వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి. ఇప్పటివరకు ఆయన తన మార్క్ ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయన మరో కొత్త జానర్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా అనీల్ రావిపూడి యానిమేషన్ నేపథ్యంలో రామాయణం కథతో ఓ ప్రాజెక్ట్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారనే రూమర్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇది ఒకింత ఆశ్చర్యకరమైన విషయమే. కానీ కేవలం కామెడీ చిత్రాలు మాత్రమే కాకుండా సాలిడ్ సీరియస్ సబ్జెక్ట్‌లు కూడా తాను చేయగలరని భగవంత్ కేసరి సినిమాతో ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేశారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌పై మరింత క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.
మరోవైపు వెంకటేశ్, కల్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమా చిత్రీకరణతో ప్రస్తుతం అనిల్ రావిపూడి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానుంది.


