సినిమా తీయడం సులభం కాదు: మంచు మనోజ్‌ | Jagannath Movie Teaser Launched by Manchu Manoj | Sakshi
Sakshi News home page

సినిమా తీయడం సులభం కాదు: మంచు మనోజ్‌

Feb 15 2025 3:42 AM | Updated on Feb 15 2025 3:42 AM

Jagannath Movie Teaser Launched by Manchu Manoj

‘‘ఈ రోజుల్లో సినిమా తీయడం అంత సులభం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ఫ్యాషన్‌తో ‘జగన్నాథ్‌’(Jagannath) చిత్రం తీశారు. కోటి రూ పాయలతో తీసిన సినిమా చిన్నది, వెయ్యి కోట్లతో తీసినది పెద్ద చిత్రం అనడానికి లేదు. ఏదైనా సినిమానే. కాకపోతే ఆ సినిమా బాగుందా? బాగాలేదా అనేదే ఉంటుంది’’ అని నటుడు మంచు మనోజ్‌ అన్నారు.

రాయలసీమ భరత్, ప్రీతి జంటగా నటించిన చిత్రం ‘జగన్నాథ్‌’. భరత్, సంతోష్‌ దర్శకత్వంలో పీలం పురుషోత్తం నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన మంచు మనోజ్‌(Manchu Manoj) మాట్లాడుతూ– ‘‘భరత్‌కి ‘జగన్నాథ్‌’ తొలి సినిమా అయినప్పటికీ ఎంతో ప్రొఫెషనల్‌గా నటించాడు. ఈ మూవీ హిట్‌ కావాలి’’ అన్నారు. రాయలసీమ భరత్‌ మాట్లాడుతూ– ‘‘సినిమాల మీద ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చాను. ఐదేళ్లు కష్టపడి ‘జగన్నాథ్‌’ చిత్రం పూర్తి చేశాం. మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం–నేపథ్య సంగీతం: శేఖర్‌ మోపూరి.  

Advertisement
 
Advertisement
Advertisement