అలాంటి వాళ్ల ఆశీస్సులు నాకు చాలు: హీరోయిన్ అంజలి | Anjali Reacts About Her Wedding Rumours | Sakshi
Sakshi News home page

అలాంటి వాళ్ల ఆశీస్సులు నాకు చాలు: హీరోయిన్ అంజలి

Oct 2 2026 8:14 AM | Updated on Oct 2 2026 8:31 AM

Anjali Reacts About Her Wedding Rumours

మీడియా ఇప్పుడు ప్రతి సెలబ్రిటీ ఇంటిలోనూ తొంగి చూడటం జరుగుతోంది. నటీమణుల విషయంలో మరింత ఆసక్తిని చూపుతుంది. ఇది కొందరు నటీమణులకు మంచి, ఇంకొందరికి చెడు జరుగుతుంది. మరికొందరికి విసుగు పుట్టిస్తుంది. అలా అసహనాన్ని వ్యక్తం చేస్తున్న వారిలో హీరోయిన్ అంజలి ఒకరు. రెండు దశాబ్దాలుగా దక్షిణాదిలో మూవీస్ చేస్తున్న ఈమె..రీసెంట్ టైంలో విశాల్‌కు జంటగా మకుటం మూవీతో వచ్చింది. కానీ ఇది హిట్ కాలేదు. తాజాగా నివీన్‌ పౌలీతో చేసిన ఏళు కడల్‌ ఏళు మలై చిత్రం గురువారం థియేటర్లలోకి వచ్చింది.

ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్న అంజలి తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నన్ను కలిసినప్పుడల్లా పలువురు ముందుగా అడిగే ప్రశ్న పెళ్లి ఎప్పుడు అనే. అయినా నా పెళ్లి గురించి వీరికెందుకు అంత అక్కరో నాకు అర్థం కావడం లేదు. పెళ్లి అనేది ఒక్కరోజు వేడుక కాదు. వివాహానంతరం అమ్మాయి జీవితమే మారిపోతుంది. పలు విషయాల్లో ఆమె త్యాగం చేయాల్సి ఉంటుంది. అలాంటి బాధ్యతలు ఉండగా ఎందుకు తరచూ పెళ్లి, పెళ్లి అంటూ ప్రశ్నిస్తారో అర్థం కావడం లేదు. నాకు పెళ్లి ఎప్పుడు జరిగినా మనస్ఫూర్తిగా ఆశీర్వదించే వారు కొందరుంటే చాలు. నేను బాగుండాలని ఆకాంక్షించేవారు నాలుగు లేదా నలభై మంది ఉంటే చాలు. అలాంటి వాళ్ల నా పెళ్లికి విచ్చేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే చాలు. ఆడంబరాల నాకు అక్కర్లేదు' అని చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement