సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'ది మేజ్'.. రివర్స్ టీజర్ రిలీజ్ | The Maze Movie Teaser | Sakshi
Sakshi News home page

The Maze Movie: రివర్స్ టీజర్‌తో సరికొత్త ప్రయత్నం 'ది మేజ్'

Aug 18 2026 6:15 AM | Updated on Aug 18 2026 6:15 AM

The Maze Movie Teaser

తెలుగు, తమిళ ప్రేక్షకులకు తెలిసిన హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా 'ది మేజ్'. ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. దీనిని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలాయ్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రివర్స్ టీజర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ‘మీకు బీఫ్‌ నచ్చిందా?’ హీరోయిన్‌కి షాకింగ్‌ ప్రశ్న)

టీజర్ బట్టి చూస్తే నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచిన హీరో మదిలో అనేక సంఘటనలు మెదులుతుంటాయి. ఎవరూ నమ్మని, తను మాత్రమే నమ్మే కొన్ని నిజాలు, వాటి రుజువుల కోసం అతను అన్వేషణ సాగిస్తుంటాడు. కొంతమంది వ్యక్తులను వెంబడిస్తుంటాడు. హీరో భ్రమపడుతున్నాడని ఇతరులు అనుకున్నవి నిజంగా భ్రమలేనా ? లేదంటే హీరో బలంగా నమ్మినట్లు వాస్తవాలా? లాంటి అంశాల్ని ఇందులో చూపించారు. టీజర్ చివరి సీన్ తప్ప మొత్తం రివర్స్‌లో ఉండటం డిఫరెంట్‌గా అనిపించింది.

(ఇదీ చదవండి: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి.. ఎప్పుడు ఎక్కడంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement