సమంతకు బిగ్ రిలీఫ్.. బాంబే హైకోర్టు కీలక ఉత్తర్వులు | Samantha face voice name can't be misused by AI says Bombay High Court | Sakshi
Sakshi News home page

Samantha: సమంతకు బిగ్ రిలీఫ్.. బాంబే హైకోర్టు కీలక ఉత్తర్వులు

Oct 2 2026 11:55 AM | Updated on Oct 2 2026 12:00 PM

Samantha face voice name can't be misused by AI says Bombay High Court

ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేసేవారిపై చర్యలు తప్పవని బాంబే హైకోర్టు హెచ్చరించింది. ఇతరుల ఫోటోలను మార్ఫింగ్ చేయడం, డీప్‌ఫేక్ కంటెంట్‌ను అనధికారికంగా సృష్టించడం, వ్యాప్తి చేయడం వ్యక్తిగత హక్కులను ఉల్లంఘిచడం కిందకు వస్తుందని కోర్టు తెలిపింది. హీరోయిన్‌ సమంత పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం సమంతకు సంబంధించిన అనధికారిక కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించింది.

కాగా.. సమంత రూత్ ప్రభు వ్యక్తిత్వ హక్కులకు సంబంధించి బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు, ఈ-కామర్స్ పోర్టల్స్, డిజిటల్ మీడియా సంస్థలలో తన పేరు, ఫోటోలు, వాయిస్‌ను అనధికారికంగా ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తన వ్యాపారం, గుడ్‌విల్ ముంబయిలో ఉన్నప్పటికీ చాలా వాణిజ్య కార్యకలాపాలు కోర్టు స్థానిక ప్రాదేశిక అధికార పరిధిని దాటి విస్తరించాయని సమంత తన పిటిషన్‌లో సమర్పించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సమంతకు సంబంధించిన అనధికారిక కంటెంట్‌ను తొలగించాలని కూడా కోర్టు ఆదేశించింది. సమంత పేరు, ఫోటోలు, గొంతు అనధికారికంగా ఉపయోగించకుండా నిరోధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement