స్వచ్ఛమైన ప్రేమకథ అనిపించింది: ‘దిల్‌’ రాజు | Producer Dil Raju about Thella Kagitham Movie | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమైన ప్రేమకథ అనిపించింది: ‘దిల్‌’ రాజు

Oct 2 2026 12:31 AM | Updated on Oct 2 2026 12:31 AM

Producer Dil Raju about Thella Kagitham Movie

కృష్ణ, ‘దిల్‌’ రాజు, హర్ష్‌ రోషన్‌

‘‘నిర్మాత కృష్ణగారు రైటర్‌ నందుతో నాకు ఈ ‘తెల్ల కాగితం’ కథ చెప్పినప్పుడే 2000 నేపథ్యంలో సాగే ఎంతో స్వచ్ఛమైన, అమాయకమైన ప్రేమకథగా అనిపించింది. మా ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో ఎలాంటి అమాయకత్వంతో కూడిన ప్రేమకథ ఉందో... ఇందులోనూ అలాంటి ఫీల్‌ కనిపించింది’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు తెలిపారు.     హర్ష్  రోషన్ , నక్షత్ర జంటగా నటించిన చిత్రం ‘తెల్ల కాగితం’. 

రమేష్‌ బండ్రెడ్డి దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్ పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ‘దిల్‌’ రాజు, దర్శకులు అనిల్‌ రావిపూడి, కొరటాల శివ, చందు మొండేటి, వశిష్ట, శైలేష్‌ కొలను, రామ్‌ జగదీష్‌ అతిథులుగా హాజరయ్యారు. రమేష్‌ బండ్రెడ్డి మాట్లాడుతూ– ‘‘మా అమ్మకి చెప్పినట్లే, ఆమెతో పాటు నా కుటుంబం, స్నేహితులు గర్వపడేలాంటి ‘తెల్ల కాగితం’ సినిమా తీశాను’’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement