breaking news
The Maze Movie
-
సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'ది మేజ్'.. రివర్స్ టీజర్ రిలీజ్
తెలుగు, తమిళ ప్రేక్షకులకు తెలిసిన హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా 'ది మేజ్'. ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. దీనిని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలాయ్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రివర్స్ టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ‘మీకు బీఫ్ నచ్చిందా?’ హీరోయిన్‌కి షాకింగ్ ప్రశ్న)టీజర్ బట్టి చూస్తే నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచిన హీరో మదిలో అనేక సంఘటనలు మెదులుతుంటాయి. ఎవరూ నమ్మని, తను మాత్రమే నమ్మే కొన్ని నిజాలు, వాటి రుజువుల కోసం అతను అన్వేషణ సాగిస్తుంటాడు. కొంతమంది వ్యక్తులను వెంబడిస్తుంటాడు. హీరో భ్రమపడుతున్నాడని ఇతరులు అనుకున్నవి నిజంగా భ్రమలేనా ? లేదంటే హీరో బలంగా నమ్మినట్లు వాస్తవాలా? లాంటి అంశాల్ని ఇందులో చూపించారు. టీజర్ చివరి సీన్ తప్ప మొత్తం రివర్స్‌లో ఉండటం డిఫరెంట్‌గా అనిపించింది.(ఇదీ చదవండి: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి.. ఎప్పుడు ఎక్కడంటే?) -
సైకలాజికల్ థ్రిల్లర్‌గా శ్రీరామ్ ‘ది మేజ్’
హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న సినిమా ‘ది మేజ్’. ప్రియాంక, హ్రితికా శ్రీనివాస్, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డా. నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో డా. రవికిరణ్ గడలాయ్ దర్శకత్వంలో డా. ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డా. కేఎస్ఆర్, డా. భరత్ రెడ్డి గోపు, డా. అనిరుధ్ రెడ్డి సోమ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దర్శకుడు రవికిరణ్ మాట్లాడుతూ – ‘‘వాస్తవం–భ్రమ మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేస్తూ, మీ ఆలోచనలను సవాలు చేసే సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కథలోని ప్రతి మలుపు ఆసక్తి రేపేలా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్.


