ప్రభు, క ృష్ణ చైతన్య ప్రభు, వైష్ణవ ప్రభు, బృందావనం గోకులపతి మాధవదాస్, సంకీర్తన బృందం జగద్గురు గౌరంగాదాస్, ద్వారకానాథ్ దాస్, నృత్యజ్యోతి సంస్థ నిర్వాహకులు భార్గవకుమార్ పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్ర ప్రారంభం
-
కట్టలు తెగిన నోట్లు
నగరంలో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. మూడు ప్రాంతాల్లో పోలీసులు కోటీ 20 లక్షల 72 వేల 680 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. హిమాయత్‌నగర్, న్యూస్‌లైన్: నగరం నుంచి అర్ధరాత్రి వేళ భారీగా నగదును ముంబయికి తరలిస్తున్న నలుగురు వ్యక్తుల బృందాన్ని నారాయణగూడ పోలీసులు పట్టుకున్నారు. ఈ డబ్బు ముంబయిలోని జవేరీ బజార్లో ఉన్న ఓ కంపెనీకి చెందినవని నిందితులు చెబుతున్నా అందుకు సంబంధించిన రశీదులు గాని, ఆధారాలు గాని చూపకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇన్స్పెక్టర్ భీంరెడ్డి కథనం మేరకు.. నగరంలోని జాంబాగ్‌కు చెందిన నాగారం చౌదరి, జగదీష్ సోధా, గోపాల్ సి.ప్రజాపతి, తాన్ సింగ్‌లు సోమవారం అర్ధరాత్రి 2 గంటలు దాటాక ఇన్నోవా కారు (ఏపీ 11ఏఈ 0999లో రూ.60 లక్షల 29 వేల నోట్ల కట్టలను సంచుల్లో తరలిస్తున్నారు. విధుల్లో నారాయణగూడ సబ్ ఇన్స్పెక్టర్ జగన్నాథ్ స్థానిక రెడ్డి కళాశాల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండా జగదీష్ బృందం పోలీసుల కళ్లుగప్పి కారును రెడ్డి కళాశాల పక్క బజారులో నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన పోలీసులు సదరు కారును ఆపి తనిఖీ చేయగా డబ్బులు కుక్కి ఉన్న రెండు సంచులు బయటపడ్డాయి. ఈ నగదును స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులకు అప్పగించగా.. డబ్బు తరలిస్తున్న వ్యక్తులను సొంత పూచీ కత్తుపై విడిచిపెట్టారు. డబ్బు తరలిస్తున్న వ్యక్తులు పోలీసుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం కూడా చేసినట్లు తెలిసింది. నాగోలు చౌరస్తాలో రూ.15 లక్షలు నాగోలు చౌరస్తాలో మంగళవారం పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.15 లక్షలు లభ్యమయ్యాయి. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సొత్తును సీజ్ చేశారు.