'మా ఆవిడ కనిపించడం లేదు సార్'.. థ్రిల్లర్ మూవీ ట్రైలర్‌ చూశారా? | Tollywood Movie The Maze Trailer Out Now | Sakshi
Sakshi News home page

The Maze Movie: 'మా ఆవిడ కనిపించడం లేదు సార్'.. ఆసక్తిగా ది మేజ్ ట్రైలర్‌

Nov 16 2026 9:00 AM | Updated on Nov 16 2026 9:06 AM

Tollywood Movie The Maze Trailer Out Now

శ్రీరామ్ (శ్రీకాంత్), ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు కీలక పాత్రల్లో వస్తోన్న మూవీ మేజ్. ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్‌గా డాక్టర్ రవికిరణ్ గడలాయ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ నిర్వహించారు.

డైరెక్టర్ డా. రవికిరణ్ గడలాయ్ మాట్లాడుతూ..' ది మేజ్ అంటే మొక్కజొన్న అనుకుంటున్నారు. కానీ మేజ్ అంటే పద్మవ్యూహం అని అర్థం. దారితెలియని అనూహ్యమైన పరిస్థితుల నుంచి బయటపడే ఓ వ్యక్తి కథ ఇది. ఆ పరిస్థితుల్లో చిక్కుకుని ఆ తర్వాత ఎలా బయటపడతాడు అనేదే ఈ సినిమా నేపథ్యం. ఈ చిత్రంలో మీరు ఊహించని ట్విస్టులు ఉంటాయి. శ్రీరామ్ దగ్గర నుంచి ఎంత పర్ ఫార్మ్ చేయించాలో అంత చేయించుకున్నాం. ది మేజ్ సినిమా చూస్తున్నంత సేపు మీరు మిమ్మల్ని శ్రీరామ్ క్యారెక్టర్‌లో ఊహించుకుంటారు' అని అన్నారు.

హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) మాట్లాడుతూ..  'ఈ సినిమాలో ప్రతి సీన్ నన్ను కొత్తగా చూపించాలని డైరెక్టర్ రవికిరణ్ తపించారు. ఆయన అందుకోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారు. పాతికేళ్లుగా పరిశ్రమలో ఉన్నా. ఇన్నేళ్లకు నా కోసం టైటిల్ కార్డ్ ఒక థీమ్ మ్యూజిక్ క్రియేట్ చేశారు. ఇప్పటిదాకా ఏ ఫిలింమేకర్ అలా చేయలేదు. ఈ మేజ్ మూవీ మిమ్మల్ని అమేజ్ చేస్తుంది. నేను నటుడిగా జర్నీ చేస్తూ వస్తున్నా, ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలియదు. అందుకే ప్రతి ప్రాజెక్ట్‌ను జాగ్రత్తగా చేసుకుంటున్నా. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా' ‍అని అన్నారు.

డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ..'ఈ  సినిమా ప్రారంభమయ్యే టైమ్‌లో డైరెక్టర్ నాకు ఈ కథ చెప్పారు. నేను విన్న కథ స్క్రీన్ మీద ఎలా ఉంటుందో చూద్దామని వచ్చా. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సర్ ప్రైజ్ అయ్యేలా కథ చెప్పినదాని కంటే చాలా బాగా రూపొందించారు. నేను చెన్నైలో పుట్టి పెరిగా కాబట్టి.. నాకు శ్రీరామ్ శ్రీకాంత్ గానే పరిచయం. నేను కాలేజ్‌లో ఉండగా శ్రీరామ్ సినిమాలు చూశాను.  ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ మూవీలో రవివర్మ, శ్రీష ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement