విజయ్‌ స్టైల్లో నా సినిమా ఉంటుంది: శరవణన్ | Legend Saravanan Reacts His Next Movie Like Vijay Movies | Sakshi
Sakshi News home page

విజయ్‌ స్టైల్లో నా సినిమా ఉంటుంది: శరవణన్

Oct 2 2026 9:40 AM | Updated on Oct 2 2026 9:40 AM

Legend Saravanan Reacts His Next Movie Like Vijay Movies

ప్రముఖ వ్యాపారవేత్త, శరవణా స్టోర్స్‌ అధినేత శరవణన్‌.. ఇప్పటికే తమిళంలో హీరోగా రెండు సినిమాలు చేశారు. చేసి తొలి ప్రయత్నంగా 'లెజెండ్‌' నిర్మించి, కథానాయకుడిగా చేశారు. అది ఆశించిన హిట్ కాలేకపోయినా తర్వాత 'లీడర్‌' చేశారు. ఈ చిత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది. దీంతో ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీని గురించి ఇటీవల ఒక భేటీలో ఆసక్తికర విషయాలు చెప్పారు.

తరచూ అభిమానులని కలుస్తున్న శరవణన్‌ని రాజకీయ రంగప్రవేశం చేసే ఆలోచన ఉందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి బదులిచ్చిన ఈ నటుడు.. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని, భవిష్యత్తులో కుదిరితే అది జరగొచ్చని అన్నారు. తాను తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నానని చెప్పారు.

విజయ్‌ ముఖ్యమంత్రి కావడంతో సినిమాలకు స్వస్తి పలికారని, దీంతో ఆయన నటించిన చిత్రాల తరహాలో మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తన తాజా చిత్రం ఉంటుందని లెజెండ్‌ శరవణన్‌ చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement